Saturday, August 26, 2017

మన దగ్గర నుండి కొందరు ప్రేమ ఆశిస్తారు ...

మన దగ్గర నుండి కొందరు ప్రేమ ఆశిస్తారు ....మరికొందరు స్నేహం ఆశిస్తారు ....ఇంకొందరు కాస్త అభిమానం ఉంటే చాలనుకుంటారు ....
మరి కొందరు ఏమీ ఆశించరు...(వీళ్ళు మహానుభావులు )
అయితే అరుదుగా కొందరు మాత్రం ....,,,,
వాళ్ళ మీద మనం ....కోపం ,ద్వేషం ప్రదర్శించాలని అనుకుంటారు ....
కావాలని మనం కోపం ,ద్వేషం ప్రదర్శించుకునేలా ప్రవర్తించి... వారికి కావలసిన కోపం మననుండి ప్రదర్శింప చేసుకుంటారు .......
ఎందుకు వారలా కోపం కోరుకుంటారా అని ప్రశాంతంగా ఆలోచిస్తే ,,,,,??!!
నాకు తెలిసినంత వరకు .....,,,,,
మన కోపం వారి అభివృద్ధికి ఉపయోగపడుతుంది , లేదా మన ద్వేషం వాళ్ళల్లో ఉన్న ప్రకటించలేని పశ్చాత్తాపాన్ని పోగొడుతుంది .....
లేదా ప్రేమను భరించలేని అభద్రతా భావం వలన....కోపం మాత్రమే భరించడం అలవాటు కావడం వలన కోపం కావాలంటారు .....అని అర్ధమైంది ....
ఇలా వాళ్ళ మానసిక కారణాలు వాళ్లకు ఉంటాయి ..... 
ఏది ఏమైనా వాళ్ళు మన కోపం, ద్వేషం కోరుకోవడం వెనుక ఇన్ని కారణాలు ఉంటాయని ఆలోచించాక... నాకు వాళ్ళ మీద కోపం స్థానంలో జాలి కలగడం మొదలైంది ......
కానీ జాలి వాళ్ళు భరించలేరు కాబట్టి .....ఆ జాలి వాళ్లకు కనిపించకుండా ....వాళ్లకు అవసరమైన కోపం వాళ్లకు ఇవ్వాలని .....వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలని ....వాళ్ళ పశ్చాత్తాపాన్ని పోగొట్టాలని .....నాకు అర్ధమైనంత వరకు శతవిధాలా కోప్పడుతూ ఉంటా ....
"తన కోపమే తన శత్రువు" అని చిన్నప్పుడు చదువుకున్నది .....
"నా కోపమే వారి మిత్రుడు" అని ....అని మార్చి ఆచరిస్తూ ఉంటా ...  

Friday, August 25, 2017

జీవితం అన్న తర్వాత కష్టాలూ ఉంటాయి ,సుఖాలూ ఉంటాయి ...

జీవితం అన్న తర్వాత కష్టాలూ ఉంటాయి ,సుఖాలూ ఉంటాయి ....ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి.....
అయితే ....కొన్ని సందర్భాల్లో.... మనం జీవించిన సమాజం , మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం వలన ....మనం ఏర్పరచుకున్న నమ్మకాల వలన ....ఆ కష్ట / సుఖాలు మనకు భగవంతుడే ఇచ్చాడు ....అనుకుంటాం ....
కష్టాలు ఏర్పడినప్పుడు ఈ కష్టాలు నాకు ఎందుకిచ్చాడు అనుకుంటాం ..కొన్నిసార్లు నిందిస్తాం .....

