Saturday, March 18, 2017

పుల్లా పుల్లా పోగేసుకుని పక్షులు గూడు

పుల్లా పుల్లా పోగేసుకుని పక్షులు గూడు నిర్మించుకోవడం పూర్తి చేసినట్టు ....
ఒక్కొక్క సాక్ష్యం ....ఒక్కొక్క ఆధారం పోగేసుకుని ....ఒక భావాన్ని నిర్మించుకుంటాం .... <3
పక్షులు ....అవి మోయగల బరువులో ఉండి.....అవి నిర్మించుకోవాలనుకున్న గూడులో ఇమడగల పుల్లల కోసం నిరంతరం అలుపెరగక అన్వేషిస్తూ ఉంటాయి ....అవి దొరకగానే ముక్కున కరుచుకుని గూడులో పెట్టుకుంటాయి .. <3
నేనూ అంతే....,,,ఒక భావం గూడు కట్టుకోవడానికి సాక్ష్యాలు సేకరిస్తూ ....ఆధారాలు నిర్మించుకుంటూ ఉంటా రోజూ ....
ఒక్కొక్క భావాన్ని నిర్మించుకున్న ప్రతిసారీ ....ఒక గూడు కట్టుకున్నంత ఆనందం ..... :) <3
ఆ గూడులైనా గాలికో వానకో...చెల్లా చెదురై పోవచ్చు కానీ .... :( :(
నా భావాలు చెక్కు చెదరవు.... <3

Friday, March 17, 2017

మన బలహీనతలు ఏమిటో మనకు తెలుసు ..

మన బలహీనతలు ఏమిటో మనకు తెలుసు ....అవి మనం ప్రపంచానికి ఇష్టమైతే చెప్తాం ...ఇష్టం లేకపోతే దాచేస్తాం ....అది మన ఇష్టం ....,,,
ఎదుటివాళ్ళకు మన బలహీనతలు తెలుసుకోలేకపోతే నిద్రపట్టదు....అది వాళ్ళ బలహీనత ...కష్టమైనా ఇష్టమైనా అది వాళ్ళ ఇష్టం ....
అయితే... వాళ్ళ తెలివితక్కువతనమో ,మన తెలివైన తనమో కానీ...కొన్ని సార్లు ...కొంతమంది... ఎంత ప్రయత్నించినా మన బలహీనతలు ఏమిటో తెలుసుకోలేరు ....
అప్పుడే వాళ్లకు ఒక పిడక ఆలోచన వస్తుంది .... :P
మన పక్కన ఉన్నవాళ్ళతో పరిచయం పెంచుకుని మన బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటారు ....(నిజంగా ఒకరు అలా చేశారు ...ఫ్రెండ్స్ నమ్మాలి ..)
మన అదృష్టమో ...వాళ్ళ దురదృష్టమో కానీ ....మన పక్కన ఉన్నవాళ్ళకు మన బలహీనతలు అందరికీ చెప్పుకుని ....బలంగా ఉండటం అనేది బలహీనత .... :(
అలా తెలుసుకున్న మన బలహీనతలు మన దగ్గర ప్రస్తావించి ....మన గురించి ఏదో తెలుసుకున్నట్టు...ఎంతో సాధించినట్టు ...మన ముందు కుప్పిగంతులు వేస్తారు ఆ "కొంతమంది"...
అలాంటి వాళ్ళను నేను "పనికిమాలిన" వాళ్ళ లిస్టు లో చేర్చి గౌరవిస్తూ ఉంటా ...... :) :) :P

జీవచ్చవాల మధ్య జీవించి ఉండాలనుకోవడం ..

