Monday, February 27, 2017

నీ పనికి నువ్వు యజమానివి కావాలి .....

నీ పనికి నువ్వు యజమానివి కావాలి .....
=============================
అవును ....
నీ పనికి నువ్వు యజమానివి కాకపోతే పని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు ....
కానీ యజమాని కావడం ఎలా ..... ??!!
నువ్వు ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ....
పని బాధ్యతను నువ్వు పూర్తిగా స్వీకరించాలి ....
దానిని ప్రేమించాలి ....
మనసావాచా ....దానికి అవసరం అయినవన్నీ సమకూర్చాలి ....
సరైన సమయం కేటాయించాలి ....
నీ కంటే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి ....
మొత్తానికి ప్రియురాలిని /ప్రియుడిని చూసుకున్నట్టు చూసుకోవాలి ....
అప్పుడు నువ్వు పనికి బాధ్యుడివి/బాధ్యురాలివి అవుతావు .....
బాధ్యుడివి/బాధ్యురాలివి అయితే యజమానిగా మారడం అంత కష్టం కాదు ....
యజమానివి అయితే పని నీకు మరెవరో చెప్పాల్సిన అవసరం లేదు .....
మరొకరు నీకు పని చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే .....
ఇంకా పని బాధ్యతను మరొకరు పంచుకుంటున్నారు అని అర్ధం .....
నువ్వు పనికి యజమానివి కాదు అని అర్ధం ....
క్షణం అయితే ..... పని మీద పూర్తి హక్కులు నువ్వు సొంతం చేసుకుని ....యజమానిగా మారతావో .... పని పూర్తి చేసేవరకు నిద్రపోవు ...
అందుకే ....
నీ పనికి నువ్వు యజమానివి కావాలి ..... !! <3 :) <3

(గమనిక : ఇక్కడ "నువ్వు" పదం ఉదాహరణగా వ్రాశాను ....ఎవరినీ ఉద్దేశించి వ్రాసిన పదం కాదు .... :P )

Saturday, February 25, 2017

మనిషి తాను అనుకున్నట్టు బ్రతకడు అనడానికి ఇదో ఉదాహరణ ....!!

పుట్టిన దగ్గరనుండి ....మనకు ....ప్రేమ ,ఆప్యాయత , అనురాగం, అభిమానం ఇలాంటి పదాలే చాలా ఇష్టంగా ఉంటాయి ...ఎందుకో తెలియదు .....బహుశా సహజ నైజం కావచ్చు .... <3
కానీ ...దురదృష్టం .... పగ , ద్వేషం , ఈర్ష్య , అసూయ ....ఇలాంటి పదాలను ఇష్టంగా చేసుకుని బ్రతికేస్తాం .....
మనిషి తాను అనుకున్నట్టు బ్రతకడు అనడానికి ఇదో ఉదాహరణ ....!! :(

(గమనిక : ఇక్కడ మనం అంటే ....జనం అని ....అర్ధం )

దానికి బ్రతికే అధికారం లేదా .....??!!

ఎంతో ప్రేమగా మనం ఒక మొక్కను తెచ్చి ....కాస్త చోటు తవ్వి .... మొక్కకు పాదు చేసి ....చుట్టూ నీళ్లు నిలబడడానికి గట్టు పెట్టి ..... మొక్కను అందులో నాటి దాని వైపు ప్రేమగా ఆనంద భరిత హృదయంతో చూస్తాం ..... మొక్కకు ప్రాణం పోశాం అనుకుంటాం ....
కానీ దాని కి ఒక అడుగు దూరంలో ...చుట్టుపక్కల ఉన్న చిన్న చితకా గడ్డి మొక్కలు నిర్దాక్షిణ్యంగా పీకేస్తాం .....ఏం,,, గడ్డి.. మొక్క కాదా ...దానికి బ్రతికే అధికారం లేదా .....??!!
మనలో ఎంతో మానవత్వం ఉంది అనుకుంటాం .....
కొన్ని సార్లు అది మన సంతోషానికి అనుగుణమైన మానవత్వం తప్ప .....ప్రకృతికి అవసరమైన మానవత్వం కాదు .....అనేది మనం గమనించాలి ....
అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు నాకూ ఉన్నాయి .... .....
ఉదాహరణకు ....కొన్ని మంచి మొక్కలు బ్రతకడం కోసం మనము కొన్ని పనికిరాని మొక్కలు చంపే తీరాలి అనొచ్చు .....
కొన్ని మొక్కలు మానవాళి మనుగడకు అవసరం , కొన్ని అనవసరం అనొచ్చు .....
ఇలా ....మీ అభిప్రాయం వ్రాయండి .....

