Friday, May 7, 2021

నాకు May 3rd ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయింది ...

 నాకు May 3rd ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయింది ...ఫస్ట్ డోస్ కి ఎలాంటి symptoms లేవు అన్నారు నాకు తెలిసిన వారు కొందరు ...

నాకు మాత్రం రెండు రోజులు ఫీవర్, ఒళ్ళు నెప్పులు , శ్వాస సమస్యలు ఎదురయ్యాయి ...
మరి రెండో డోస్ కి ఎలా ఉంటుందో తెలియదు ...
వ్యాక్సినేషన్ తీసుకునేముందు చాలా ప్రశ్నలు వేశాను ...
నేను వేసిన తిక్క ప్రశ్నలన్నికి సమాధానం ఇచ్చాకే ...ఇంకేమీ అడగాల్సింది లేదు కదా అని నిర్ధారించుకుని నాకు వాక్సిన్ వేశారు ...
అందులో ముఖ్యంగా ..."వాక్సిన్ ఎంత శాతం పనిచేస్తుంది" అని అడిగా
"ఇప్పుడు ఇదంతా ప్రయోగాత్మకమే తప్ప ...ఏదీ ఖచ్చితంగా చెప్పలేం" అని చెప్పారు ....
"నేను వాక్సిన్ ని ఎంచుకోవచ్చా నాకు ఏది కావాలో ...." అడిగా ...
"మా దగ్గర ఇది ఒక్కటి మాత్రమే ఉంది .... " చెప్పారు ..
"జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్ కి కొన్ని సమస్యలు వచ్చాయి అని విన్నాను ....అది కొంతకాలం ఆపేసారు అని విన్నాను ....మీ కామెంట్ " అడిగా ....
"దానివలన కొందరికి సమస్యలు వచ్చిన మాట నిజమే ...కానీ తర్వాత విచారణలో తేలింది ఏమిటంటే ...వాళ్ళు , వాక్సిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా జవాబివ్వాల్సిన కొన్ని ప్రశలకు తప్పు సమాధానం ఇచ్చారని ...దానివల్లనే సమస్యలు ఎదురయ్యాయని...అందుకే అడిగిన అన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఆశిస్తున్నాం" చెప్పారు ...
ప్రశ్నలు ...ఉదాహరణకు ....గత 14 రోజుల్లో ఇంకేదైనా వాక్సిన్ తీసుకున్నారా ..., కోవిడ్ ఉన్నవాళ్లను ప్రత్యక్షంగా గత 14 రోజుల్లో కలిశారా ...మీకు కోవిడ్ symptoms ఏమైనా ఉన్నాయా ....(జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలు మొదలైనవి ), వాక్సిన్ కి ఎలర్జీలు లాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా కలిగాయా .., ఏదైనా మెడికేషన్ తీసుకుంటున్నారా , దీర్ఘకాల సమస్యలు ఉన్నాయా , వాటికి ఏదైనా మందులు వాడుతున్నారా ...ఇలాంటివి ....
"ఎందుకో నాకు కాస్త భయంగా ఉంది ....ఇది సేఫ్ గా ఉంటుందా ...లేదా అని" అడిగా ...
"నేను కూడా రెండు డోస్ లూ వేసుకున్నాను ...చాలా శాతం వాక్సిన్స్ వేస్తున్నాం ...ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది ..." చెప్పారు ...
ఇలాంటి కొన్ని ప్రశ్నలు ....సమాధానాలు అయ్యాక ...నేను రెడీ అన్నప్పుడు వాక్సిన్ వేశారు ....
వేశాక ...ఓ పదిహేను నిమిషాలు అక్కడే కూర్చోమన్నారు ...ఆ తర్వాత వెళ్లొచ్చు అని చెప్పారు ....
ఓ ఐదు రోజులు వరసగా కోవిడ్ symptoms రావడం మాములే అని ...అప్పుడు కూడా తగ్గకపోతే ....అరవరోజు ...హాస్పిటల్ కి కాల్ చేయమని చెప్పారు ....
అలా ఫస్ట్ డోస్ కంప్లీట్ అయింది ....
మా అమ్మ అడిగింది ...వాక్సిన్ వేసుకున్నావా అని ....
తీసుకున్నాను, అని చెప్పాలంటే చాలా గిల్టీగా అనిపించింది ....
మా అమ్మకు వాక్సిన్ అందుబాటులో లేదు ....ఎప్పుడొస్తుందో తెలియదు ...అప్పుడే నేను తీసుకున్నాను ....అని ...
ఎందుకంటే నా పిల్లలు ...నన్ను కూడా తీసుకోమని ఎన్నోసార్లు అడిగారు ఇప్పటికే ...
నేను తీసుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ...
మాకు ఏప్రిల్ 15 తర్వాతే ....వాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ...!
ప్రపంచం లో అందరికీ వాక్సిన్ అందుబాటులోకి రావాలని ....అందులో మా అమ్మ కూడా ఉండాలని నా ప్రార్ధన !!🙏