జీవచ్చవాల మధ్య జీవించి ఉండాలనుకోవడం ....,,,జీవించి ఉన్న వాళ్ళ మధ్య జీవచ్చవంలా ఉండాలనుకోవడం రెండూ అసాధ్యమే ....
అదృష్టమో ,దురదృష్టమో తెలియదు....జీవితాకాలం అంతా ...నా ప్రయత్నం... జీవచ్చవాల మధ్య జీవించి ఉండాలనుకోవడంతోనే గడిచిపోయింది ....
రెండో అవకాశం ఎప్పుడూ కలగలేదు ....బహుశా కలగకపోవడమే మంచిది.... !!

Saturday, March 11, 2017

ప్రతి వ్యక్తీ ఎవరికి వాళ్ళు చాలా మానవత్వం ఉన్నవాళ్లే /ఉత్తములే .....

రెండు రోజుల క్రితం ఒకరితో చిన్న వాగ్వివాదం జరిగింది .....వాళ్ళు నాదే తప్పు అన్నారు ....నేను నా తప్పు ఏమీ లేదు అన్నాను ....జరిగింది చెప్పాను ...సంఘటన వివరించాను ....
నష్టపరిహారం కట్టమన్నారు .....సరే అన్నాను ....ఇంత కట్టమన్నారు ......అంత నేను కట్టను/ కట్టలేను ......ఇంత అయితే ఇవ్వగలను అన్నాను ....ఒప్పుకోలేదు .....నేను తప్పుకోలేదు ....మీరు ఇలాంటి వాళ్ళు అని అనుకోలేదు అన్నారు ......ప్రతి వ్యక్తీ ఎవరికి వాళ్ళు చాలా మానవత్వం ఉన్నవాళ్లే /ఉత్తములే ....నిజమైన సందర్భం వచ్చినప్పుడే వాళ్ళ లో ఉన్న అసలు వ్యక్తి బయటకు వచ్చేది ....మీరూ నేనూ అందరం ఉత్తములమే సందర్భం రానంత వరకు అన్నాను ..... చివరకు ఎన్నో వాగ్వివాదాల తర్వాత .....నేను చెప్పిన మొత్తం మాత్రమే ఇవ్వగలను / ఇస్తాను అన్నాను ...మేం చెప్పిన మొత్తం కట్టేవరకు మిమ్మల్ని ముందుకు కదలనివ్వం అన్నారు ......మీరెవరు నన్ను కదలనివ్వకపోవడానికి ..మీకేం హక్కుంది అన్నా ....ఫోన్ లో ఉన్న మావారు ...911 కి కాల్ చెయ్యి అన్నారు ....వాళ్ళు కూడా పిలవండి పోలీస్ ని అన్నారు .....మీరు ఎంతమందిని పిలిచినా ....ఎందరు వచ్చినా అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా ....నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు ....చెప్పా ప్రశాంతంగా ..... :)
చివరకు నా నిర్ణయానికి తప్పనిసరై ఒప్పుకున్నారు ......చెక్కు రాసిచ్చి ...అక్కడినుండి వాళ్లకు నవ్వుతూ వీడ్కోలు చెప్పి కదిలా ..... :)
రాత్రి నేను షాప్ లో ఉండగా వాళ్ళ దగ్గరనుండి ఫోన్ వచ్చింది ....తర్వాత చూద్దాం అని ఎత్తలేదు ....
వెంటనే రెండో సారి కూడా వచ్చింది .....రెండోసారి వెంటనే అంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని ఫోన్ తీశా .....
అటునుండి విపరీతమైన పశ్చాత్తాప భావంతో ....వాళ్ళ గొంతు ....'సారీ ....మేము అసలు అలాంటి వ్యక్తులం కాదు .....అసలు ఆ క్షణంలో ఎందుకు అలా ప్రవర్తించానో ఇప్పటికీ అర్ధం కావడం లేదు ....అలా ప్రవర్తించాక....అసలు నేను ఎలాంటి వ్యక్తిని.. ఏం చేశాను ....తన పట్ల ఎలా ప్రవర్తించాను అనుకుంటే నిద్ర పట్టడం లేదు ...తిండి సహించడం లేదు ....ఒకటే బాధగా ఉంది ....మీకు సారీ చెప్పాలని ఫోన్ చేశాను ....మీరు ఇచ్చిన డబ్బులు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తాను ....ఇలా మీకు సారీ చెప్పకపోతే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను .....ఐ యాం రియల్లీ వెరీ సారీ ....." అని వినిపించింది ....
