Friday, November 24, 2017

ఇదొక రకమైన మానసికక్రీడ..!

కొంతమంది ఉంటారు ....
సంభాషణ మొదలుపెడతారు మనతో ....
మొదటి కాసేపు బాగానే ఉంటుంది ....🙂
తర్వాత వారికి సామరస్య సంభాషణ రుచించదు ....🙄
వెంటనే మనకు కోపం తెప్పించేలా ఏదో ఒకటి అంటారు ....
మనకు వారి ఆంతరంగిక అభిప్రాయం అర్ధం కాకపోతే, వారు కోరుకున్న విధంగా కోప్పడతాం ....😡
వారు శాంతపూరిత స్వభావం ఉన్నట్టు మానవత్వం ప్రదర్శిస్తారు ....పనిలో పనిగా మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరించి ....వాళ్ళ అహం సంతృప్తి పరచుకుని ...ఆ రోజుకి సమాజంలో మనిషిగా బ్రతకడానికి సరిపడా శక్తిని సంపాదించుకుంటారు .....
కొన్నిసార్లు మనకు అర్ధం అయితే ...., మనం కోప్పడం ...😷
అప్పుడు వారు మరో విధంగా కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తారు ....
అయినా సంయమనం పాటిస్తే ...ప్రపంచంలో ఉన్న అన్ని విధాలుగా ప్రయత్నించి (చివరకు మన జాతి ని , నీతిని అవమానించి అయినా ) మనకు కోపం తెప్పించడంలో సఫలీకృతులు అవుతారు .....😡
తప్పదు ....అది వారి మనుగడ కోసం ....అవసరమైన అహం సంతృప్తి కోసం చేసే ఒకవిధమైన జీవన పోరాటం ....
వారి అంతిమ లక్ష్యం మాత్రం ...ఎదుటివారిని ....ఏదో ఒక విధంగా.... మానవత్వం లేనివారిగా , దుర్మార్గులుగా , బాధ్యతలే లేని వారిగా , చేతకానివారిగా చిత్రీకరించడమే ....
తద్వారా వారిలో ఎదుటివారికంటే మెరుగుగా అవన్నీ తమలో ఉన్నాయని సంతృప్తి పడడమే .....😥
సంభాషణ ఇరువురిచే సామరస్యంగా ప్రారంభించబడి....వారిచే వక్రీకరించబడి .... చివరకు వారిచే సామరస్యంగా ముగించబడుతుంది ....
ఇదొక రకమైన మానసికక్రీడ..!🤔
(గమనిక : నేను మానసిక శాస్త్రం అధ్యయనం చేయలేదు ....రోజూ నాకెదురయ్యే వ్యక్తులతో నాకు ఏర్పడిన వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా చెప్పినవి మాత్రమే ...!)

No comments:

Post a Comment