చాలామంది జీవితంలో పరుగులు పెడుతూ ఉంటారు ...(ఆ మాటకొస్తే ఈ రోజుల్లో ...దాదాపుగా అందరూ పరుగులు పెట్టాల్సి వస్తుంది అనేది నిర్వివాదాంశం ...)
వాళ్ళకి ఇతరులతో మాట్లాడే సమయం కూడా ఉండదు ... అంటే, వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మనం కూడా పరుగులు పెడుతూనే మాట్లాడాలి ......
వాళ్ళకి ఇంకా చాలా పనులకు సమయం ఉండదు .. తీరికగా తినడానికి సమయం ఉండదు ...
ఇష్టమైన వాళ్ళతో కబుర్లు చెప్పుకునే సమయం ఉండదు ....వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు ...ఏం చేస్తున్నారు అని ఆలోచించే సమయం ఉండదు ...
చుట్టూ ఉన్నవాళ్లకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ...వాళ్ళ మనోభావాలు ఏమిటి ...అని గమనించే అవకాశం ఉండదు ...
కాసేపు ప్రకృతిని గమనిద్దాం ...అది మనకు పీల్చడానికి గాలి ఇస్తుంది ...తాగడానికి నీళ్లు ఇస్తుంది ...పచ్చని పరిసరాల్ని ఇస్తుంది ....అన్న ధ్యాసే ఉండదు ...
మనతో పాటు ప్రకృతిలో ఇంకా కొన్ని జీవులు ఉన్నాయి ...అవి ఎలా బ్రతుకుతున్నాయో చూద్దాం అనే ఆలోచన ఉండదు ...
పరుగు పరుగు పరుగు ....
ఎక్కడికి అంటే వాళ్ళకే తెలియదు ...
అలాంటి వాళ్ళతో పరుగులు మనకి అవసరమా అని ఆలోచిస్తే ...
నా జీవితం చెప్పిన సమాధానం ...
ఎంత మాత్రం అవసరం లేదని ...
హాయిగా జీవితాన్ని ఆస్వాదించమని... అలాంటి వ్యక్తులకు దూరంగా బ్రతకమని..!

No comments:
Post a Comment