"నేను అర్ధం చేసుకోగలను ....నాకు మీ మీద ఏం కోపం లేదు .....బహుశా నేను మీ నుండి మరో విధమైన రెస్పాన్స్ ఆశించడం వలన నేను కూడా ఆ సందర్భంలో అలా మీరు ప్రవర్తించేలా ప్రేరేపించి ఉంటాను ....అదొక చేదు సందర్భం ....ఆ సందర్భం వరకు అనుకోకుండా కొన్ని తప్పులు చేసాం అనుకుందాం ....మీరు అదంతా మర్చిపోండి ....ఈ సందర్భంలో డబ్బుల విషయం ఇక రానివ్వకండి .... డబ్బే మన ఫీలింగ్స్ కి అడ్డుకట్ట వేసేది ....నేను అంతా మర్చిపోయాను ...మీ మీద నాకు ఏం కోపం లేదు ....మీరెప్పుడూ హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ....మనము ఎప్పుడూ ఫ్రెండ్స్ లా ఉందాం ...." చెప్పా మర్యాదపూర్వకంగా ....
"లేదు నన్ను నా మనసులో ఉన్నది చెప్పనివ్వండి ....." అర్ధింపుగా వినిపించింది ....
అలా చెప్పుకోకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరని అర్ధమై .....సరే చెప్పండి ....అన్నా ...ఏం చెప్పినా వింటాను అన్నట్టు ....
"అసలు నేను అలా ఎందుకు ప్రవర్తించానో అర్ధం కావడం లేదు ....నేను అలాంటి వ్యక్తిని కాదు ..." మళ్ళీ అదే సమాధానం .....
"నీ పరిస్థితుల్లో ఉంటే నేను కూడా అలాగే ప్రవర్తించి ఉండేదాన్ని ...కానీ ఇప్పుడు కాదు ....కొన్నేళ్ల క్రితం అయితే ....అప్పుడు నేను ప్రవర్తించినట్టే ఇప్పుడు మీరూ ప్రవర్తించారు కాబట్టి ....నాకు నీ ఫీలింగ్స్ అర్ధం చేసుకోవడం ఈజీ అయింది ....కానీ ఇంత త్వరగా తప్పు తెలుసుకోవడం మాత్రం నిజంగా అభినందించదగ్గ విషయం...నిజానికి నేను కూడా ఇంత తొందరగా నా తప్పులు నేను తెలుసుకోలేకపోయాను నా జీవితంలో ...నాకు మిమ్మల్ని చుస్తే చాలా సంతోషంగా ఉంది ....మనం ఇద్దరం అంతా మర్చిపోయి ...మంచి ఫీలింగ్స్ తో ముందుకు వెళదాం ...." అపరాధ భావం పోగొట్టాలని ....చెప్పా.....
===============
ఈ సంఘటన వల్ల నాకొకటి అర్ధం అయింది ....మన జీవితంలో మనకు దుర్మార్గులూ ఎదురవుతారు ....ఉత్తములూ ఎదురవుతారు .....దుర్మార్గులు అనుకున్నవాళ్ళు ఉత్తములని తెలిసినప్పుడు మానవజాతి మీద అమితమైన నమ్మకం .....ఉత్తములు అనుకున్న వాళ్ళు దుర్మార్గులని తెలిసినప్పుడు మానవజాతి మీద అమితమైన అసహ్యం కలగడం సహజం ....!
దుర్మార్గులు అందరు ఉత్తములూ కాదు ....ఉత్తములు అందరూ దుర్మార్గులు కాదు .....మనం కొన్నిసార్లు పొరబడతాం ....సందర్భాన్ని బట్టి .....దుర్మార్గులను ఉత్తములని ....ఉత్తములను దుర్మార్గులని .....
కానీ కాస్త సమయం ఇస్తే ....ఎవరు ఏమిటో తెలుసుకోవచ్చు ....
====================
ఏది ఏమైనా ....ఎవరు ఎలా ఉన్నా ....జీవితం గొప్ప పాఠశాల రా బుజ్జీ ... :) <3

