Sunday, October 30, 2016

నిద్రలోంచి తట్టి లేపే అంతగా...!!!!

హెలెన్ కెల్లెర్ ని(She was the first deafblind person to earn a Bachelor of Arts degree. )...ఒక విలేకరి, "చూపు లేకపోడం కన్నా దురదృష్టవంతులు ప్రపంచం లో ఉన్నారా ....?! "అని ప్రశ్నించారట....

"ఉన్నారు.....కలలు లేనివాళ్ళు"అని చెప్పారట.....

ఒక స్టోర్ కీపర్ గా పని చేసి ....ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన JC Penney ని 90 సంవత్సరాల వయసులో "ఇప్పుడు మీ కంటి చూపు ఎలా ఉంది ?! "అని విలేకరులు అడిగిన ప్రశ్నకు .."కంటి చూపు మందగిస్తుంది.....కానీ భవిష్యత్తు ఇంకా సుస్పష్టంగా కనిపిస్తుంది " అని సమాధానమిచ్చారట.....

అబ్దుల్ కలాం కూడా ఎప్పుడూ చెప్పేది ఒక్కటే "కలలు కనండి " అని.....

ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్తే....భవిష్యత్తు గురించి రోజే మనం ఒక కల కనకుండా ఉంటే మనకన్నా దురదృష్టవంతులు ఎవరూ ఉండరు....... కల ఎలా ఉండాలంటే మనకు నిద్ర పట్టనివ్వనంతగా.....నిద్రలోంచి తట్టి లేపే అంతగా...!!!!


(ఒక ఫ్రెండ్ కోసం మూడు సంవత్సరాల క్రితం ఇది రాసాను.....)

Saturday, October 29, 2016

ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా ....

నాకు దీపావళి టపాసులు అన్నిటిలోకి చిచ్చుబుడ్లు అంటే ఎక్కువ ఇష్టం .... <3

అవి వెలిగించాక పువ్వులా వెలుగులు చిమ్ముకుంటూ ఆకాశానికి ఎగురుతాయి ... :) 

కానీ అవి ఎక్కువ రేటు ఉండేవి.....అందుకే 10 కంటే ఎక్కువ తెచ్చేవారు కాదు చిన్నతనంలో ....

మిగతావన్నీ చీకటి పడకముందే ఆత్రంగా కాల్చేవాళ్ళం కానీ ఇవి ఒక్కటి మాత్రం, చిక్కటి చీకట్లో పంచిన వెలుగుల్ని చూడడానికి ....అన్నీ కాల్చడం అయిపోయాక ...చివరలో కాల్చుకునే వాళ్ళం ...... <3

ఇవి కాల్చడానికి ముందే పదిమంది చుట్టూ గుమికూడేవాళ్లు ...ఎంత ఎత్తు వెళ్తుందో చూడాలని .....
చిచ్చుబుడ్డి సైజుని బట్టి ఎంత ఎత్తు వెళ్ళొచ్చో ముందుగానే అంచనా వేసేవాళ్ళం  .....అదిగో వేపచెట్టు కొమ్మ దాటి వెళ్తుందిరా .....అని ....లేదురా ఇది ఇందాక కాల్చిన దానికంటే చిన్నది .... గోడ దాటుతుంది అంతే అని ....పందెం వేసుకునేవాళ్ళం ..

అనుకున్నదానికంటే ఇంకా ఎత్తు ఎగిరితే సంబరంతో గంతులు వేసేవాళ్ళం ....ఎగరకపోతే మరో చిచ్చుబుడ్డిమీద ఆశలు పెట్టుకునేవాళ్ళం .....

దీపావళి పండగంటే వీధిలో ఒక్కరు టపాసులు కాల్చినా వీధి అందరూ ఆనందిస్తారు అది చూసి ....కాల్చినవాళ్లు కాల్చినందుకు ....చూసినవాళ్లు చూసినందుకు .....ఎలా అయితేనేం అందరూ ఆనందంగా ఉండడమే పండగ కదా .....


మిత్రులందరికీ దీపావళి శుభాకంక్షాలు .... :) :) :)

Friday, October 28, 2016

లక్ష్యాలనే బంధాలుగా మార్చుకోవడం కష్టమా ....??!!









కొంతమంది ఎలా ఆలోచిస్తూ ...మాట్లాడుతూ ...ఉంటారంటే ...,,,,
జీవితంలో …..

