Friday, February 4, 2022

మొన్న పొద్దున్నే నిద్ర లేవగానే ...

 మొన్న పొద్దున్నే నిద్ర లేవగానే ...కిచెన్ లో నా డాటర్ చేసిన టీ తాగుతున్న మావారి దగ్గరకు వెళ్లి ..."డాక్యూమెంట్స్ మెయిల్ చేసారా ..." అడిగా ....అవి త్వరగా పంపించాల్సిన చాలా ముఖ్యమైన డాక్యూమెంట్స్ ...

గత కొన్ని రోజులుగా సమయం దొరికినప్పుడల్లా అడుగుతూనే ఉన్నా ...అందుకు సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి ....ఫాలో అప్ చేసి ....ముందు తాను పంపించాల్సిన డాక్యూమెంట్స్ పంపించమని...
మొన్న కూడా ...అలాగే అడిగా లేవగానే ...
వాళ్ళు ఆ సమయంలోనే ఫోన్ కి అందుబాటులో ఉంటారు ....మళ్ళీ మధ్యాహ్న్నం అయితే ఫోన్ ఎత్తరు... పైగా అవి నేను పంపించగలిగే డాక్యూమెంట్స్ కాదు ...
"నేను ఎన్ని గంటలకి నిద్ర లేచానో తెలుసా ...అప్పటినుండి ఎంత బిజీ గా ఉన్నానో తెలుసా ...ఇప్పుడే పది నిముషాలు టైం దొరికింది ... నేను ఎంత కష్టపడుతున్నానో నీకు అర్ధం కాదు ...ఎప్పుడు చూడు మెయిల్ మెయిల్ మెయిల్ ....చేస్తా ...కాసేపాగి చేస్తా ..నాకిప్పుడు టైం లేదు ...అయినా పొద్దున్నే ఇంకేం లేనట్టు అదే అడుగుతావు... కాసేపు ప్రశాంతంగా ఉండనీయకుండా" అని నామీద అంతెత్తున లేచారు ....
అంతా విని ...మౌనంగా నా రూమ్ కి వచ్చి ....నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
నేనేం తప్పుగా మాట్లాడానో నాకు అర్ధం కాలేదు ...ఒక పని అయిందా అయిందా అని తన బాధ్యతను పదే పదే నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు ....
కానీ అది ఫ్యామిలీకి సంబంధించినది కావడం వలన ....అది అయిపోయే వరకు నేను గుర్తు చేస్తూ ఉంటా ....
నిజానికి ...పొద్దున్నే గుర్తు చేస్తే పొద్దున్నే అంటారు ....మధ్యాహ్న్నం గుర్తు చేస్తే ఆకలేస్తుంది అంటారు ....అన్నం తిన్నాక గుర్తు చేస్తే నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి అంటారు ....కాసేపు నిద్రపోయి లేచాక చెబితే ....ఇప్పుడే లేచా కాసేపు వాకింగ్ చేసాక చేస్తా అంటారు ...వాకింగ్ చేసాక గుర్తు చేస్తే ...ఆఫ్ షోర్ మీటింగ్ ఉంది అది అయిపోయాక చేస్తా అంటారు ...అది అయిపోయాక డిన్నర్ ...తర్వాత అడిగితే నేను చేస్తాలే నువ్వు పడుకో ...అంటారు ....పొద్దున్న లేచి చేసారా అని అడిగితే సైకిల్ రిపీట్ అవుతుంది ....
సరే ...నాకేమీ అయన నామీద ఎగిరినందుకు బాధగా అనిపించలేదు ....నా బాధ్యత అయిపొయింది అని తృప్తిగా అనిపించింది ....
కొంతసేపటికి జ్ఞానోదయం అయ్యి ...తన తప్పు తెలుసుకున్నారు ....అది వేరే విషయం ...
నిన్న...
పొద్దున్నే ...నేను లేచి నా పని నేను చేసుకుంటూ ఉన్నా ....
నా రూమ్ లోకి వచ్చి ...."ఒక sad న్యూస్... ట్రాష్ కాన్స్ పెట్టడం మర్చిపోయా ...." చెప్పారు విచారంగా ...
నిజానికి బుధవారం మేం ట్రాష్ కాన్స్ రోడ్ మీద పెట్టాలి ....గురువారం ఉదయమే ట్రాష్ వాళ్ళు వచ్చి ట్రాష్ పట్టుకుపోతారు ....
విపరీతమైన గాలి వలన ట్రాష్ కాన్స్ రోడ్ మీద ముందు రోజు రాత్రే పెడితే ఎగిరిపోతాయని తెల్లవారి పెడదాం అని అనుకున్నాం ...
సాధారణంగా తను పొద్దున్నే లేస్తారు కాబట్టి తను పెడతారు ...
"నిజానికి అది నాకేమీ sad న్యూస్ కాదు ....ఒకవేళ అయినా ...పొద్దున్నే ఈ ట్రాష్ కాన్ వార్త ...నాకు చెప్పాల్సిన అవసరం ఉందా ...నిన్న నేను చాలా ముఖ్యమైన పని గురించి గుర్తు చేస్తే ....నా మీద ఎగిరారు ...ఇప్పుడు చెత్త అంతా తెచ్చి పొద్దున్నే నా మీద పెడుతున్నారు ....మైండ్ మీకొక్కరికే ఉందా ...పొద్దున్నే ప్రశాంతత కోరుకునేది మీరొక్కరేనా ..రూల్స్ మీకొక్కరికేనా ....లేక అందరికీ వర్తిస్తాయా ...." అడిగా ప్రశాంతంగా ...
ఏదో నిర్వచనాలు చెప్పబోయారు ...
"ఒకే ఒక్క ఆన్సర్ సింపుల్ గా ఎస్ ఆర్ నో ...రూల్స్ మీ దృష్టిలో అందరికీ సమానమా కాదా ...పైగా నేను మీలాగా ఎగరలేదు ....ప్రశాంతంగా అడుగుతున్నా ...." అడిగా ...
"ఎస్ ..." చెప్పారు ...
"అది మీరు అమలుపరుస్తున్నారా ....ఐ మీన్ ....ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా ....థియరీ ఒక్కటేనా ..." అడిగా ...
సమాధానం ఇంకా రాలేదు ...ఇప్పుడప్పుడే వస్తుందని గ్యారెంటీ లేదు ..!😇✍
Happy Weekend!
Like
Comment
Share

No comments:

Post a Comment