Wednesday, February 15, 2017

గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ...

జీవితంలో ఏర్పడే అనేక అభివృద్ధి దశలే మెట్లు అనుకుంటే ...,,,

ఆ మెట్లు చాలా కష్టపడి / ఇష్టపడి అధిరోహిస్తూ అది అభివృద్ధి అనుకుంటే ...,,,,

అది కొంతమంది సునాయాసంగా అధిరోహిస్తూ ఉంటారు ...కొందరు వ్యయ ప్రయాసలకోర్చి అధిరోహిస్తూ ఉంటారు ....మరి కొందరు ...ఎప్పుడో ఒకసారి ఒకమెట్టు అతి కష్టం మీద ....ఇంకొందరు వారి జీవితకాలం అంతా ప్రయత్నించినా ఒక్క మెట్టు కూడా అధిరోహించలేక పోతారు ....ఏది ఏమైనా ఇదంతా ఎవరి దృష్టిలో ….ఎప్పుడు ....ఎందుకు ....ఎలా …అనేది నిర్వివాదాంశం ....!!

ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు .... ఆ ఎక్కిన/ దిగిన మెట్లు ని బట్టి వాళ్ళ వాళ్ళ జీవన విధానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం ....

కొందరు ఎక్కిన/దిగిన మెట్లుకి అనుగుణంగా జీవన విధానం మార్పు చెందనివ్వకుండా ...సమాజానికి అనుగుణంగా నియంత్రించుకుంటూ ఉంటారనుకోండి ....అదివేరే విషయం ....!

అయితే ...ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే .......,,,,

కొందరు ...అర్హత సంపాదించాం అనుకుని కొన్ని మెట్లు ఎక్కి ....అందుకు అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని కూడా మార్చుకుంటారు ...కానీ కొంతకాలం ఆగాక ....జీవన విధానానికి తగినట్లుగా మన ఎదుగుదల లేదని ....మన అర్హత ఇంకా ఆ మెట్టుకి చేరుకోలేదు అని....తెలుస్తుంది...అప్పుడు తప్పనిసరి గా ఒక మెట్టు కిందకు దిగాల్సి వస్తుంది ...
వీళ్ళ అలవాటును ఎవరూ మార్చలేరు ....వీళ్ళను చూసి వీళ్ళే నవ్వుకునే పరిస్థితి అది ...

మరి కొందరు ...ఒక మెట్టు ఎక్కిన తర్వాత..వందసార్లు ఆలోచిస్తారు...
మనం...మనం ఎక్కాల్సిన మెట్టుకి అర్హత సంపాదించుకున్నామా లేదా అని ....,,,
అందుకు తగినట్లుగా మన జీవన విధానం మార్చుకోవచ్చా ...అని ....,,,
ఇక ఒకసారి వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే .....ప్రాణం పోయినా క్రింది మెట్టుకి రారు ....అలా రావాల్సి వస్తే వాళ్ళ ప్రాణాలే వదిలేస్తారు .....వీళ్ళను చూసి వీళ్ళే గర్వపడే పరిస్థితి అది ….!!


ఏది ఏమైనా ....ఎలా జీవించినా....చివరకు గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ....,,,,, మన జీవన విధానం మనకు గర్వం కలిగించాలి తప్ప ...మనకే నవ్వు తెప్పించకూడదు ....అనేది నా అభిప్రాయం .!!

No comments:

Post a Comment