Sunday, February 28, 2021

క్వారంటైన్ హాలిడేస్ అలా గడిచాయన్నమాట ...!








 మా నాయనమ్మ చెప్పేది ...

"ఉప్పూ ...కారం ...వేసి ..తాలింపు వేస్తే ...గడ్డి కూడా కూరే ...రుచిగానే ఉంటుంది అని ..."
అదే సూత్రం నేనెప్పుడూ ఫాలో అవుతూ ఉంటా ...కిచెన్ రూమ్ లో ....
అంటే ...గడ్డి కూర చేస్తానని కాదు ....
కానీ ...నేను చేసే రెసిపీ నాకే గుర్తుండదు ఒక్కోసారి ...
ఏది అందుబాటులో ఉంటే అదే పడేస్తూ ఉంటా ...ఇదే రెసిపీ ఉండాలి దీనికి ....ఇలాగే చేయాలి అని ఫిక్స్ అవను...
అందుబాటులో ఉన్నవాటిలో ...ఆ కూరలో ఏం వేయగలిగితే అది వేసి చేసేస్తా ..
ఇప్పటివరకూ అందరూ ఏం వంకలు పెట్టకుండా బాగానే తినడం వలన ....నేనూ ఆ పద్ధతి తప్పు అని ఎప్పుడూ అనుకోలేదు ...
నేను వంట మొదలుపెట్టాక వెతుక్కుంటా ఏమున్నాయో ఏం లేవో .... పిల్లలు అలా కాదు ...అందులోకి కావాల్సిన పదార్ధాలన్నీ తెచ్చుకుని ...వంట చేయడం మొదలు పెడతారు ...
నేను ఉజ్జాయింపుగా ఉప్పు కారం వేసేస్తా ....ఉప్పు కారం రుచి చూసే అలవాటు కూడా లేదు ...అదే సరిపోతుందిలే అనుకుంటా ....
పిల్లలు అన్ని కొలతల ప్రకారం వేసుకుని ....వీడియోలో ఆలా చెప్పారు ...ఇలా చెప్పారు అంటారు ...
నేను ఏ విధమైన డెకరేషన్ లు చేయను ...వాళ్ళు ఆకర్షణీయంగా ఉండేలా అలంకరణ చేస్తూ ఉంటారు ...
ఇలా ..నాదొక స్టైల్ వాళ్ళదొక స్టైల్ అన్నట్టు వంటలో ...
మా అయన మా అందరికంటే డిఫరెంట్ స్టైల్ లో చేస్తారు ...అది వేరే టాపిక్ అనుకోండి ....
అయితే ఇదిలా ఉంచితే ....లాస్ట్ ఇయర్ ....క్వారంటైన్ మొదలైన కొత్తలో ...నా డాటర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చింది ....
వచ్చింది మొదలు ...పాపం ఎక్కడికీ వెళ్లే వీలే లేదు ....మాస్క్ పెట్టుకుని వెళ్ళమన్నా కూడా తనకు మా మీద ఉన్న కన్సర్న్ వలన ... మాకెక్కడ కరోనా వస్తుందో అని భయపడి ...ఇంట్లోనే ఉండిపోయింది ...
అయితే ...
ఇంట్లో ఉండడం వలన ....ఇంట్లో చేసుకునే ఆర్ట్ వర్క్ చేసుకోవడం, కుకింగ్ ...రీడింగ్ ...ఇలాంటివేవో చేసుకునేది ...
ఆర్ట్ వర్క్ అంటే ...ఒకసారి బయటికి వెళ్లి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవచ్చు ...కానీ వంట అలా కాదు .... ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవాలి ....
పైగా పిల్లలు చేసే డిషెష్ డిఫరెంట్ ....అందులో ఏ సాస్ ...కెచప్ లాంటివి తక్కువైనా రుచిగా ఉండవు (అని వాళ్ళ ఫీలింగ్ )
అందులోనూ నా డాటర్ కి ...త్రీ మినిట్స్ రూల్ ఒకటి ఉంది ....మూడు నిమిషాల్లో తనకు కావాల్సిన వస్తువు కిచెన్ లో కనిపించకపోతే ....వెంటనే షాప్ కి వెళ్లి కొనాల్సిందే ....
అయితే ....ఈ రూల్ క్వారంటైన్ లో వర్కౌట్ కాదు అని నాకు అర్ధమైంది ....
అందుకే ...మా నయనమ్మలాగా ....నేను కూడా తన మైండ్ ని కాస్త ట్యూన్ చేశా ...
"నీకు కావాల్సినవి తెచ్చుకుని ...అన్ని ఉంటే రుచికరమైన వంట చేయడం క్రియేటివిటీ కాదు ....నీకు ఇంట్లో ఉన్నవి ..అందుబాటులో ఉన్నవి వాడుకుని ...రుచికరమైన వంట చేయడం క్రియేటివిటీ ...అలా చేయడానికి ప్రయత్నించు ....రోజూ ఇలా షాప్స్ కి వెళ్లడం ఈ టైం లో సేఫ్ కాదు" అని చెప్పా ....
ఇంకా కాస్త మసాలా జోడించి ...."నువ్వు ఎక్కడైనా అడవుల్లో చిక్కుకుని పోయి ...అక్కడ దొరికే ఆకుల్లాంటివే తినాల్సి వస్తే ..."అప్పుడెలా ఆలోచిస్తావు ... అని కూడా అడిగా ...
పిల్లలు చాలా షార్ప్ ...నేను చెప్పినదాని గురించి ఆలోచించడమే కాదు ...ఆచరణలో కూడా పెట్టింది ...
ఫలితం ...
ఎన్నో రుచికరమైన డిషెస్ చేసి వాటిని డెకరేట్ చేసి మరీ నాకు అందించేది ....
ఒక స్పూన్ తినేవరకు వెయిట్ చేసి ...మెరిసే కళ్ళతో ...నేను మెచ్చుకుంటే ...ఎంతో సంతోషపడిపోయేది ...
"థాంక్స్ మమ్మి ....నువ్వలా చెప్పడం వలన నా స్వంత రెసిపీస్ నేను క్రియేట్ చేసుకోగలిగా ...ఇప్పుడు ఇంకా తృప్తిగా ఉంది ....ఒక డిష్ చేసినప్పుడు ...ఒక ఆర్ట్ క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ..." అని హాలిడేస్ లాస్ట్ లో చెప్పింది ...
నాకూ హాపీ గా అనిపించింది ....
నిజమే వంట చేయడం అనేది ఒక ఆర్ట్ ...అదీ మన స్వంతంగా తయారు చేస్తే ఇంకా ఆ సంతృప్తే వేరు ...
అదిగో ఆ క్వారంటైన్ హాలిడేస్ అలా గడిచాయన్నమాట ...!
గమనిక : ఈ పిక్స్ లో ఉన్న డిషెస్ / ఆర్ట్ వర్క్ ..అన్ని నా కూతురు తయారు చేసినవే ...అన్ని నాకు ఫెవరెట్ డిషెస్ ...












