Sunday, April 29, 2018

అది నిజమైన నాయకుడికే సాధ్యం ....!

లీడర్స్ ....
సాధారణంగా రెండు రకాల లీడర్స్ ఉంటారు ...
ఒకరు తాను ముందు ఉండి తన సైన్యాన్ని నడిపించేవాడు ....
మరొకరు తాను వెనక ఉండి తన సైన్యాన్ని నడిపించేవాడు ....
ముందు ఉండి నడిపించేవాడు తాను పని చేసి చూపించి వెనక ఉన్నవాడిని చేయమని చెప్పాలి ....అప్పుడే వెనక ఉన్నవాడు కదిలి వస్తాడు .....అంతవరకు అతనికి ఆ పని ఎలా చేయాలో తెలియదు ....లేదా ఆ పని ఇలా చేయాలని చూపిస్తేనే చేయగలడు ....లేకపోతే ఇతరులు చేస్తేనే వీళ్ళకి చేయాలనిపిస్తుంది ....🤔
ఇక తాను వెనక ఉండి ....తన సైన్యాన్ని నడిపించేవాడు ....ఫలానా పని చేయండి అని ప్రోత్సహించాలి .....వెనక ఉండి ముందున్నవాళ్లను తరుముతూ ఉండాలి ....పదండి పదండి అని అనుక్షణం ప్రోత్సహిస్తూ ఉండాలి .....🤔
ఈ రెండురకాల లీడర్స్ ప్రపంచం అంతా తెలుసు .....లీడర్ అంటేనే ఇది సహజం ...కారణం ఏదైనా లీడర్ ఈ మాత్రం కష్టపడక తప్పదు అనుకుంటాం ....
అరుదుగా కొందరు లీడర్స్ ఉంటారు ....
ఇతను ఆ పనికి , ఆ వ్యక్తులకు ఎలాంటి వాతావరణం అవసరమో ఆ వాతావరణం సృష్టించి పని చేయిస్తాడు .....అవసరం అయితే పని చేసి చూపిస్తాడు ....లేదా పదండి ముందుకు అని ప్రోత్సహించి పని చేయిస్తాడు ....అవసరాలకు తగ్గట్టు తన నాయకత్వ లక్షణాలను అనుక్షణం మార్చుకుంటాడు ....😍
ఏది ఏమైనా పని చేయిస్తాడు ముందు ....నిజంగా అలాంటి వాళ్లకు మనం కృతజ్ఞతలు చెప్పాలి ....👍
చాలా మంది అనుకుంటారు ....ఆ .., లీడర్స్ అంటే వాళ్ళు మనుషుల్ని మానేజ్ చేయడమే కదా అని ....
మనుషుల్ని మేనేజ్ చేయడం కాదు వాళ్ళు చేస్తుంది ....మనుషుల మైండ్స్ ని మేనేజ్ చేస్తున్నారు ...
అది అంత ఈజీ అయిన పని కాదు ....🙅‍♀️
ఒక మెదడుని కదిలించి ముందుకు నడిపించడం అంటే ....వెయ్యి ఏనుగులని ఒంటి చేత్తో లాగడం అంత బలమైన పని ....
అది కూడా చిన్నతనం నుండి బండబారిపోయిన , మొండికేసిన , వంకర పోయిన మెదడులను సరిచేసి ....కదిలించాలంటే ....మరో వెయ్యి ఏనుగులను మందలో కలిపి ....లెక్కపెట్టకుండా ....చిటికెన వేలితో లాగడం లాంటిది అన్నమాట ....
అది నిజమైన నాయకుడికే సాధ్యం ....! 😊😍

No comments:

Post a Comment