Tuesday, November 7, 2017

అదే ....జీవన ధ్యానం ...🧘‍♀️

కొందరు మైండ్ ని ఖాళీగా ఉంచుకుంటారు (ఎందుకు ఉంచుకుంటారో కారణాలు అన్వేషించాలి )🤔
కొందరు మైండ్ ని నిండా నింపుకుంటారు ....(ఎందుకు నింపుకుంటారో ..ఏం నింపుకుంటారో అన్వేషించాలి ) 🤔
అయితే రెండు రకాల వ్యక్తులను పరిశీలిస్తే ....🤔

నింపుకున్నవాళ్ళు పదిమాటలు మైండ్ లో నింపాక .....నింపాదిగా ఆలోచించి .....అత్యంత అవసరమైన ఒక్కొక్క మాటను బయటకు చెప్తారు .....ఆ మాట కూడా విలువైనదా కాదా .....అది ఎదుటివాళ్ళకు అర్ధమవుతుందా ....ఉపయోగపడుతుందా .....చుట్టూ ఉన్నవాళ్లకు ఏదైనా హాని కలిగిస్తుందా.....చెప్పాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట వెనక్కి తీసుకోకూడదు .... పర్యావరణం దెబ్బ తింటుందా ....ఇలా రకరకాలుగా ఆలోచించి .....బయటకు విడుదల చేస్తారు .....😍
ఇక మైండ్ ని ఖాళీగా ఉంచుకునేవాళ్ళు ...మైండ్ లోకి వచ్చింది వచ్చినట్టు ....తెచ్చింది తెచ్చినట్టు ఖాళీ చేస్తారు ....రేకు డబ్బాలో రాళ్ళేసి గల గల గిలకొట్టినట్టు ....ఒకటే నస....ఎదుటివాళ్ళని ఏం చెప్పనియ్యరు ....నోటికి ఏదొస్తే అదే ....కాదు కాదు ....మైండ్ ని ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలనే తొందరలో ....అంతా వచ్చింది వచ్చినట్టు కక్కేస్తూ ఉంటారు ....చుట్టూ ఉన్నవాళ్లు ఇబ్బంది పడతారా ....బాధింపబడతారా అనే విచక్షణే ఉండదు ....ఎవడెలా పొతే నాకేం అన్నట్టు ....ఏదో ఒకటి అనేయడం....సారీ సారీ అనడం ....
ఇలాంటి వాళ్ళ వల్ల...అందరి మెదళ్ళూ హరించివేయబడతాయి ....పీడించబడతాయి ...
పర్యావరణ కాలుష్యం ....శబ్ద కాలుష్యం ....అసహన కాలుష్యం ....ఒకటనేమిటి ....అంతా కాలుష్యమే ....😥
ఈ కాలుష్యాన్ని అరికట్టాలి ....దీనికి ధ్యానం ఒక్కటే నాకు తెలిసిన మార్గం ....🧘‍♀️
మనం ప్రశాంతంగా బ్రతకాలి ....ఇతరుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వాలి ....😍
అదే ....జీవన ధ్యానం ...🧘‍♀️

No comments:

Post a Comment