ఇదే సూత్రం మనుషుల మనుగడకు కూడా వర్తిస్తుంది .....కాదంటారా ....??!!

"జీవితంలో ప్రతి విషయాన్నీ experience చేయాలి"

మధ్య నాతో ఒకరు ఏమన్నారంటే ....,,,
"జీవితంలో ప్రతి విషయాన్నీ experience చేయాలి" అన్నారు ....
"ఓహ్ అలాగా ......,,,
ఉదాహరణకు ...ఒకటి చెప్పండి ...." అడిగా ....
ఒకటి కాదు ...రెండు మూడు చెప్పారు ....
"అవి మనుషులు సృష్టించినవా ....ప్రకృతి మనకు ఇచ్చినవా ....." అడిగా .. :P
"మనం సృష్టించుకున్నవే ...."
"ప్రకృతి మనకు ఇచ్చినవి అన్ని experience చేశారా ....." అడిగా ....
"లేదు ...."
"అవి experience చేయడానికి మీ జీవిత కాలం సరిపోతుందా ....??!!"
"????"

"అందుకే..... ముందు ప్రకృతి మనకు ప్రసాదించినవి అన్ని experience చేయండి ....మనం అందుకే జన్మించాం ..... <3
ఇంకా సమయం మిగిలి ఉంటే....తర్వాత మనుషులు సృష్టించినవి మొదలు పెట్టొచ్చు ....." చెప్పా ....!!

Friday, February 24, 2017

నీ శరీరాన్ని నువ్వు ఎలా రోజూ మోసుకుంటూ తిరుగుతావో ...

నీ శరీరాన్ని నువ్వు ఎలా రోజూ మోసుకుంటూ తిరుగుతావో .....
నీ మెదడులో ఆలోచనలను నీ మెదడు కూడా అలానే మోసుకుంటూ తిరుగుతుంది నీతో సంబంధం లేకుండా .....
అయితే .....శరీరానికి తగ్గ బరువు ఉంటేనే నువ్వు సుఖంగా ....హాయిగా ఉన్నట్టు .....నీ మెదడు మోయగలిగిన ఆలోచనలే నీ మెదడుకి కూడా హాయిగా ఉంటాయి .....
శరీరం మీద ఏవైనా గాయాలయితే .....మాసిపోవడానికి మందు వేస్తాం ....అధిక బరువు వ్యాయామంతో తగ్గించుకుంటాం ....

అలాగే చెడు ఆలోచనలను సాధనతో నిర్మూలించుకోకపోతే .....అనవసర ఆలోచనలను మోసుకుంటూ తిరుగుతుంటే ....అవి మానని గాయాలై మెదడుని తినేస్తాయి .....శారీరక వ్యాధులు శరీరాన్ని కృశింపజేసినట్టు ...... !

ఈ రోజు నేను ఒక పొరపాటు చేశాను ....

