Sunday, April 1, 2018

ఒక అసామాన్యమైన సమస్యకు సమాధానం తెలుసుకున్నా....

ఒక అసామాన్యమైన సమస్యకు సమాధానం తెలుసుకున్నా (నా అభిప్రాయం )....అదేమిటంటే ,,,,
అసలు ప్రపంచంలో సమస్యలు అనేవి ప్రత్యేకంగా ఏమీ లేవు అని ....మన ఆలోచనల రూపంలో మాత్రమే సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి అని.....
---------------------------

ప్రస్తుత స్థితిలో ....నువ్వు మాత్రం కనిపిస్తున్నావు ప్రపంచంలో ....అంటే నీ ఉనికి మాత్రమే కనిపిస్తుంది ....
నీ ఉనికి నీ రూపం అయితే ...నీ ఆలోచనలు నీకు దృశ్య రూపం ....
నీ రూపానికి అస్థిత్వం ఈ ప్రపంచం అయితే ....నీ ఆలోచనలకు అస్థిత్వం నువ్వు ......
ఎప్పుడైతే నీ ఆలోచనల్లో ఒక సమస్య ఉంది అని అనుకుంటున్నావో ...అప్పుడు సమస్య దృశ్య రూపం నీకు కనిపిస్తుంది ....అది నీకు భయాన్ని ....ఆందోళనను కలిగిస్తుంది ....
సమస్య గురించి నువ్వు ఆలోచించకపోతే .....అసలు ఆ సమస్య అక్కడ లేదు ....అది ఎక్కడా లేదు .....ఆ దృశ్య రూపం నీకు కనిపించదు ....సమస్య లేని స్థానం నీకు సంతోషాన్ని , నిశ్చింతనూ ఇస్తుంది .....
ఎప్పుడైతే నీ శరీరం తన మనుగడకు శక్తి లేక ....బలహీనమై ....అందుకు తగిన ఆధారాన్ని సృష్టించుకోవాలి అనుకుంటుందో .....అప్పుడు సమస్యల ఆలోచనలను సమీకరించుకుంటుంది ....
ఎప్పుడైతే శక్తి కలిగి ఉంటుందో .....ఆ ఆలోచనలను అధిగమించి అవి సమస్యల్లా చిత్రీకరించకుండా సంతోషాన్ని , నిశ్చింతనూ సొంతం చేసుకుంటుంది ....
మనిషి ఎంత బలహీనుడైతే అంత సమస్యల వలయాన్ని తన చుట్టూ నిర్మించుకుంటాడు ....
సమస్యలు తన శక్తి యుక్తుల లేమికి కారణంగా చూపి ....తాను సమస్యల వలయంలో ఉన్నానని ....అందువలనే శక్తి లేదని అందరినీ నమ్మించాలని, తాను కూడా నమ్మాలని ప్రయత్నిస్తాడు ....
అందుకే మనం మాత్రమే ....ప్రస్తుత స్థితిలో ఉన్న మనకు మాత్రం ఇక్కడ అస్థిత్వం ఉంది ....సమస్యలకు మన ఆలోచనలలో మాత్రమే అస్థిత్వం ఉంది ....ప్రపంచంలో ఇంకెక్కడా అస్థిత్వం లేదు ...
ఆలోచనలను నియంత్రించుకోగలిగితే సమస్యలనేవే లేవు ....ఆలోచనలను నియంత్రించుకోవడం సాధనతోనే సాధ్యం ...!
----------------------
గమనిక : ఇది ...నా స్వీయ పరిశీలన ఆధారంగా వ్రాయబడింది ...నేను మానసిక శాస్త్ర నిపుణురాలిని కాదు ....!

No comments:

Post a Comment