Friday, September 23, 2016

ఒక బంధం వచ్చింది .... A relationship has approached me....

A relationship has approached me
It said, “I’ll be a part of your life”
“Will you become my life?” I asked.
After a while it left, leaving its life behind.
I watched as it departed my life filled with sorrow.
___________________________________________

Yet another relationship entered my life
It said, “I’ll hold onto you.”
“Shall I devote my life to your embrace?’
Eventually its stubbornness caused for it to abandon me as well.
I started to wonder.
_____________________________________________

A different relationship has arrived
It said, “I will tie myself to you.”
“Can I wrap myself around you?” I requested.
After sometime the tie itself has loosened and disappeared.
I searched my heart for the answer
______________________________________________

One more relationship advanced me
“It was I who has commanded for all of the other relationships to perish!” it exclaimed.
“May I at least know your name?” I asked in hope to find the answer to the destruction of all of my relationships.
I look into its eyes: I see no regret for what it has done to my life.
It snickers and says, “Money relationship.”

===========================================

ఒక బంధం వచ్చింది .... బంధువు అవుతాను అంది .... ప్రాణం కావా అని అడిగా ....కొంతకాలం తర్వాత, ....ప్రాణాలే వదిలి వెళ్ళిపోయింది .....
బాధగా చూశా ................

మరో బంధం వచ్చింది ......అల్లుకు పోతాను అంది .... పందిరి కానా అని అడిగా ...కొంతకాలం తర్వాత ,......అలిగి వెళ్ళిపోయింది ....
ఆలోచించి చూశా ......

వేరొక బంధం వచ్చింది .....ముడివేసుకుంటాను అంది ....పెనవేసుకోనా అని అడిగా ....కొంతకాలం తర్వాత, ....ముడి వీడి పోయింది ....
అర్ధం కోసం చూశా .....

మరొక బంధం వచ్చింది ........అన్ని బంధాలను వెళ్లి పొమ్మని శాసించింది నేనే అంది .....పేరు చెప్పవా అని అడిగా, .....'ఆర్ధిక బంధం" అంది
.....!!

I saw, standing in front of me, monsters…

I saw, standing in front of me, monsters… Many times.
I didn’t greet them. I didn’t acknowledge them. I didn’t utter one word to them.
I strived to pretend that I didn’t identify them.
No longer able to bear my ignorance to their existence,
Filled with annoyance and despair they steered clear of me.


 I saw, standing in front of me, human beings… No more than one time
But this time, I introduced myself to them. I greeted them. I happily conversed with them.
Surprisingly, day after day they started to talk to me

And we became a part of a bond that can never be replaced.

=============================================

ఎదుటివ్యక్తిలో రాక్షసుడిని చూసాను .....చాలాసార్లు .....,కానీ పలకరించలేదు ,పట్టించుకోలేదు ,మాట్లాడలేదు .....అసలు ఎవరో తెలియనట్లే ప్రవర్తించా .....నేను చేసే నిర్లక్ష్యం భరించలేక విసిగి ,వేసారి నా ముందుకు రావడమే మానేసాడు ..........

ఎదుటివ్యక్తిలో మనిషిని చూసా .....ఒక్కసారే .....,కానీ నేనే పరిచయం చేసుకున్నా ,పలకరించా ,మాట్లాడా .........విచిత్రంగా రోజూ నన్ను పలకరించడం మొదలు పెట్టాడు ....మేమిద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం .....!!



Monday, September 19, 2016

చాలా మంది నాకు తెలివితేటలు లేవు అనుకుంటూ (అంటూ )ఉంటారు ...

చాలా మంది నాకు తెలివితేటలు లేవు అనుకుంటూ (అంటూ )ఉంటారు ....ఎందుకలా అనుకుంటారా ...అన్ని పనులూ బాగానే చేస్తున్నా కదా ,అన్ని మాటలు అందరిలా మాట్లాడుతూ ఉన్నా కదా అనుకుంటూ ఉంటా .... :(

చివరికి చాలా కాలం ఆలోచించి ఆలోచించి నేను అమాయకురాలినే అని అందరికీ చెప్పి ... నేను ఫిక్సయ్యే లోపల …నేను అమాయకురాలిని కాదు అని ప్రూవ్ చేసుకునే ఒక సంఘటన ఎదురైంది .... :)

ఆ మధ్య ఒకరు ఇలాగే "నువ్వెంత అమాయకురాలివో నాకిప్పుడు అర్ధమైంది ...." అన్నారన్నమాట నాతో ....

