Monday, December 18, 2017

నాది కృతజ్ఞత చూపించే జన్మ ....వాళ్ళది కృతఘ్నత చూపించే జన్మ .

కొంతమంది కోసం ...వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ....మనం ఎన్నో పనులు చేసి ఉంటాం ....
నిజానికి అప్పుడు మనం కూడా చాలా కష్టాల్లో ఉంటాం ....అయినా చేయాలనుకుంటాం సాటి మనిషిగా ....🤔
అఫ్కోర్స్ మన సమయాన్ని వెచ్చించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా ... 😊
సరే వాళ్ళ అవసరం అయిపోతుంది ....సమస్యల్లో నుండి బయటపడి చాలా సేఫ్ గా ఉంటారు ....
వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పటి పరిస్థితుల్లో మనతో ...."నా సమస్య తీరిపోయాక నేను కూడా నీ కోసం సమయం వెచ్చించి ...సహాయం చేస్తాను" .....అని ....అంటారు
తర్వాత మన పని చేసి పెట్టమని మనం అడిగితే ....,,
ఈ రోజు చాలా బాధగా ఉంది చేయలేను అంటారు ...
మరో రోజు అడిగితే ....ఈ రోజు చాలా అలసటగా ఉంది చేయలేను అంటారు ....
తర్వాత రోజు అడిగితే ....ఈ రోజు కాస్త బద్దకంగా ఉంది చేయలేను అంటారు ....
ఇంకో రోజు అడిగితే ....ఈ రోజు చాలా సంతోషంగా ఉంది చేయలేను అంటారు ...
తర్వాత ..ఇంక వీకెండ్ వచ్చిందిగా అప్పుడు చేస్తా అంటారు ....
తర్వాత వీకెండ్ షాపింగ్ ఉంది అంటారు ....రెస్ట్ తీసుకుంటున్నా అంటారు ....
చివరకు మనకు అర్ధం అవుతుంది .....
వాళ్ళ అవసరం అయిపోయాక ...కొద్ది రోజుల్లోనే ....ఇంతకు ముందు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానా అనే విషయం మర్చిపోయారు అని ....😡
ఇలాంటి వాళ్ళు నాకు జీవితంలో చాలా మంది ఎదురవుతారు ....
అలాంటి వాళ్ళను నేను ఏం చేస్తానంటే .....,,,,,
మళ్లీ జీవితంలో ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఎదురై ...మళ్లీ నా సహాయం అర్ధిస్తే ...
మళ్లీ నేను ఇదివరకు లాగే సహయం చేస్తా ....😍😀😘😂❤️
నాది కృతజ్ఞత చూపించే జన్మ ....వాళ్ళది కృతఘ్నత చూపించే జన్మ ....🤣😀😂
ఆ తేడా ఉండాలిగా .....??!! 🤔🤣

Saturday, December 16, 2017

చింటూ అని ఓ పసివాడు ఉండేవాడు ......