ఫలానా ఉద్యోగం వస్తే చాలు ....
పెళ్ళయితే చాలు ...
పిల్లలకు చదువులు చెప్పిస్తే చాలు ....
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే చాలు .....
రిటైర్ అయ్యేవరకు చాలు .....
తర్వాత కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవడమే ..

....ఎందుకు అలా జీవితానికి అంతిమ క్షణాలు ముందుగానే నిర్ణయించుకుంటారో ....నిర్ణయించుకోమని అందరికీ చెబుతూ ఉంటారో నాకర్ధం కాదు ....

ఏం ఒక ఉద్యోగం వచ్చాక …..కెరీర్ మారకూడదా  ....ఒక ఉద్యోగం ఇష్టం లేకపోతేమరో ఇష్టమైన ఉద్యోగానికి వెళ్ళకూడదా ...అందులో మన లక్ష్యాలను వెతుక్కోకూడదా .... ఇష్టమైన ఉద్యోగం వదిలి ఇష్టం లేని ఉద్యోగానికి వెళ్లి అయినా ఇష్టంగా మార్చుకుని ఆనందంగా చేసుకోకూడదా ....

పెళ్ళయితే ....,ఖర్మకాలి వైవాహిక జీవితం అస్తవ్యస్తం అయితే ....మనుషుల మనస్తత్వాల్లో మార్పు వస్తే ....జీవితం అయిపోయినట్టేనా ... మనకు వేరే బంధాలే ఉండవా .... బంధాలను అనుబంధాలుగా ఆస్వాదించలేమా ....ఇంకా బంధాలు ఏర్పడవా....లేదా లక్ష్యాలనే బంధాలుగా మార్చుకోవడం కష్టమా ....
  
పిల్లలకు చదువు చెప్పించి ....లేదా పెళ్లి చేస్తే ....వాళ్ళ బాధ్యత అయిపోయినట్టేనా ....ఏం బాధ్యత జీవితాంతం ఎందుకు ఉండకూడదు ....అసలు అది బాధ్యత అని ఎందుకు అనుకోవాలి ...బంధంగా మార్చుకూడదా ....వాళ్లను  జీవితాంతం చేయి పట్టుకుని నడిపించాల్సిన అవసరం ఉండదుగా ....పరుగులు పెడుతూ పడిపోతామనుకుంటే ఎప్పుడైనా మన సలహా అవసరం కావచ్చు ....అప్పుడు మన అనుభవాలతో కాస్త ఆసరా ఇస్తే అల్లుకుపోతారు కదా ....వాళ్లకు కూడా ఎప్పుడూ మనకోసం ఒకరు ఉన్నారనే భావం కలిగించినవాళ్ళం అవుతాం కదా ....

రిటైర్ అయిపోతే ....అయినవాళ్ళు, కానివాళ్ళు ,మనం ...చావు కోసం ఎదురుచూస్తూ ఉంటామా ....తినడం , పడుకోవడం ....కాకుండా మనకు వేరే పనే ఉండదా ....జీవితంలో మనం ఏవేవో ఆశలు పెట్టుకుని అవి సమయం కుదరక చేయలేకపోయి ఉన్నవి అప్పుడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కదా ...మన జీవితంలో ఇతరులకు ఉపయోగపడతాయి అనుకున్న అమూల్యమైన అనుభవాలు ఏవైనా ....ఏదో ఒక రూపంలో పంచుకోవచ్చు కదా ....
...................................

నాకైతే జీవితం ఆఖరి క్షణం వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలనిపిస్తుంది ....ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలని ....అది సాధించడం కోసం కృషి చేయాలని .......ఎప్పుడూ కలలు కంటూనే ఉండాలని ....జీవితం మీద ప్రయోగాలు చేస్తూ ఉండాలని ....ఎప్పుడూ ఏదీ అయిపోలేదని .....దేనికీ చాలు అనేది లేదని ..... 

ఆఖరి క్షణం నా జీవితం కోసం ఎదురుచూస్తూ ఉండేలా నా జీవితాన్ని మలచుకోవాలని ....ఇలా ఎన్నో ....

...................................

ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా ..... రోజు విపరీతమైన వర్షం ....అలా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే ...రాలిపోతున్న (Fall Colours) రంగు రంగుల ఆకుల్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ,అందంగా ,ఆనందంగా అనిపించింది .... రంగుల్ని చూడడం కోసం ఎన్నో ప్రదేశాల నుండి ఎందరో వస్తూ ఉంటారు ...... ఆకులు రాలిపోతూ కూడా తమ జీవితాన్ని ఎంత అందంగా మలచుకున్నాయా అని ఆలోచిస్తే నాకు అద్భుతంగా అనిపించింది ….
మరణంలో కూడా ...చూసే వాళ్ళ కళ్ళకి ఆనందం ....ప్రకృతికి అందం పంచుతూ ఎంతటి స్పూర్తిని కలిగిస్తున్నాయి అనిపించింది .....


రాలిపోతున్న ఆకులే మన జీవితానికి స్పూర్తి ఎందుకు కాకూడదు అనిపించింది....!!
======================
గమనిక : (( ఈ ఆర్టికల్ క్రితం సంవత్సరం ఇదే రోజు వ్రాసిన ఆర్టికల్))

Tuesday, October 25, 2016

మనకు గతం లో జరిగినవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి ....

మనకు గతం లో జరిగినవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి ....
మంచి సంఘటనలు జరిగితే ఇంకా మంచిగా కనిపిస్తాయి ....
ఒకవేళ చెడ్డ సంఘటనలు జరిగితే అవి కూడా మంచిగా కనిపిస్తాయి ... <3

భవిష్యత్తులో జరగబోయేవి ఊహించుకున్నప్పుడు కూడా భలేగా ఉంటుంది ....సాధారణంగా భవిష్యత్తులో జరగబోయేవి అన్ని మంచి విషయాల్లాగే ఊహించుకుంటాం కాబట్టి సమస్యే లేదు ....అప్పుడు చెడ్డ సంఘటనలు గురించి చింతించే అవసరం రాదు .... :) 

కానీ వర్తమానంలో జరుగుతున్నవి మాత్రమే మింగుడు పడవు ....
అందుకే ....మనసు ఎప్పుడూ వెనుకకు , ముందుకి ఆలోచించుకుంటూ.... వర్తమానంలో బ్రతకలేక బ్రతకలేక బ్రతుకుతూ ఉంటుంది .... :(

మాట్లాడితే చాలు .....,,,
ఇదివరలో అలా ఉండేది కదా .... రోజులే వేరు ...అనో ....,,,
రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది కదా .... రోజులు ఎప్పుడొస్తాయో అనో ...,,
అప్పుడు అలా జరిగింది.... ఎంత బాగుండేదో అనో ....,,,
ఓహ్... రేపు ఇలా జరగబోతుంది  ....ఎంత బాగుంటుందో ...అనో...,,,, 

మనసు అనుక్షణం పరి పరి విధాలా ఆలోచిస్తూ సంబరపడుతూ ఉంటుంది .. :) 

"ఏమే....వర్తమానం గురించి కాసేపు ఆలోచించరాదటే ...అని కసిరామనుకోండి....." 
"ఇప్పుడు ఇలా జరగాలి అంటే .....అందుకు నేను పని చేయాలి .....ఇప్పుడీ పని చేయాలా ....?? చాలా బాధగా ఉంది .....ఇలా అనుకోవాలంటే" అనే సమాధానం వస్తుంది ..... :( 

ఒకవేళ ....బలవంతగా అనుకునేలా చేయాలని మనం ఆదేశించినా ....శతవిధాలా తప్పించుకుని ...గతం లోకో , భవిష్యత్తులోకో ...మన కళ్ళు గప్పి పత్తా లేకుండా పోతుంది .... :P 

దీనికంతటికీ ఒకే ఒక్క కారణం ...."బాధ్యత" ....వర్తమానంలో పని జరగాలన్నా , సంఘటన గురించి ఆలోచించాలన్నా అది జరగడానికి బాధ్యత తీసుకోవాలి ....బాధ్యత తీసుకోవడం ఎవరికైనా బాధాకరంగానే ఉంటుంది ....

అదే గతంలోకి , భవిష్యత్తులోకి వెళ్లాలంటే అణా కాణీ "బాధ్యత" ఉండదు అక్కడ ....చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్లి రావచ్చు .... :P 

ఎప్పుడైతే మనం, మన మనసుకి  ....వర్తమానం లో ఉన్న బాధ్యతను తీసుకోవడం అలవాటు చేసి ...ఆస్వాదించడం...ప్రేమించడం.. నేర్పిస్తామో...,,,అప్పుడు దానికి గతంలోకి , భవిష్యత్తులోకి వెళ్లే తీరిక ఉండదు , అవసరమూ రాదు ....