"నాకేమీ తెలివి లేదని....ఉన్నదంతా అమాయకత్వమే అని....
నేనెప్పుడో అంగీకరించాను ....అయినా ఇప్పటివరకు ఆవిషయం గుర్తించకుండా ....ఇప్పుడు ...నా అమాయకత్వం గుర్తించిన మీరు ....నాకంటే ఇంకెంత అమాయకులై ఉంటారో ఆలోచించండి ....." అని తెలివైన అమాయకంగా సమాధానం చెప్పా... :) 

చివరకు నా కంటే అమాయకులు కూడా ఉన్నారని అర్ధమై చాలా ధైర్యంగా అనిపించింది అనుకోండి ....అది వేరే విషయం ....!!

ఇంతకూ నన్ను అమాయకురాలు అని ఎందుకు అనుకుంటున్నారో చెప్పలేదు కదూ .....,,,

అంటే ... కొంతమందిలా ..గుట్టు చప్పుడు కాకుండా ...మూడో కంటికి తెలియకుండా ... కావాల్సిన పనులు ,కావాల్సిన వాళ్ళనడిగి చక్కబెట్టుకోకుండా ....మనసులో ఉన్నదంతా మాట్లాడేసి …దాచకుండా బయటికి చెప్పేస్తూ ఉంటా .....అదన్నమాట సంగతి .....అలా చెప్పడం వలన నాకు చాలా కష్టాలు కూడా వస్తూ ఉంటాయనుకోండి .... :(

మనలో మనమాట .... తెలివితేటలు ఉన్నవాళ్ళు అలా మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పరట....అసలు మనసులో ఉన్నది కాకుండా వేరే కథ అప్పటికప్పుడు అల్లి చెప్పేస్తూ ఉంటారట .... చాలా తెలివి ఉన్నవాళ్ళు అయితే ....కథలే చెప్పాల్సిన అవసరం ఉండదట ....కథే వాళ్ళ దగ్గరకొచ్చి మమ్మల్ని ఇలా అల్లి చెప్పండి ...అలా అల్లి చెప్పండి ....అని బ్రతిమాలుకుంటుందట ..... ఎంత తెలివితేటలో కదా .... 

వాళ్ళు అదృష్టవంతులురా బుజ్జీ .... :(

"సరేలెండి ....అలాంటి తెలివితేటలు ఎన్ని తపస్సులు చేసినా ఈ జన్మకు నాకు రావని అర్ధమైంది ....ఏదో ఇలా అమాయకంగా నన్ను బ్రతకనివ్వండి ..."అని తెలివైన వాళ్ళందరికీ పేరు పేరునా చెప్పడం తప్ప నాకు మరో మార్గం లేదు ఇక ... :(

తెలివైన వాళ్ళందరూ ...ఇలాంటి తెలివిలేని స్టేటస్ పెట్టింది ఏమిటా అని అలా కోపంగా చూడకండి ....నాకు తెలివైన స్టేటస్ లు పెట్టడం మాత్రం ఎలా వస్తుంది ...??!!...... ఎలా ...హౌ .... :) :) 

Sunday, September 18, 2016

లెఫ్ట్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నా ఈ రోజు ..

లెఫ్ట్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నా ఈ రోజు ...ఎదురుగా రోడ్డు మీద బాతుల గుంపు వచ్చింది ....వెళ్తున్న ప్రతికారూ ఆగి ....వాటికి దారి ఇచ్చి పక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం ....ముచ్చటగా అనిపించింది ....(హార్న్ చేయకుండా ...)
ఏంటో అవి మహా రాజులు , మహారాణుల్లాగా .....అటు కాసేపు , ఇటు కాసేపు ....ధీమాగా నడుచుకుంటూ ....
మీకూ షేర్ చేద్దామని ....నాలుగు ఫొటోస్ క్లిక్ చేశా .....<3 <3 <3 




సృష్టి లో కొన్నిటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం సాహసం ...

"ఇప్పుడే ఒక సినిమా చూస్తుంటే నాకు ఒక సందేహం వచ్చి నీకు కాల్ చేశాను ....ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ....సూది గుచ్చితే ఇంత నొప్పి ...కాలు విరిచేస్తే ఇంత నొప్పి ....ఉంటుందని వివరించి ....బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు ఇంత నొప్పి ఉంటుంది తల్లికి అని వివరించారు ...
ఆ నొప్పి తల్లి ఎలా భరిస్తుంది అనేది ఇప్పటివరకు ఏ పరిశోధనకూ అందని విషయమట....ఇంతకూ ఎలా భరిస్తారు ఈ నొప్పిని ...." ఇప్పుడే ఒకరు అడిగారు ఆసక్తిగా ....