సుఖాలు ఏర్పడినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాం .....
(ఆ భగవంతుడి స్థానంలో ఆత్మీయులు కూడా ఉండొచ్చు ....లేదా మనం కూడా ఉండొచ్చు ....)
అయితే ....జీవితం దయవలన నేను అర్ధం చేసుకుంది ఏమిటి అంటే .... ..,,,,
జీవితంలో ఎల్లప్పుడూ ....కష్టాలు కష్టాలుగానే ఉండవు .....సుఖాలు సుఖాలుగానే ఉండవు అని ....
ఇప్పటి కష్టాలు కొంతకాలం తర్వాత / క్రితం సుఖాలు కావచ్చు ....
ఇప్పటి సుఖాలు కొంతకాలం తర్వాత / క్రితం కష్టాలు కావచ్చు .....
అప్పుడు .....కష్టాలూ సుఖాలూ సమానమే అవుతాయి కదా .....
అందుకే .....జీవితంలో కష్టాలు ఏర్పడినప్పుడు అవి సుఖాలుగా మారతాయని , సుఖాలు ఏర్పడినప్పుడు అవి కష్టాలు కావచ్చు అని అర్ధం చేసుకుని .....
ఎవరు ఏవి ఇచ్చినా , ఎవరి వలన ఏం జరిగినా ....అందరికీ కృతజ్ఞతలు చెప్పేస్తూ ...రెండింటిని సమానంగా స్వీకరిస్తే .....
జీవితం అర్ధవంతంగా ముందుకు పోతూ ఉంటుంది .... 

Tuesday, August 15, 2017

పిల్లల నిర్ణయాలకు కారణాలు వెదకాల్సిన అవసరం లేదు ....