"ఓహ్ .... రోజు ఎంత బాగుందో…ఈ బాధ్యత తీసుకోవడం , ఈ పని చేయడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ...! ” అనుకోవడం మొదలు పెడుతుంది ....

జీవితాన్ని క్షణంలో ఆస్వాదించడం అలవాటై బ్రతుకే నందనవనం అవుతుంది .....

అది కదా జీవితాన్ని జీవించడం అంటే ....! <3 <3 <3

Monday, October 24, 2016

మరే బలహీన క్షణాలకు లొంగిపోనంతగా.....!

జీవితంలో ఎప్పుడూ ఇలా చేయకూడదు అని కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకుని .....అందుకు అనుగుణంగా మనసుని,మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చుకుని...ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉంటాం....కానీ కొన్ని బలహీన క్షణాలు చుట్టుముట్టినప్పుడు మన నిర్ణయం మన మాట వినదు.....
..................

అలా ఎదురైన ఎన్నో బలహీన క్షణాలను అధిగమించిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం మనం చెప్పిన మాట వింటుంది.....ఎంతగా వింటుంది అంటే ,మరే బలహీన క్షణాలకు లొంగిపోనంతగా.....!!!!

Sunday, October 23, 2016

బీరకాయ చేదుగా ఉంటుందా అసలు ....

"బీరకాయ కాస్త చేదుగా ఉంది ...బీరకాయ చేదుగా ఉంటుందా అసలు ...." వంట చేసుకునే ముందు ఒకరి ప్రశ్న నాకు .....

"కొన్ని చేదుగా ఉండొచ్చు ...." చెప్పా ....

"మరి నువ్వు బీరకాయలు తీసుకునేముందు చేదు చూసుకుని తెస్తావా ...." సందేహంగా వారు ....

"లేదు చూడను ....తిని చూడడం ఇష్టం ఉండదు ....బీరకాయ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చేదు లేనిది సెలెక్ట్ చేసుకుంటా ....ఇక తీసుకున్న తరవాత చేదు గా ఉందా ....తీయగా ఉందా....ఎలా ఉందో చూడకుండా వండేస్తూ ఉంటా .... ఇప్పటివరకూ ఎప్పుడూ చేదు కాలేదు ...." నవ్వుతూ నేను 

"ఎలా తెలుస్తుంది ...ముందుగానే చేదుగా ఉందా లేదా అని ...." సందేహం ...

"తెలియదు ...నమ్మకం ... (అది బీరకాయలా కనిపిస్తే చాలు అనే సహజ లక్షణాన్ని బట్టి .... :) )
బీరకాయ అయినా మనుషులు అయినా .....
కొన్ని నమ్మకం మీద తెచ్చుకుంటా అంతే.....
తర్వాత చేదుగా ఉన్నా భరించడం నాకు అలవాటు ....." నవ్వుకుంటూ నాలో నేను .... :) <3

Saturday, October 22, 2016

"పరిశోధన చేసినప్పుడు మనసుని విస్మరిస్తే ఎలా ....హౌ ...???!!"

"రెండు మంచినీళ్ల గ్లాసులని తీసుకుని ....రెండు గదుల్లో ఉంచి ....ఒకగదిలో ఉన్న నీళ్లను రోజూ తిడుతూ .....మరో గదిలో ఉన్న నీళ్లను పొగుడుతూ ....ఉంటే కొన్ని రోజుల తర్వాత ....తిడుతూ ఉన్న నీళ్లు నలుపు రంగులోకి మురికిగా మారిపోయాయి ....పొగుడుతూ ఉన్ననీళ్ళు .....స్వచ్చంగా ఉన్నాయి .....కాబట్టి ఎప్పుడూ మనిషి ఎలాంటి వాతావరణంలో ఉండాలి అనేది ....ఎలాంటి ఆహారం తినాలి అనేది పరిశోధన మనకు తెలియజేస్తుంది ....." ఒకరు నాతో ....

"మరి పరిశోధన చేసినవాళ్లు ....తిడుతూ ఉన్నప్పుడు వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి .....పొగుడుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనే విషయాలు పరిగణలోకి తీసుకున్నారా ...." నా ప్రశ్న ...
"అది చేయలేదు ...."