"ఆ నొప్పి ఎలా భరిస్తారు అనేది సృష్టి ధర్మం , నియమం ....అది అర్ధం చేసుకోవడం సృష్టికి మాత్రమే (స్త్రీ కి ) సాధ్యం .....కానీ ఇంకా అర్ధం కాని మరో విషయం ఏమిటంటే .....ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కి కూడా తాను ఆ నొప్పిని భరించినా కూడా .....తన బిడ్డ మరో బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ....తన బిడ్డ మీద అదే సందేహం వ్యక్తం చేస్తుంది ....జీవితాంతం అదే సందేహంలో ఉంటుంది కూడా ...."నా బిడ్డ ఈ నొప్పిని ఎలా భరించగలదు" అని ......." నా బిడ్డ ఈ నొప్పిని ఎలా భరించింది" అని .....

సృష్టి లో కొన్నిటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం సాహసం ....అలాంటి సాహసాలు ఆపి సినిమా చూసుకోండి ....ఉంటాను ....." ఫోన్ పెట్టేస్తూ నేను ..  :) :) 

మంచివాళ్లను బాధపెట్టడం కన్నా.... కొన్నిసార్లు దుర్మార్గుల్ని సంతోషంగా ఉంచడం సమాజానికి మంచిది ...!

మంచివాళ్లను బాధపెట్టడం కన్నా.... కొన్నిసార్లు దుర్మార్గుల్ని సంతోషంగా ఉంచడం సమాజానికి మంచిది ...!

మంచివాళ్లను బాధపెడితే/బాధపడితే వాళ్ళు మౌనంగా ఉంటారు , భరిస్తారు ....సమాజానికి,చుట్టుపక్కల వారికి ఏ విధమైన హాని చేయరు .... <3

అదే చెడ్డవాళ్లను బాధపెడితే/బాధపడితే ....
"తాను చెడ్డ కోతి వనమెల్లా" అనే సామెత లాగ అయిపోతుంది ....:)

అందుమూలంగా వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత సమాజంలో బాధ్యత గల పౌరులు అందరి మీదా ఉందని నా అభిప్రాయం ... :) :) 

ఇక మంచి చెడు అనే విషయానికి నిర్వచనాలు మన సొంతం అనుకోండి ...! :) 

"ఎదుటివారికి 100% అహం ఉంది ....

"ఎదుటివారికి 100% అహం ఉంది ....నాకు 0% అహం ఉంది ....."
ఇలా కొందరు అంటూ ఉంటారు నాతో .... 

కానీ వారికి తెలియనిది ఏమిటి అంటే ఎదుటివారు కూడా అలాగే అనుకుంటారు అని .... :) 

అందుమూలంగా .....ఎవరికైనా అహం అనేది... ఉంటే 100% ...లేకపోతే 0% .... :) :P

"నేను ఈ పని చేసి చూపిస్తా ....." నాతో ఒకరు ...

"నేను ఈ పని చేసి చూపిస్తా ....." నాతో ఒకరు ....

"ఆల్ ది బెస్ట్ ..." నేను...


"నీ మాటల్లో ఈ పని నువ్వు చెయ్యలేవు అని ...ఏదో ఒక అగమ్య గోచరమైన భావం కనిపిస్తుంది ...." అనుమానంతో వారు ...


"అలాంటి భావం ఏదో నా మాటల్లో వెతుక్కుని ... అది ఛాలెంజ్ గా తీసుకుని అయినా ఆ పని చేద్దాం అని ఆశగా చూస్తున్నట్టున్నారు మీరు ..." నవ్వుతూ నేను ....


"నీతో మాట్లాడడం కష్టం ..." ఎప్పటిలాగే వారు .... :)

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది(ట)....

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది(ట)....ఈ మాట కొంతమంది అంటూ ఉంటారు .....ఆ విషయం పురుషులే ద్రువీకరించాలి .... :)

వ్యక్తులు వారి వారి అనుభవాలను అనుసరించి అభిప్రాయాలను ఏర్పరచుకుని అవి అందరికీ పంచుతూ ఉంటారు ....అవి మన జీవితానికి అనుకూలంగా ఉంటే , మనం నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు .........లేకపోతే విని వదిలేయవచ్చు ...