రోజు నేను ఒక పొరపాటు చేశాను .... :(
నా మీద చేసిన వ్యక్తిగత విమర్శను , నిందను ....నేను వ్యతిరేకించాను ....నవ్వుతూ స్వీకరించలేకపోయాను .....అలా స్వీకరించాలి అని నేను ఎన్నో ఆర్టికల్స్ వ్రాశాను ....కానీ నిజ జీవితంలో ఆచరించాల్సి వచ్చినప్పుడు .....కాస్త ఆవేశానికి గురయ్యాను ... :(
నిజానికి అది నా బాధ్యత కాదు ...నా బాధ్యతను నేను పూర్తి చేసినా ....అదనపు బాధ్యతను నేను నిర్వర్తించినా ......ఇంకా నేను నా బాధ్యత పూర్తిగా నిర్వర్తించలేదని .....ఒక అపరిచిత వ్యక్తి ముందు ఒక పరిచిత వ్యక్తి నన్ను దోషిని చేసిన క్షణంలో నేను మాటల కోసం ఆకాశం వైపు నిస్సహాయంగా...మూగగా చూశాను .... :(
కొంత సమయం తర్వాత ... వ్యక్తి మీద అలా ఎందుకు చేసారని ఆవేశ పడ్డాను .... వ్యక్తి అది తప్పని అంగీకరించలేదు .... :(
తర్వాత ఒక పది నిముషాలు ఆలోచించాను .....విమర్శను నవ్వుతూ స్వీకరించాలి అనే నా ఆర్టికల్ గుర్తొచ్చింది ....మళ్ళీ చదువుకున్నాను ....నవ్వుతూ నిద్రపోయాను .... <3
నిద్ర లేచాక .... వ్యక్తి ...."సారీ .... వ్యక్తి ముందు నిన్ను అలా అనకుండా ఉండాల్సింది ...." చెప్పారు నాతో ....
"అసలు వ్యక్తి ముందు అనే కాదు అలా అనడమే తప్పు" అని చెప్పాలనుకున్నాను ....కానీ,,,,,
"నన్నే మన్నించండి ....ఎలాంటి విమర్శనైనా నవ్వుతూ స్వీకరించే శక్తి ఇంకా నేను పెంపొందించుకోవాలి అని అర్ధమైంది ....." చెప్పా నవ్వుతూ .... :) :) <3
నేను ...నిన్న క్రితం క్షణంలో ఏం తప్పు చేశాను అనేది నాకు ముఖ్యం కాదు .....క్రితం క్షణం నుండి ఏం నేర్చుకున్నాను ... క్షణం ఎంత ఎదిగాను అనేదే నాకు ముఖ్యం ....అదే నాకు రేపటి జీవితానికి పునాది .....!

చాలా సంతృప్తిగా అనిపించింది ....!

Wednesday, February 22, 2017

ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా విమర్శిస్తున్నారా ....??!!

ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా విమర్శిస్తున్నారా ....??!!

విమర్శల నుండి తప్పించుకునే అవకాశం లేదా ....??!!
ప్రతి విమర్శ చేయడం మీకు ఒకింత బాధగా అనిపిస్తుందా ....??!!
లేదా ప్రతి విమర్శకు వాళ్ళు అర్హులు కాదా ....??!!
విమర్శిస్తున్న వాళ్ళు ఒక్క విమర్శలు తప్ప అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడడం లేదా ....???!!
అలాంటప్పుడే చాలా సంయమనంగా ఆలోచించాలి ....
అలాంటి వాళ్ళను విమర్శించనీయండి ....ఇంకా ఇంకా విమర్శించనీయండి .... తర్వాత కొన్ని రోజులకు మన మెదడు విమర్శకు బాధపడడం ఆపేస్తుంది ....
అలాంటి విమర్శ రాగానే అది విమర్శగానే తనలోకి స్వీకరించి ....అది తనకు అనుకూలంగా మార్చుకుని ఒక పొగడ్త గానో....లేదా మనకు కావలసిన స్ఫూర్తిగానో మార్చి ....మనకు చూపడం మొదలుపెడుతుంది .... స్థితికి వచ్చాక ....అది ఇచ్చిన స్పూర్తి మనం ఉపయోగించుకోవడం మొదలు పెట్టాక ....ఫలితాలు ఎలా ఉంటాయంటే ....ప్రపంచంలో ఇక మనకు తిరుగులేదు అన్నట్టు ఉంటాయి .... విమర్శా మనల్ని ఏం చేయదు అన్నట్టు ఉంటుంది ....,,
అయితే మెదడు కొన్నిసార్లు ... విమర్శను ...పొగడ్తగా ...లేదా స్పూర్తిగా మార్చుకునే క్రమంలో చేసే సంఘర్షణలో ..... విమర్శించిన వారి మాటలను ...అసలు అంగీకరించకపోవడం , అవి అసలు మాటలే కాదని విలువలేనివిగా తేల్చి కొట్టి పారేయడం ....వ్యంగ్య పూర్వక సమాధానాలు ఇవ్వడం ...లాంటివి జరగొచ్చు ... ,,,
ఏది ఏమైనా ....మన మెదడుకు తన స్వీయ రక్షణ తనకు ముఖ్యం ....
అలాంటి ఆహ్లాదకర సంఘర్షణ జరగనివ్వాలి ....లేకపోతే మన మెదడు ను మరొకరు తమ అధీనం లోకి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ....!!

