Tuesday, July 27, 2021

ఈ గార్డెనింగ్ అనేది ...

 ఈ గార్డెనింగ్ అనేది ...చాలా పరిమితంగా చేసుకోవాలి అనేది ఈ సంవత్సరం నేను నేర్చుకున్న పాఠం ...

ఎక్కువ పండించడం వలన ...లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి ...
మొన్నొక ఆంటీ వాళ్ళకి ...మా తోటలో పండిన కూరగాయలు ఇవ్వడానికి వెళ్తే ...అప్పుడు ఆంటీ నాకు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చారు ...చిక్కుడు కాయలు , సొరకాయలు ఇలా చాలా...
"ఆంటీ నా దగ్గర ఉన్నవాటికే ఫ్రిడ్జ్ లో చోటు లేదు ...
పోనీ అని కష్టపడి చేసినా ...వండినవన్నీ తినలేకపోతున్నాం ...
అంతలో పాడైపోతున్నాయి ....మధ్యలో పిల్లలు ....బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు ..." అని వద్దని చెప్పా ...
అప్పుడు ఆంటీ కూడా అదే చెప్పారు ...
పొద్దున్న నిద్రలేచేసరికి మీ అంకుల్ ..వాళ్ళిచ్చారు వీళ్లిచ్చారు అని ...తోటలోవి అని ...రకరకాల కూరగాయలు పెడుతున్నారు ...దానితో అది చెయ్యి ...దీనితో ఇది చెయ్యి బాగుంటుంది అని లిస్ట్ చదువుతున్నారు ....నేనేమో చేయలేకపోతున్నాను ....అని
ఇలా ఒకరికొకరు ఇవ్వడం వలన కానివ్వండి ...గార్డెనింగ్ వలన కానివ్వండి ...ఆడవాళ్ళ మీద కనిపించని ఒత్తిడి పడుతుంది ...
కానీ మగవాళ్ళు మాత్రం కోరుకున్న రుచులు ...తింటూ హాయిగా కాలుమీద కాలేసుకుని కాలం గడుపుతున్నారు ....(కొద్ది మంది మినహాయింపు )
పైగా దీనికి తోడు ....మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ...గిన్నెలు కడుక్కోవడం ఒకటి ...
ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ...ఇలాంటివి స్త్రీ కి అదనపు బాధ్యతలే తప్ప ...
ఏ విధమైన లాభం లేదని అర్ధమైంది ....
అందుకే పరిమితంగా ఓ నాలుగైదు చెట్లు వేసుకుని ....బజార్లో బియ్యం తెచ్చుకుని ...బండ మీద కారం నూరుకుని ....ఎవరైనా బలవంతంగా కూరగాయలు అంటగట్టినా ....సున్నితంగా తిరస్కరించి ....సంతోషంగా కాలం గడపాలి అని గుణ పాఠం ...అన్నమాట 🙏!

Sunday, July 18, 2021

ప్రతి స్త్రీ ..తనకు ఇల్లుందా లేదా ...

 ప్రతి స్త్రీ ..తనకు ఇల్లుందా లేదా ....ఇంట్లో తనకు హక్కులున్నాయా లేదా అని ఆలోచించాలి ....

ఇల్లు లేకపోవడం అంటే ...ఇల్లు లేకపోవడం కాదు ...
ఇంట్లో స్త్రీ కి హక్కులు లేకపోవడం ...
ఇల్లంటే ....మేడ ....చెట్టు ...పుట్ట ఏదైనా కావచ్చు ....
ఎక్కడైనా ఉండనీ ...ప్రతి స్త్రీ కి తన ఇంట్లో తనకు హక్కులున్నాయా అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే ...
కనీసం తన మీద తనకైనా హక్కుందా ....తన సంపాదన మీద ...,తన వస్త్ర ధారణ మీద .., తన ఇష్టా ఇష్టాల మీద, ... తను తినే తిండి మీద అయినా తనకు హక్కుందా ...?!
ఆలోచించాలి...మరోసారి ...వీలైతే మరోసారి ...స్త్రీ ఆలోచించాలి ....తనను తాను ప్రశ్నించుకోవాలి !🤔

బాధ్యత నిర్వర్తించడం అంటే ...

 బాధ్యత నిర్వర్తించడం అంటే ...,, అప్పుడప్పుడు, ఇష్టమైనప్పుడు, సమయం అనుకూలించినప్పుడు , నిద్ర లేచినప్పుడు , చేయాలని అనిపించినప్పుడు , ఎవరైనా చూస్తున్నప్పుడు , ఎవరైనా చెప్పినప్పుడు ...చేసేది కాదు ...

అది పూర్తయ్యేవరకు ....ఇష్టమున్నా ...లేకపోయినా ....సమయం ఉన్నా ...లేకపోయినా ...చేయాలనిపించినా అనిపించకపోయినా ....ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా ....చూసినా చూడకపోయినా ...నిద్రలోనూ ...మెలకువలోనూ...అదే ధ్యాసలో అదే శ్వాసలో ...పూర్తి చేస్తే ...బాధ్యత నిర్వర్తించడం అంటారు ....!😀😇

ఎందరో స్త్రీలు ..ప్రతి రోజూ ..ప్రతి క్షణం ...