"పరిశోధన చేసినప్పుడు మనసుని విస్మరిస్తే ఎలా ....హౌ ...???!!" :) :)
-------------------
(
గూగుల్ లో విషయం గురించి ఉన్న సమాచారం కాకుండా మీ ఆలోచనలు షేర్ చేయండి ప్లీజ్ ....)

Friday, October 21, 2016

సంతోషమే లేని , సంతోషమే గుర్తించలేని ప్రపంచం గురించి....ఆలోచించడం ఎందుకు ....

ఇందులో ఏమైనా జోక్ ఉందా ...??!! నీకెందుకు నవ్వొచ్చిందో అర్ధం కావడంలేదు ....అంటుంది ప్రపంచం  ..... :P 

బహుశా ప్రపంచం గుర్తించనిది ఏదో ...నవ్వు తెప్పించేది ఒకటి ....అందులో నీకు కనిపించింది .....

అంటే ప్రపంచం అంతా గుర్తించలేని ... సంతోషాన్ని గుర్తించే సంతోషం నీలో ఉంది ....

ఇక ...సంతోషమే లేని , సంతోషమే గుర్తించలేని ప్రపంచం గురించి....ఆలోచించడం ఎందుకు ....


నవ్వొస్తే ప్రపంచంతో సంబంధం లేకుండా నవ్వడమే ....నీలో ఉన్న సంతోషం ...సంతోషమే లేని ప్రపంచానికి పంచడమే .....!! <3 <3 <3

"ఇంత వయసొచ్చాక ....ఇన్ని పనులు చేయాలంటే కష్టం కదా ...."

"ఇంత వయసొచ్చాక ....ఇన్ని పనులు చేయాలంటే కష్టం కదా ...." అని అన్నామనుకోండి..
వయసు అనేది ఒక సంఖ్య అంటారు .... :p 

అయితే ...సరేలెండి ...."నేనింకా యంగ్ ....యూత్ ...అప్పుడే ఏం వయసు అయిపోయిందని ...." అని అన్నామనుకోండి.... 
హలో నీకింత వయసు వచ్చింది ....ఇంకా నువ్వు చిన్న పిల్లవేం కాదు అంటారు ....  :P 

రెండు వాక్యాలూ ఒకరితోనే అంటాం .... రెండు స్టేట్మెంట్స్ ఒకరే ఇస్తారు ....

మరి ఎందచాట ..??!! అంటే .....

మనుష్యులను చదివే మానసిక శాస్త్రంలో .....దీనినే ....భయం అంటారట.... :P 

ఎలా భయం , ఎందుకు భయం , ఎవరికి భయం అని అడిగితే ....,,,,


ఏమో ....నిజానిజాలు స్టేట్మెంట్స్ ఇచ్చిన వారికే తెలియాలి .... !! :P :)

సర్వేజనాః సుఖినోభవంతు ...!!

సంవత్సరం అంతా .....పొలం దున్ని , విత్తునాటి , మొలక కంటే వేగంగా పెరుగుతున్న కలుపు పీకి , లేత చిగుర్లని ఆశిస్తున్న చీడ పీడలను సంహరించి ...ఎండకు ఎండినప్పుడు నీళ్లు పోసి , వానకు తడిసినప్పుడు ఎండ నిచ్చి , గాలి కి కొమ్మలు విరగకుండా ఆసరా ఇచ్చి ....పంట పండించి చూసుకుని మురిసి ....ఆప్యాయంగా పంట ఇంటికి తెచ్చుకుంటే ....

సంతోషం చెప్పనలవి కానిది ...ఇక తరవాత పంట ఎవరి నోటిలోకి పోతుంది అనేది ....పండించిన వారి చేతుల్లో ఉండదు ....

కొంత పొలంలో ఉండగానే పక్షుల పాలైపోతుంది .....ఇంటికి తెచ్చే సమయంలో కొన్ని గింజలు నేల పాలు కావచ్చు ....ఇంటికి తెచ్చాక కొంత ఎలుకల పాలు , ఇక దళారీలు , మిగిలింది కాస్తో కూస్తో తన కోసం ఉంచుకుంటే .... ....బంధువుల్లాంటి రాబందులు ..

దీనికి తోడు ....పరిగె ఏరుకునే వాళ్లకు (పంటలన్నీ అయిపోయాక కొందరు పొలంలో కింద మట్టిలో పడిపోయినవి ఏరుకుంటారు ....) చివరకు మిగిలేది ..... 

ఆఖరికి పండించిన వారి ఆకలి ప్రశ్నార్ధకమే .... ??!!