(గమనిక : ఇది అందరికీ వర్తించదు ....)

Tuesday, February 21, 2017

చిన్నతనం నుండి ....నిన్న మొన్నటి వరకు ...,,,

చిన్నతనం నుండి ....నిన్న మొన్నటి వరకు ...,,,

నన్ను ఎవరైనా విమర్శించే సమయంలో .....నేను ఎవరి విమర్శనైనా స్వీకరించే సమయంలో ......,,,
నావి - ఎదుటివారివి.... హావభావాలు ....వరుసక్రమంలో ఇలా మారుతూ ఉంటాయి ....
=========================
ముందుగా ...నాలో ఆవేశం ....వారిలో చిరునవ్వు
తర్వాత ....నాలో ఏడుపు ....వారిలో ప్రశాంతత
తర్వాత ...నాలో ఆలోచన ....వారిలో కూడా ఆలోచనే ....
ఆ తర్వాత ...నాలో ప్రశాంతత .....వారిలో ఏడుపు ...
చివరకు ....నాలో చిరునవ్వు .....వారిలో ఆవేశం ....
===========================
ఇప్పుడైతే ఇంతసేపు సాగతీత ఏం లేదు .... :) :P
అట్టే సమయం తీసుకోకుండా తేల్చేస్తున్నా ఒకే ఒక్క చిరునవ్వుతో .... :)
పాపం వారికే ఆవేశంతో మొదలు పెట్టడం కష్టంగా ఉంది .....! :) :P :P

Sunday, February 19, 2017

ఏం కావాలి మీకు ...??!!

ఏం కావాలి మీకు ...??!!
తెలియదా ...,,,
లేదా తెలుసా ....,,,
ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి ....!!
50 ఏళ్ళు పైబడినా కొందరికి (ఎందరికో ) వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే తెలియదంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు ....
మాటలు కూడా రాని పసివాళ్ళకు ...కొంతమందికి సైగలతో అయినా వాళ్లకు ఏం కావాలో వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు అంటే కూడా ఆశ్చర్యం కలగక మానదు ....
అందుకే ముందుగా మనకు ఏం కావాలో మనం తెలుసుకోవాలి ....
కీర్తి , డబ్బు , ప్రేమ , బంధాలు , బాధ్యతలు , విజ్ఞానం ....ఇవన్ని కాకపోతే ఇతరుల చెడు(ఇది కూడా కావాలి కొందరికి) .....ఇలా ఏదో ఒకటి ...కానీ మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ....
ఆ తర్వాత అవి సాధించడం కోసం మనం నిరంతరం కృషి చేయాలి .....అందకపోతే ఇంకా ఇంకా కృషి చేయాలి ....
అవి అందుకోవడానికి ఏవైనా అడ్డు పడుతుంటే ....ఆ అడ్డంకులను అధిగమించాలి ....
ఒకవేళ మనం కావాలనుకున్నది సాధించడానికి ....మనం కావాలనుకోనిది అడ్డు పడుతుంది అనుకోండి ....మనం కావాలనుకున్నదాన్ని సాధించడం కోసం అందుకు అడ్డు పడేదాన్ని కూడా సాధించాలి .....
ఉదాహరణకు మనకు కీర్తి కావాలి అనుకుందాం ....దానికి డబ్బు అడ్డుపడుతుంటే ....డబ్బు సంపాదించి తర్వాత కీర్తి సంపాదించాలి ....(అది మన కీర్తికి ఏ మాత్రం ఆటంకం కలిగించకుండా జాగ్రత్తపడాలి ....)
లేదా డబ్బు కావాలి అనుకుంటే .....దానికి బాధ్యతలు అడ్డు పడుతుంటే .....బాధ్యతలు నిర్వర్తిస్తూ డబ్బు సంపాదించాలి ...
ప్రేమ కావాలి అనుకుంటే ....లేదా మరేదైనా చేయాలనుకుంటే ...అది ....ఇలా .....
మొత్తానికి మనం ఏం కోరుకుంటున్నామో మనకు దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటేనే మనం ఏమైనా చేయగలం .....
మనకు ఏం కావాలో మనకే తెలియకపోతే ....మనకు మన జీవితమూ అయోమయమే ....పక్క వాళ్ళ జీవితం అంతకంటే అయోమయం ..... ఈ అయోమయంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాల్చుకు తింటూ ఉంటారు కొందరు ....
నాకు ఏదో కావాలి అని (అదేమిటో చెప్పలేరు ) ....,
నా జీవితం ఇలా ఉంది అని ....,,,,
నా జీవితం అల్లా వాళ్ళలా ఉంటే బాగుండేది అని .........,,,,
నాకు బ్రతకడం ఎలాగో తెలియట్లేదు అని .....ఇలా ....,,,,
అందుకే ...పోయి ...తెలుసుకోండి ....ముందు మీకేం కావాలో ....??!!
చుట్టుపక్కల బ్రతికే వాళ్ళను పీక్కుని తినకుండా .... !!

