Sunday, December 18, 2016

అంతవరకు ఇక నాకు శత్రువులు లేనట్టే ..

ఇన్నాళ్లు " నీ మిత్రుడు ఎవరో చెప్పు నువ్వెవరో చెబుతాను " అనే కాన్సెప్ట్ ని ఫాలో అయిపోయి ....నేను మంచి మిత్రుల్ని ఏర్పరచుకుందాం అని డిసైడ్ అయ్యి .....అలా మిత్రులను వెదుక్కునే పనిలో ఉన్నా .....వాళ్ళ వలన అయినా నాకు మంచి పేరొస్తుంది అని ....
అయితే ఇవ్వాళ చూసిన ఒక సినిమాలో ....." నీ శత్రువు ఎవరో చెప్పు నువ్వెవరో చెబుతాను " అని మార్చి చెప్పారు ....
ఎందుకలా అంటే ....శత్రువుని బట్టి నీ శక్తి ఏమిటో నిర్ణయిస్తాను అని అర్ధం ..... :P :P
అయితే .....ముందుగా నేను నాకున్న శత్రువులు ఎవరా అని ఆలోచిస్తే ....( మధ్య శత్రువుల జాతి అంతరించింది అనుకోండి ) నాకు గుర్తొచ్చిన వాళ్ళల్లో ...ఒక్కరు కూడా నా శక్తిని చాటి చెప్పేవాళ్ళు కనపడలేదు .... :( :(
ఛీ ...ఇన్నాళ్లు వీళ్లనా నేను నా శత్రువులు అనుకున్నాను ....అని నామీద నాకే ఒకింత చిరాకు కలిగింది .... :(
అందుకే ....ఇంత చిన్న విషయంలో కూడా ఉపయోగపడని శత్రువులు నాకు అక్కర్లేదు అని వాళ్లందరినీ ఇక వదిలేయాలని నిర్ణయించుకున్నా ..... :) :P
నా శక్తికి చాటి చెప్పే శత్రువులు దొరికినప్పుడు .....అప్పుడు వాళ్ళను శత్రువులుగా పరిగణిస్తా ....
అంతవరకు ఇక నాకు శత్రువులు లేనట్టే .....! :( :( :P :P
నాలా నువ్వుండలేవు ....నీలా నేనుండలేను ...

నువ్వు నన్ను అన్నిట్లో అనుకరించగలవు ....
నాలా నవ్వగలవు , ఏడవగలవు , మాట్లాడగలవు....ఒకటేమిటి .....నేను చేసే పనులన్నీ చేయగలవు .....
కానీ నా లక్షణాలను మాత్రం అనుసరించలేవు .... :(
అవి ఎవరినో అనుసరిస్తే వచ్చేవి కాదు ....
మట్టి పిసికి , ఇటుకలుగా చేసి , మంటల్లో వేసి ఎర్రగా కాల్చి , గోడ నిర్మించినట్టు .....
చిన్నతనం నుండి ఒక్కో జీవిత సంఘటనలో నుండి నేర్చుకున్న జీవితపాఠాలను ..ఒక్కొక్కటిగా... పేర్చుకుంటూ వచ్చినవి ....
నా లక్షణాలు నువ్వు అనుసరించాలి అనుకుంటే .... నా జీవితపాఠాలు కూడా నువ్వు నేర్చుకోవాలి .....నా జీవిత పాఠాలు నువ్వు నేర్చుకోవాలి అంటే .....నా జీవితంలో నాకెదురైన సంఘటనలు నీ జీవితంలోనూ నీకు ఎదురు కావాలి .....
అవి నీకు ఎప్పటికీ రావు ..... :P
అందుకే .....నాలా నువ్వుండలేవు ....నీలా నేనుండలేను ....:P
జన్మకి ఎవరిలా వాళ్ళుండి పోదాం ....ఒప్పుకోరా బుజ్జీ ..... :) :) :P :P
జీవితంలో మనకు కొంత విచక్షణా జ్ఞానం వచ్చాక ..