చింటూ అని ఓ పసివాడు ఉండేవాడు ......
ఓ రోజు వాడు ....ఒక చాక్లేట్ తెచ్చి వాళ్ళమ్మకు ఇచ్చి దాచమన్నాడు .....ఇది ఎవరడిగినా ఇవ్వొద్దు , నేను దాచానని కూడా ఎవరికీ చెప్పొద్దు ....నువ్వు కూడా తినకూడదు అన్నాడు .....👩‍👦
సరే అని వాళ్ళమ్మ జాగ్రత్తగా దాచింది ....
కాసేపటి తర్వాత చింటూ మళ్ళీ వచ్చి , మళ్ళీ మరో చాక్లేట్ ఇచ్చి దాచమన్నాడు వాళ్ళమ్మను .....నీకు మొత్తం రెండు చాక్లేట్ లు ఇచ్చాను ....అన్నాడు .....మళ్ళీ కాసేపటికి మూడో చాక్లేట్....ఇలా కొన్ని చాక్లేట్ లు అమ్మ దగ్గర దాచుకున్నాడు ...😍
చింటూకి ఓ తమ్ముడున్నాడు ....వాడు కూడా వాళ్ళమ్మ దగ్గర ఇలాగే కొన్ని చాక్లేట్ లు దాచుకున్నాడు .....👩‍👦‍👦
చింటూ వాళ్ళ చెల్లి కూడా వీళ్లిద్దరికీ తెలియకుండా తన చాక్లేట్ లు కొన్ని దాచుకుంది ....👩‍👧‍👦
వాళ్ళమ్మ అన్ని జాగ్రత్తగా దాచి ....ఎవరివి వాళ్లకు వాళ్ళు అడిగినప్పుడు .... తిరిగి ఇస్తూ ఉండేది .....😍
అలా వాళ్ళు రోజూ ....వాళ్ళు తెచ్చుకున్న.. చాక్లేట్లు , జీడీలు , చేగోడీలు ...మొదలైనవి వాళ్ళ అమ్మ దగ్గర దాచుకుని తినేవారు ....ఇంతకూ వాళ్ళు అవి ఎక్కడినుండి తెచ్చుకుంటున్నారు అనే సందేహం కదా ....🤔
నాన్న దగ్గర , తాతయ్య దగ్గర , బామ్మ దగ్గర అడిగి తెచ్చుకునేవారు ....వాళ్ళు ఒకరిని అడిగేటప్పుడు , మరొకరు ఇచ్చిన సంగతి కానీ , అవి తమ దగ్గర ఉన్న సంగతి కానీ వాళ్లకు చెప్పేవాళ్ళు కాదు ....నా దగ్గర ఒక్క చాక్లేట్ కూడా లేదు అని అందరిదగ్గరా చెప్పేవాళ్ళు .....జాలి మొహం పెట్టేవాళ్ళు ....😥ఇక తాతయ్య బామ్మ , నాన్న వీళ్ళందరూ పిల్లలు అడిగారు కదా అని అనుకుని ఇచ్చేవాళ్ళు ....❤️
కానీ ఈ పిల్లలకు ఒక పెద్ద నమ్మకం ఏమిటంటే ....ఎక్కడెక్కడ ఏం సంపాదించుకున్నా ....అమ్మ దగ్గర దాచుకుంటే ....పదిలంగా ఉంటాయని ....అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు అని ...😍
అమ్మ కూడా ...పిల్లలు ఇచ్చింది జాగ్రతగా దాచి వాళ్ళు అడిగినప్పుడు వాళ్లకు ఇచ్చి .....ఒక భద్రత పిల్లలకు కలిగించడం తన బాధ్యత అనుకునేది .....
వాళ్ళు ఎక్కడ , ఏం చెప్పి ....అవి ఎలా సంపాదించుకున్నారో అమ్మకు తెలియదా ....పోనీలే పిల్లలు కదా చాక్లేట్ కోసం ఆశపడడం సహజం అని నవ్వుకునేది ...... ❤️
----------------------------------
కొన్ని బంధాలను కూడా నా దగ్గర కొందరు అలాగే దాచుకుంటారు ..నా మనసులో దాచుకున్న బంధాలు ఎక్కడికీ పోవు ....ఎప్పటికీ పదిలం అని వాళ్ళ నమ్మకం ...❤️😍
వాళ్ళు వాటిని ....ఎక్కడ ...ఏం చెప్పి సంపాదించుకున్నారో నాకు తెలియదా ....🤔😘నవ్వుకుని ఊరుకుంటా ...!🤣😃😂

