Sunday, April 23, 2017

తెలియని విషయాన్ని తెలియదు అని చెప్తే మాత్రం జనం చిత్ర విచిత్రంగా నవ్వుతారు ....🙃

తెలిసిన విషయం తెలియదు అని చెప్పడం చాలా తేలిక ....
తెలియని విషయాన్ని తెలుసు అని చెప్పడం చాలా కష్టం ....
తెలిసిన విషయం తెలియదు అని చెప్తే మేధావి అంటారు ....

తెలియని విషయాన్ని తెలుసు అని చెప్తే కూడా మేధావి అనే అంటారు ....
తెలిసిన విషయం తెలుసు అని చెప్తే కూడా మేధావి అనే అంటారు ....
కానీ ..., తెలియని విషయాన్ని తెలియదు అని చెప్తే మాత్రం జనం చిత్ర విచిత్రంగా నవ్వుతారు ....
ఎందుకో అర్ధం కాదు ... 
బహుశా అందుకేనేమో ....చాలా మంది తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పలేరు .... 
అది తెలిసినట్టు నటించడానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటారు ... 
బహుశా కొన్ని సందర్భాల్లో మనుగడకు అలా నటించడం అవసరం కావచ్చు ....
కానీ అవసరం లేనప్పుడు నటించాల్సిన అవసరం ఏముందా...??!! అని ఆలోచిస్తూ ఉంటా ....
తెలియని విషయం తెలియదు అని మనం చెప్పినప్పుడు ఎవరు నవ్వుతారు అని పరిశీలిస్తే ....,,,,,
ఆ విషయంలో వాళ్లకు మన కన్నా ఎక్కువ విజ్ఞానం ఉంటే వాళ్ళు నవ్వుతారు .... అసలే విజ్ఞానం లేనివాళ్లు కూడా నవ్వుతారు ... (అందరూ కాదు )
నాకు ఈ విషయం తెలియనంత మాత్రాన ....నవ్వాలా ...??!! అని ఆలోచిస్తాం .....
మనకు గనక అంతర్గతంగా మన మీద నమ్మకం ఉంటే ఆ నవ్వుల్ని మనం లెక్కచేయల్సిన అవసరం ఉండదు .....అనుకోండి ...అది వేరే విషయం ...
అయితే నన్ను చూసి కూడా కొందరు నవ్వుతూ ఉంటారు ....
నాకు తెలియదు అని నిజాయితీగా చెప్పినప్పుడు ....
వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ....,,,
తెలిసిన విషయాల మీద నా అభిప్రాయాలు బలంగా ఉంటాయి ....అవి నాకు తెలుసు అని ...,,,,
తెలియని విషయాల మీద కూడా నా అభిప్రాయాలు బలంగా ఉంటాయి ....అవి నాకు తెలియవు అని ....
మొత్తానికి అభిప్రాయం అనేది ఎప్పుడూ బలంగా ఉంటుంది అన్నమాట ....
ఇది వాళ్లకు తెలియదు అని వాళ్ళు నాకు చెప్పరు....
ఒకవేళ చెప్పినా నేను నవ్వను ...

No comments:

Post a Comment