మనల్ని మోసం చేసిన వాళ్లకు గానీ ,బాధపెట్టిన వాళ్లకు గానీ ....ఏదైనా కష్టం వస్తే ,బాధ కలిగితే ....అది కూడా మనల్ని పెట్టిన కష్టం ,బాధ లాంటిదే అయితే ….,,,
ఎంత కాదనుకున్నా ...ఒక్క క్షణం అయినా ......వాళ్లకు ఇలా జరగడం సరైనదే అనుకుంటాం ....
అంటే ఇక్కడ మనం చేయలేకపోయింది ,చూపించలేకపోయింది ...దానంతట అదే జరిగింది లేదా భగవంతుడే చేశాడు అనే సంతృప్తి కావచ్చు .... :(
జీవితంలో మనకు కొంత విచక్షణా జ్ఞానం వచ్చాక ....మనం అలా అనుకోలేం ...

"వాళ్ళు అలా ప్రవర్తించి మనల్ని బాధపెట్టడం అనేది ....వాళ్ళ ప్రవర్తనా లోపం ... సంఘటన ద్వారా అయినా వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను సరిదిద్దుకుంటే ....మంచి వ్యక్తులుగా ఎదుగుతారు ....లేదా వాళ్ళ ఖర్మ అనుకుంటాం ….” :) :)

మన పని మనం చేసుకుంటూ పోతే జీవితంలో ముందుకు పోతాం ..

ఒక వ్యక్తికి మనం అంటే విపరీతమైన కోపం , ద్వేషం , అసూయ .... :(
మరో వ్యక్తికి మనం అంటే విపరీతమైన ఆరాధన ,గౌరవం ,అభిమానం ... :)
కానీ ఇద్దరికీ మనతో పరిచయం లేదు .....
మరి మన గురించి ఎలా తెలుసు అంటే ...,,,,, మన పక్కనే ఉన్న వ్యక్తికి వాళ్ళు బాగా పరిచయం .... వ్యక్తి ద్వారానే వాళ్ళు మన గురించి రోజూ వింటూ ఉంటారు ....(అనుకుందాం )
"మరి ఇద్దరికీ ఒకే వ్యక్తి నుండి సమాచారం వెళ్తున్నప్పుడు ...ఒకే విధంగా మన గురించి అనుకోవాలి కదా ....??!!" అదే కదా సందేహం .....అక్కడికే వస్తున్నా ...
సమాచారం చేరవేసే వ్యక్తి ...ఒకే విషయాన్ని ...,,,ఒక వ్యక్తికి ఒక విధంగా ....మరో వ్యక్తికి మరో విధంగా చెప్తూ ఉంటారన్నమాట ...
అలా ఎందుకు చెప్తారు అని అడిగితే ...నాకు తెలిసిన కొన్ని కారణాలు ....

1. వినే వాళ్ళ మనస్తత్వాలు వేరు వేరు గా ఉండొచ్చు ....
2.
చెప్పే వాళ్ళు ఎవరి దగ్గర ఏం ఆశిస్తారో దానికి అనుగుణంగా చెప్పి ఉండొచ్చు ....
3.
మన గురించి.... ఎవరి దగ్గర ఏం చెప్తే ...చెప్పే వ్యక్తి ఆశించింది లభిస్తుందో అది ఆశించి కావచ్చు ....
4.
వినే వాళ్ళు ఏం ఆశిస్తారో అది వాళ్లకు చెప్పే ఉద్దేశ్యం కావచ్చు ....
---------------------
కాబట్టి చివరాఖరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ....ఎవరు ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం చెప్పుకున్నా సాధించేది ఏం లేదు అని మనం అర్ధం చేసుకుని ....మన పని మనం చేసుకుంటూ పోతే జీవితంలో ముందుకు పోతాం ... :) :) :)

Saturday, December 17, 2016

ఎదురుగా ఉన్నవాళ్లను వాళ్ళు ఎప్పటికీ ప్రేమించలేరు ....

మనం మనుషులుగా పుడతాం ....మనుషులుగా పోతాం ...,,

అయితే పుట్టడానికి పోవడానికి మధ్య కాలంలో మనిషి కొన్ని ముఖ్యమైన స్వకార్యాలను , పర కార్యాలను చేస్తూ ఉండడం సహజం .... :) 

అందులో మనిషికి ప్రాధమిక అవసరాల తర్వాత ....అవసరమైనది , మనిషి అనుక్షణం కావాలని తపించేది , అది లేకపోతే కష్టపడి / ఇష్టపడి సంపాదించుకునేది .... చెప్పుకోదగినంత ముఖ్యమైన స్థానం ఉన్నది  "ప్రేమ" అనేది నిర్వివాదాంశం ... <3 

ప్రేమ అంటే ఒకటే అయినా ....కాలానుగుణంగా మనుషులు దాన్ని రకరకాలుగా విభజించి ....వాళ్లకు అనుగుణంగా మార్చుకుని  ... ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రేమిస్తూ ఉంటారు ....ఆశిస్తూ ఉంటారు ....అనేది ప్రేమెరిగిన సత్యం  .....