నాకు అర్ధమైంది ...రాముడికి సీత లా ఉండడం ఎంత కష్టమో ...

 నాకు తెలిసిన ...రాముడు , సీత అనే భార్య భర్తలున్నారు ...

అంటే ...ఆ రాముడు సీత కాదు ...వీళ్ళ పేర్లు యాదృచ్చికంగా రాముడు సీత అయ్యాయి అన్నమాట ...
ఆఫ్కోర్స్ ...ఆ పేర్లలో ఉన్న మహాత్మ్యం కానివ్వండి ...లేదా వీళ్ళు ఆ పేర్లు పెట్టుకోవడం వలన వాళ్ళ గుణాల్ని పుణికిపుచ్చుకోవడం కానివ్వండి ....వాళ్ళు నిజంగానే గుణగణాల్లో రాముడు సీతలా ఉండేవారుట ...
కానీ ఆయన రాముడిలా ఉండడం వలన ఈవిడ సీతలా ఉండడం వలన సంసారం అనే బండి సాఫీగా సాగలేదు ...
"ఆయన రాముడిలాగే ఉండడం వలన నేను శూర్పణఖలా మారాల్సి వచ్చింది" ఒక సందర్భంలో తను నాతో ...
నాకు అర్ధమైంది ...
ఎందుకు తను సీతలా ఎందుకు ఉండలేకపోయిందో ....
నాకు అర్ధమైంది ...శూర్పణఖలా మారడానికి తను ఎంత బాధ పడిందో ...
నాకు అర్ధమైంది ...రాముడికి సీత లా ఉండడం ఎంత కష్టమో ...
నాకు అర్ధమైంది ...
ఎంత మంది సీతల త్యాగఫలమో ఈ రాముళ్లు అని .... !🙏