Tuesday, February 7, 2017

నా భావాల మీద ప్రేమతో ....!!

"నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు/నీకు కోపం సెట్ కాదు" ఒకరు .....
"నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి/ నువ్వు ఏడిస్తే నాకు హాయిగా ఉంటుంది..." మరొకరు ....
"నువ్వు బాధ పడితే నేను చూడలేను/నీ సంతోషం కోసం ఏమైనా చేస్తా ..."ఇంకొకరు ....
------------------------------------------------------------
ఇవన్నీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన ప్రయోజనం గురించి ఆలోచించి కోరుకునే భావాలు మాత్రమే కాదు .....మనం ఎలా ఉంటే వాళ్ళు ఆహ్లాదంగా ,ఆనందంగా ఉంటారో ఆలోచించుకుని వాళ్ళ కోసం ....వాళ్ళు కావాలని కోరుకునే భావాలు కూడా కావచ్చు కొన్నిసార్లు .........
అప్పుడెప్పుడో....బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఒకరు ఏకంగా హత్యలే చేసినట్లుగా ....(రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తీసారనుకోండి ....) మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళు మనకు ఎదురైన ప్రతిసారీ ...వాళ్ళు కోరుకున్న భావాలనే ....వాళ్లకు ప్రదర్శించి ....కాదు కాదు .....మనకు తెలియకుండానే అలా ప్రదర్శించడానికి అలవాటు పడి.....జీవన కాల గమనంలో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు .......
నేను కూడా కొన్నిసార్లు, నాకు తెలిసినా....తెలిసీ.... అలా కొన్ని భావాలను ప్రదర్శిస్తూ ఉంటా ...... అయితే నా ఇష్ట/కష్టాలతో సంబంధం లేకుండా అలా ప్రదర్శించడం అన్ని సమయాల్లో సాధ్య పడకపోతే ఏం చేయాలి ....అని ఈ మధ్య దీర్ఘంగా ఆలోచిస్తే .........
---------------------------------------------------------------------------
ఒక ఐడియా వచ్చింది ...... నాకు సాధ్యం కాని ,వాళ్లకు కావాల్సిన భావాలను ప్రదర్శించాల్సి వచ్చిన వ్యక్తులకు తారసపడకుండా ఉంటే సమస్యే ఉండదని .....,

ఇదంతా ఆ వ్యక్తుల మీద ద్వేషంతో కాదు సుమా .....నా భావాల మీద ప్రేమతో ....!! :) :) :)