నాకు కొందరి ప్రేమ చూస్తే ....చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది .....వింతగానూ అనిపిస్తుంది .....అసలు అది ప్రేమ అంటారా అని తెలియని అయోమయం లోకి వెళ్ళిపోతూ ఉంటా ....కానీ సదరు వ్యక్తులు ఇది ప్రేమే అని మనసు గిల్లి మరీ చెబుతూ ఉండడం వల్ల సందిగ్ధావస్థలో కొట్టు మిట్టాడుతూఉంటా ....

------------------------------------------------

గత కొన్నేళ్లలో అలాంటి సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ...నా మదిలో ప్రశ్న ఉదయించింది .... 

అదేమిటంటే ....

కొందరు... వాళ్ళ జీవితకాలంలో ... ,,,,

- వాళ్ళ దగ్గరున్నవాళ్లను అస్సలు ప్రేమించరు....దూరంగా ఉన్నవాళ్లను కడవలు కడవలు ప్రేమిస్తారు ............

- దగ్గరున్నవాళ్ళ మొహం కూడా చూడరు .....దూరంగా ఉన్నవాళ్ళను ఆణువణువూ చూడాలని పరుగులు తీసుకుంటూ వెళ్తారు ....

- దగ్గరగా ఉన్న వాళ్ళు దూరమైనప్పుడు ప్రేమిస్తారు .....దూరమైన వాళ్ళు దగ్గరైనప్పుడు ప్రేమించలేరు ....

- దగ్గరున్నవాళ్ళు దూరమైనప్పుడు దగ్గరవ్వాలనుకుంటారు .....దూరంగా ఉన్నవాళ్లు దగ్గరైనప్పుడు దూరం కావాలని చూస్తారు .... 

- మొత్తానికి వీళ్ళు ప్రేమించాలి అంటే .....వీళ్లకు ఒక ఆరడుగుల దూరంలో  ఉండాలి ....(ప్రేమించబడకూడదు అంటే ....అరడుగు దూరంలో ఉంటే చాలు  ....)

- అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేశామా .....ఏం కాదు ....వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు ....ఆరడుగులు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది అన్నట్టు ....

ఎందువలన, ఎందువలన, ఎందువలన ....అనే ప్రశ్న నన్ను ఆలోచింపజేసింది ..... 

లక్షణాలు ఎందుకో మానవ జీవితానికి భిన్నంగా అనిపించాయి ..... :( 

మనం అంటూ భూ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు , మన చుట్టూ కొన్ని వింత లక్షణాలు ఉన్న జీవులు బ్రతుకుతున్నప్పుడు ...., వాళ్ళు మానవ సమాజానికి భిన్నమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ...వాళ్ళు జన జీవన స్రవంతిలో కలవలేకపోతున్నప్పుడు ....బాధ్యతాయుతమైన పౌరులుగా మనం వారి మీద పరిశోధన చేసి , అందుకు గల కారణాలు కనుగొని .....వీలైతే / ఉంటే వారికి పరిష్కార మార్గాలు చూపించాలి కాబట్టి ....నేను కూడా ....
నా బాధ్యతలో భాగంగా ....అలాంటి వ్యక్తులు  నాకెదురైనప్పుడు , వాళ్ళని  అన్వేషించి ...  జీవిత సత్యం తెలుసుకున్నాను .....

సమాధానం ఎంతో కొంత దొరికిన సంతృప్తి కలిగింది ...

అయితే ఇదే సరైన సమాధానం కాకపోవచ్చు , అలా అని అవనూ వచ్చు ....ఏది ఏమైనా సమాధానంతో సంతృప్తి అయితే చెందను....మళ్ళీ అవకాశం దొరికితే భవిష్యత్తులో మరి కొన్ని విషయాలు తెలుస్తాయేమో అన్వేషిస్తూ మాత్రం ఉంటా ...

