Friday, June 12, 2020

Take it for granted

Take it for granted:
===============
మొన్నొక రోజు ....మావారు "కాస్త పనుంది ...బయటకెళ్ళాలి ...నీకెప్పుడు వీలవుతుంది" అడిగారు నన్ను ...
"ఇప్పుడా ...,నాకు వీలవదు...నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యేవరకు వెయిట్ చేయండి ...అవగానే వస్తాను ...." చెప్పా ...తప్పకుండా వస్తాను అని అర్ధం ధ్వనించేలా ....
"ఎందుకు ....నేను వెళ్ళొస్తాను కదా ..." అడిగారు ...
"వద్దు ....నేను మీకు కార్ ఇవ్వను ..." చెప్పా కాస్త కటువుగా ...
"సరే తల్లి ..." చెప్పారు తప్పదన్నట్టు ...
(దానికో బలమైన కారణం ఉంది ....ఈ మధ్య లక్డౌన్ లో రెండు సార్లు వరుసనే బ్యాటరీ సర్వీస్ కోసం ...ఇన్సూరెన్స్ ని కాల్ చేయాల్సి వచ్చింది ...
కారు దిగాక ...ఇంజన్ ఆఫ్ చేయకపోయినా ....లేదా లాక్ చేయకపోయినా బ్యాటరీ డౌన్ అయిపోతుంది ...ఇది కావాలని చేసారని కాదు ...ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ..ఈ రెండిట్లో ఏదో మర్చిపోతున్నారని నా అనుమానం ..(అనుమానం మాత్రమే కావచ్చు కూడా )
పైగా నాకు కొన్నిసార్లు మాత్రమే ... ఫ్రీ సర్వీస్ ఉంటుంది సంవత్సరానికి ....అది దాటితే వాళ్ళకి డబ్బులు కట్టాలి ...లాక్ డౌన్ వలన గంటలతరబడి వాళ్ళు రారు ...
ఏదైనా అర్జెంటు అయితే ...?
అందుకే ఇవ్వనని చెప్పా ...)
పనయిపోయాక ...ఇద్దరం బయలుదేరాం ...
సాయంత్రం అయిదవుతున్నా వాతావరణం చాలా వేడిగా ఉంది ...
కిటికీ అద్దాలు కిందకి దించి ...ఏసీ ఫుల్ స్పీడ్ లో పెట్టా ....
కాస్త రిలాక్సింగ్ గా అనిపించింది ....
మేం వెళ్లిన పని ఓ ఐదు నిమిషాల్లో అయిపోతుంది ....
"ఈ కాస్త దానికి నేను కూడా కార్ దిగడం ఎందుకు ....మీరు వెళ్లి వచ్చేయండి ...నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా ...." చెప్పా మా వారితో ...
తను వెళ్ళాక ఆ వేడికి కార్ ఆఫ్ చేయకుండానే వెయిట్ చేస్తూ ...సాంగ్స్ వింటూ ...మెసేజ్ లు చూస్తూ కూర్చున్నా ....
కాసేపాగాక ....క్రెడిట్ కార్డు నా దగ్గరే ఉందని గుర్తొచ్చి ....తప్పనిసరై ..నేను కూడా షాప్ లోకి వెళ్లి ...క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న తనకు కార్డు ఇచ్చి ...త్వరగా వచ్చేయండి అని చెప్పి .......మళ్ళీ వచ్చి కార్ లో కూర్చున్నా ...
ఐదు నిముషాలు ....
పది నిముషాలు ....
పదిహేను నిముషాలు అయిపోతుంది ....
అయినా ఇంకా రాలేదు ....
ఏంటి ....బిల్ కట్టడానికి ఇంతసేపా ....అనుకున్నా ...
సరేలే మళ్ళీ ఏదైనా గుర్తొచ్చిందేమో అని ....ఇంకాసేపు వెయిట్ చేశా ...
మరో పది నిమిషాలయితే పరుగులు పెట్టాయి కానీ ....వస్తాడనుకున్న మనిషి అక్కడే ఆగిపోయాడు ....
ఇక లాభం లేదని ...ఫోన్ చేశా ...
ఏమైంది ...ఇంకా రాలేదు ...అడిగా ...
