Wednesday, April 26, 2017

మనిషి నిజాన్ని నిజం అని అంగీకరించనంత కాలం ...

మనిషి నిజాన్ని నిజం అని అంగీకరించనంత కాలం ...,,
దాన్ని అబద్ధంగా మార్చడానికి ....ఆ అబద్ధం మీద ... పునాదులు కట్టి, అందమైన భవనాలు నిర్మించి ....నిజాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ....
అంగీకరించాక ....,,,,
ఆ నిజం జీర్ణించుకోవడానికి జీవితకాలం ప్రయత్నిస్తూనే ఉంటాడు ... !!

కొంతమందికి మేం చాలా మంచివాళ్ళం అని

కొంతమందికి మేం చాలా మంచివాళ్ళం అని ,వీలైతే దేవుళ్ళం అని ఒక బలమైన నమ్మకం ఉంటుంది ....
ఏం తప్పులేదు ....ఇది వాళ్లకు అవసరం .... :)
అయితే పక్కన ఉండి రోజూ గమనించే వాళ్లకు ...వాళ్ళెంత దుర్మార్గులో తెలుస్తూనే ఉంటుంది .... కానీ ...వీళ్ళకు వాళ్ళ దుర్మార్గాల్ని కూడా బయటపెట్టలేని మంచితనం (అనుకుంటూ ఉంటారు ) ఉంటుంది .....
ఇది కూడా తప్పులేదు ...ఇది వీళ్ళకు అవసరం .... :)
సపోజ్ ....ఫర్ సపోజ్ ....
ఎవరెలా పోతే మనకెందుకు .... పోనివ్వండి ....వేరే చాలా పనులున్నాయి ...అనుకున్నా .....,,,,,,
మనం పక్కనే ఉండి .., వాళ్ళల్లో ఎంత దుర్మార్గం ఉందో ప్రపంచానికి తెలియజేయకపోయినా ....కనీసం వాళ్ళకైనా తెలియజేయకపోతే ....,వాళ్లకు,తద్వారా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ....
ఇది చాలా తప్పు ... ఇది మనకు అనవసరం ..... :(
అందుకే సాధ్యమైనంత వరకు అలాంటి దుర్మార్గాల్ని బయటపెడదాం ... వాళ్లకు వాళ్ళ గురించి తెలిసేలా చేద్దాం ..... :) :)
ఆల్ ద బెస్ట్ .. :) :)

Sunday, April 23, 2017

తెలియని విషయాన్ని తెలియదు అని చెప్తే మాత్రం జనం చిత్ర విచిత్రంగా నవ్వుతారు ....🙃

తెలిసిన విషయం తెలియదు అని చెప్పడం చాలా తేలిక ....
తెలియని విషయాన్ని తెలుసు అని చెప్పడం చాలా కష్టం ....
తెలిసిన విషయం తెలియదు అని చెప్తే మేధావి అంటారు ....