-----------------------------------------

ప్రస్తుత అన్వేషణలో బయటపడిన విషయం ఏమిటి అంటే .....,,,,

"ఎదురుగా ఉన్నవాళ్లను వాళ్ళు ఎప్పటికీ ప్రేమించలేరు ....దూరంగా ఉన్నవాళ్లను మాత్రమే ప్రేమించగలరు .....(ప్రేమిస్తున్నాం అని భ్రమ పడగలరు)"

ఎందువలన అనగా ....

వాళ్ళ లోపాలను ...ఎదురుగా ఉన్నవాళ్లు స్పష్టంగా చూడగలరు ... వీళ్ళకున్న లోపాలు వాళ్లకు వాళ్ళే అసహ్యించుకునే లోపాలు అయిన కారణంగా ....ఎదుటివారు కూడా తప్పనిసరిగా అసహ్యించుకుంటారు అని వీరు బలంగా నమ్ముతారు ....

అందుకే ఎదుటి వాళ్ళు దగ్గరకు వచ్చే కొద్దీ వీళ్ళు భయపడి దూరంగా పారిపోతారు ....

మరి వీళ్ళు దూరంగా ఉన్నవాళ్లను ప్రేమిస్తున్నారు కదా అని అనుకుంటే ....వాళ్లు కూడా అదే భ్రమలో ఉండి పరుగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు ....కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే గాలి తీసిన బెలూన్ లా వీళ్ళ ప్రేమ తుస్సుమంటుంది .... స్థానంలో మళ్ళీ భయం చోటు చేసుకుంటుంది .....ఎక్కడ వీళ్ళ లోపాలు కనిపిస్తాయో అని ....వీళ్లకు వీళ్ళే వాళ్లకు దూరమవుతారు ....

అప్పుడు వీళ్లకు, ఇంతకు ముందు దగ్గర ఉన్నవాళ్లు దూరంగా ఉన్నారు కాబట్టి  వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది ....(ప్రేమించే అవసరం కలుగుతుంది ....).అప్పుడు వాళ్ళ లోపాలు వీళ్లకు కనిపించవు కాబట్టి అనుకోండి .....
ఇంకా కాస్త ముందుకు వెళ్లి ...వాళ్లలో లోపాలు చూసి అయితే వీళ్ళు అసహ్యించుకుంటారని ఇంతకు ముందు భయపడ్డారో .....అవి ఇప్పుడు నాలో లేవు అని, వీళ్ళను... దగ్గరకు వచ్చే ముందే నమ్మించాలని చూస్తారు .....అప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూడలేరు కాబట్టి ....చెప్పింది నమ్మి , వాళ్ళు ప్రేమిస్తారని ఆశ పడతారు .... :( 

వీళ్ళ దగ్గరకు వచ్చాక వాళ్ళు ....వాళ్ళ దగ్గరకు వెళ్ళాక వీళ్ళు ....వీళ్లో, వాళ్ళో దగ్గర ఉంటే దూరంగా ఉన్న మరొకరు .....

వీళ్ళు జీవితంలో ఎప్పటికీ ఎవరికీ దగ్గర కాలేరు .....ఎందుకంటే ....వాళ్ళే వాళ్లకు ఎప్పుడూ దగ్గర కాలేరు .....వాళ్లంటే వాళ్లకు కూడా భయం కాబట్టి .....

వీళ్ళ ప్రేమ వీళ్లకు ఎప్పటికీ ఎండమావి లాంటిదే ..అల్లంత దూరంలో కనిపించినట్టు అనిపిస్తుంది ....దగ్గరకు వెళ్తే వెక్కిరిస్తుంది .....

ప్రేమ కోసం వీళ్ళ అన్వేషణ ఎప్పటికీ పూర్తి కాదు .....ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటారు ....అలానే జీవితం ముగిసిపోతుంది అనేది వాళ్ళు జీర్ణించుకోలేని చేదు వాస్తవం .... :( :( 

విచిత్రం ఏమిటంటే ప్రేమ వీళ్ళ దగ్గరగానే ఉంటుంది ....అది వీళ్లకు కనిపించదు(చూడలేరు ....) ....దూరంగా ఉన్న ఎండమావినే చూస్తూ ప్రేమ అనే భ్రమలో వెళ్లడం , అందుకోవాలని ప్రయత్నించడం , ఆశాభంగానికి గురికావడం వీళ్ళ జీవితచర్య ..... :( :( :( 

--------------------------------------------

మరి వీళ్ళ జీవితం ఇలా ముగిసిపోవలసిందేనా ....??!! పరిష్కారమే లేదా ??!! అని సందేహం కలగడం సహజం  .....