Thursday, March 9, 2017

భూమి సమానంగా ఉంచడం ఆయన బాధ్యత ....

భగవంతుడికి బాధ్యతలు ఏముంటాయా అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటా ....??! :(
ఎందుకుండవు ....??!! అనుకుంటాం కానీ భగవంతుడికి కూడా ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి ....
ఉదాహరణకు ...భూమి సమానంగా ఉంచడం ఆయన బాధ్యత అనుకుందాం....
సమానం ఏమిటండీ భూమి గుండ్రంగా కదా ఉండేది అని మీకు అనుమానం రావచ్చు .... :)
ఇక్కడ సమానంగా అంటే అర్ధం ... పాపులు అంతా పెరిగిపోయి ....పాపుల పక్కకు .....పుణ్యాత్ములు అంతా పెరిగిపోయి పుణ్యాత్ముల పక్కకు ప్రపంచం ఒరిగిపోకుండా ....బాలెన్స్ చేయడం అన్నమాట .... :P
అది ఎవరి పని ....??!! ఖచ్చితంగా భగవంతుడి బాధ్యతే .....!
సపోజ్ ,,, పర్ సపోజ్ ....మన జీవితంలో మనకు ఒక మనిషి.... పరమ దుర్మార్గుడని , నీచమైన వాడని , నమ్మక ద్రోహానికి వారసుడని , దారి చూపిన వాళ్ళ దారిలో గోతులు తవ్వేవాడని ...మొత్తానికి మనిషి పుట్టుక పుట్టలేదని తెలిసింది అనుకుందాం .....సహజంగానే ....ఛీ వీడూ ఒక మనిషేనా అని అసహ్యం కలుగుతుంది.....
ఆ తర్వాత ...మరుక్షణమే...మనకు జీవితంలో ..ఒక ఉత్తముడు ....మానవత్వం పరిమళించే వ్యక్తి .....సహాయానికి చిరునామా ఇచ్చిన వ్యక్తి ....చేయూత ఇచ్చి దారి చూపే వ్యక్తి తారసపడి .....ఆహా... మానవత్వం ఉన్న మనిషంటే వీళ్ళే కదా అనిపిస్తుంది .....
అలా అనిపించాలి / కనిపించాలి కూడా ....అనిపించకపోతే ....జీవితం మీద ఆశ చచ్చిపోతుంది ....మానవ జన్మ మీద నమ్మకం పోతుంది ....ఒకరినొకరు చంపుకుని ....లేదా ఎవరికి వాళ్లే చచ్చిపోతారు .......
ఏమో ...ఇప్పుడు ఈ మానవత్వం ఉన్నవాళ్లు రేపు మళ్ళీ దుర్మార్గులుగా మారిపోవచ్చు ....అవకాశవాదం అలవరచుకుని .....
ఆ దుర్మార్గులు ఉత్తములు అయిపోనూవచ్చు ...అవసరవాదం అలవరచుకుని ....
లేదా ....ఈ దుర్మార్గులు మరొకరికి ఉత్తములు కావచ్చు ....ఈ ఉత్తములు మరొకరికి దుర్మార్గులు కావచ్చు ....చెప్పలేం ....
ఇలా దుర్మార్గుల్ని , పుణ్యాత్ముల్ని సమానంగా ఉంచకపోతే భూమి ఏదో వైపుకి ఒరిగిపోతుంది అనే భయం భగవంతుడికి కూడా ఉంటుంది ....
అందుకే నిరంతరం ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు .....అదే భూమిని సమానంగా ఉంచడం .... :) :P
ఏది ఏమైనా మనకెవరు తారసపడినా ....మన జీవిత ప్రయాణం నిరంతర పాఠాలతో ....నిత్య నూతనంగా సాగుతూనే ఉంటుంది ....అనేది మనమెరిగిన జీవిత సత్యం ..... :) <3

