కొందరిలో ఉన్న క్రూరత్వాన్ని మనం క్రూరత్వం తోనే ఎదుర్కోవాలి ...
కొందరిలో ఉన్న సాధు స్వభావాన్ని సాధు స్వభావంతోనే పలకరించాలి ....
ఇది మనం చిన్నతనం నుండి అలవాటు చేసుకున్నాం ....అదే మనుగడకు అవసరం అనుకుని ....
🤔
----------------------
కానీ ....మనిషి సహజ గుణం అది కాదు ....
🙅♀️
ఇతరుల్లో ఉన్న క్రూరత్వాన్ని కూడా మన సాధు స్వభావము తోనే పలకరించాలి .....ఇది మనిషి లో ఉన్న సహజ గుణం...
😍
అలా పలకరించాలి అంటే ....??!!
మనలో మనుగడకోసం పెంపొందించుకున్న క్రూరత్వాన్ని రూపుమాపాలి ....
🙅♀️
అది అనుకున్నంత సాధ్యమే అనుకుంటాం ....రాతల్లో , మాటల్లో ....
కానీ చేతల్లోనే....??
😜
నేనేమంటానంటే ....,, కొందరిలో ఉన్న క్రూరత్వాన్ని - మనలో ఉన్న సాధు స్వభావంతో పలకరించాలంటే ...కొన్నిసార్లు కుదరదు ....
😥
వాళ్ళల్లో ఉన్న క్రూరత్వం మోతాదుని బట్టి ....మనలో ఉన్న సాధు స్వభావం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఎదురుకావచ్చు ....
🤔
ఉదాహరణకు ....వాళ్ళల్లో 200 శాతం క్రూరత్వం ఉందనుకోండి ....మనం 100 శాతం సాధు స్వభావం తో పలకరిస్తే ఏ మాత్రం వాళ్ళ మీద ప్రభావం చూపించదు...
🙅♀️
అలాంటప్పుడు ....మనలోని సాధుస్వభావం ఉనికి కోల్పోతుంది ....ఆ పలకరింపులు క్రూరత్వాన్ని ఏ మాత్రం మార్చలేవు ....
🤔
అలాంటప్పుడు ఏం చేయాలి ....??!!
🙆♀️
వాళ్ళను పలకరించే తీరాలి అన్నప్పుడు ....,, కాసేపు మన సాధు స్వభావాన్ని పక్కన పెట్టి ....క్రూరత్వాన్ని ఆహ్వానించాలి ....అయితే అది మన సాధు స్వభావాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించాలి తప్ప ....ఎదుటివాళ్ళ క్రూరత్వాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి ....
🙇♀️
ఆ క్రూరత్వం పదునైంది , ఆరోగ్యకరమైనది , తెలివైనది, ముఖ్యంగా సాధు స్వభావం మీద ప్రేమ ఉన్నది అయి ఉండాలి .....కత్తిని కొందరు మనుషుల్ని చంపడానికి వాడితే ....కొందరు కూరగాయలు కోసుకోవడానికి వాడతారు అన్నట్టు ....
🤔
అలాంటి సమయాల్లో ....ఇంకా ఇంకా ఇంకా ...మనలో తిష్ట వేసుకున్న సాధు స్వభావం కొన్నిసార్లు మనల్ని వణికిస్తుంది ....క్రూరత్వానికి భయపడి ....
😥
పిల్లలు దగ్గు మందు వేసుకోమంటే భయపడి దాక్కున్నట్టు ....దాక్కుంటుంది ....
😥
కానీ దగ్గు మందు వేసి ...పిల్లలను కాపాడుకుంటాం కానీ ....భయపడుతున్నారని వదిలేస్తామా ....
🤔
ఇదీ అంతే....
👍
క్రూరత్వాన్ని ఆహ్వానించే తీరాలి ...కొందరిలో ఉన్న క్రూరత్వాన్ని పలకరించడం కోసం ....మనలో ఉన్న సాధు స్వభావాన్ని బ్రతికించుకోవడం కోసం ....!
😍
No comments:
Post a Comment