ఎక్కడైతే సమస్య ఉంటుందో ...అక్కడ తప్పనిసరిగా పరిష్కారం ఉంటుందనే నమ్మకం తో ఆలోచిస్తే ఒకే ఒక్క పరిష్కారం దొరికింది ..... :) 

"వాళ్ళు వాళ్ళ లోపాలను సరిదిద్దుకుని ....ముందు వాళ్ళను వాళ్ళు ప్రేమించుకుంటే ....ఎదుటివాళ్ళ ప్రేమ ను గుర్తించగలరు అని అర్ధమైంది ...." :) 

లోపాలు దాచి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటూ బ్రతికినంత కాలం ....ఎవరికీ వాళ్ళను వాళ్ళు చూపించుకోలేరు .....ఎదుటివాళ్ళ ప్రేమను చూడలేరు ...లేని ఎండమావి ప్రేమ కోసం వాళ్ళ అన్వేషణ అంతం కాదు .. :( 

-----------------------------------------

మరి ఇంకా ఆలస్యం ఎందుకు...??!! 

వాళ్ళే అసహ్యించుకునే వాళ్ళ లోపాలను వాళ్ళు సరిదిద్దుకోవడానికి శ్రీకారం చుడతారని... జీవితంలో ఒక్క క్షణం అయినా ప్రేమను పొందగలరని, ప్రేమను ఇవ్వగలరని.... ఆశిస్తూ .....

ప్రేమస్తు ....!! <3 <3 <3 

----------------------------------------

(గమనిక : నేను సైకాలజిస్ట్ ని కాదు ....నా జీవితంలో నాకెదురైన వ్యక్తులను గమనించిన విషయాలు ....వాటిపై నా అభిప్రాయాలు వ్రాస్తూ ఉంటా ....)

Wednesday, December 14, 2016

అమ్మ , నాన్న తర్వాత నాకెదురైన రెండో వ్యక్తి ఈమే ....!

ప్రపంచంలో మనకు రోజూ ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు ...అందరినీ పలకరిస్తాం ...లేదా వాళ్ళు మనల్ని పలకరిస్తారు ....అంతే ....వాళ్ళు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి వాళ్ళవైపు మళ్ళీ మనం చూడం ....వాళ్ళు మనవైపు చూస్తారో లేదో తెలియదు .....బహుశా అరుదుగా చూడాలని అనిపించొచ్చు ....

ఒకవేళ అలా వాళ్ళను మళ్ళీ చూడాలనిపిస్తే  ....చూశాక ఇంకా ఇంకా వాళ్ళను పదే పదే చూడాలనిపిస్తే  ....వాళ్ళను అలా చూస్తూనే ఉండాలనిపిస్తే ....ఆహా ఎంత అద్భుతమైన హృదయం ఉంది వీళ్ళకి అని అనిపిస్తే .....అలాంటి వాళ్ళు మనకు తారసపడితే ....వాళ్లకు మీరు అద్భుతమైన వ్యక్తి అని చెప్పాలనిపిస్తే .....???!! 

అంతకంటే అదృష్టం లేదని అనుకుంటూ ఉంటా నేనైతే .....అదే మాట రోజు ఒకరితో చెప్పా .....!!

----------------------------------------

ఆమె అక్కడ హాస్పిటల్ లో సిస్టర్ ....

ఆమెని నేను చాలా రోజుల క్రితం చూశాను ....ఒక చిన్న రెండేళ్ల పాపను పలకరిస్తుంటే .....,,,

వాళ్ళ అమ్మ పాపను బాత్ రూమ్ కి తీసుకుని వెళ్ళడానికి అక్కడున్న వాళ్ళను Key అడిగింది ....ఆమె Key తీసుకుని వచ్చి ....వాళ్ళ అమ్మకు Key ఇచ్చింది ....వాళ్ళ అమ్మ ఫోన్ లో మాట్లాడుతుంటే ....
"పర్వాలేదు మీరు మాట్లాడండి ....నేను తీసుకుని వెళతాను పాపను" అని నవ్వుతూ అడిగింది ....
వాళ్ళ అమ్మ "థాంక్స్ ....నేను వెళతాను" అంది ....
నవ్వుతూ సరేనని చెప్పింది ....

