Sunday, April 16, 2017

ఏదీ కోరుకోకపోవడం....సొంతం చేసుకోవాలనే కోరిక లేకపోవడం ....వ్యామోహ పడకపోవడమే ...

ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే నేను ధనవంతుడిని / ధనవంతురాలిని అనే భావం మీకెప్పుడైనా కలిగిందా ....??!!
ఒక్క క్షణం అయినా కలిగిందా ....నిజంగా అలాంటి ఫీలింగ్ కలిగితే ....ఓహ్ ....అద్భుతంగా ఉంటుంది కదూ .... ??!!
========================
గత కొన్ని రోజులుగా .....నేను చేతి గడియారం పెట్టుకోవడం మానేసాను అని ఈ మధ్యే గమనించాను .........
అది నేనెంతో ఇష్టపడి కొనుక్కున్న చేతి గడియారం ....బయటకు వెళ్లేప్పుడు నేను పెట్టుకునే ఒకే ఒక్క విలువైన ఆభరణం అదొక్కటే ప్రస్తుతం ....
ఇక్కడ పాంట్ షర్ట్ లే వేసుకుంటాం కాబట్టి ఏం పెట్టుకోకపోయినా ...మెడ మీద, నుదురు , చేతులు తదితర భాగాలు బోసిగా అనిపించవు .....అందుకే ఒక్క గడియారం పెట్టుకుంటూ ఉంటా ....అయితే గత కొన్ని రోజులుగా పెట్టుకోవడం మానేశా అనే విషయం తర్వాత గమనించాను ....
గుర్తొచ్చి పెట్టుకోవాలని గడియారం దగ్గరకు వెళ్లడం ....నవ్వి దానివైపు చూసి అక్కడే వదిలేసి వెళ్లడం జరుగుతుంది .....ఎందుకు అలా అనిపిస్తుంది నాకు ..అని ఆలోచించా ....
ఆలోచనకు అందలేదు ......
ఈ క్రమంలోనే ...మొన్నా మధ్య షాపింగ్ కి వెళ్ళా ....
(ఈ షాపింగ్ కి వెళ్ళడానికి కూడా ఓ కారణం ఉంది ....అది మరోసారి ఉదహరిస్తాను ....అది నా చిన్న కూతురి కోరిక ...నా కోసం ఏమైనా కొనుక్కోమని .....)
సరే అదో పెద్ద షాపింగ్ కాంప్లెక్ .....రకరకాల షాప్స్ ఉన్నాయి ....
నా దగ్గర షూ లాంటి చెప్పులు ఎక్కువ లేవు ....ఓ రెండు జతలే ఉన్నాయి ....చెప్పులు కొనుక్కుందాం అని చెప్పుల షాపుకి వెళ్ళా .....
చాలా చాలా బాగున్నాయి అన్ని ....షాపులో అమ్మాయిని పిలిచి నా సైజు చెప్పులు అడిగి తీసుకుని మరీ సైజు లు చూసుకున్నా ....షాపులో దాదాపు అన్ని చెప్పులు చూసాక ...కొన్ని నచ్చాయని సెలెక్ట్ చేసుకున్నాక ....ఇప్పుడు నిజంగా నాకు ఈ చెప్పులు అవసరమా??!! ........లేదా ..అందరూ నాకు రెండు జతలే ఉన్నాయి అనుకుంటారు అని తీసుకుంటున్నానా ....??!!
ఒకవేళ అనుకుంటే నాకు నష్టం ఏముంది .....??!!
అలా ఆలోచించాక ....నవ్వుకుంటూ చెప్పులు కొనకుండా షాప్ బయటకు వచ్చేసా ....
తర్వాత బట్టలు గురించి ఆలోచించా ....ఏవో కొన్ని మంచి బట్టలు ఉన్నాయి కదా .... ఎందుకు... అవసరం లేదు అనిపించింది ....??!!
ఇంకేం అవసరం ఉంది అని ఆలోచిస్తే ....ఏమీ అవసరం లేదు అనిపించింది .....
ఈ క్షణం నా ఒంటి మీద ఆభరణాలు ఏం ఉన్నాయి అని ఆలోచిస్తే .....ఏం లేవు ....
ఏం కావాలి ....??!!
శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు , తిరగడానికి కాలికి చెప్పులు , తినడానికి తిండి .....అవసరం అయిన ఫోన్ , కార్ లాంటివి తప్పవు ఇక్కడ .....అవి కూడా ఉన్నాయి ....
ఇంకేం కావాలి ....
ఇంకేం వద్దు .....
షాప్స్ అన్ని తిరిగి చూస్తుంటే .....ఇది వరకు... ఇది కొనాలి అది కొనాలి అనిపించేది .....అది నా సొంతం చేసుకోవాలి ....ఇది నా సొంతం చేసుకోవాలి అనిపించేది .......
ఇప్పుడు ....ఏదీ సొంతం చేసుకోవాలని లేదు .....ప్రపంచంలో ...అన్నీ ఎక్కడివక్కడే వాటి వాటి స్థానాల్లో ఉండాలి ....నేను చూసి ఆస్వాదించాలి అంతే...
ఎందుకో ఆ భావం నాకు అద్భుతంగా అనిపించింది ....
అప్పుడు నేను అందరికంటే చాలా ధనవంతురాలిని అనిపించింది .....
ప్రపంచంలో .....ఏదైనా కావాలనుకోవడం కాదు ....ఉందనుకోవడం కాదు ....సొంతం చేసుకోవడం కాదు ....
ఏదీ కోరుకోకపోవడం....సొంతం చేసుకోవాలనే కోరిక లేకపోవడం ....వ్యామోహ పడకపోవడమే ....అన్నిటి కంటే ధనం అని అనిపించింది .....
ఒక్కసారిగా నేను ధనవంతురాలిని అనే ఫీలింగ్ కలిగింది ....అద్భుతంగా అనిపించింది .... <3 <3

No comments:

Post a Comment