పొద్దున్నే లేవగానే .. ఈ రోజు కృష్ణాష్టమి కదా అనుకున్నా ...హ్యాపీ బర్త్ డే నాన్నా (కృష్ణుడికి కాదు , నా కూతురికి )....అని చెప్పడంతో ఈ రోజు మొదలైంది నాకు ....😍
నీకు బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలిరా ....అడిగా ...
ఏం వద్దు మమ్మీ ....చెప్పింది ...
నీకిష్టమైన డ్రెస్ అయినా కొనుక్కోరా ....చెప్పా ...
కొనుక్కోవాలని లేదు ....వద్దు ....చెప్పింది ....
ఎందుకో బలవంతం చేయాలనిపించలేదు ....పిల్లల ప్రతి నిర్ణయానికి కారణాలు వెదకాల్సిన అవసరం లేదు .... వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అనుకుంటాను ....అంతే ....అందుకు కారణాలు ఏవైనా ....🤔
తెలుగు వాళ్లందరికీ (కొంతమంది హిందీవాళ్లకు కూడా ) కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పా ఆఫీస్ లో ...గుజరాత్ లో రేపు జరుపుకుంటున్నారట కృష్ణాష్టమి ....మనకు అంతా తొందరేగా ..??!! 😂ఏంటో ....కృష్ణుడు ఎన్ని రోజులు పుట్టాడో ఏమో ....నాకు అర్ధం కాదు ....🤔ఒక ఫ్రెండ్ కృష్ణుడి ప్రసాదం చలిమిడి, సున్నుండలు తెచ్చి ఇచ్చారు ...ఒక ఫ్రెండ్ చికెన్ బిర్యానీ తెచ్చి ఇచ్చారు ....అది కృష్ణుడి ప్రసాదం కాదు ....ఊరకనే తెచ్చారు ....🤫ఈ రోజు నాన్ వెజ్ తిననండీ అని చెప్పా ..అయినా తనని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ....ఫ్రిజ్డ్ లో పెట్టుకుని రేపు తింటాలే ...అని చెప్పి తీసుకుని థాంక్స్ చెప్పా ....
సాయంత్రం తొందరగా ఇంటికి రావొచ్చు అని ....తొందరగా వెళ్ళా ఆఫీస్ కి పొద్దున్నే ....ఏం లేదు తొందరగా వచ్చి ...తనని కృష్ణ టెంపుల్ కి తీసుకుని వెళదాం అని ప్లాన్ ....
ఎంత తొందరగా బయలుదేరిననా ట్రాఫిక్ గురించి ఎవరికి తెలుసు ....ఎంతసేపు పడుతుందో ....అందుకే రోజూ వెళ్లే దారిలో ఎక్కువసేపు టైం చూపిస్తే ....టోల్ దారిలో వెళదాం అని డిసైడ్ చేసుకున్నా ....🏎️
కానీ కార్ స్టార్ట్ చేయగానే ...25 నిముషాలు చూపించింది ....టోల్ రోడ్ లో అయినా అంతే టైం పడుతుంది ....
త్వరగా ఇంటికొచ్చి ...రాగానే కృష్ణుడి ప్రసాదం నా కూతురికి పెట్టా ....చాలా బాగుంది అని ఇష్టంగా తింది ...మనం ఈ వీకెండ్ సున్నుండలు చేసుకుందాం అంది ....(ఫొటోస్ గట్ర ఏం షేర్ చేయను ... 😜 ) సరే అని చెప్పా ....
వెంటనే రెడీ అయి దగ్గరలో కృష్ణుడి టెంపుల్ ఎక్కడ ఉందా అని చూస్తే...10 మైల్స్ లో ఒక చిన్న టెంపుల్ ఉంది ....25 మైల్స్ లో ఒక పెద్ద టెంపుల్ ఉంది అని చూపించింది ....
"అరె ...భగవంతుడు ఎంత టెంపుల్ లో ఉన్నా భగవంతుడేరా ....ఏం మార్పు లేదు ..." అని దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్లాం .....
దారి పొడవునా అందమైన కొండలు ....ఆ కొండల మధ్యలో నుండి వెళ్తుంటే ...ఏదో బృందావనానికి వెళ్లిన భావం కలిగింది ...చాలా ఆహ్లాదంగా అనిపించింది .....😍
అక్కడ టెంపుల్ కి పక్కవీధిలో కార్ పార్క్ చేసి ....టెంపుల్ లోకి అడుగుపెట్టగానే ....కృష్ణుడి రూపం కనువిందు చేసింది ....కానీ ఎవరూ అంతగా జనం లేరు ....ఒక (అమెరికన్) అబ్బాయి ...హరే కృష్ణ హరే కృష్ణ ....అంటూ ...తబలా వాయిస్తూ ....ఉన్నాడు ....ఒక (అమెరికన్ )అమ్మాయి ..అతని దగ్గర నేర్చుకుంటూ ఉంది ....అక్కడ ఒక బోర్డు మీద ...పూజ రేపు ...అని వ్రాసి ఉంది ....
సరేలే ...ఇక్కడ కూడా కృష్ణాష్టమి రేపే చేస్తున్నారు అనుకుని .... మేం దేవుడికి దండం పెట్టుకుని .....గుడి చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాం ....అక్కడ కొంతమంది పూవులు మాలలుగా గుచ్చుతూ ఉన్నారు ... అంతలో ఓ వ్యక్తి ...మీరూ మాలలు అల్లుతారా అని అడిగారు ....సరే అని చెప్పాం ....😍
అక్కడ కూర్చుకుని బంతి , చేమంతి మాలలు గుచ్చుతూ ....దాదాపుగా రెండు గంటలు అక్కడే రకరకాల డిజైన్ లలో ....గుడి అలంకరణ కోసం .... మాలలు అల్లడంలో మాకు సమయం తెలియలేదు ...
అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది తెలుగువాళ్లు కృష్ణుడి గురించి , భగవద్గీత గురించి మాట్లాడారు ..😍
అందులో ఒకరు ...."మిమ్మల్ని కృష్ణుడి ని ఆరాధించమని ఎవరు ప్రోత్సహించారు ...." అని అడిగారు ...."ఒకరు ప్రోత్సహించడం ఏమిటి ....నాకు చిన్నప్పటినుండి కృష్ణుడంటే ఇష్టం...అయినా.., ఒకరు ప్రోత్సహిస్తే వచ్చేది భక్తి ఎలా అవుతుంది ....మన మనసులో జనించేది భక్తి అవుతుంది గానీ ..." చెప్పా ...🤔
"నాకు మాత్రం మా అమ్మ ప్రోత్సాహం వలెనే కృష్ణుడు అంటే ఇష్టం ...." చెప్పింది నా కూతురు నా వైపు చూస్తూ ....😘
"అయ్యుండొచ్చు ...వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడ్డారు ... కృష్ణుడిని ఇష్టపడండి అని నేనెప్పుడూ వాళ్లకి చెప్పలేదు ...." చెప్పా నవ్వుతూ ....😀
పూల దండలన్నీ పెట్టెల్లో కూర్చి ...ఇక వెళ్లొస్తాం అని చెప్పాము....ఇవన్నీ రేపు అలంకరిస్తాం ....రేపు తప్పకుండా రండి అని అక్కడున్న అందరూ పిలిచారు ....
ఒక అమ్మాయి (అమెరికన్....) నన్ను ...."మాతా..." ఆ పువ్వులు ఇలా ఇవ్వండి ....(ఇంగ్లీషులో )అని అడిగింది ....
అక్కడ అందరూ అలానే పిలుచుకుంటారని తెలిసి ....ఆ అమ్మాయి అందర్నీ ఫాలో అవడం చూసి ...ముచ్చటేసింది ....😍
------------------------------------
"థాంక్స్...ఇదే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ " సంతోషంగా చెప్పింది నా కూతురు .....😍
తర్వాత ...ఓ అమెరికన్ రెస్టారెంట్ లో డిన్నర్ తో ....
=================
అదిగో ....అలా జరిగింది కృష్ణాష్టమి ... :) 