Saturday, February 18, 2017

అలాంటి హృదయాన్ని కరిగించాలంటే ....., ప్రేమకే సాధ్యం ....!


కష్టానికి.. హృదయం ద్రవించినప్పుడు మాత్రమే ..మనకు దుఃఖం వస్తుంది ..,

హృదయం కరడు కట్టినప్పుడు ....దుఃఖాన్ని కూడా మనం బ్రతిమాలుకుని ఆహ్వానించాలి ... :( 
కరడు కట్టిన హృదయాన్ని కరిగించే శక్తి ఆ దుఃఖానికి కూడా ఉండదు ....,
అలాంటి హృదయాన్ని కరిగించాలంటే ....., ప్రేమకే సాధ్యం ....!

"జీవితంలో నేను పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు"

కొందరు .....

"జీవితంలో నేను పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు" .....అని
"నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకేం తెలుసు" .....అని,
"నా కష్టాలకు ఎంత బాధ అనుభవించానో నా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుంది" ....అని, నాతో అంటూ ఉంటారు ....

నాకు సానుభూతి , నవ్వు ఏకకాలంలో వస్తూ ఉంటాయి ..... :( :) 

వాళ్లకు తెలియనిది , వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే .....,,

ఎదుటివాళ్ళు నవ్వుతూ ఉన్నారని , లేదా వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకోలేదని ....వాళ్లకు అసలు కష్టాలే లేనట్టు కనిపించారని .....వాళ్లకు కష్టాలు లేవని , కష్టం అంటే తెలియదని అనుకోవడం మీ అమాయకత్వం .... :P 

అసలు జీవితం లో కష్టాలు లేనిది ఎవరికి....??!!

పుట్టిన పసిపాని అడుగు ....

మాటలు వస్తే .....తనకి ప్రపంచంలో బ్రతకాలని ప్రయత్నించడం ఎంత కష్టమో .....తల్లి కడుపులో ఎంత హాయిగా ఉండేదో వివరిస్తుంది ..... :( :( 

ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎన్నో కష్టాలు , సుఖాలూ ఉంటాయి ..

కానీ కొందరు సుఖాల్ని మాత్రమే ఎదుటివాళ్ళకు పంచుకుని .....కష్టాలని తామే భరించడం నేర్చుకుంటారు ....

ఎందుకంటే .....బహుశా ...., ప్రపంచం సుఖాలను మాత్రమే తేలికగా పంచుకునే శక్తి కలిగి ఉంటుంది అని వాళ్ళు గమనించి ఉండొచ్చు ..... 

తమ చుట్టూ ఉన్నవాళ్లకు కష్టాల్ని పంచుకునే శక్తి లేదని వాళ్ళు బలంగా విశ్వసించవచ్చు .....

లేదా తమకు తామే కష్టాలను తమలో దాచుకుని భరించే అసాధారణ శక్తిని సంపాదించుకుని ఉండొచ్చు ..... <3 


చెప్పలేం ....మాహానుభావుల జీవితాలు అస్సలు అర్ధం కావు ....!

"నువ్వు నీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు "

"నువ్వు నీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు " అని నాతో అంటూ ఉంటారు కొందరు .....

నేను అది పట్టించుకునే స్థితిలో ఉండను ..... :) 

వాళ్ళ మాటలు లెక్కచేయని మనస్తత్వం వలన మాత్రం కాదు సుమా .....  

అదే బాధ్యతను ఇంకా నాకు చేతనైనంతవరకు ఇంకా నిర్వర్తిస్తూ చాలా బిజీగా ఉంటా ... :) 

ఆ బాధ్యత నిర్వర్తించడం అయిపోయాక, తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తా ....