 ఎందరో స్త్రీలు ..ప్రతి రోజూ ..ప్రతి క్షణం ...కుటుంబానికి , సమాజానికి , పరిస్థితులకు అనుగుణంగా ...తమను తాము మార్చుకుంటూ ....మారిపోతూ ...మార్పు చెందుతూ ఉండడం ...నేను నా జీవితం అంతా చూస్తూనే ఉన్నా ....

🙏
కానీ నా జీవితకాలం లో ..ఒక్క పురుషుడు కూడా ...తనని తాను మార్చుకోవడం ...మారుతూ ...మార్పు చెందుతూ ఉండడం నేను చూడలేదు ...
సమాజం , కుటుంబం , పరిస్థితుల కోసం కాకపోయినా ...చివరకి తన కోసం తాను అయినా సరే ...!🤔

Friday, July 16, 2021

కొన్ని బాధ్యతలు కొత్తవి నేను కమిట్ అయినప్పుడు

 కొన్ని బాధ్యతలు కొత్తవి నేను కమిట్ అయినప్పుడు నాకు ఆ రోజు ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా మెలకువ వస్తుంది ....

అది నేను చేయగలనా అని ..భయం వేస్తుంది ....
ఎప్పటిలాగే ఆలోచనల్లో కూడా భరోసా కోసం ఎవరూ తోడు రారు ...
ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది ....అసలు ఎందుకు కమిట్ అయ్యాను ....ఎవరి కోసం ..
ఇది నా బాధ్యతా ...కాదా ...
ఒకవేళ బాధ్యతే అయితే ....తలకు మించిన బాధ్యతేమో ....
లేదు ఎలాగైనా వెనకడుగు వేయకూడదు ....ఇంకాస్త ఎక్కువ కష్టపడదాం ....
రేపటినుండి ..ఇంకా జాగ్రత్తగా పనులు చేసుకోవాలి ...
ఈ సంఘర్షణతో ....ఏ తెల్లవారు జామునో నిద్ర పడుతుంది ...
అంటే మధ్యలో ఓ రెండు మూడు సార్లు ....కళ్ళు గట్టిగా మూసుకోవడానికి ప్రయత్నిస్తా కానీ బెంగ అనుకో ....భయమనుకో ....ఆందోళన అనుకో ..నిద్ర పట్టదు ...
పొద్దున్నే నిద్ర లేచాక ...ఎవరితోనూ మాట్లాడను...ఎవరికీ కాల్స్ చేయను ....మౌనంగా రోజుకంటే ఎక్కువ పని చేసుకుంటా ....
ఆఫ్కోర్స్ ...కొన్ని రోజులయ్యాక ఈ బాధ్యత అయిపోయి ....మరో కొత్త బాధ్యత కమిట్ అవ్వాల్సి వస్తుంది ....మళ్ళీ ఆలోచనలు ....నిద్ర పట్టకపోవడాలు ....
ఇదో జీవిత ప్రవాహం .... పాతనీరు ...కొత్తనీరు ...
ఇలాంటి సంఘర్షణ ...ఓ నాలుగు రోజుల క్రితం జరిగింది ....!🙍‍♀️

ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో ...

 ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో ...

ఒకే ఒక్కటి మా వారికి నేను ఇవ్వలేకపోయా ....
కానీ వారు నాకు అనుక్షణం అది క్రమం తప్పక ఇస్తూనే ఉన్నారు ...ఉంటారు ...
అదే ..." బాధ్యతలు (చేయాల్సిన పనులు ) గుర్తు చేయడం ..."
...............................
అదేంటో ...ఎవరి పనులు వాళ్ళు సమయం ప్రకారం చేయాలని ...మరొకరు గుర్తు చేయడం ఏంటో ...
గుర్తు చేసినా చేయకపోవడం వలన ....మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఏమిటో ....
ఇలాంటి అవకాశం కొందరికే ఉంటుంది ...
అందుకు నేను వారికి కృతఙ్ఞతలు చెప్పాలి ...!

"ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్స్ , బంధువులు

 "ఇండియాలో ఉన్న నా ఫ్రెండ్స్ , బంధువులు ....లక్ష్మి అమెరికాలో ఉంది కదా ..ఇంకేముంది .... కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ...టాప్లెస్ కార్లో సీటు బెల్టు కూడా పెట్టుకోకుండా ....ఒక కోక్ బాటిల్ స్టైల్ గా ఒక చేత్తో తాగుతూ ....ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ....డ్రైవ్ చేసుకుంటూ ...పబ్బులకి , క్లబ్బు లకి , కాసినోలకి ....షాపింగులకి , సినిమాలకి ...ఊపిరాడకుండా తిరుగుతూ ఉంటుంది .... అని ఊహాగానాలు చేస్తూ ఉంటారు ....