ఈ రోజు అనుకోకుండా విన్న ఒక స్పీచ్ లో యండమూరిగారు ఏమన్నారంటే .....,

"పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటూ ఉంటారు .....కానీ పురుషుడి విజయం వెనక ఒక పురుషుడు కూడా ఉండొచ్చు ......(సరే బాగుంది ....ఇది విని వదిలేసా ... 
 )


కానీ ప్రతి స్త్రీ విజయం వెనక మాత్రం ...,ఒక స్త్రీ మాత్రమే ఉంటుంది ....." అని .....,


యండమూరి గారు ఏ ఉద్దేశ్యంతో చెప్పినా ....రెండో వాక్యం నాకు అమితంగా నచ్చేసింది కాబట్టి మనసులో ముద్రించుకున్నా ....!! :)

Saturday, September 17, 2016

"మా ఫ్రెండ్ దగ్గర చాలా మంది రౌడీలు ఉన్నారు ...

"మా ఫ్రెండ్ దగ్గర చాలా మంది రౌడీలు ఉన్నారు ...డబ్బులిచ్చి వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నాడు ..." తన ఫ్రెండ్ గురించి గర్వంగా నాతో ఒకరు ....
"ఓహ్ అవునా ....ఇంతకూ ఏం అవసరం ఉంది రౌడీలతో మీ ఫ్రెండ్ కి ...." ఆశ్చర్యంగా నేను ....
"బిజినెస్ కోసం & పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నాడు....అందుకే ...." సమాధానం....
"నాకు తెలిసినంత వరకు ....బిజినెస్ చేయాలంటే తెలివితేటలు కావాలి ....
పాలిటిక్స్ లోకి రావాలంటే ప్రజల అభిమానం సంపాదించాలి .......
మధ్యలో రౌడీలు ఏం చేస్తారు…??!!” అయోమయంగా నేను ....
-----------------------------------
"అర్ధమైంది లెండి ....
ఇంత అమాయకమైన ప్రశ్న అడిగినందుకు ...నేను వెనకబడిపోయా .....మీరు సమాజంలో ఎంతో ఎదిగిపోయారు అంటారు ....అంతేనా ....." నా సమాధానంతో నేను .... :) :)

Thursday, September 15, 2016

"మా అబ్బాయి పెళ్ళికి ఫలానా సెలెబ్రిటి వచ్చాడు .....నా జీవితాశయం నెరవేరింది ....."

"మా అబ్బాయి పెళ్ళికి ఫలానా సెలెబ్రిటి వచ్చాడు .....నా జీవితాశయం నెరవేరింది ....."

"మా అమ్మాయి పెళ్ళికి ఫలానా సెలెబ్రిటి ని పిలవాలి ....ఇదే నా జీవితాశయం ...."


వాళ్ళతో మీకు పరిచయం ఉందా .....??!!


లేదు ....వాళ్లకు మాకు దగ్గరగా పరిచయం ఉన్నవాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేయించాము ....


అంత బిజీ గా ఉన్నవాళ్ళకు మీ పెళ్ళికి వచ్చి అంత సమయం గడిపే తీరుబడి ఉందా ...??!!...


లేదు ....అతి కష్టం మీద ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్లారు .....పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి షేక్ హ్యాండ్ ఇచ్చారు ...ఫొటోస్ తీసుకున్నాము ....


ఇంతకూ భోజనం అయినా చేసారా ....??


సెక్యూరిటీ ప్రాబ్లం కదా అందుకే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు .... :( 
................................................................
ఎందచాట ఇది ..........  :) :P

Tuesday, September 13, 2016

ఆప్యాయత ,అనురాగం , ప్రేమ ,అభిమానం అనేవి .....

ఆప్యాయత ,అనురాగం , ప్రేమ ,అభిమానం అనేవి ....ఎప్పుడు ఎలా ఎక్కడినుండి వస్తాయో మనం ఊహించలేం ....

మనం ఊహించని సమయంలో ....ఊహించని వ్యక్తుల నుండి ....ఆకాశమంత అభిమానం మనకు లభించి ....మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది .... <3

మనం ఊహించి .... యుగాల తరబడి ఎదురు చూసిన వారి దగ్గర నుండి ...అణువంత అభిమానం కూడా మనకు లభించక ....మనం విసిగి వేసారి పోతాం .... :( 

అందుకే మనం చేయాల్సింది ఏమిటంటే ....

జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరిదగ్గర నుండి అయినా ...అభిమానం , అనురాగం లాంటివి ...ఇలా దొరకడం ఆలస్యం .....అలా ..ఒడిసిపట్టుకుని ఆస్వాదించడమే...! :) <3

Monday, September 12, 2016

శాశ్వతంగా అమెరికా వదిలి భారతదేశం వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఓ తెలుగు కుటుంబం వాళ్ళు ...

(గమనిక : ఇది క్రితం సంవత్సరం ఇదే రోజు వ్రాసిన ఆర్టికల్ ...)
---------------------------------------------------------------
శాశ్వతంగా అమెరికా వదిలి భారతదేశం వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఓ తెలుగు కుటుంబం వాళ్ళు ...

వాళ్ళ స్వకారణాలు ఏవైనా ....ఏ వైపు నుంచి తరచి తరచి చూసినా ఇది ఆనందించాల్సిన విషయమే తప్ప బాధపడే విషయం కాదు అనిపించి ....వాళ్ళకి నిన్న ఆనందంగా వీడ్కోలు చెబుదామని భోజనానికి పిలిచాం ....

చాలా కష్టపడి వంట చేయాల్సి వచ్చింది ....కష్టపడి అని ఎందుకు అన్నానంటే ...మా కారం(మమకారం) గురించి తెలిసిన కారణంగా ముందుగానే వాళ్ళు ఫోన్ చేసి ..."పిల్లలకు అస్సలు కారం లేకుండా ...., మాకు ….,మీరు తినే కారం కంటే ... కారం తగ్గించి చేయండి లక్ష్మిగారూ ...." అని రిక్వెస్ట్ చేశారు .....

నిజం చెప్పొద్దూ ఇలాంటివి నాకు అగ్ని పరీక్షలే అనుకోండి .....అయినా ధైర్యం చేసి పిల్లలకు ,మాకు మాత్రమే అనుకుని రెండురకాల వంటలు చేశా ....విచిత్రం ఏమిటంటే వచ్చాక పిల్లలు కూడా వాళ్ళ కోసం చేసినవి కాకుండా ...మేం తినే కారం హాయిగా తిన్నారు ....

"మీరు కారం చాలా తగ్గించారు లక్ష్మిగారూ ...." అన్నారు ఆశ్చర్యంగా ....

"కాదు …, మీరు ఎక్కువగా భయపడ్డారు ....."అన్నా నవ్వుతూ ....

అందరం హాయిగా తింటూ ఉన్న సమయంలో ….

మధ్యలో అతను ...."లక్ష్మి గారూ గారెలు చాలా బాగున్నాయండీ ....నూనె అస్సలు పీల్చుకోకుండా ఎలా చేయగలిగారు ....ఏదైనా చిట్కా ఉందా .....చూడు ...ఎలా ఉన్నాయో ....ఇలా చేయమని అడుగుతూ ఉంటా నేను నిన్ను ఎప్పుడూ ...."అంటూ తన భార్య వైపు చూశారు ....
ఏం జరగబోతుందో నాకు అర్ధమైంది .... :)

నేను సమాధానం చెప్పకముందే ....తనకు ఏడుపు వచ్చినంత పనైంది ...."నేను చేసినవి కూడా ఇలాగే ఉంటాయి ...." అంది ఉక్రోషంతో ....

"నువ్వు చేసినవి బాగుండవు అనలేదు నేను ...ఇవి ఇంకాస్త నాకు కావాల్సిన విధంగా ఉన్నాయి ....మనం చేసేవి కూడా ఇలా చేసుకోవచ్చు కదా అని ....తెలుసుకుందామని అడిగాను ...." అన్నాడతను సంజాయిషీ ఇచ్చే ధోరణితో .....

ఇక నేను కల్పించుకోక తప్పలేదు .....సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ...(అసలు ఎలాంటి సందర్భంలో అయినా )నేను స్త్రీలకే సపోర్ట్ చేస్తూ ఉంటా :)

"మీరు బాగా చేస్తారని మీకు నమ్మకం ఉన్నప్పుడు ..ఈ తాటాకు చప్పుళ్ళకు మీరు ఎందుకు భయపడుతున్నారు ...??!! ఒక్కసారి నవ్వుతూ ...."అలాగేనండీ ....ఈసారి నుండి ఇంతకంటే బాగా చేస్తానండీ .." అని చూడండి....మీవారి అహం సంతృప్తి పడి మళ్లీ ఒక్క మాట మాట్లాడకుండా ఎలా ఉంటారో చూడండి .... " అన్నా ...అనునయించే ధోరణిలో ...... 

