Sunday, February 12, 2017

ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!!

సహజంగా మనం మనకున్న అనుకూలతలు ఏమిటో ఎదుటివారికి తెలిసేలా ప్రవర్తిస్తాం , లేదా తెలియజేస్తాం ...నిజమే ...అది సహజం కూడా ....ఇలాంటి వాళ్ళు ...అందరి ప్రేమకు అర్హులవుతూ ....అందరితో కీర్తింపబడుతూ ..జీవిస్తూ ఉంటారు .... 

కానీ ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రం తమకున్న ప్రతికూలతలు/లోపాలు ఏమిటో ఎదుటివాళ్ళకి తెలిసేలా ప్రవర్తిస్తారు ....అలాంటి వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కుంటూ ,అందరితో విమర్సింపబడుతూ....అందరి ద్వేషానికి గురవుతూ ....జీవిస్తూ ఉంటారు ...

ఇందులో నేను రెండో రకానికి చెందిన వ్యక్తిని అని నా గురించి బాగా అర్ధం చేసుకున్న నా మిత్రులకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .... :P :P :)

అయితే నేను అలా అందరిలా కాకుండా కొందరిలా ....జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నానా అని ఒక పని లేని సాయంకాలం చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తే....,,, నాకు జ్ఞానోదయం కలిగింది ...."ఓహో ఇదా కారణం" అని తెలిసొచ్చి మనసంతా గాల్లో తేలిన ఫీలింగ్ కలిగింది ..... :)

తెలిసొచ్చిన కారణం విషయానికి వస్తే ....,,,,

చాలా మందికి ఉన్న సహజ గుణం ఏమిటి అంటే ....ఎదుటివ్యక్తి బలహీనత తెలిస్తే ...వాటినే గుచ్చి గుచ్చి ,ఎత్తి ఎత్తి చూపించి విమర్శిస్తూ ....తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు ...తన అహం సంతృప్తి పరచుకుంటూ ఉంటారు ....సహజంగా అలా విమర్శిస్తారు అనే భయంతోనే చాలా మంది (అంటే మొదటి రకం వ్యక్తులు )తమకున్న లోపాలను ఎదుటివాళ్ళ కళ్ళ పడకుండా శతవిధాలా దాచేసి ...తమకున్న అనుకూలతలు తెలిసేలా చేసి ....పొగిడించుకోబడుతూ ఉంటారు ....ఇది అన్ కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్ కి వెళ్ళడం లాంటిది ...!! (వాళ్ళ దృష్టిలోమాత్రమే.... :P )

ఈ రెండో రకం ....అంటే నాలాంటి వాళ్ళు ....తమలో ఉన్న లోపాలను దాచకుండా ప్రదర్శించి అందరితో విమర్శలకు గురవుతారు ...అలా విమర్శలు ఎదుర్కొనీ ఎదుర్కొనీ కొంతకాలం తర్వాత .....,,,,,
ఆ విమర్శలు వాళ్ళని ఏమీ చేయని స్థితికి ....,
ఆ విమర్శలను లెక్కచేయని స్థితికి ,
ఆ విమర్శలను నవ్వుతూ స్వీకరించే స్థితికి ....,
అవతలి వాళ్ళు కొత్త విమర్శలు వెతుక్కోవాల్సిన స్థితికి ...,
ఆ లోపాలు లేని స్థితికి .....,
కొత్త లోపాలు ప్రదర్శించి అవి కూడా విమర్సించేలా చేసుకుని అవి తమలో లేని స్థితికి చేరుకుంటారు ....,


ఇది కంఫర్ట్ జోన్ నుండి అన్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లి మళ్లీ కంఫర్ట్ జోన్ లోకి రావడం లాంటిది అన్నట్టు....(అందరి దృష్టిలో కాదు ....) ఇక లైఫ్ లో తిరుగు లేదు అన్నట్టు ..!! :) :)

No comments:

Post a Comment