Saturday, December 3, 2022

ఇండియా వచ్చేటపుడు

 ఇండియా వచ్చేటపుడు ఫ్లైట్ లో నా పక్కన ప్రయాణం చేసిన ఒకమ్మాయి, మాటల సందర్భంలో, తను డాక్టర్ అని.. ఏదో షార్ట్ టైం ట్రైనింగ్ కోసం అమెరికా లో వర్క్ చేస్తుందని తెలిసింది ...

"ఇక్కడ (అమెరికాలో ) మెడికల్ సిస్టం నాకు నచ్చలేదండి" అని చెప్పింది ...
ఎవరైనా ఏదైనా నచ్చలేదంటే అది ఎందుకు నచ్చలేదో తెలుసుకోవడం ...లేదా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడం మన ధర్మం ...మనం ప్రతి అభిప్రాయానికి ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు ...
లేదా ఫేస్ బుక్ లో లాగా...ఒక అభిప్రాయం పోస్ట్ చేయగానే పొలోమని అది అక్కడ వంకర పోయింది ...ఇది ఇక్కడ సరిచేయాలి అని ఒక పట్టకారు పట్టుకుని పడిపోవడం కూడా కాదు ...
"సాధారణంగా ఇక్కడ ఇన్సూరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ...మన ఇన్సూరెన్స్ కవరేజెస్ ...అవి ఏ డాక్టర్ కవర్ చేస్తారు చూసుకుని మనం సంప్రదించాలి ...మీకెదురైన డిఫికల్టీస్ ఏంటి.. " అడిగా ..
"అరె ప్రతి ఒక్కటి డాక్టర్ రిఫర్ చేయాలి అంటారు .... అరె ...నేను డాక్టర్ ని బాబు ...నా గురించి నాకు తెలుసు ...నేనే అడుగుతున్నా ....మందులివ్వండి అన్నా ఇవ్వరు మెడికల్ షాప్ లో ..." చెప్పింది కొంచెం విసుగ్గా ...
"అవును ఇవ్వరు .. కొన్ని కొన్ని ఏంటి బయాటిక్స్ డాక్టర్ మాత్రమే రెఫర్ చేయాలి .." చెప్పా అంగీకరిస్తున్నట్టు ...
"పైగా ...ఒక డాక్టర్ దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ దొరకవు ...ఉదాహరణకు ..ఒక రేడియాలజీ అప్పోయింట్మెంట్ తీసుకోవాలంటే రెండు నెలలకు కానీ దొరకదు .." చెప్పింది తను
"రేడియాలజీ అప్పోయింట్మెంట్ మీరు చెప్పింది నిజమే ..కానీ కొన్ని లొకేషన్స్ లో ఎర్లీ అపాయింట్మెంట్స్ దొరకొచ్చు ...వాళ్ళే చూసి చెబుతారు ...ఏ లొకేషన్ లో ఏ టైం లో అందుబాటులో ఉంది అని ...అది ఇన్సూరెన్స్ కారియర్స్ ని బట్టి కూడా ఉంటుంది ..." చెప్పా ...
"బహుశా అది అంత అర్జెంటు కాదు అని కూడా కావచ్చు ..." చెప్పా మళ్ళీ నేనే
"ఏమోనండీ ...అదే మన దగ్గర అయితే ...ఈ బాధలు ఉండవు " చెప్పింది
"నిజమేలెండి ...ఎక్కడ ఉండే అడ్వాంటేజెస్ అక్కడ ఉన్నాయి ..." అంగీకరించా ....
కట్ చేస్తే ...
ఇక్కడ ఒక ప్లేస్ లో ...హెవీ బ్లీచింగ్ స్మెల్ పడక విపరీతమైన దగ్గు బారిన పడిపోయా నేను గత మూడు రోజులుగా ...
బహుశా అది వేరే కారణాల వలన కూడా అయి ఉండొచ్చు ...
ఏమైనా కరోనా ఎఫెక్ట్ అయినా తర్వాత కాస్త నా ఇమ్మ్యూన్ సిస్టం డల్ గానే ఉంది ...ప్రతి చిన్న పడని వాసనకు ...దగ్గు వస్తుంది ...
దగ్గు వచ్చింది సరే ...కానీ ఫ్రెండ్స్ , అయిన వాళ్ళు కంగారు పడటమూ సరే ...
నా ధైర్యం ఏంటంటే ...ఓ నాలుగు రోజులు దగ్గితే ...అదే పోతుంది అని ...
కానీ రోజు రోజుకీ దగ్గు ఎక్కువ కావడం వలన ...మా ఫ్రెండ్స్ ఒక యాంటీ బయాటిక్ పేరు చెప్పారు ...అది మెడికల్ షాప్ నుండి తెప్పించుకోమని ...సరేలే అని ...మా వాచ్ మాన్ ని మెడికల్ షాప్ కి పంపిస్తే ...మెడికల్ షాప్ వాడు .. వేరే యాంటీ బయాటిక్ ఇచ్చాడు ..దగ్గు + గొంతు నొప్పి అని తెలుసుకుని ...అంతలో మా అమ్మ ఫోన్ చేసి ...అందరూ దగ్గుకి ఇంకో యాంటీ బయాటిక్ వాడుతున్నారు ...నువ్వు అదే వాడు ...తగ్గుతుంది త్వరగా అని చెప్పింది ...అంతలో ..ఒక మిషన్ కుట్టే పిల్ల మా ఇంటికొచ్చి నేను వాడుతున్న మందులు టాబ్లెట్స్ చూసి ...మా ఆయన మెడికల్ రిప్రెసెంటేటివ్ ...మీరు వాడుతున్న మందులు దగ్గుకి బాగానే పనిచేస్తాయని సెర్టిఫై చేసింది ...
మొత్తానికి ఏ యాంటీ బయాటిక్ అయినా డాక్టర్ అవసరం లేకుండా చిటికెలో దొరికేస్తుంది ...ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ అన్నట్టు ...అప్పుడూ తగ్గకపోతే ...డాక్టర్ దగ్గరికి పోవాలన్నట్టు ...
ఇట్లా కొట్లో మరమరాలు కొనుక్కున్నట్టు ...ఎవరికి తోచిన యాంటీ బయాటిక్స్ వాళ్ళు కొనేసుకోవడమే ..
ఇక్కడ ప్రతి ఒక్కరూ డాక్టర్లే ...!
ఏ సిస్టం గొప్పదో నాకు తెలియదు ...నాకు అనలైజ్ చేసేంత తెలివి లేదు ...
కానీ మనిషి ప్రాణం అనేది ...మందుల్లో పడి కొట్టుకుపోయే కీలుబొమ్మ కాకుండా ...మన జాగ్రత్తలో మనం ఉండడమే ..అంతకు మించి చేసేదేం లేదు ! 😇✍️
See insights and ads
Like
Comment
Share