తెలియని విషయాన్ని తెలుసు అని చెప్తే కూడా మేధావి అనే అంటారు ....
తెలిసిన విషయం తెలుసు అని చెప్తే కూడా మేధావి అనే అంటారు ....
కానీ ..., తెలియని విషయాన్ని తెలియదు అని చెప్తే మాత్రం జనం చిత్ర విచిత్రంగా నవ్వుతారు ....
ఎందుకో అర్ధం కాదు ... 
బహుశా అందుకేనేమో ....చాలా మంది తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పలేరు .... 
అది తెలిసినట్టు నటించడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటారు ... 
బహుశా కొన్ని సందర్భాల్లో మనుగడకు అలా నటించడం అవసరం కావచ్చు ....
కానీ అవసరం లేనప్పుడు నటించాల్సిన అవసరం ఏముందా...??!! అని ఆలోచిస్తూ ఉంటా ....
తెలియని విషయం తెలియదు అని మనం చెప్పినప్పుడు ఎవరు నవ్వుతారు అని పరిశీలిస్తే ....,,,,,
ఆ విషయంలో వాళ్లకు మన కన్నా ఎక్కువ విజ్ఞానం ఉంటే వాళ్ళు నవ్వుతారు .... అసలే విజ్ఞానం లేనివాళ్లు కూడా నవ్వుతారు ... (అందరూ కాదు )
నాకు ఈ విషయం తెలియనంత మాత్రాన ....నవ్వాలా ...??!! అని ఆలోచిస్తాం .....
మనకు గనక అంతర్గతంగా మన మీద నమ్మకం ఉంటే ఆ నవ్వుల్ని మనం లెక్కచేయల్సిన అవసరం ఉండదు .....అనుకోండి ...అది వేరే విషయం ...
అయితే నన్ను చూసి కూడా కొందరు నవ్వుతూ ఉంటారు ....
నాకు తెలియదు అని నిజాయితీగా చెప్పినప్పుడు ....
వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ....,,,
తెలిసిన విషయాల మీద నా అభిప్రాయాలు బలంగా ఉంటాయి ....అవి నాకు తెలుసు అని ...,,,,
తెలియని విషయాల మీద కూడా నా అభిప్రాయాలు బలంగా ఉంటాయి ....అవి నాకు తెలియవు అని ....
మొత్తానికి అభిప్రాయం అనేది ఎప్పుడూ బలంగా ఉంటుంది అన్నమాట ....
ఇది వాళ్లకు తెలియదు అని వాళ్ళు నాకు చెప్పరు....
ఒకవేళ చెప్పినా నేను నవ్వను ...

Sunday, April 16, 2017

ఏదీ కోరుకోకపోవడం....సొంతం చేసుకోవాలనే కోరిక లేకపోవడం ....వ్యామోహ పడకపోవడమే ...

ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే నేను ధనవంతుడిని / ధనవంతురాలిని అనే భావం మీకెప్పుడైనా కలిగిందా ....??!!
ఒక్క క్షణం అయినా కలిగిందా ....నిజంగా అలాంటి ఫీలింగ్ కలిగితే ....ఓహ్ ....అద్భుతంగా ఉంటుంది కదూ .... ??!!
========================
గత కొన్ని రోజులుగా .....నేను చేతి గడియారం పెట్టుకోవడం మానేసాను అని ఈ మధ్యే గమనించాను .........
అది నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న చేతి గడియారం ....బయటకు వెళ్లేప్పుడు నేను పెట్టుకునే ఒకే ఒక్క విలువైన ఆభరణం అదొక్కటే ప్రస్తుతం ....
ఇక్కడ పాంట్ షర్ట్ లే వేసుకుంటాం కాబట్టి ఏం పెట్టుకోకపోయినా ...మెడ మీద, నుదురు , చేతులు తదితర భాగాలు బోసిగా అనిపించవు .....అందుకే ఒక్క గడియారం పెట్టుకుంటూ ఉంటా ....అయితే గత కొన్ని రోజులుగా పెట్టుకోవడం మానేశా అనే విషయం తర్వాత గమనించాను ....
గుర్తొచ్చి పెట్టుకోవాలని గడియారం దగ్గరకు వెళ్లడం ....నవ్వి దానివైపు చూసి అక్కడే వదిలేసి వెళ్లడం జరుగుతుంది .....ఎందుకు అలా అనిపిస్తుంది నాకు ..అని ఆలోచించా ....
ఆలోచనకు అందలేదు ......
ఈ క్రమంలోనే ...మొన్నా మధ్య షాపింగ్ కి వెళ్ళా ....
(ఈ షాపింగ్ కి వెళ్ళడానికి కూడా ఓ కారణం ఉంది ....అది మరోసారి ఉదహరిస్తాను ....అది నా చిన్న కూతురి కోరిక ...నా కోసం ఏమైనా కొనుక్కోమని .....)
సరే అదో పెద్ద షాపింగ్ కాంప్లెక్ .....రకరకాల షాప్స్ ఉన్నాయి ....
నా దగ్గర షూ లాంటి చెప్పులు ఎక్కువ లేవు ....ఓ రెండు జతలే ఉన్నాయి ....చెప్పులు కొనుక్కుందాం అని చెప్పుల షాపుకి వెళ్ళా .....
చాలా చాలా బాగున్నాయి అన్ని ....షాపులో అమ్మాయిని పిలిచి నా సైజు చెప్పులు అడిగి తీసుకుని మరీ సైజు లు చూసుకున్నా ....షాపులో దాదాపు అన్ని చెప్పులు చూసాక ...కొన్ని నచ్చాయని సెలెక్ట్ చేసుకున్నాక ....ఇప్పుడు నిజంగా నాకు ఈ చెప్పులు అవసరమా??!! ........లేదా ..అందరూ నాకు రెండు జతలే ఉన్నాయి అనుకుంటారు అని తీసుకుంటున్నానా ....??!!
ఒకవేళ అనుకుంటే నాకు నష్టం ఏముంది .....??!!
అలా ఆలోచించాక ....నవ్వుకుంటూ చెప్పులు కొనకుండా షాప్ బయటకు వచ్చేసా ....
తర్వాత బట్టలు గురించి ఆలోచించా ....ఏవో కొన్ని మంచి బట్టలు ఉన్నాయి కదా .... ఎందుకు... అవసరం లేదు అనిపించింది ....??!!
ఇంకేం అవసరం ఉంది అని ఆలోచిస్తే ....ఏమీ అవసరం లేదు అనిపించింది .....
ఈ క్షణం నా ఒంటి మీద ఆభరణాలు ఏం ఉన్నాయి అని ఆలోచిస్తే .....ఏం లేవు ....
ఏం కావాలి ....??!!
శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు , తిరగడానికి కాలికి చెప్పులు , తినడానికి తిండి .....అవసరం అయిన ఫోన్ , కార్ లాంటివి తప్పవు ఇక్కడ .....అవి కూడా ఉన్నాయి ....
ఇంకేం కావాలి ....
ఇంకేం వద్దు .....
షాప్స్ అన్ని తిరిగి చూస్తుంటే .....ఇది వరకు... ఇది కొనాలి అది కొనాలి అనిపించేది .....అది నా సొంతం చేసుకోవాలి ....ఇది నా సొంతం చేసుకోవాలి అనిపించేది .......
ఇప్పుడు ....ఏదీ సొంతం చేసుకోవాలని లేదు .....ప్రపంచంలో ...అన్నీ ఎక్కడివక్కడే వాటి వాటి స్థానాల్లో ఉండాలి ....నేను చూసి ఆస్వాదించాలి అంతే...
ఎందుకో ఆ భావం నాకు అద్భుతంగా అనిపించింది ....
అప్పుడు నేను అందరికంటే చాలా ధనవంతురాలిని అనిపించింది .....
ప్రపంచంలో .....ఏదైనా కావాలనుకోవడం కాదు ....ఉందనుకోవడం కాదు ....సొంతం చేసుకోవడం కాదు ....
ఏదీ కోరుకోకపోవడం....సొంతం చేసుకోవాలనే కోరిక లేకపోవడం ....వ్యామోహ పడకపోవడమే ....అన్నిటి కంటే ధనం అని అనిపించింది .....
ఒక్కసారిగా నేను ధనవంతురాలిని అనే ఫీలింగ్ కలిగింది ....అద్భుతంగా అనిపించింది .... <3 <3

Saturday, April 15, 2017

ప్రపంచంలో డర్టీ జాబ్ అంటూ ఏదీ లేదు ..

