Wednesday, November 1, 2017

చిన్నతనంలో మా దగ్గర ....

చిన్నతనంలో మా దగ్గర ....
అంటే ...మా గుప్పిట్లో ఏదో ఉందని ....దాచాం అని ...స్నేహితుల్ని ఉడికించడం కోసం...గుప్పిట మూసి ఉంచేవాళ్ళం ....
వాళ్ళు మమ్మల్ని బ్రతిమాలేవాళ్ళు ....

చూపించవా ...??!!
ఉహు ....చూపించను ....
డబ్బులా ....??!!
కాదు .....
చాకెలెట్టా.....??!!
కాదు ...
జీడీలా....??!!
కాదు ....
ఆ ....చేగోడీలా....??!!
లేదు ....
ఏదీ ఒకసారి చూడనీ ....
గుప్పిట ఇంకా గట్టిగా మూస్తాం ....
అయినా ..ఇంకా ఇంకా ..తెరవాలని ప్రయత్నిస్తారు ....
ఇంకా ఇంకా ..గుప్పిట గట్టిగా మూసి పెనుగులాడతాం...
ఎలా అయినా చూడాలనే పంతం పెరుగుతుంది .....
చివరకు ఎంత బల ప్రయోగం చేసినా లొంగక పోవడం వలన కితకితలు పెడతారు ......🤦‍♀️
అప్పుడు ....ఫక్కుమని నవ్వగానే ...గుప్పిట విడివడుతుంది ....🤣
చూస్తే గుప్పిట్లో ఏం ఉండదు ....ఊరికే ఉడికించాం అంతే ....💁‍♀️

---------------------
మేం ఇప్పుడు కూడా కొన్నిసార్లు అంతే ....
ఏదో అర్ధం కానట్టు ఉడికిస్తాం....ఎంతో కష్టపడి అర్ధం చేసుకోవాలి అని పంతం పడతారు పురుషులు .....😜
తీరా చూస్తే మేం వీజీగా అర్ధమై పోతాం ....అర్ధం చేసుకోరూ .....??!!😍😘
(గమనిక: అన్నిసార్లు అంత ఈజీ కాదు ....కొన్నిసార్లు మాత్రమే ...🙅‍♀️)

No comments:

Post a Comment