Tuesday, August 15, 2017

పిల్లల నిర్ణయాలకు కారణాలు వెదకాల్సిన అవసరం లేదు ....

పొద్దున్నే లేవగానే .. ఈ రోజు కృష్ణాష్టమి కదా అనుకున్నా ...హ్యాపీ బర్త్ డే నాన్నా (కృష్ణుడికి కాదు , నా కూతురికి )....అని చెప్పడంతో ఈ రోజు మొదలైంది నాకు ....😍
నీకు బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలిరా ....అడిగా ...
ఏం వద్దు మమ్మీ ....చెప్పింది ...
నీకిష్టమైన డ్రెస్ అయినా కొనుక్కోరా ....చెప్పా ...
కొనుక్కోవాలని లేదు ....వద్దు ....చెప్పింది ....
ఎందుకో బలవంతం చేయాలనిపించలేదు ....పిల్లల ప్రతి నిర్ణయానికి కారణాలు వెదకాల్సిన అవసరం లేదు .... వాళ్ళ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి అనుకుంటాను ....అంతే ....అందుకు కారణాలు ఏవైనా ....🤔
తెలుగు వాళ్లందరికీ (కొంతమంది హిందీవాళ్లకు కూడా ) కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పా ఆఫీస్ లో ...గుజరాత్ లో రేపు జరుపుకుంటున్నారట కృష్ణాష్టమి ....మనకు అంతా తొందరేగా ..??!! 😂ఏంటో ....కృష్ణుడు ఎన్ని రోజులు పుట్టాడో ఏమో ....నాకు అర్ధం కాదు ....🤔ఒక ఫ్రెండ్ కృష్ణుడి ప్రసాదం చలిమిడి, సున్నుండలు తెచ్చి ఇచ్చారు ...ఒక ఫ్రెండ్ చికెన్ బిర్యానీ తెచ్చి ఇచ్చారు ....అది కృష్ణుడి ప్రసాదం కాదు ....ఊరకనే తెచ్చారు ....🤫ఈ రోజు నాన్ వెజ్ తిననండీ అని చెప్పా ..అయినా తనని నిరుత్సాహపరచడం ఇష్టం లేక ....ఫ్రిజ్డ్ లో పెట్టుకుని రేపు తింటాలే ...అని చెప్పి తీసుకుని థాంక్స్ చెప్పా ....
సాయంత్రం తొందరగా ఇంటికి రావొచ్చు అని ....తొందరగా వెళ్ళా ఆఫీస్ కి పొద్దున్నే ....ఏం లేదు తొందరగా వచ్చి ...తనని కృష్ణ టెంపుల్ కి తీసుకుని వెళదాం అని ప్లాన్ ....
ఎంత తొందరగా బయలుదేరిననా ట్రాఫిక్ గురించి ఎవరికి తెలుసు ....ఎంతసేపు పడుతుందో ....అందుకే రోజూ వెళ్లే దారిలో ఎక్కువసేపు టైం చూపిస్తే ....టోల్ దారిలో వెళదాం అని డిసైడ్ చేసుకున్నా ....🏎️
కానీ కార్ స్టార్ట్ చేయగానే ...25 నిముషాలు చూపించింది ....టోల్ రోడ్ లో అయినా అంతే టైం పడుతుంది ....
త్వరగా ఇంటికొచ్చి ...రాగానే కృష్ణుడి ప్రసాదం నా కూతురికి పెట్టా ....చాలా బాగుంది అని ఇష్టంగా తింది ...మనం ఈ వీకెండ్ సున్నుండలు చేసుకుందాం అంది ....(ఫొటోస్ గట్ర ఏం షేర్ చేయను ... 😜 ) సరే అని చెప్పా ....
వెంటనే రెడీ అయి దగ్గరలో కృష్ణుడి టెంపుల్ ఎక్కడ ఉందా అని చూస్తే...10 మైల్స్ లో ఒక చిన్న టెంపుల్ ఉంది ....25 మైల్స్ లో ఒక పెద్ద టెంపుల్ ఉంది అని చూపించింది ....
"అరె ...భగవంతుడు ఎంత టెంపుల్ లో ఉన్నా భగవంతుడేరా ....ఏం మార్పు లేదు ..." అని దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్లాం .....
