Sunday, February 12, 2017

ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!!

సహజంగా మనం మనకున్న అనుకూలతలు ఏమిటో ఎదుటివారికి తెలిసేలా ప్రవర్తిస్తాం , లేదా తెలియజేస్తాం ...నిజమే ...అది సహజం కూడా ....ఇలాంటి వాళ్ళు ...అందరి ప్రేమకు అర్హులవుతూ ....అందరితో కీర్తింపబడుతూ ..జీవిస్తూ ఉంటారు .... 

కానీ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రం తమకున్న ప్రతికూలతలు/లోపాలు ఏమిటో ఎదుటివాళ్ళకి తెలిసేలా ప్రవర్తిస్తారు ....అలాంటి వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కుంటూ ,అందరితో విమర్సింపబడుతూ....అందరి ద్వేషానికి గురవుతూ ....జీవిస్తూ ఉంటారు ...

ఇందులో నేను రెండో రకానికి చెందిన వ్యక్తిని అని నా గురించి బాగా అర్ధం చేసుకున్న నా మిత్రులకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .... :P :P :)

అయితే నేను అలా అందరిలా కాకుండా కొందరిలా ....జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నానా అని ఒక పని లేని సాయంకాలం చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తే....,,, నాకు జ్ఞానోదయం కలిగింది ...."ఓహో ఇదా కారణం" అని తెలిసొచ్చి మనసంతా గాల్లో తేలిన ఫీలింగ్ కలిగింది ..... :)

తెలిసొచ్చిన కారణం విషయానికి వస్తే ....,,,,

చాలా మందికి ఉన్న సహజ గుణం ఏమిటి అంటే ....ఎదుటివ్యక్తి బలహీనత తెలిస్తే ...వాటినే గుచ్చి గుచ్చి ,ఎత్తి ఎత్తి చూపించి విమర్శిస్తూ ....తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు ...తన అహం సంతృప్తి పరచుకుంటూ ఉంటారు ....సహజంగా అలా విమర్శిస్తారు అనే భయంతోనే చాలా మంది (అంటే మొదటి రకం వ్యక్తులు )తమకున్న లోపాలను ఎదుటివాళ్ళ కళ్ళ పడకుండా శతవిధాలా దాచేసి ...తమకున్న అనుకూలతలు తెలిసేలా చేసి ....పొగిడించుకోబడుతూ ఉంటారు ....ఇది అన్ కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్ కి వెళ్ళడం లాంటిది ...!! (వాళ్ళ దృష్టిలోమాత్రమే.... :P )

ఈ రెండో రకం ....అంటే నాలాంటి వాళ్ళు ....తమలో ఉన్న లోపాలను దాచకుండా ప్రదర్శించి అందరితో విమర్శలకు గురవుతారు ...అలా విమర్శలు ఎదుర్కొనీ ఎదుర్కొనీ కొంతకాలం తర్వాత .....,,,,,
ఆ విమర్శలు వాళ్ళని ఏమీ చేయని స్థితికి ....,
ఆ విమర్శలను లెక్కచేయని స్థితికి ,
ఆ విమర్శలను నవ్వుతూ స్వీకరించే స్థితికి ....,
అవతలి వాళ్ళు కొత్త విమర్శలు వెతుక్కోవాల్సిన స్థితికి ...,
ఆ లోపాలు లేని స్థితికి .....,
కొత్త లోపాలు ప్రదర్శించి అవి కూడా విమర్సించేలా చేసుకుని అవి తమలో లేని స్థితికి చేరుకుంటారు ....,


ఇది కంఫర్ట్ జోన్ నుండి అన్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లి మళ్లీ కంఫర్ట్ జోన్ లోకి రావడం లాంటిది అన్నట్టు....(అందరి దృష్టిలో కాదు ....) ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!! :) :)

Saturday, February 11, 2017

ఆత్మీయుల నుండి నాకెదురైన కొన్ని ప్రశ్నలు ....వాటికి నా సమాధానాలు .....!

మధ్య ఆత్మీయుల నుండి నాకెదురైన కొన్ని ప్రశ్నలు ....వాటికి నా సమాధానాలు .....!
---------------------
నిన్ను అందరూ ఇష్టపడడం సాధ్యమా .....??!!
సాధ్యం కాదు .....
నిన్ను అందరూ ఇష్టపడాలని నువ్వు కోరుకుంటావా ....??!!
కోరుకోను....అది అమాయకత్వం .... :) 

నువ్వు అందరినీ ఇష్టపడడం సాధ్యమా ....??!!
సాధ్యమే .... 
నువ్వు అందరినీ ఇష్టపడాలని నువ్వు కోరుకుంటావా .....??!!
కోరుకుంటాను ....అది మనస్తత్వం......  <3 


అది నాకు ఖచ్చితంగా తెలుసు .....

నేను గెలిచినప్పుడు నాతో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు ...
కానీ నేను ఓడిపోతే మాత్రం నాతో ఒకరుంటారు .... :)
అది నాకు ఖచ్చితంగా తెలుసు .....