Sunday, August 13, 2017

ఆ మధ్య ఇద్దరు వ్యక్తులతో నా సంభాషణ ఇలా ఉంది ...

ఆ మధ్య ఇద్దరు వ్యక్తులతో నా సంభాషణ ఇలా ఉంది ...
ఒక వ్యక్తి ......................,,,,
నాకు నా తోబుట్టువులు వేసిన మార్కులు = 100/100
నా తల్లితండ్రులు వేసిన మార్కులు = 100/100
నా బంధువులు వేసిన మార్కులు = 100/100
నా స్నేహితులు వేసిన మార్కులు = 100/100
మా ఆఫీసులో కొలీగ్స్ /మానేజర్స్ వేసిన మార్కులు = 100/100
నా భార్య వేసిన మార్కులు = 30/100
-------------------------------------------------------
రెండో వ్యక్తి ...................,,,,
మీకో విషయం తెలుసా ....అందరు భార్యలు వాళ్ళ భర్తలకు వేసే మార్కులు అవే ... 
-------------------------------------------------------
తెలుగు = 100/100
ఇంగ్లిష్ = 100/100
సైన్సు = 100/100
సోషల్ = 100/100
హిందీ = 100/100
లెక్కలు = 34 /100
మార్కులు వస్తే .....ఎవరైనా పాసై పోతారా ....??!!
మీరనేది ఎలా ఉందంటే......,,,"నేను పరీక్ష చాలా బాగా రాశాను ...ఆ మేష్టారు నా మీద కోపంతో నన్ను ఫెయిల్ చేశారు ...." అని ....
"పేపరు చాలా కష్టంగా ఇచ్చారు ...అందుకే పరీక్ష సరిగా రాయలేకపోయాం" అని ....
"కాపీ కొడదామంటే ఇన్విజిలేటర్ మంచివాడు రాలేదు" అని ..... అన్నట్టుంది….. 
“ఇప్పటికైనా బాగా చదువుకొని పరీక్ష రాయండి .... మార్కులు వాటంతట అవే వస్తాయి ....”  

కళ్ళనీళ్ళు తుడుచుకోవడానికి ఇద్దరికీ చెరొక టిష్యూ పేపర్ చేతికి అందిస్తూ…… ,,,
నేను ....   

Saturday, August 12, 2017

కొంతమంది అబద్ధం దగ్గర ప్రారంభించి..

కొంతమంది అబద్ధం దగ్గర ప్రారంభించి.. నిజం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు ....
నిజం దగ్గర ప్రయాణం ప్రారంభించి అబద్ధాన్ని చూడమని అడుగుతూ ఉంటా నేను వాళ్ళను...
నాకు బ్రతకడం చేతకాదు అంటారు వాళ్ళు....
నిజాన్ని కలిసే ధైర్యం తెచ్చుకోండి అంటాను నేను వాళ్ళతో ....😍

మనలో ఉన్న ఆవేశాన్ని చూసి ఆనందించేవారు ..

మనలో ఉన్న ఆవేశాన్ని చూసి ఆనందించేవారు ....వారు ఆంతరంగిక వ్యక్తులైనా, ...వారి స్వార్ధం కోసమే అలా చేస్తూ ఉంటారు .....వారి ఆవేశాన్ని మనలో చూసుకుని ....వారి తృష్ణ చల్లార్చుకుంటారు ....వీరికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి ... 😡
మనలో ఉన్న క్షమాగుణాన్ని చూసి ఆనందించేవారు ....వారు పరాయి వాళ్ళయినా ....మనకోసమే అలా చేస్తూ ఉంటారు ....మనలో ఆవేశాన్ని తగ్గించి ...మన తృష్ణను చల్లార్చాలని చూస్తారు ....వీళ్లకు సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి ...😍

జీవితంలో మనం ఎప్పుడు పడిపోయినా ...


