Tuesday, April 26, 2022

 అంటే.. ఫ్రెండ్ ఇచ్చిన ఉసిరికాయ పచ్చడి.. ఇప్పుడే ఇండియా నుండి ఇంపోర్ట్ అయ్యిందన్న మాట..

ఎన్నాళ్ళో వేచిన ఉసిరి.. ఈనాడే ఎదురవుతుంటే.. ఇన్నినాళ్ళు దాచిన రుచులు.. ఎగిసి ఎగిసి పోతుంటే.. ఇంకా తనివి తీరదేమి ...
చిన్నప్పుడు.. మా ఇంటి పక్కన నరసింహ శాస్త్రి గారి ఇంట్లో ఈ ఉసిరి చెట్టు పెద్దది ఉండేది..
కానీ వాళ్ళు పిల్లలకి ఊరికే కాయలు ఇచ్చేవాళ్ళు కాదు.. పెద్దవాళ్లకైతే ఇచ్చేవాళ్ళు ..
అప్పుడు పిల్లలు అందరం.. పది పైసలు, పావలా తీసుకుని వెళ్లి కాయలు కొనుక్కునేవాళ్ళం.. వాళ్ళు పొద్దున్నే ఏరినవి ప్లేట్ లో పెట్టి ఉంచి అవి మాకు ఇచ్చేవాళ్ళు..
ఒక్కోసారి.. పెరట్లోకి వెళ్లి ఏరుకుని తెచ్చుకోండి అనేవాళ్ళు..
అప్పుడు లోపలికి భయం భయంగా వెళ్ళేవాళ్ళం.. కారణం ..వాళ్ళ పెరట్లో చాలా పెద్ద పుట్ట ఉండేది ...
అందులో పాములు ఉంటాయని అందరికీ నమ్మకం ..నాగుల చవితికి పుట్టలో అందరూ పాలు పోయడానికి కూడా వెళ్ళేవాళ్ళు..
కాసిన్ని కాయలు ఏరుకుని వళ్ళో వేసుకుని.. పరుగో పరుగు..
ఇక చూడు ...కాయ కొరకడం .. మంచి నీళ్లు తాగడం ...రోజంతా ఇదే పని ..పుల్లగా / వగరుగా ఉన్న కాయ కొరికి నీళ్లు తాగితే తియ్యగా ఉండేది ...
తర్వాత ..చాలా అందుబాటులోకి వచ్చినా ...ఎంత దొరికినా ...అప్పటి రుచి మాత్రం ఇప్పుడు రాదు అనేది ...మనందరికీ తెలుసనుకోండి ...
ఎప్పటికైనా ఒక ఉసిరికాయ మొక్క ఇక్కడ వేయాలనేది నా కోరిక.


No comments:

Post a Comment