అది "నేనే" ... !! :) :) <3

నీ మంచి కోసమే చెబుతున్నా ....నా మాట వినరా బుజ్జీ ……

నీ ముందు కొన్ని ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, నీళ్లు ఉన్నాయి, అందమైన ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత విశాలమైన స్థలం ఉంది ....వ్వాట్ నాట్..... ఇల్లు కట్టుకోవడానికి కావలసినవి అన్నీ నీ ఎదురుగా ఉన్నా కూడా ...నీ జీవిత కాలంలో నువ్వు రెండు ఇటుకలని కూడా ఒక చోట చేర్చలేక పోయావు ..... :(
అలాంటి నువ్వు .....ఎక్కడో, ఎప్పుడో, అందమైన సువిశాల భవంతి నిర్మిస్తానని కలలు కంటున్నావు ..... :P
"
ఇదిగో నా అరచేతిలో ఉన్నదే స్వర్గం అని.... " అందరినీ నమ్మించాలని నీ ప్రయత్నం .... :P
పోనీ... నీ కలలు.... నీ నమ్మకాలు ...నీ ఇష్టం ....ఎలాగైనా బ్రతుకు ...
కానీ........., ఇక్కడ ...ఇప్పుడు ...ఎంతో శ్రమించి ...
పుల్లా పుల్లా పోగేసుకుని,
మట్టీ నేలా కలిపేసుకుని,
శ్వాసా ఆశా కలబోసుకుని,
 
తన ముందు ఉన్నవాటితో ....ఒక చిన్న నివాస యోగ్యమైన గుడిసె కట్టుకుని... విజయవంతంగా నివసిస్తున్నాడే.... మనిషి ....అతని ముందు మాత్రం ఇవన్నీ చెప్పకు ....!

——————————
నీ మంచి కోసమే చెబుతున్నా ....నా మాట వినరా బుజ్జీ …… :) :) :P :P

Friday, February 10, 2017

చుట్టూ చిమ్మ చీకటి..పక్కనే దూరంగా చెట్ల మధ్యన ఒకే ఒక్క బిల్డింగ్ కనిపిస్తే......

కార్లో ప్రయాణిస్తూ ఉంటాం .....ఉన్నట్టుండి పెట్రోల్ low level అని హెచ్చరిక సమాచారం చూపిస్తుంది .....

పెట్రోల్ low level కి రాగానే ....వెంటనే "ఇప్పుడేగా వార్నింగ్ వచ్చింది ,ఇంకా 40 మైల్స్ నడపొచ్చు ...." అనుకుని సాగిపొతూ ఉంటాం ......అప్పుడు ఎన్ని మైల్స్ లో low level లోకి వచ్చిందో నెంబర్ గుర్తు పెట్టుకుని .....తర్వాత ఎన్ని మైల్స్ నడుపుతున్నామో కలుపుకుంటూ ..."వార్నింగ్ ఇస్తే ....మేం వింటామా అన్నట్లు "....cool అనుకుంటూ వెళ్తూ ఉంటాం ...... 


20 మైల్స్ వెళ్ళిన తర్వాత ...."ఇంకా 10 మైల్స్ తర్వాత చూద్దాం ....కంగారేం లేదు అనే ఆలోచన ...." 

అలా మరో 10 మైల్స్ .....అప్పుడు పెట్రోల్ కోసం వెతకడం మొదలు పెడతాం ...నిమిషానికో సారి టెన్షన్ తో చూసుకోవడం అపుడే మొదలవుతుంది ....

మరో 5 మైల్స్ లో పెట్రోల్ దొరుకుతుంది అనే సమాచారం చూసుకుని ..."హమ్మయ్య" అనుకుంటాం .....

2 లేక 3 మైల్స్ వెళ్ళాక, కొన్నిసార్లు వాతావరణం సహకరించకపోతే ......ట్యాంక్ లో పెట్రోల్ మరీ అడుగుకి వెళ్ళిపోతే ...మన దురదృష్టం బాగుంటే ....ఇంజన్ కి పెట్రోల్ అందడం కష్టం అయితే .... కార్ ఆగిపోతుంది ...... :( 

సిటీ లో ఆగిపోతే దురదృష్టం కాస్త తక్కువున్నట్టు ... :P 

ఎక్కడో ఊరి బయట ఎవరూ లేని చోట ఆగిపోతే, (అదృష్టం కాస్త తక్కువున్నట్టు )... :( 

అక్కడ ఎవరూ లేకపోతే ...వెనక,ముందూ ఏ కారో వస్తున్న జాడే లేకపోతే ...చుట్టూ చిమ్మ చీకటి..పక్కనే దూరంగా చెట్ల మధ్యన ఒకే ఒక్క బిల్డింగ్ కనిపిస్తే ....,,,,వెంటనే పెట్రోల్ ఎలా తెచ్చుకోవాలా అనే ఆలోచన కంటే ముందు ...కృష్ణ కాటేజ్ సినిమా గుర్తొస్తే .....(ఎప్పుడూ ఏ ఆలోచనలు రాకూడదో అవే రావడం సహజం కాబట్టి) ....ఆ క్షణంలో ....ఇంకేముంది ...పై ప్రాణాలు పైనే పోతాయి ......