జీవితంలో మనం ఎప్పుడు పడిపోయినా ...ఎప్పుడూ మనమే లేస్తూ ఉండాలి అనేది నిజం .....బహుశా అదే జీవితం కూడా కావచ్చు ....
చిన్నతనంలో.. మనం తప్పటడుగులు వేస్తూ పడిపోతే తల్లితండ్రులు మనకు చేయందిస్తారు ....
కాస్త వయసొచ్చాక ..మనం పడిపోతే ...పక్కన ఉన్న స్నేహితులు సాయం చేస్తారు ....
ఇంకాస్త వయసొచ్చాక మనం జీవిత భాగస్వామి మనకు చేదోడుగా ఉండొచ్చు ....
బంధువులు కావచ్చు .....
కానీ ఏదో ఒకరోజు... మనకి మనమే ...చేయి ఇచ్చుకుని లేవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా వస్తుంది .....🤔
ఆ అవసరం వచ్చినప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసం సిద్ధంగా ఉండాలి ...🚶‍♀️
అలా ఉండాలి అంటే, ముందు నుండే మనం అలాంటి శక్తి సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి ...🏋️‍♀️
ఒకవేళ ప్రయత్నించలేదు అనుకోండి .....అప్పటికి మనకు తెలియకపోవచ్చు .....
ఫలితం మళ్ళీ పడిపోతాం .....😥
పడీ పడీ దెబ్బలు తిని ...ఎలాగో మనం లేవడం నేర్చుకున్న తర్వాత ...చివరకు మనం పడిపోవడం గురించి భయపడాల్సిన అవసరం ఉండని స్థితికి వచ్చేస్తాం .....😍
తర్వాత కొన్నాళ్ళకి ...ఎంత కిందకి పడిపోతే అంత ఎత్తుకి లేస్తాం ......ఫోర్స్ తో ....😍
ఎవరి జీవితం అయినా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దయచేసి వాళ్ళను ఎవరూ పడేయాలని చూడకండయ్యా ....
మళ్ళీ అంతెత్తుకు లేస్తే చూసి తట్టుకోలేరు ....😜

Friday, August 11, 2017

కడుపు నిండా తిండి తిన్న తర్వాత ..

కడుపు నిండా తిండి తిన్న తర్వాత ....హమ్మయ్య కడుపునిండా తిండి లేకపోయినా పర్లేదు... కానీ ....కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనిపిస్తుంది ..
కంటి నిండా నిద్రపోయిన తర్వాత ...హమ్మయ్య కంటి నిండా నిద్రలేకపోయినా పర్లేదు... కానీ ....కడుపునిండా తిండి ఉంటే చాలు అనిపిస్తుంది ....
కడుపునిండా తిని ,కంటి నిండా నిద్రపోయాక ....హమ్మయ్య ఈ రెండు లేకపోయినా పర్లేదు ...కానీ ...చేతి నిండా డబ్బుంటే చాలు ....అనిపిస్తుంది ...

డబ్బుంటే .....,,,,,ఇవేం అవసరం లేదు ..అసలు మనిషికి సమాజంలో గౌరవం , బంధాలు , స్నేహితులు లేకుండా బ్రతకడం ఎలా ....కాబట్టి ....అందుమూలంగా ....ప్రపంచంలో ఉన్నవన్నీ కావాలి అనిపిస్తుంది ...  
--------------------------
దీనిని బట్టి ....అర్ధం చేసుకుంది ఏమిటి అంటే ....మనిషి (అందరూ కాదు  ) తన దగ్గర ఉన్నదాని విలువను ఎక్కువ శాతం గుర్తించడు....లేనిది మాత్రమే విలువైనది అనుకుంటాడు ..... అదుంటే చాలు ...ఇప్పుడున్నవన్నీ లేకపోయినా పర్లేదు ...అనుకుంటాడు ... 
ఉన్నది ఎంత విలువైనదో తెలుసుకుని దానిని ఆస్వాదించడం నేర్చుకుంటే ....,,,,,,
ఈ రోజుకి ఇది ఉంది చాలు ....అది లేకపోయినా పర్లేదు అనుకుంటే ....అంతకంటే జీవిత పాఠం ఏముంది ....??!!