Sunday, April 29, 2018

మనిషి జీవితం.... మనుగడ ...అనేవి అనేక లక్షణాల సమ్మిళితం ..

మనిషిలో సహజంగా కొన్ని లక్షణాలు ఉంటాయి ....
వాటితో మనం మన జీవనాన్ని సాగించాలి అనుకుంటాం .....
నిజానికి అదే సరైన జీవన విధానం కూడా ....
కానీ..., కొన్ని సార్లు మనకు మన సహజ లక్షణాలతో జీవితం ముందుకు సాగదు ....
అప్పుడే సమాజం లో మనుగడ కోసం ....సమాజం ఆమోదించే కొన్ని లక్షణాలను మనం అలవరచుకుంటాం ....
ఉదాహరణకు .....
మనలో ఉన్న సహజ లక్షణం ధైర్యం అనుకోండి .....కానీ కొన్నిసార్లు ధైర్యం పనికిరాదు ....కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి భయపడాలి ....ఆ నిర్ణయాల ఫలితాలు మన ఒక్కరిమీద కాకుండా మన చుట్టూ ఉన్నవాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తున్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయలేం ....అప్పుడు సమాజం మనల్ని పిరికివాళ్ళు అని ముద్ర వేసినా సరే .... పిరికితనం తోనే ముందుకు వెళ్ళాలి ....మనలో సహజంగా లేని పిరికితనాన్ని అలవరచుకోవాలి .....
మనలో ఉన్న సహజ లక్షణం నిజం అనుకోండి.....కానీ కొన్నిసార్లు నిజం చెప్పలేం ...ఆ నిజం వలన మనకే కాకుండా ....సమాజానికి , మన ఆత్మీయులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది....అప్పుడు అబద్ధమే చెప్పాలి ....
అలాగే మనలో సహజ లక్షణం భయం అయితే ....ఎప్పుడూ భయపడుతూ ఉంటే ....జీవితాన్ని కొనసాగించలేం ....కొన్ని క్షణాల్లో ధైర్యంగా అడుగు ముందుకేయాలి ....
మనలో సహజ లక్షణం అబద్ధాలు చెప్పడం అయితే ....కొన్నిసార్లు తప్పనిసరిగా నిజమే చెప్పాల్సి రావచ్చు ...లేకపోతే మనుగడ అసాధ్యం కావచ్చు ...
-------------------------------------
సహజ లక్షణం ఏదైనా ....అందుకు విరుద్ధంగా ఏ లక్షణాన్ని కనపరచాల్సి వచ్చినా ....మనిషి మనుగడకు ఏ లక్షణం అయితే అనివార్యమో అది అవసరమైన చోట ప్రదర్శించక తప్పదు ....🤔
మేమెప్పుడూ అబద్ధం చెప్పలేదు ....మేమెప్పుడూ తప్పు చేయలేదు అని ....ఎవరైనా అంటే...అంత హాస్యాస్పదమైన మాట మరొకటి ఉండదు .....🤣
మనిషి జీవితం.... మనుగడ ...అనేవి అనేక లక్షణాల సమ్మిళితం ...ఎప్పుడు ఏది అవసరం అయితే అదే ....!😍👍😊

No comments:

Post a Comment