"లేదు ...ఒక బుక్ ప్రింట్ చేసుకోవాలి ....అది అయ్యేసరికి ...ఓ అరగంట పడుతుంది ...వెయిట్ చేయాలి ..." అన్నారు ...
"మీరొచ్చిన పనేంటి ....చేస్తున్న పనేంటి ...నేనిక్కడ ఇంతసేపటినుండి వెయిట్ చేస్తున్నాను ....కనీసం ...ఈ పని ఉంది ...ఇంతసేపు పడుతుంది ....అని మీకు చెప్పాలనిపించలేదా ...."అడిగా అయోమయంతో కూడిన అసహనంతో ....
"ఆ ...పోనీ వెయిట్ చేయలేకపోతే నువ్వు ఇంటికెళ్ళు ...నేను నడిచి వస్తాను ...." చెప్పారు ...
"లేకపొతే ..ఇక్కడ ఒక ఐటం దొరకలేదు ....పక్క షాప్ లో ఉంది ....కాస్త వెళ్లి తీసుకురాగలవా ...అంతలో నా పని అయిపోతుంది ..." తనే చెప్పారు మళ్ళీ ...
"సరే వీళ్ళని బుక్ ప్రింట్ చేయమని చెప్పి నేను వస్తాను ....ఇద్దరం వెళ్దాం ...." నా సమాధానంతో సంబంధం లేకుండానే చెప్పారు ....
అయిదు నిమిషాల తర్వాత ...తను రావడం ..కాస్త దగ్గరలో ఉన్న మరో షాప్ కి వెళ్లడం ....ఆ పని పూర్తి చేసుకోవడం ....మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్న బుక్ కోసం తిరిగి రావడం ....జరిగిపోయింది ...వస్తూ ఉన్నప్పుడు దారిలో....
"అసలు మీకు ...బయట నేను ఎండలో వెయిట్ చేస్తున్నాను అని ....కనీసం ఇంత టైం పడుతుంది... అని చెప్పాలి అనిపించలేదు అంటే ....నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ...." మళ్ళీ అడిగా ...సమాధానం కోసం ...
"వెయిట్ చేస్తావులే అనుకున్నా " చెప్పారు ....వెయిట్ చేయక నీకు వేరే ఆప్షన్ ఏముంది అన్నట్టుగా
నాకు చాలా చాలా కోపం వచ్చింది ....కానీ అదంతా ప్రదర్శించడం కూడా వృధా అనుకుని ....
ఇంత బాధ్యతారహితంగా ఎందుకు ప్రవర్తిస్తారో ....అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా ...
ఇదే స్థానంలో ...మీ భార్య కాకుండా ఒక ప్రేయసి ఉండి ఉంటే ఇలా ప్రవర్తించేవారా ...." ప్రశ్నించా ....నిజంగా సమాధానం తెలుసుకోవాలని ....
అవతలినుండి ...మౌనమే సమాధానం ...
"పోనీ మీకొకటి చెప్పనా ....నాకొక ప్రేమికుడు ఉండి ఉంటే ....అతను ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటే ....ఖచ్చితంగా ఇలా ప్రవర్తించి ఉండేవాడు కాదు ..." చెప్పా ప్రశ్న అడగకపోయినా ....
"ఈ పెళ్లిని ..భార్యని ...ఈ బంధాలన్నిటిని ....ఎందుకింత "Take it for granted" గా తీసుకుంటున్నారో ....భార్య స్థానంలో ఉంది ఒక మనిషని ....దాని జీవితానికి ఒక సమయం ఉంటుందని ....దాన్ని రెస్పెక్ట్ చేయాలనీ మీకు అనిపించనప్పుడు ...ఇలాంటి బంధాలు ఎందుకో నాకు అర్ధం కావడం లేదు ...." చెప్పా అర్ధం కాదని ...అర్ధం లేదని తెలిసినా ....
అసలు ఎవరికి అర్ధం అవుతుంది ...??!! తను బుక్ తెచ్చుకోవడానికి వెళ్లిన సమయంలో యధావిధిగా నా ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి ....
**********************
అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ క్రితం అనుకుంటా ....
కాలేజ్ నుంచి సెలవులకి ఇంటికొచ్చిన నా కూతురు ...కొత్తగా ప్రవర్తించడం నేను గమనించా ....