చెప్పడంలో , పంపించడంలో ఉన్న భద్రత చూసి ....ఎంత బాగా పలకరిస్తుంది అనుకున్నా క్షణం .....

------------------------------------------

రోజు ...ఆమె ...కాసేపాగాక నన్ను రిసీవ్ చేసుకుంది ....ఓహ్ ఈమే నన్ను చూసుకోబోయే సిస్టర్ అనుకున్నా ....

నేను లోపలికి వెళ్ళాక నా హెల్త్ హిస్టరీ సిస్టం లో ఓపెన్ చేసింది .....అంతా చూసింది ....నేను ట్రీట్ మెంట్ కోసం వచ్చానో నిర్ధారణ చేసుకుంది ....అంతకు ముందు ఉన్న పరిస్థితి అంతా అడిగి తెలుసుకుంది ....
తర్వాత నా అంచనా తప్పు కాలేదు ....ఆమె అద్భుతమైన వ్యక్తి అని ఆమె ప్రతి మాటలో ప్రతిబింబిస్తూనే ఉంది ....నేను నా ట్రీట్మెంట్ సంగతి మర్చిపోయేలా చేసింది ఆమె ....ఆమె ప్రతి కదలికను గమనించడమే నా పనిలా మార్చింది ....

ఆమె సుశిక్షితురాలైన సైనికురాలు ....
ఆమె చేసే పని మీద ఆమెకు పూర్తి అవగాహన కలిగి ఉంటుంది ....ప్రతి చిన్న అంశం ఆమె పరిగణలోకి తీసుకుంటుంది .....డాక్టర్ రాకముందే డాక్టర్ ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా వివరించింది ....డాక్టర్ వచ్చాక ఏం చేయాలో డాక్టర్ తో చర్చించింది ....అందుకు తాను ఏం సిద్ధం చేసుకోవాలో చక చకా సిద్ధం చేసుకుంది .....ఇక అక్కడనుండి ఆమె యంత్రంలా పని చేసుకుంటూ పోయింది ....ఆమెకు డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ....డాక్టర్ అడగకముందే అన్ని తెలిసినట్టు ముందే అందుకుంటుంది .....ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నట్టు ... తర్వాత డాక్టర్ ఏం చేయబోతున్నారో ముందే తెలిసినట్టు .....ఇప్పుడు ఇది చేయబోతున్నారు కదా అని అడుగుతుంది ....అలాంటి సందర్భంలో పేషంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆమె గమనించడం మర్చిపోదు....

అనస్థీషియా ఇచ్చేటప్పుడు, ఇంజక్షన్ చేసేటప్పుడు మనకు ముందే చెబుతుంది ....అది డాక్టర్ బాధ్యతే అయినా ....అది మనకు ఎంత నొప్పి కలిగించబోతుంది అని ....ఎక్కడ చేస్తున్నారు అని ....

పేషంట్ ఎలా ఫీల్ అవుతాడు అనేది ఆమెకు తెలిసినంతగా డాక్టర్ కు కూడా తెలియదు ....

ఆమె మనకు ఇస్తున్న ట్రీట్మెంట్ గురించి మనకంటే ఎక్కువగా డాక్టర్ ని అడిగి తెలుసుకుని తర్వాత మనకు వివరిస్తుంది ....

ఇదంతా చేస్తున్నప్పుడు ఆమె చిరునవ్వు చెక్కు చెదరదు....అంతా అయిపోయాక నవ్వుతూ వీడ్కోలు చెప్పేవరకు ఆమె కంటికి రెప్పలా మనల్ని చూసుకుంటుంది .....

ఎందుకో ఆరోజు నేను గమనించాను కానీ ....నేను వెంటనే స్పందించలేకపోయాను....ఇంటికొచ్చి నిద్రపోయి లేచాక ఆమె గుర్తొచ్చింది .....అద్భుతంగా అనిపించింది ....ఆమె మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంది ....
ఓహ్ మళ్ళీ కలవబోతున్నాను కదా అనుకున్న తర్వాత ఒకింత నిశ్చింతగా అనిపించింది .....