నిన్న ఒకరిని ఒక పని చేసి పెట్టమని అడిగా ....అఫ్కోర్స్ అది నా బాధ్యతే అనుకోండి ....
ఆ పని చేయాల్సిన సమయంలో నా సమయం అనుకూలించక పోవడం వలన అలా పలుసార్లు అడగాల్సి వచ్చింది .....
కొంత సమయం పోయాక మళ్ళీ మెసేజ్ చేశా ....చేసారా అని ....
"లేదు .......ఆ పని నేను చేయలేకపోతున్నా ....నా వల్ల కావడం లేదు ...." అని మెసేజ్ వచ్చింది .....
"ఆ పనిని మీ బాధ్యత అనుకుని చేయండి ....అప్పుడు చేయగలరు...." చెప్పా అదే పద్ధతిలో ఆ పనిని నేను ఇంతకుముందు ప్రయత్నించి ఉండడం వలన .....
"Bullshit, I can't do this dirty job" అని రిప్లై వచ్చింది ..
"డర్టీ జాబ్ .....??!! ఒక తల్లి నీకు తన రక్త మాంసాలూ పంచి జన్మనివ్వడం డర్టీ జాబ్ అనుకుంటే నువ్వు ఈ భూమి మీద ఉంటావా .....నీ మలమూత్రాలూ శుభ్రం చేయడం డర్టీ జాబ్ అనుకుని ఉంటే నువ్వు ఎదగగలవా .....అంతెందుకు భూమి నీ ఉనికిని భరించడం డర్టీ జాబ్ అనుకుంటే ...నువ్వు అంటూ ఉంటావా .... డర్టీ జాబా..??!! ... " ....ఇదంతా మనసులో అనుకున్నాను .... :(
పైకి మాత్రం .....,,,,
"హ హ ....ప్రపంచంలో డర్టీ జాబ్ అంటూ ఏదీ లేదు ....బహుశా డర్టీ మైండ్స్ ఉండొచ్చు ...." చెప్పా నవ్వుతూ ..... :) :)
=======================
అన్నట్టు ఈ రోజు నేను, అలాంటిదే ...మరో డర్టీ జాబ్ చేశాను ...(అది నా బాధ్యత కాకపోయినా ...) <3
ఈ రోజే కాదు ....నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి .....ఎన్నో డర్టీ జాబ్స్ చేస్తూనే ఉన్నాను ....ఊపిరున్నంత వరకు అలాంటి డర్టీ జాబ్స్ చేస్తూనే ఉంటాను ...... <3 <3
ఎందుకంటే ....నాది డర్టీ మైండ్ కాదు అని నా నమ్మకం .... <3 <3

Monday, April 10, 2017

నా నంబర్ 4 ....అవును అక్షరాలా నాలుగే ....


