Monday, April 2, 2018

తప్పెవరిది ....తల్లితండ్రుల బాధ్యత లేదా ....??!!

"ముసలివాళ్ళు ఇంట్లో పని మనుషులుగా వంట మనుషులుగా పనికొస్తారు కాబట్టి ....నాలుగు మెతుకులు పడేస్తారు ....." బాధగా ఒక మిత్రుడు ఈ రోజు ఆత్మహత్యల గురించి జరిగిన చర్చలో ...నాతో అన్నారు ....😥
మనం పెంచిన పిల్లలే అలా ఆలోచించడానికి కారణం ఎవరు ....??!! ఒకసారి ఆలోచిస్తే ...,,అందుకు కారణం మన పెంపకం కూడా అని మనం అంగీకరించక తప్పదు ....
వాళ్ళు , మనుషుల్ని వాడుకుని వదిలేసే వస్తువులుగా చూడడం మనమే అలవాటు చేస్తాం ....మనకు తెలియకుండానే .....🤔
------------------------------
అందుకు ఈ మధ్య నాకూ నా డాటర్ కి జరిగిన ఒక చిన్న సంభాషణ మిత్రునికి వివరించా ....
-------------------------------
ఈ మధ్య ...."ఐ లవ్ మై కార్ ...." అంది నా చిన్నకూతురు నాతో ....
అసలు విషయం ఏమిటంటే తన కార్ మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది కొన్ని రోజులు వాడుకోవడానికి ....వాళ్ళు ఏదైనా దానికి యాక్సిడెంట్ చేస్తారేమో అని భయం అన్నమాట ...
"కారుని ప్రేమించడం ఏమిటిరా....అది వాడుకుని వదిలేసే ఒక వస్తువు ...." ఆశ్చర్యంగా అడిగా ...
"ఆ కారు మీద నాకు అనుబంధం ఏర్పడింది ....దానికి ఏదైనా అయితే నేను భరించలేను ...." చెప్పింది ...వివరిస్తూ ....
"కారుకి ఏదైనా అయితే ...దాని గురించి కేర్ తీసుకో ....నీట్ గా ఉంచుకో ...ఇన్సూరెన్స్ తీసుకో ....దానికి కావాల్సినవి అన్ని చేయి ....కానీ దాని మీద ఏ అనుబంధం పెంచుకోకు ....దాన్ని ప్రేమించకు...
ప్రపంచంలో ప్రాణం ఉన్న వ్యక్తులను ప్రేమించు ....జంతువులను ప్రేమించు ....పక్షులను ప్రేమించు ....ప్రేమించడానికి ఇంత జీవ సంపద ఉండగా ....ప్రాణం లేని వస్తువులను ప్రేమించడం ఏమిటి ...."చెప్పా అనునయంగా ....
అప్పటికి "నా కార్ నాకు కావాలి ఇప్పటికిప్పుడు" అని ఏదో పేచీ పెట్టింది కానీ ....ఆ విషయం గురించి కాస్త ఆలోచించింది అనే చెప్పాలి ....
ఆ తర్వాత మరెప్పుడూ నా ముందు అయితే ...."ఐ లవ్ మై కార్" అని అనలేదు .....🙅‍♀️
---------------------------------------------
వాళ్లకు ....వస్తువులకు, ప్రాణం ఉన్న జీవులకు తేడా తెలియకపోతే ....భవిష్యత్తులో ....వ్యక్తులని వస్తువులుగా ....వస్తువులను వ్యక్తులుగా పొరబడే ప్రమాదం లేకపోలేదు ....🤔
పొరబడితే ఏముంది ....
ముసలి తల్లితండ్రులు పనికి రాని ,పనిచేయలేని వస్తువులుగా ....బంగారం, కార్లు , బంగళాలు, స్థలాలు ... వాళ్లకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే జీవం ఉన్న జీవులుగా పరిగణిస్తారు ...
వయసులో ఉన్నప్పుడు ....పడకసుఖం ఇస్తున్నప్పుడు భార్య పనికొచ్చేది గానూ ....వయసయిపోయిన తర్వాత కాపురానికి పనికిరానిది గానూ ... విడాకులు ఇచ్చి వదిలించుకునే వస్తువుగానూ కనిపిస్తారు .....
బాగా సంపాదించే భర్త పనికొచ్చే వస్తువుగానూ ....సంపాదించని భర్త ఎందుకూ పనికిరాని వాడుగానూ దూషించబడతాడు ....
పిల్లలు ప్రయోజకులైతే నా పిల్లలు ....లేకపోతే వాళ్ళ తలరాత ...ఇంట్లోనుండి గెంటి వేయబడతారు .....
ఇలా ....అందరూ ....అన్ని తారుమారవుతాయి ....😥
వస్తువులు ఎలా అయితే కొనుక్కుని వాడుకుంటామో ....అలాగే మనుషులను కూడా వెలకట్టి వాడుకొని వదిలేసే మనస్తత్వానికి చిన్నతనం లోనే మూలాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ....అనేది మనం విస్మరించలేని సత్యం ....!😥
-----------------------------
తప్పెవరిది ....తల్లితండ్రుల బాధ్యత లేదా ....??!!
అందుకే ....పిల్లల మనసులను మురికిపట్టిన ఆలోచనలతో కలుషితం చేయనప్పుడే ....పిల్లల దగ్గర నుండి సజీవమైన మానవ సంబంధాలను ఆశించగలం ....అని నా అభిప్రాయం ....! 🤔

No comments:

Post a Comment