మనలో దాగి ఉన్న ఆనందం కనుక్కున్న రోజున

"వీళ్లకు ఆహారం , సెక్స్ అనేవి రెండు మాత్రమే ఆనందాలు ...." కొందరిని ఉద్దేశించి ....ఒకరు నాతో
"పాపం ఎందుకనో వాళ్ళు మిగతావాటిలో ఆనందం కనుక్కోలేకపోయారు .... " జాలిగా చెప్పా నేను ...
ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ ...బ్రతికినంతకాలం ....ఎక్కడ ఆనందం ఉందో గుర్తించడం అనేది దినచర్య గా మారాలి ....ప్రతి రోజూ ....ప్రతి క్షణం మనం చేసే ప్రతి పనిలో ఆనందం గుర్తించగలిగితే ....ఏదో ఒకదాని మీద ఆనందం కోసం ఆధారపడే అవసరం ఎందుకు వస్తుంది .....??!!
ఏది ఏమైనా చివరకు ....మనలో దాగి ఉన్న ఆనందం కనుక్కున్న రోజున ....ప్రపంచం అంతా మన ఆనందం మీద ఆధారపడే రోజు ఒకటి వస్తుంది అనేది ...ఆనంద సత్యం ...! <3 <3

Tuesday, March 7, 2017

"ప్రొడక్టివ్ అంటే ...."