నా నంబర్ 4 ....అవును అక్షరాలా నాలుగే ....
ఖైదీ లకు జైలుకి వెళ్ళగానే ఒక నంబర్ ఇచ్చి ....ఆ నంబర్ తో పిలుస్తారు ....వాళ్ళ పేరు పెట్టి పిలవరు ....అలా నన్ను ఇక నుండి శ్రీలక్ష్మి అని, పేరు పెట్టి పిలవకుండా ...."నంబర్ నాలుగు" అని పిలిచినా నాకు ఇష్టమే ....
బహుశా ఈ దేశంలో చాలా మంది స్త్రీలకు నాలాగే నాలుగు నంబర్ ఉండొచ్చు ....లేదా ఒకటి ఉండొచ్చు ....లేదా ఏ పదో నంబరో ఉండొచ్చు ....లేకపోతే అసలు లేకుండానూ పోవచ్చు ....నాకు తెలియదు ..... :(
======================
అవును ....గత కొన్నేళ్లుగా ....అంటే దాదాపు చాలా ఏళ్లుగా అన్నమాట ....నా నంబర్ నాలుగే ....
అసలు చెప్పాలి అంటే ....నాకు నాలుగు అనే నెంబర్ ఎవరైనా ఇచ్చారా ??!! ....నేనే తీసుకున్నానా ...??!! అని ఆలోచిస్తే ....ఏమో, సమాధానం దొరకని ప్రశ్నే ....
ఒకప్పుడు ...అంటే నాకు ఊహ తెలిశాక నా నంబర్ ఒకటే ....
అప్పుడు ....నాకేం కావాలన్నా ఒకటో స్థానంలో సాధించుకోవడం అలవాటు ....
పాకెట్ మనీ కావాలంటే.... నాకు ఇప్పుడే కావాలి అని పేచీ ....
కొత్తబట్టలు తెస్తే ...నాకు ముందు ఇవ్వలేదని అలక ....
నాకూ సైకిల్ కొనిపెట్టాలి అని .....నాకూ వాచ్ కావాలి అని ....పళ్ళూ ....పూలు ...ఇలా ....ఒకటనేమిటి ... అన్నీ నాకూ కావాలి ....అని తల్లి తండ్రుల్ని అడిగి సాధించుకోవడమే .....నాకు తెలిసినప్పుడు ....నాకు నేను విలువ ఇచ్చుకున్న రోజుల్లో ...నన్ను నేను వరుసలో 
ముందు నిలుపుకున్న రోజుల్లో ....నా నంబర్ నాకు ఒకటే ....
=====================
తర్వాత నా నంబర్ రెండుగా మారింది ....ఎందుకు మారింది ....ఎప్పుడు మారిందో నాకు తెలియదు ....
వివాహం తర్వాత .... నన్ను నేనే రెండో స్థానం లోకి మార్చుకున్నాను ....
సమయం సందర్భం ఏమిటి అని నాకు గుర్తు లేదు కానీ ....ఏది కావాలనుకున్నా ....ముందుగా మొదటి స్థానంలో ఉన్న వాళ్ళ అవసరాలు తీరాక ....నాకు ఏది కావాలో అని ఆలోచించడం నేర్చుకున్నాను .....
అది నిజానికి నా తప్పా ....చుట్టూ ఉన్న సమాజం తప్పా ....లేక ఇచ్చేవన్నీ మొదటి స్థానంలో ఉంచి ఇచ్చి .... వివాహం తర్వాత నువ్వు రెండో స్థానంలో ఉండాలి అని నన్ను నా ఆలోచనను చిన్నతనం నుంచి శాసించిన తల్లితండ్రుల, బంధువుల, సమాజం తప్పా ...??!!
ఏమో ....నేను ఎవరినీ నిందించను ....నన్ను నేను తప్ప ....
ఎందుకంటే ....నా నంబర్ ను నా మాతృప్రేమ నాలుగో స్థానంలోకి చేర్చడం .....నాకు తెలియకుండా చేసింది కాదు ....నాకెవరూ అలా చేయమని చెప్పలేదు .....(బహుశా మా అమ్మ కూడా అందుకే మొదటి స్థానం నాకు ఇచ్చిందేమో .... ??!! )
====================
అప్పటి నుండి నా స్థానం నాలుగే .....
నేను నాలుగో స్థానంలో ఉన్నాను అని నాకు తెలియడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది ....
తెలిశాక నా తప్పు నేను తెలుసుకుని .....మళ్ళీ మొదటి స్థానం లోకి రావాలని ప్రయత్నించాను ....
కానీ ఇప్పటివరకు నేనే వాళ్లకి ఆ స్థానం ఇచ్చి ....నా స్థానం నేను నిర్ణయించుకుని ....మళ్ళీ ఇప్పుడు నాది నాకు కావాలి అంటే ఎలా కుదురుతుంది .....??!! పైగా చిన్నతనంలో నా తల్లితండ్రులు ఇచ్చిన స్థానాన్ని నేను ఆస్వాదించలేదూ ....??!!
అందుకే ....ప్రస్తుతానికి నా స్థానం నాలుగే ...
నా ఒకటో స్థానం నాకు వచ్చేవరకు నా నంబర్ నాలుగే ....
====================
అందుకు నేను బాధపడడం లేదు .....చివరి క్షణాల వరకూ ఎదురు చూస్తాను .....
ఎవరో నాకు మొదటి స్థానం ఇవ్వడం కోసం కాదు ......నా ఆలోచనల్లో మార్పు కోసం ....
"నా కోసం" ....అని నాకు నేను పేచీ పెట్టుకోవడం కోసం ....నాకు ముందుగా కావాలి అని నా మీద నేను అలగడం కోసం...ఎవరిగురించీ ఆలోచించకుండా అవసరమైంది నాకు నేను ముందుగా కొనుక్కోవడం కోసం ....
మొత్తానికి ....నాకు ....నా కోసం ..."ముందుగా కావాలి ..."అని ఏదైనా నేను కోరుకోవడం కోసం ....
నాకు నేను ఇచ్చుకునే ఎప్పుడో కోల్పోయిన నా మొదటి స్థానం కోసం .... <3 <3 <3