తీరా ఇక్కడ నేనేంటమ్మా అంటే ....ఒక పబ్బు ఎలా ఉంటుందో తెలియదు ...ఒక క్లబ్బు ఎలా ఉంటుందో తెలియదు .....కనీసం పనిమనిషి కూడా దొరకదు కాబట్టి ....రోజూ చిప్పలు తోముకుంటూ ....వండి పోసుకుంటూ ....పొద్దుటినుండి ...రాత్రి నిద్రపోయేవరకు ఒకటే చాకిరీ ....
ఇండియా నుండి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ....వాళ్ళు పొరపాటున పబ్ కి పోదాం అంటే నా పరిస్థితి ఏంటి....?! "అని మా ఇంట్లో వాళ్ళతో అన్నా మొన్నామధ్య ....
"నేను తీసుకెళ్తా పద " పాపం అని జాలి తలచి చెప్పారు మావారు ....
"నేను మీతో రాను" చెప్పా ...
"నేను తీసుకుని వెళ్తాలే మమ్మీ నిన్ను ఒకసారి" చెప్పింది నా డాటర్ ....🥰
"ఈ వయసులో మీరు బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాలి ...మమ్మీ తో వెళ్తే అందరూ నవ్వుతారురా ...." చెప్పా
"అలా ఏమీ ఉండదులే నేను తీసుకెళతా ...."నా డాటర్ హామీ ....
"వద్దులే ....నేనే ఎవరినైనా ఫ్రెండ్స్ ని చూసుకుని వెళ్తా ...." చెప్పా నవ్వుతూ ....
కాబట్టి ఫ్రెండ్స్ ఎవరూ ...నాకు ఇక్కడ ఉన్నవన్నీ తెలుసనీ ....అదనీ ఇదనీ అనుకోకండి ...
ఇక్కడ తలకు మించిన బాధ్యతలు తప్ప ఇంకేం లేవు ....ఒక స్టేటస్ వ్రాసుకోవాలన్నా ....వీకెండ్ వరకు వెయిట్ చేయాలి ....😓
ఇంకా ఇండియాలో ఉంటేనే నాకు కొన్ని అయినా తెలుస్తాయేమో అని నా అభిప్రాయం ...!🥰
Happy Weekend!

ఓ ఇరవయ్యేళ్ళ క్రితం నా గురించి,

ఇరవయ్యేళ్ళ క్రితం నా గురించి, నాకు నా మిత్రురాలు మొన్న పరిచయం చేస్తుంటే ... కథలా వింటూ ఉండిపోయా ..!  <3


"మీరు అందంగా ఉంటారు అని ఇంతకు ముందు మీతో ఎవరైనా చెప్పారా ...."

 "మీరు అందంగా ఉంటారు అని ఇంతకు ముందు మీతో ఎవరైనా చెప్పారా ...." అడిగారు నిన్న నన్ను ఒకరు ... ( Wrote on July 15 2020)

"గుర్తులేదు ...బహుశా చెప్పే ఉంటారు ...." నవ్వు ఆపుకుని చెప్పా ..
"చెప్పండి ...ఎవరు ...ఎప్పుడు చెప్పారు ....." అడిగారు ...
"ఏమో ....లెక్కపెట్టలేదు ...." ఆపుకోకుండానే నవ్వేసా ...
"నిజం ...మీరు చాలా అందంగా ఉంటారు ..." కాస్త నమ్మకంగానే చెప్పారు ...
"అందం రూపంలో కాదు ...ఆలోచనల్లో ఉంటుంది అని నేను తెలుసుకుని చాలాకాలం అయింది ....ఈ పొగడ్తలు నా ఆలోచనల్లో ఎలాంటి మార్పు తీసుకుని రాలేవు ....టేక్ ఇట్ ఈజీ ...." సంభాషణ కు ముగింపుగా చెప్పా ....
=================================
ఈ సంభాషణను నేను లాస్ట్ ఇయర్ ఇదే రోజున వ్రాశాను ...కానీ పోస్ట్ చేయలేదు ...
మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు నీ అభిప్రాయం ఎలా ఉంటుందో చూస్తాను ...అని ఆ వ్యక్తితో చెప్పా ...
ఇప్పుడు నాకు పరీక్షించే అవకాశం లేదు ...ఈ సంభాషణ జరిగిన రెండు రోజుల తరువాత ...ఆ వ్యక్తి కి ..."ఇంకెప్పుడూ నాకు కాల్ చేయొద్దు" అని చెప్పాను ...
జీవితం లో ఏర్పడే పరిచయాలన్నీ ....
వేగంగా మనవైపే ప్రయాణించి అంతలోనే ఆవిరయ్యే మేఘాల్లాంటివి ...
ఏవీ శాశ్వతం కాదు ...
ఈ సంభాషణను నేను సేవ్ చేయడం వలన నాకు తెలిసిన జీవిత సత్యం ఇది ....!😇