మరి సంవత్సరం అంతా రేయనక , పగలనక కష్ట పడింది ఎవరు అంటే .....ఒక్కరే ....రైతు ....

కానీ రైతు లేకుండా ఉంటే.... సమస్త జీవకోటి ఎలా బ్రతుకుతారు ....???!! 

అందుకే రైతు తనకు ఉందా లేదా అని ఆలోచించకుండా .....మళ్ళీ శ్రమించడం మొదటినుండి మొదలు పెట్టాలి .....

మళ్ళీ దుక్కి దున్ని , విత్తు నాటటడం మీదే తన దృష్టి అంతా కేంద్రీకరించాలి ....ఇంకా వానలు పడలేదే అని ఆకాశం వైపు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండాలి  ....

రైతు పని వైపు చూస్తుంటే ....

మిగతా అందరూ రైతు మొహం వైపు చూస్తూ ఉంటారు ....వాళ్లకి వేరే పని లేదు ....రైతు పండించేవరకు ఎదురు చూసి ....దోచుకునే సమయం వరకు కాచుకుని కూర్చోవడమే పని .......!! 

============================

ఇక్కడ సమాజంలో జీవన చిత్రం కూడా అదే ......

సంవత్సరాల తరబడి ....మనం పని చేస్తాం .... పనికి సమాజంలో గుర్తింపు వచ్చే సమయానికి ఫలితాన్ని చుట్టూ పదిమంది దోచుకోవడానికి సిద్ధపడతారు .....

పని చేసేవాళ్ళు .....పని, పని, పని ఇదే ఆలోచిస్తూ పని చేసుకుంటూ పోతారు .....

ఫలితం మీద వాళ్ళ దృష్టి ఉండదు .....వాళ్లకు పని చేయాలనే బాధ్యత కనిపిస్తుంది అంతే....అది చేశాక మేము పని చేసాం అని ఎవరితో చెప్పరు...చెప్పే తీరిక ఉండదు ....అయ్యో ఆపని ఇంకా పూర్తి కాలేదు .... బాధ్యత ఇంకా నెరవేర్చలేదు ....అనే ఆలోచనే ....

తలవంచుకుని ..... సైనికునిలా , సుశిక్షితుడిలా .... కార్యకర్తగా , సేవకుడిలా , భావకుడిలా ... పని చేసుకొంటూ పోతూనే ఉంటారు .....

ఇక దోచుకునే దొంగలు .....

చూసుకుంటూ ఉంటారు .....

వాళ్ళు చేసే పనిని వీళ్ళు చేసే పనిగా చిత్రీకరించి మెప్పు పొంది ఆనందించడం , వాళ్ళు అనుసరించే మార్గాలను వీళ్ళు నిర్మించిన మార్గాలుగా పదిమందికీ చూపించి ప్రచారం చేసుకోవడం , వాళ్ళ ఫలితాన్ని వీళ్ళు సాధించిన విజయాలుగా పల్లకీలో వూరేగించుకోవడం .....ఇదే వీరి దినచర్య ......

పని చేసుకుంటూ పోయేవారు ఇది గమనించినా ....,,,, నవ్వుకుంటూ వదిలేయడం ....వారికి లేదని , రాలేదని , రాబోదని చింతించకుండా ..పూర్తయిన పని తాలూకు ఫలితాన్ని ....పరిగె ఏరుకునే పరికముగ్గుల వాళ్లకు ధారపోసి .....

మరో పని వైపు ....దానిని మొదలు పెట్టడం వైపు , పని చేయడం అనే శ్రమైక జీవన సౌందర్యాన్ని సొంతం చేసుకునే వైపు ....విశ్రాంతి ఎరుగని ప్రయాణానికి సన్నద్ధమవుతూ ఉంటారు ....

వాళ్ళు మళ్ళీ పని చేస్తున్నారు  .....అందులో మనం ఏం దోచుకొని... మనకు ఆపాదించుకోగలం అని ... దోచుకునే బాచ్ వాళ్ళవైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది .....

సమాజానికి రైతు , శ్రమ జీవులు .....వెన్నెముకల్లాంటి వాళ్లు .....
దోచుకు తినేవాళ్లు ..... వెన్నెముకే లేనివాళ్లు ....

వాళ్ళు శ్రమిస్తారు ...అందరూ జీవిస్తారు ....

సర్వేజనాః సుఖినోభవంతు ...!!