--------------------------------

రోజు మళ్ళీ కలిశాను ....అదే పలకరింపు .....ఏమీ మార్పు లేదు .....

నా పేరు శ్రీలంక ను పోలి ఉందని .....ఎలా పలకాలి అని అడిగింది .....నేను రాకముందే ప్రాక్టీస్ చేశాను అని పలికి చూపించింది ....నేను నవ్వి ...శ్రీ అని పిలవమని చెప్పాను....వాతావరణం రేపు ఎలా ఉండబోతుందో చెప్పింది .....చాలా చలిగా ఉంటుంది జాగ్రత్తగా ఉండమంది .....

రోజు ట్రీట్మెంట్ మధ్యలో డాక్టర్ బ్రేక్ లో ...ఎలా ఉంది అని అడిగింది .....

అవకాశం దొరికింది కదా అని ....ఆమె గురించి అడిగాను ....

ఇథియోపియా నుండి వచ్చిందట .....ఆమె పేరు అడిగాను, చెప్పింది ....

నీలాంటి హృదయం కలిగిన వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు ....నీ హృదయం ఎంతో అందంగా ఉంది అని చెప్పాను .....నీ హృదయం నిండా దైవత్వమే నిండి ఉంది అని చెప్పాను ....

కాస్త సిగ్గుపడింది .....(పొగిడితే వచ్చే అందమైన సిగ్గు <3 ) నేను నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అని చెప్పింది ....

కాదు నీ బాధ్యతను నువ్వు ఎంతో ప్రేమగా చేస్తున్నావు ....అలా బాధ్యతను  ప్రేమించేవాళ్లను నేను నా జీవితంలో అతి కొద్దిమందిని చూశాను అని చెప్పాను  ....

నీ దగ్గర ప్రతి ఒక్కరికీ అందమైన నందనవనాన్ని నిర్మిస్తున్నావు ....అది అందరికీ సాధ్యం కాదు ....నువ్వు అద్భుతమైన వ్యక్తివి .....అని చెప్పా ....

ఫోటో తీసుకోవచ్చా అని అడిగి తీసుకున్నా ....ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది .....

అంతలో డాక్టర్ వచ్చారు ....అడిగితే ఆమె గురించి చెప్పా .....

"ఓహ్ రోజు తను నిద్రపోదు.... " అన్నాడు నాతో ఏకీభవించి నవ్వుతూ ....

అది నా అదృష్టం, ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటాను ...అంతే ... అంది ఆమె నవ్వుతూ ....

కాదు ఇలాంటి వాళ్ళను నా జీవితంలో కలిసే అవకాశం రావడం ....వాళ్లు నాకు ఎదురుపడడం నా అదృష్టం అని చెప్పా ....

----------------------------

రోజు నిద్రపోయి లేచాక కూడా ఆమె గుర్తొచ్చింది .....మళ్ళీ కలుస్తాను అని గుర్తొచ్చి నిశ్చింతగా అనిపించింది .....

--------------------------------

కొంతమంది దగ్గర అంతే .....మన ప్రాణాలు వాళ్ళ చేతుల్లో పెట్టి మనం నిశ్చింతగా కాసేపు మన ఆత్మను జో కొట్టొచ్చు అనిపిస్తుంది ..... కాసేపు మన ఆత్మకు వాళ్ళు కాపలా ఉండి....మళ్ళీ మనకు భద్రంగా తిరిగి అప్పగిస్తారని మనకు నమ్మకం కలుగుతుంది .....వాళ్ళ హృదయానికి మన హృదయం అర్పించి మనల్ని మనం మర్చిపోయేలా చేస్తారు ఇలాంటి వ్యక్తులు .....

అలాంటి వ్యక్తులను మనం అరుదుగా కలుస్తాం ..... జీవిత కాలంలో ఎంతమంది అలాంటి వ్యక్తులు మనకు ఎదురవుతారు అనేది మన అవకాశం /అదృష్టం ....నిర్ణయిస్తుంది ....


అలా ...నా జీవితంలో ...నాకు ... అమ్మ , నాన్న తర్వాత నాకెదురైన రెండో వ్యక్తి ఈమే ....!