దారి పొడవునా అందమైన కొండలు ....ఆ కొండల మధ్యలో నుండి వెళ్తుంటే ...ఏదో బృందావనానికి వెళ్లిన భావం కలిగింది ...చాలా ఆహ్లాదంగా అనిపించింది .....😍
అక్కడ టెంపుల్ కి పక్కవీధిలో కార్ పార్క్ చేసి ....టెంపుల్ లోకి అడుగుపెట్టగానే ....కృష్ణుడి రూపం కనువిందు చేసింది ....కానీ ఎవరూ అంతగా జనం లేరు ....ఒక (అమెరికన్) అబ్బాయి ...హరే కృష్ణ హరే కృష్ణ ....అంటూ ...తబలా వాయిస్తూ ....ఉన్నాడు ....ఒక (అమెరికన్ )అమ్మాయి ..అతని దగ్గర నేర్చుకుంటూ ఉంది ....అక్కడ ఒక బోర్డు మీద ...పూజ రేపు ...అని వ్రాసి ఉంది ....
సరేలే ...ఇక్కడ కూడా కృష్ణాష్టమి రేపే చేస్తున్నారు అనుకుని .... మేం దేవుడికి దండం పెట్టుకుని .....గుడి చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాం ....అక్కడ కొంతమంది పూవులు మాలలుగా గుచ్చుతూ ఉన్నారు ... అంతలో ఓ వ్యక్తి ...మీరూ మాలలు అల్లుతారా అని అడిగారు ....సరే అని చెప్పాం ....😍
అక్కడ కూర్చుకుని బంతి , చేమంతి మాలలు గుచ్చుతూ ....దాదాపుగా రెండు గంటలు అక్కడే రకరకాల డిజైన్ లలో ....గుడి అలంకరణ కోసం .... మాలలు అల్లడంలో మాకు సమయం తెలియలేదు ...
అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది తెలుగువాళ్లు కృష్ణుడి గురించి , భగవద్గీత గురించి మాట్లాడారు ..😍
అందులో ఒకరు ...."మిమ్మల్ని కృష్ణుడి ని ఆరాధించమని ఎవరు ప్రోత్సహించారు ...." అని అడిగారు ...."ఒకరు ప్రోత్సహించడం ఏమిటి ....నాకు చిన్నప్పటినుండి కృష్ణుడంటే ఇష్టం...అయినా.., ఒకరు ప్రోత్సహిస్తే వచ్చేది భక్తి ఎలా అవుతుంది ....మన మనసులో జనించేది భక్తి అవుతుంది గానీ ..." చెప్పా ...🤔
"నాకు మాత్రం మా అమ్మ ప్రోత్సాహం వలెనే కృష్ణుడు అంటే ఇష్టం ...." చెప్పింది నా కూతురు నా వైపు చూస్తూ ....😘
"అయ్యుండొచ్చు ...వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడ్డారు ... కృష్ణుడిని ఇష్టపడండి అని నేనెప్పుడూ వాళ్లకి చెప్పలేదు ...." చెప్పా నవ్వుతూ ....😀
పూల దండలన్నీ పెట్టెల్లో కూర్చి ...ఇక వెళ్లొస్తాం అని చెప్పాము....ఇవన్నీ రేపు అలంకరిస్తాం ....రేపు తప్పకుండా రండి అని అక్కడున్న అందరూ పిలిచారు ....
ఒక అమ్మాయి (అమెరికన్....) నన్ను ...."మాతా..." ఆ పువ్వులు ఇలా ఇవ్వండి ....(ఇంగ్లీషులో )అని అడిగింది ....
అక్కడ అందరూ అలానే పిలుచుకుంటారని తెలిసి ....ఆ అమ్మాయి అందర్నీ ఫాలో అవడం చూసి ...ముచ్చటేసింది ....😍
------------------------------------
"థాంక్స్...ఇదే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ " సంతోషంగా చెప్పింది నా కూతురు .....😍
తర్వాత ...ఓ అమెరికన్ రెస్టారెంట్ లో డిన్నర్ తో ....
=================
అదిగో ....అలా జరిగింది కృష్ణాష్టమి ... :) 

No comments:

Post a Comment