కొన్ని సంవత్సరాల క్రితం .....ఓ రోజు ....మావారు నా దగ్గరకు వచ్చి ....
=========================
"ఈ రోజు నువ్వు చేసిన ప్రొడక్టివ్ పని ఏమిటో చెప్పు ...." అడిగారు ....
"డిషెస్ / ఇల్లు శుభ్రం చేశా , బట్టలు ఉతికా , బజారుకి వెళ్లి కూరగాయలు ,/ సరుకులు తెచ్చా , ఇంకా పిల్లలకు వండి పెట్టా ..." ఇలా ఏవో చెప్పా ....
"అది కాదు ...ప్రొడక్టివ్ వర్క్ " మళ్లీ అదే ప్రశ్న ....
"ప్రొడక్టివ్ అంటే ...." నిజంగానే తెలియక అడిగా ....
"అంటే నీ కెరీర్ కి , నీ అభివృద్ధికి , నీకు ఉపయోగపడే పనులు ..."
".................................." సమాధానం చెప్పలేకపోయా ..... :(
"ఇకనుండి రోజూ ప్రొడక్టివ్ వర్క్ ఏం చేశావో ఆలోచించుకో ..." చెప్పారు నాకు ...
"మీరేం ప్రొడక్టివ్ వర్క్ చేశారు ..??!!" అసలు ప్రొడక్టివ్ అంటే అర్ధమేమిటో తెలుసుకోవాలని అడిగా ...అలాంటిదే నేను కూడా చేయొచ్చు అని కూడా అనుకోండి .....
"చదువుకున్నా , డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం చేశా , నా ఆరోగ్యం కోసం వ్యాయామం చేశా ...మళ్లీ చదువుకున్నా ...కాసేపు నా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూశా " సమాధానం చెప్పారు ....
ఓహ్ .... ఏదైనా.... మన కోసం మనం చేసుకోవడమే ప్రొడక్టివ్ అని అర్ధమైంది .....
తర్వాత రోజు .....అంతా ప్రొడక్టివ్ వర్క్ చేశా ....
భలేగా అనిపించింది .... :)
రెండో రోజు ....ప్రొడక్టివ్ వర్కే చేశా ....
మూడో రోజు ....
కంచంలో అన్నం పెట్టుకుందాం అని చూస్తే ....కుక్కర్ లో అన్నం లేదు ...పెట్టుకోవడానికి కంచం లేదు .... :(
సింక్ చుట్టూ ఎండిపోయి ,నాకేసినట్టు కంచాలు ...స్టవ్ మీద మాడిపోయిన గిన్నెలు ....
వెంటనే .....,,,
ఘంటసాల భగవద్గీత పెట్టుకుని ....గిన్నెలు కడగడం మొదలు పెట్టా ...
"పార్ధా ..నీవు నా యందే చిత్తము లగ్నము చేసి కృత నిశ్చయుడవై ...యుద్దము చేయుము ...." పార్థుడితో కృష్ణుడు అనడం విని నవ్వొచ్చింది ..... :)
ఎందుకో ....కృష్ణుడిని అడగాలనిపించింది....పని చేసి ...ఫలితం ఆశించకు అని చెప్పావ్ కానీ .... ప్రొడక్టివ్ వర్క్ అంటే ఏమిటో .....ఒక్క ముక్క చెప్పకూడదా ....అని .....
హు ...ఏమో ఎవరికి తెలుసు .....కృషుడు కూడా ఆ ఒక్కదానికే అర్ధం నాకు తెలియదు అని అని తప్పించుకుంటాడేమో అనే నా ఆలోచనకు నాలిక్కరుచుకుని ....టాప్ తిప్పా....యుద్ధం చేయడానికి కాదు ....గిన్నెలు కడగడానికి ....ప్రపంచం గుర్తించని ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి .. !
---------------------------------------------
కానీ ఆ క్షణం నుండి ....ప్రతిరోజూ ప్రొడక్టివ్ వర్క్ ఎంత చేస్తున్నానో లెక్క పెట్టుకోవడం మాత్రం నా మెదడు మర్చిపోలేదు .....
అంత విప్లవాత్మకమైన ప్రశ్న నన్ను వేసి నా జీవిత గమనాన్ని మార్చిన మా వారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పక తప్పడం లేదు ..... :):P
---------------------------
మహిళా మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..... :) :P

Wednesday, March 1, 2017

ఇదే నా జీవిత దృశ్యం ......... :) :) :)

గతం = చేసిన తప్పులు -నేర్చుకున్న పాఠాలు .....
వర్తమానం =చేస్తున్న తప్పులు -నేర్చుకుంటున్న పాఠాలు..
భవిష్యత్తు =చేయబోయే తప్పులు -నేర్చుకోబోయే పాఠాలు ...
----------------------------------------------
ఇదే నా జీవిత దృశ్యం ......... :) :) :)

సందేహం లేకుండా ....అదే జీవితం .... :) :)

జీవితంలో ..మనకు ఎదురైన వారిలో …..,,,
మనం కొందరికి ఎంతో ఇస్తాం ....కానీ మనం తిరిగి వాళ్ళ దగ్గరనుండి ఏమీ తీసుకోలేం.....
అలాగే కొంతమందికి మనం ఏమీ ఇవ్వం/ఇవ్వలేం ....అయినా వాళ్ళ దగ్గర ఎంతో తీసుకుంటాం ...
ఏమీ ఇవ్వని వాళ్లకి మనం ఎలా ఇవ్వగలం అని ...,అన్ని ఇచ్చిన వాళ్లకి మనం ఏమీ ఇవ్వలేకపోయాం అని బాధపడుతూ కూడా ఉండలేం ....
అందుకే ....,
"కొంతమంది దగ్గరనుండి తీసుకోవడం ....
మరి కొందరికి ఇవ్వడం...."
ఇదే జీవితం అని కొన్నిసార్లు అనిపిస్తే ........??!!
సందేహం లేకుండా ....అదే జీవితం .... :) :)