ఎంతవరకు చేశాను ....
ఎంతవరకు చేయలేదు ....
ఇతరులు అందులో ఎంత తీసుకున్నారు ....
ఎంత తీసుకోలేదు ....
నేను వాళ్లకు ఎంత అందించగలిగాను ....
ఎంత అందించలేకపోయాను..... అని ....,

అప్పటివరకు ఇలా ఆలోచించే సమయాన్ని కూడా ...నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోవడంలో వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు .....!! <3

Wednesday, February 15, 2017

గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ...

జీవితంలో ఏర్పడే అనేక అభివృద్ధి దశలే మెట్లు అనుకుంటే ...,,,

ఆ మెట్లు చాలా కష్టపడి / ఇష్టపడి అధిరోహిస్తూ అది అభివృద్ధి అనుకుంటే ...,,,,

అది కొంతమంది సునాయాసంగా అధిరోహిస్తూ ఉంటారు ...కొందరు వ్యయ ప్రయాసలకోర్చి అధిరోహిస్తూ ఉంటారు ....మరి కొందరు ...ఎప్పుడో ఒకసారి ఒకమెట్టు అతి కష్టం మీద ....ఇంకొందరు వారి జీవితకాలం అంతా ప్రయత్నించినా ఒక్క మెట్టు కూడా అధిరోహించలేక పోతారు ....ఏది ఏమైనా ఇదంతా ఎవరి దృష్టిలో ….ఎప్పుడు ....ఎందుకు ....ఎలా …అనేది నిర్వివాదాంశం ....!!

ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు .... ఆ ఎక్కిన/ దిగిన మెట్లు ని బట్టి వాళ్ళ వాళ్ళ జీవన విధానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం ....

కొందరు ఎక్కిన/దిగిన మెట్లుకి అనుగుణంగా జీవన విధానం మార్పు చెందనివ్వకుండా ...సమాజానికి అనుగుణంగా నియంత్రించుకుంటూ ఉంటారనుకోండి ....అదివేరే విషయం ....!

అయితే ...ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే .......,,,,

కొందరు ...అర్హత సంపాదించాం అనుకుని కొన్ని మెట్లు ఎక్కి ....అందుకు అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని కూడా మార్చుకుంటారు ...కానీ కొంతకాలం ఆగాక ....జీవన విధానానికి తగినట్లుగా మన ఎదుగుదల లేదని ....మన అర్హత ఇంకా ఆ మెట్టుకి చేరుకోలేదు అని....తెలుస్తుంది...అప్పుడు తప్పనిసరి గా ఒక మెట్టు కిందకు దిగాల్సి వస్తుంది ...
వీళ్ళ అలవాటును ఎవరూ మార్చలేరు ....వీళ్ళను చూసి వీళ్ళే నవ్వుకునే పరిస్థితి అది ...

మరి కొందరు ...ఒక మెట్టు ఎక్కిన తర్వాత..వందసార్లు ఆలోచిస్తారు...
మనం...మనం ఎక్కాల్సిన మెట్టుకి అర్హత సంపాదించుకున్నామా లేదా అని ....,,,
అందుకు తగినట్లుగా మన జీవన విధానం మార్చుకోవచ్చా ...అని ....,,,
ఇక ఒకసారి వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే .....ప్రాణం పోయినా క్రింది మెట్టుకి రారు ....అలా రావాల్సి వస్తే వాళ్ళ ప్రాణాలే వదిలేస్తారు .....వీళ్ళను చూసి వీళ్ళే గర్వపడే పరిస్థితి అది ….!!


ఏది ఏమైనా ....ఎలా జీవించినా....చివరకు గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ....,,,,, మన జీవన విధానం మనకు గర్వం కలిగించాలి తప్ప ...మనకే నవ్వు తెప్పించకూడదు ....అనేది నా అభిప్రాయం .!!

Sunday, February 12, 2017

ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!!

సహజంగా మనం మనకున్న అనుకూలతలు ఏమిటో ఎదుటివారికి తెలిసేలా ప్రవర్తిస్తాం , లేదా తెలియజేస్తాం ...నిజమే ...అది సహజం కూడా ....ఇలాంటి వాళ్ళు ...అందరి ప్రేమకు అర్హులవుతూ ....అందరితో కీర్తింపబడుతూ ..జీవిస్తూ ఉంటారు .... 