నేను బ్రేక్ ఫాస్ట్ ఇచ్చినా ....లంచ్ ఇచ్చినా ....డిన్నర్ ఇచ్చినా ...లేదా తనకోసం ఏ చిన్న పని చేసినా ...."థాంక్ యు సో మచ్" అని చెప్పడం ....అది నా బాధ్యత అయినా / కాకపోయినా ...తన కోసం చేశాను అన్నట్టు ....అది చేసినప్పుడు నేను ఆ పని మీద వెచ్చించిన సమయం పరిగణలోకి తీసుకోవడం ....ఎంత కష్టపడి చేసానో గుర్తించడం ...."లవ్ యు మమ్మి " అని చెప్పడం నేను గుర్తించా ....
"ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా చెప్పేదానివి కాదు ....ఇప్పుడు కొత్తగా ఇలా ఎందుకు చెబుతున్నావు ..." అడిగా ఒకరోజు తెలుసుకుందాం అని ....
"ఇంతకు ముందు నాకు తెలిసేది కాదు ....మీరేం చేసినా "Take it for granted" గా తీసుకునేదాన్ని ....అది వాళ్ళ బాధ్యత అన్నట్టు ఆలోచించేదాన్ని ....ఇప్పుడు ఎవరు మన కోసం ఏం చేసినా "Take it for granted" గా తీసుకోకూడదని అర్ధం చేసుకున్నాను...అందుకే ఇప్పుడు నువ్వు మా కోసం ఏం చేసినా చాలా కృతజ్ఞతగా అనిపిస్తుంది .." చెప్పింది వివరంగా ....
పిల్లలు చాలా ఎదిగారని ..వాళ్ళ దగ్గరనుండి నేను ఎంతో నేర్చుకోవాలని నాకు అర్ధం అయింది ....అప్పట్లో ....
అప్పటినుండి ....నేను కూడా మా అమ్మ నా కోసం ఏం చేసినా ...."Take it for granted" గా తీసుకోకూడదని అర్ధం చేసుకున్నా ...
అమ్మ నాకు ఇప్పటికీ పళ్లెంలో అన్నం పెట్టి ఇస్తుంది ఇంటికెళ్తే ....నేనెప్పుడైనా థాంక్స్ చెప్పానా అని ఆలోచిస్తే ....లేదు ....నేను కూడా "Take it for granted" గానే తీసుకుంటాను ....
అమ్మ కి థాంక్స్ చెప్తే నన్ను పిచ్చిదానిలా చూడొచ్చు అమ్మ ....కానీ చెప్పాలి ....పది సార్లు నన్ను పిచ్చిదానిలా చూస్తుంది ....పదకొండోసారి తప్పకుండా అర్ధం చేసుకుంటుంది ....
అంతెందుకు ....ఫ్రెండ్స్ కి ప్రతి చిన్నదానికి థాంక్స్ చెబుతూ ఉంటా ....సారీ చెబుతూ ఉంటా ....
మనలో మనకి థాంక్స్ అవసరమా ....సారీ అవసరమా అంటారు ....
ఇతరుల సమయాన్ని ....కష్టాన్ని ...."Take it for granted" గా తీసుకోకూడదనే ఒకే ఒక్క కారణం ....నన్ను ఆలోచింపజేస్తుంది ....
చిన్నతనం నుండి ....మనకు ప్రతిదీ "Take it for granted" గా తీసుకోవడం అలవాటు అయితే ...ఎదుటి వ్యక్తి కష్టానికి ....జీవితానికి ...విలువేదీ ....??!!
అందరూ మనం ఉపయోగించుకోవడానికి పుట్టినవాళ్ళే ...నా జీవితం ఒక్కటే నాకు ముఖ్యమైంది ....ఇతరుల జీవితం ఎలా పొతే నాకేం ..అనే ...మనస్తత్వం ఏర్పడితే ....చివరకు ప్రకృతి కూడా మనకు ...."Take it for granted" గానే మారిపోతుంది ...!
*************************
నా ఆలోచనల్లో నేనుండగానే ....
"బుక్ బైండింగ్ చేస్తున్నారు ...అయిదు నిమిషాల్లో అయిపోతుంది ..." అని మా వారి నుండి మెసేజ్ ...
"ఓకే ...థాంక్స్ " చెప్పా ....నా సమయానికి ఇచ్చిన గౌరవానికి కృజ్ఞతగా చెప్పా ....🙏