పురుషుడిని ప్రేమించే ప్రతి స్త్రీ ....పురుషుడు తనకంటే అన్నింట్లో ఎక్కువ స్థానంలో ఉండాలని ...తన ముందు అతను తలెత్తుకుని నిలబడాలని....పురుషుడిలో తాను ఒదిగిపోవాలని కోరుకుంటుంది ...
😍
నేను చెప్పేది సహజంగా ఉండే స్త్రీ మనసు ....
😊
బహుశా మన భారతీయ సమాజం కూడా అందుకే పురుషుడికి కాస్తంత ఎక్కువ స్థానం ఉండాలని సూచించి గౌరవించిందేమో ....
🤔
అయితే ....కొందరు పురుషులు తన కంటే ఎక్కువ స్థానంలో ఉండే స్త్రీ ని కూడా ప్రేమించగలరు ....
👍
కానీ తనకంటే తక్కువ స్థానంలో ఉండే పురుషుడిని ప్రేమించడం స్త్రీకి ఎక్కువ శాతం సాధ్యం కాదు .....
🙅♀️
ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల వలన స్త్రీ కూడా అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడి వాళ్ళని అధిగమించి ముందుకు వెళ్తుంది ...
ఎప్పుడైతే స్త్రీ తనకు సమానమైన / లేదా అధిక స్థానంలో ఉందో పురుషుడిలో అభద్రతా భావం ఏర్పడి ....స్త్రీకి తనకు తానుగా దూరమవుతున్నాడు....
😥
ఇక్కడ దూరం కావడం అంటే వదిలి వేయడం కాదు ....మానసికంగా దూరం కావడం .....
🤔
అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీ పురుషుడికి గట్టి పోటీ ఇచ్చి తనకంటే ఇంకా ఎక్కువ ఎత్తుకు పురుషుడు ఎదగాలని కోరుకుంటుంది ....
🤔
అది పురుషుడు పోటీగా తీసుకుంటే ఆమెను అపార్ధం చేసుకుని దూరమవుతాడు ...పురుషుడిలో లీనమై పోవడానికి స్త్రీ చేసే ప్రయత్నంగా భావిస్తే ....విజేత గా నిలిచి స్త్రీని ఐక్యం చేసుకుంటాడు ....
❤️
ఇదంతా ఎవరూ గమనించలేని ...సహజ సిద్ధంగా జరిగే అంతర్గత ప్రకృతి పరిణామం ...!
😍
ఏది ఏమైనా ఇది వ్యక్తిగతంగా గమనించిన అభిప్రాయం మాత్రమే ...మార్పు చేర్పులు ఆహ్వానిస్తున్నా ... !
👍