అలా కాకుండా .........................................

పెట్రోల్ low level కి రాగానే ......వెంటనే దగ్గరలో పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అని నావిగేషన్ సిస్టం లో సెర్చ్ చేసి ..... అక్కడకు వెళ్లి ట్యాంక్ Full చేసుకుని మళ్లీ ప్రయాణం మొదలు పెడితే .....అనుకున్నట్లు గానే ప్రయాణం హాయిగా ......అలా అలా ......ఆ క్షణంలో... 

"అయినా మనిషి మారలేదు ...ఆతని మమత తీరలేదు .... "పాట మాత్రం వినసొంపుగా వినిపిస్తూ ఉంటుంది .....

మన చేతుల్లోనే ఉన్న ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని అందమైన పాటలా మారుస్తుంటే ...,,,,,??!!

......నాకైతే పాట వినడం ఎంతో హాయిగా ఉంటుంది ......

(అన్నట్లు కృష్ణ కాటేజ్ సినిమా మాత్రం ఒకసారి చూసాను సుమా ....!!... :) )

-----------------       -------------------     ---------------------

(గమనిక : ఈ ఆర్టికల్ February 10, 2014 తేదీన వ్రాశాను ...)

Tuesday, February 7, 2017

నా భావాల మీద ప్రేమతో ....!!

"నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు/నీకు కోపం సెట్ కాదు" ఒకరు .....
"నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి/ నువ్వు ఏడిస్తే నాకు హాయిగా ఉంటుంది..." మరొకరు ....
"నువ్వు బాధ పడితే నేను చూడలేను/నీ సంతోషం కోసం ఏమైనా చేస్తా ..."ఇంకొకరు ....
------------------------------------------------------------
ఇవన్నీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ప్రయోజనం గురించి ఆలోచించి కోరుకునే భావాలు మాత్రమే కాదు .....మనం ఎలా ఉంటే వాళ్ళు ఆహ్లాదంగా ,ఆనందంగా ఉంటారో ఆలోచించుకుని వాళ్ళ కోసం ....వాళ్ళు కావాలని కోరుకునే భావాలు కూడా కావచ్చు కొన్నిసార్లు .........
అప్పుడెప్పుడో....బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఒకరు ఏకంగా హత్యలే చేసినట్లుగా ....(రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తీసారనుకోండి ....) మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళు మనకు ఎదురైన ప్రతిసారీ ...వాళ్ళు కోరుకున్న భావాలనే ....వాళ్లకు ప్రదర్శించి ....కాదు కాదు .....మనకు తెలియకుండానే అలా ప్రదర్శించడానికి అలవాటు పడి.....జీవన కాల గమనంలో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు .......
నేను కూడా కొన్నిసార్లు, నాకు తెలిసినా....తెలిసీ.... అలా కొన్ని భావాలను ప్రదర్శిస్తూ ఉంటా ...... అయితే నా ఇష్ట/కష్టాలతో సంబంధం లేకుండా అలా ప్రదర్శించడం అన్ని సమయాల్లో సాధ్య పడకపోతే ఏం చేయాలి ....అని ఈ మధ్య దీర్ఘంగా ఆలోచిస్తే .........
---------------------------------------------------------------------------
ఒక ఐడియా వచ్చింది ...... నాకు సాధ్యం కాని ,వాళ్లకు కావాల్సిన భావాలను ప్రదర్శించాల్సి వచ్చిన వ్యక్తులకు తారసపడకుండా ఉంటే సమస్యే ఉండదని .....,

ఇదంతా ఆ వ్యక్తుల మీద ద్వేషంతో కాదు సుమా .....నా భావాల మీద ప్రేమతో ....!! :) :) :)

Sunday, February 5, 2017

రెండూ నా స్వీయానుభావాలే .....!!!

ఎవరిమీదైనా మనకు విపరీతమైన కోపం వస్తే ....,

1.ఆ కోపం వెంటనే ప్రదర్శించడం ఒక పద్ధతి ....

2.కాస్త ఆగి ఆలోచించి ..లేదా క్షమించి ,ఆ కోపం ప్రదర్శించకుండా ఉండటం ఒక పద్ధతి ...

వెంటనే కోపం ప్రదర్శించడం వలన, మనకు చాలా ఉపశమనం కలగటమే కాకుండా ..... విపరీతమైన సంతోషం కలిగినట్లు అనిపిస్తుంది ....కానీ అది తాత్కాలికం ....తర్వాత కొంతసేపటికి చాలా బాధ మొదలవుతుంది .....( ఆత్మ క్షోభ)

క్షమించి ఆ కోపం ప్రదర్శించకుండా ఉండటం వలన ,మనకు చాలా అసహనం......విపరీతమైన బాధ కలిగినట్లు అనిపిస్తాయి ......ఇది కూడా తాత్కాలికమే ....తర్వాత కొంతసేపటికి విపరీతమైన సంతోషం మొదలవుతుంది .....( ఆత్మ సంతృప్తి)!!!


రెండూ నా స్వీయానుభావాలే .....!!!