Saturday, November 18, 2017

వీళ్ళు జీవితాంతం ఇతరుల సంతోషానికి కాపలా దారులే ....

కొందరి సంతోషం ఇతరుల సంతోషంపై ఆధారపడి ఉంటుంది ....
అంటే ఇతరులు సంతోషంగా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు ....
ఇతరులు ఏ మాత్రం సంతోషంగా ఉండే అవకాశం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాళ్ళు సంతోషంగా ఉండగలరు ....
ఇతరులు ఏ విషయంలో అయినా సంతోషంగా ఉన్నారని గమనించారా ...వాళ్ళ దుఃఖానికి అవధులు ఉండవు ...
అప్పుడేం చేస్తారు ....
వాళ్ళు ఆ దుఃఖాన్ని భరించలేరు కాబట్టి ....దాన్ని పోగొట్టుకోవాలి అంటే ....ఇతరులను దుఃఖం లోకి నెట్టడం తప్ప వేరే మార్గం లేదు ....
మన జీవితంలో అలాంటి వాళ్ళు మనకు ఎదురైతే ....మనం సంతోషంగా ఉన్నా కూడా వాళ్లకి చెప్పకూడదు ...లేదండీ పొద్దుటినుండీ ఏడుస్తూనే ఉన్నాను ....అని చెప్పాలి ....
అప్పుడు వాళ్ళు ...అయ్యో అలా ఏడిస్తే ఎలా ....నాలుగు స్వాంతన వచనాలు పైకి చెప్పి ...లోలోపల ....హమ్మయ్య అనుకుంటారు .....
ఒకవేళ ఇతరులు సంతోషంగా ఉన్నాం అని చెప్పినా ....ఎందుకు మీరు సంతోషంగా ఉన్నారు అని కారణాలు తెలుసుకుని ....అది అబద్ధం అని ....మీరు అనవసరంగా సంతోషంగా ఉన్నారని నిర్ధారించే వరకు నిద్రపోరు ....
వీళ్ళు జీవితాంతం ఇతరుల సంతోషానికి కాపలా దారులే ....
కాటికాపరుల జీవితమే వీళ్ళ కంటే నయం ....వీళ్ళు శవాన్ని పూర్తిగా కాల్చి వాళ్ళ ఆత్మకు శాంతిని చేకూర్చి ....సంతోషిస్తారు ....
వీళ్ళు ఇతరుల సంతోషాన్ని కాల్చి వాళ్ళ దుఃఖానికి శాంతిని చేకూర్చుకుని ...సంతోషిస్తారు ....!

No comments:

Post a Comment