Wednesday, May 23, 2018

ప్రపంచం అంతా మనల్ని అపార్ధం చేసుకున్నప్పుడు ....

మిత్రులతో నా మనసులోని కొన్ని స్పందనలు ...... 
===================================
ప్రపంచం అంతా మనల్ని అపార్ధం చేసుకున్నప్పుడు ....ఎవరైతే మనల్ని అర్ధం చేసుకుంటారో వాళ్ళే మన ఆత్మీయులు అని .... 
ప్రపంచం అంతా మనల్ని తప్పు చేశావని నిందిస్తే ....ఎవరైతే మనం చేసిన పనిని సమర్ధిస్తారో వారే మన ఆత్మ బంధువులు అని ..... 
ప్రపంచం అంతా మనల్ని చెడ్డ వాడని వెలివేస్తే ....ఎవరైతే మనల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తారో వాళ్ళే మన మనసైన వాళ్ళని ..... 
మనం అనుకుంటూ ఉంటాం .... 
నాకు ఎదురైన సంఘటనలలో , సందర్భాలలో... నా జీవితం కూడా ....కొందరు వ్యక్తులను.. నాకు ఆత్మీయులుగా ,ఆత్మ బంధువులుగా , మనసైన వారిగా ...నాకిచ్చింది ....అందుకు నాజీవితానికి మనఃపూర్వక కృతజ్ఞతలు ...  
వారితో నా జీవితం అలా ఏ లోటూ లేకుండా సాగిపోతూ ఉన్నా కూడా .....అప్పుడప్పుడు నా ప్రవర్తన అలాంటి వారికి కూడా కోపం తెప్పించిన సందర్భాలు ....నా మీద అసహ్యం కలిగించిన సందర్భాలు ....నేను అర్ధం కాని సందర్భాలు ఉన్నాయి ....   
అప్పుడు మాత్రం ...."తప్పనిసరై ఇలా ప్రవర్తిస్తున్నాను ....మీకు నచ్చినట్టుగా ప్రవర్తించ లేనందుకు మన్నించండి ...." అని మనసులోనే అనుకుంటా ...  
జీవితంలో వాళ్ళు ఎప్పటికైనా అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ఉంటా .... 
----------------------------------
నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి .....ఈ మధ్య ....నన్ను, నా ప్రవర్తనను అర్ధం చేసుకుని .... నా చర్యలను సమర్ధించి ....నన్ను అక్కున చేర్చుకుని ...ఆ విషయాన్ని నాతో పంచుకుని .......,,,,,,,,,,,,
.... ...నాకు మరింత ప్రియమైన వ్యక్తిగా దగ్గరై ....నన్ను తన ప్రియమైన వ్యక్తిగా దగ్గర చేర్చుకున్న .... సంఘటన ఒకటి జరిగింది ....   
------------------------------------------
"ఫలానా వాళ్ళు నీకు అన్యాయం చేస్తున్నారు ....అని తెలిసీ భరించావు ....
నీ సొంత వాళ్ళనే నీకు దూరం చేస్తున్నారు ....వాళ్ళ బుద్ధులే వాళ్లకు అప్పచెప్పి .... బుద్ధి చెప్పు అని , నీ ప్రాణ స్నేహితులే నీతో చెప్పినా ....నవ్వుతూ అది నా మనస్తత్వం కాదన్నావు ....
నువ్వు కూడా కొందరిలా నటించు ....ప్రయోజనాలు పొందొచ్చు .....నీకు చెందాల్సిన ప్రయోజనాలు వాళ్ళకి చెందుతున్నాయి .......అని ఆత్మీయులే చెప్పినా ....నటిస్తే వచ్చే ప్రయోజనాలు నాకు అవసరం లేదన్నావు ...
నా అనుకున్న వాళ్ళే నీ వెనక గోతులు తవ్వుతుంటే ...తవ్వుకోనీ అని వాళ్ళ మనస్తత్వం చూసి జాలి పడుతూనే .....నీ భవిష్యత్తుకు బాటలు నిర్మించుకున్నావు ....
కొన్ని సందర్భాల్లో నేను కూడా నిన్ను అపార్ధం చేసుకున్నాను ....ఎందుకు అందరిలా నువ్వు కాస్త నటిస్తే ....నువ్వు కోరుకుంది నీ కాళ్ళ ముందు ఉంటుంది కదా ....అని ....
ఇప్పుడు నీ ఉన్నతమైన వ్యక్తిత్వం నాకు అర్ధమైంది ....
నువ్వు నటించి ఉంటే 'నువ్వు నువ్వు కాదు'....'నటించకపోవడమే నువ్వు' అని .....నిన్ను నువ్వు కోల్పోకపోవడమే నువ్వు అని ....
అది కోల్పోయి ....మా దృష్టిలో ప్రయోజనాలు అనుకున్న ప్రయోజనాలు పొంది ఉంటే ...ఈ రోజు నువ్వు ఇంత సంతోషంగా ఉండేదానివి కాదు .....నిన్ను నువ్వు కోల్పోకుండా ఉండడం వలెనే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు అని ....
వాళ్లకు నీకూ వ్యక్తిత్వంలో తేడా ఇప్పుడు నాకు తెలుస్తుంది ....నా దృష్టిలో నీ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది ....
నిన్ను చూసి నేను నేనులా ఎలా ఉండాలో నేర్చుకున్నాను ....నేను నేనులా ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాను .....థాంక్స్ "
అంటూ ఆ వ్యక్తి చెప్పడం ముగించాక ....,,,,,,,,(నిజంగా ఆ వ్యక్తి అన్న మాటలే ఇక్కడ చెప్పాను ....)
----------------------------------------
"థాంక్స్ ....మీరు నన్ను అర్ధం చేసుకుంటారని నాకు తెలుసు ....మీ అంతట మీరే అర్ధం చేసుకోవాలని నేను ఆశించా ...జీవితంలో ఎప్పటికైనా జరుగుతుంది అనుకున్నా ....ఇంత త్వరగా ఆ రోజు వస్తుందని మాత్రం అనుకోలేదు ...." సంతోషంగా చెప్పా ....
ఇలా నాతో అన్నది ఎవరో కాదు ....నా పెద్ద కూతురు ....   

(Note: Wrote and published on May 23rd 2016)

No comments:

Post a Comment