Thursday, December 14, 2017

మబ్బులు విడిపోయినట్టు , మేఘాలు కనుమరుగైనట్టు ,

మనం అర్ధం చేసుకోలేనివాళ్ళు , మనకు అర్ధం కాని వాళ్ళు మనకు ఎదురైతే ....జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ...అనేది ఆసక్తికరమైన వాస్తవం ...😍
అయితే ....నేను ఎదురైన చాలామంది నాతో అనే మాట ఏమిటంటే ...మిమ్మల్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం, అని .....అంతెందుకు ....అత్యంత ఆత్మీయులు కూడా తరచూ నాతో ఇదే మాట అంటూ ఉంటారు ....😜
అసలు అంత అర్ధం కాకుండా ఎలా ఉంటానా అని ఆశ్చర్యపోతూ ....అర్ధం కావడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటాననుకోండి ....అది వేరే విషయం ...😘😀
విచిత్రం ఏమిటంటే వాళ్ళు నాకు తేలికగానే అర్ధమైపోతారు ....
బహుశా నేను తేలికగా అర్ధం చేసుకుంటానా ... వాళ్ళు తేలికగా అర్ధమవుతారా అనేది నేను ఇంకా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించలేదు ....🤔
అయితే ...ఈ మధ్య నా జీవితం కూడా కాస్త ఆసక్తికరంగా మారింది ....😍
కొందరిని అర్ధం చేసుకోవడం నాకు కష్టంగా ఉంది ....☝️
ఒకళ్ళు వారానికి అర్ధం అవుతారు ....ఇంకొకళ్ళు నెలరోజులకు అర్ధం అవుతారు ....మరొకళ్ళు సంవత్సరానికి అర్ధం అవుతారు ....ఫైనల్గా ఎవరైనా అర్ధం అయితీరాలి ...అవుతారు ....అనే నిజం ...నా ఆసక్తిని ఏ మాత్రం తగ్గించలేకపోతుంది .....🤔
అలా ఆసక్తికరంగా ఉండడం నాకు ఆనందంగా ఉంది .....😍
అందరూ ఇంతకుముందు నేను అర్ధం కావడం లేదని ఆస్వాదించక ఎందుకు ఫిర్యాదు చేసారో మాత్రం నాకు అర్ధం కాలేదు .....🤔
అసలు ...మనకు అర్ధం కాని.....అర్ధం చేసుకోవలసిన వాళ్ళను ....అర్ధం చేసుకున్న ప్రతిసారీ ....భలే బాగుంటుంది కదా ...😍
మబ్బులు విడిపోయినట్టు , మేఘాలు కనుమరుగైనట్టు , ఆకాశం విరగబడి నవ్వినట్టు ....చిరుజల్లై వర్షించినట్టు ...😍

జీవించడం నా అశక్తత

"నువ్వు నిజం ....వాళ్ళు అబద్ధం ...
నువ్వు వాస్తవం ....వాళ్ళు అవాస్తవం ....
నువ్వు జీవం ....వాళ్ళు నటన .....
నేను నీ వైపు రావాలి అనుకుంటాను .....కానీ వాళ్ళవైపు వెళ్తాను .....
నేను ఎంతో ప్రయత్నిస్తాను .....కానీ అశక్తకు గురవుతాను .....
నేను తప్పు మార్గం వైపు వెళ్తున్నాను అని తెలుసు ....అయినా ఏమీ చేయలేకపోతున్నా....
అందరూ నువ్వే కరెక్ట్ నేనే తప్పు అని వేలెత్తి చూపినా నేను తప్పు చేయడానికే మొగ్గు చూపిస్తున్నా ....
నువ్వే మారిపోయి .....,, నన్ను, అబద్ధం తో , అవాస్తవంతో , నటనతో.... నీ వైపు మళ్లించుకుంటే నేను తప్పు చేయాల్సిన అవసరం ఉండదు కదా ...." చాలా రోజుల క్రితం నాతో ఒకరు ....(బహుశా అన్నవాళ్లకు కూడా గుర్తు లేకపోవచ్చు ....)
"నిజమే ....అలా చేయలేకపోవడం నా తప్పే ....
నిజం కావడం , వాస్తవంగా ఉండడం ....జీవించడం నా అశక్తత .....ఇది నేను మార్చుకోలేను ...అది కూడా ఒక బలహీనతను ప్రోత్సహించడం కోసం ..నా బలాలను నిర్వీర్యం చేసుకోలేను ....నన్ను మన్నించండి ....." నా సమాధానం ...!😍