కానీ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రం తమకున్న ప్రతికూలతలు/లోపాలు ఏమిటో ఎదుటివాళ్ళకి తెలిసేలా ప్రవర్తిస్తారు ....అలాంటి వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కుంటూ ,అందరితో విమర్సింపబడుతూ....అందరి ద్వేషానికి గురవుతూ ....జీవిస్తూ ఉంటారు ...

ఇందులో నేను రెండో రకానికి చెందిన వ్యక్తిని అని నా గురించి బాగా అర్ధం చేసుకున్న నా మిత్రులకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .... :P :P :)

అయితే నేను అలా అందరిలా కాకుండా కొందరిలా ....జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నానా అని ఒక పని లేని సాయంకాలం చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తే....,,, నాకు జ్ఞానోదయం కలిగింది ...."ఓహో ఇదా కారణం" అని తెలిసొచ్చి మనసంతా గాల్లో తేలిన ఫీలింగ్ కలిగింది ..... :)

తెలిసొచ్చిన కారణం విషయానికి వస్తే ....,,,,

చాలా మందికి ఉన్న సహజ గుణం ఏమిటి అంటే ....ఎదుటివ్యక్తి బలహీనత తెలిస్తే ...వాటినే గుచ్చి గుచ్చి ,ఎత్తి ఎత్తి చూపించి విమర్శిస్తూ ....తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు ...తన అహం సంతృప్తి పరచుకుంటూ ఉంటారు ....సహజంగా అలా విమర్శిస్తారు అనే భయంతోనే చాలా మంది (అంటే మొదటి రకం వ్యక్తులు )తమకున్న లోపాలను ఎదుటివాళ్ళ కళ్ళ పడకుండా శతవిధాలా దాచేసి ...తమకున్న అనుకూలతలు తెలిసేలా చేసి ....పొగిడించుకోబడుతూ ఉంటారు ....ఇది అన్ కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్ కి వెళ్ళడం లాంటిది ...!! (వాళ్ళ దృష్టిలోమాత్రమే.... :P )

ఈ రెండో రకం ....అంటే నాలాంటి వాళ్ళు ....తమలో ఉన్న లోపాలను దాచకుండా ప్రదర్శించి అందరితో విమర్శలకు గురవుతారు ...అలా విమర్శలు ఎదుర్కొనీ ఎదుర్కొనీ కొంతకాలం తర్వాత .....,,,,,
ఆ విమర్శలు వాళ్ళని ఏమీ చేయని స్థితికి ....,
ఆ విమర్శలను లెక్కచేయని స్థితికి ,
ఆ విమర్శలను నవ్వుతూ స్వీకరించే స్థితికి ....,
అవతలి వాళ్ళు కొత్త విమర్శలు వెతుక్కోవాల్సిన స్థితికి ...,
ఆ లోపాలు లేని స్థితికి .....,
కొత్త లోపాలు ప్రదర్శించి అవి కూడా విమర్సించేలా చేసుకుని అవి తమలో లేని స్థితికి చేరుకుంటారు ....,


ఇది కంఫర్ట్ జోన్ నుండి అన్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లి మళ్లీ కంఫర్ట్ జోన్ లోకి రావడం లాంటిది అన్నట్టు....(అందరి దృష్టిలో కాదు ....) ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!! :) :)

Saturday, February 11, 2017

ఆత్మీయుల నుండి నాకెదురైన కొన్ని ప్రశ్నలు ....వాటికి నా సమాధానాలు .....!

మధ్య ఆత్మీయుల నుండి నాకెదురైన కొన్ని ప్రశ్నలు ....వాటికి నా సమాధానాలు .....!
---------------------
నిన్ను అందరూ ఇష్టపడడం సాధ్యమా .....??!!
సాధ్యం కాదు .....
నిన్ను అందరూ ఇష్టపడాలని నువ్వు కోరుకుంటావా ....??!!
కోరుకోను....అది అమాయకత్వం .... :) 

నువ్వు అందరినీ ఇష్టపడడం సాధ్యమా ....??!!
సాధ్యమే .... 
నువ్వు అందరినీ ఇష్టపడాలని నువ్వు కోరుకుంటావా .....??!!
కోరుకుంటాను ....అది మనస్తత్వం......  <3