తాత్కాలికమైన పరిణామాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ....దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని .... అలాంటి సందర్భాల్లో ఎలా మాట్లాడితే ఆమె ఆలోచనల్లో మార్పు తీసుకుని రావచ్చో ఆలోచిస్తూ .....

"కాదండీ ....వీళ్ళు ఎప్పుడూ ఇంతే (మగవాళ్ళు)....నేను కూడా బాగానే చేస్తాను ...." అంది తను ఏడుపు ఆపుకుంటూ ....మిమ్మల్ని పొగిడారని నాకు బాధ లేదు అని నాకు అర్ధమయ్యేలా చెప్పాలని ....

"నాకు తెలుసు ....అందుకే వాళ్ళు ఎప్పుడూ అంతే కాబట్టి ....మీ ఆలోచనల్లో మార్పు రావాలి అంటున్నాను ...మీరు కూడా ఎప్పుడూ వాళ్ళలా ఉండకండి ...ఒక్కసారి నా మాట విని అలా అని చూడండి ....అది కూడా నవ్వుతూ ...." కండిషన్ విధించి మరీ స్థిరంగా చెప్పా ....

"అలాగేనండీ …ఈసారి నుండి ఇంతకంటే చాలా బాగా చేస్తాను ...." నవ్వుతూ చెప్పింది తను తన భర్తతో ....

అతను కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు ....ఆమె చాలా హాయిగా నవ్వింది ....

నాకు కావాల్సింది కూడా అదే .... :)

హాయిగా భోజనాలు పూర్తయ్యాక ....ఇంకా సర్దుకోవడాలు పూర్తికాలేదని ...త్వరగా వెళ్ళిపోతాం అని బయల్దేరాక ....”హ్యాపీ జర్నీ” .....అంటూ వీడ్కోలు చెప్పాం ...హైదరాబాద్ వస్తే మీరు మా ఇంట్లోనే ఉండాలి అని వాళ్ళూ మనస్పూర్తిగా ఆహ్వానించారు ....

వెళ్ళే ముందు తలుపు దగ్గరకు వచ్చాక ఆమె ...."ఇదివరకు...మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు .... మీరు ఒకసారి చెప్పిన మాట నాకెప్పుడూ గుర్తొస్తుంది ....అది తల్చుకుని నేను చాలా సంతోషంగా ఉండడం నేర్చుకున్నాను .....నేనెప్పుడూ ఆ మాట మర్చిపోను ....థాంక్స్ అండీ ...." అంది నాతో ....చాలా ఉద్వేగంగా ....

"ఏమాట ....." అన్నాను ....అంత సంతోషంగా ఉంచిన మాటేమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో .....
"అదే మీరు ఒకసారి చెప్పారు ....ఇప్పుడు ,ఈ క్షణంలో ఏదైతే నా దగ్గర ఉందో ....ఏదైతే నేను అనుభవిస్తున్నానో ....అదే నా ఆస్తి . ….ప్రపంచంలో ఇంకెక్కడ ఎంత ఆస్తి ఉన్నా అదేదీ నాది కాదు ....అని చెప్పారు ...గుర్తుందా ....."అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేసింది .....

"గుర్తొచ్చింది ...." నవ్వుతూ చెప్పా ....

"అది నేను నమ్మిన సిద్ధాంతం ....అందుకే చెప్పా ...."చెప్పాను....

"అది నాకు చాలా నచ్చింది లక్ష్మిగారూ .....అలా అనుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉండగలుగుతున్నా ....." సంతోషంగా చెప్పింది ......
------------------------------------------
మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో అనేది అప్రస్తుతం .... అవి ఎవరికి నచ్చాయో ... ఎవరికి నచ్చలేదో అనేది కూడా అప్రస్తుతం ....

అవి ఒక్కరి ఆలోచనా విధానం మీద అయినా ప్రభావం చూపిస్తున్నాయా లేదా అనేదే ప్రస్తుతం .....
అదీ ....వాళ్లకు కొద్దికాలం సంతోషంగా బ్రతికేందుకు మాత్రమే కావచ్చు ...ఒక్క రోజు కావచ్చు లేదా ఒక్క క్షణం కావచ్చు ...

నాకు మాత్రం ఒక జీవిత కాలం గర్వాన్ని తెచ్చే క్షణాలు అలాంటివి ....!! :) :) :)