Wednesday, February 22, 2017

ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా విమర్శిస్తున్నారా ....??!!

ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా విమర్శిస్తున్నారా ....??!!

విమర్శల నుండి తప్పించుకునే అవకాశం లేదా ....??!!
ప్రతి విమర్శ చేయడం మీకు ఒకింత బాధగా అనిపిస్తుందా ....??!!
లేదా ప్రతి విమర్శకు వాళ్ళు అర్హులు కాదా ....??!!
విమర్శిస్తున్న వాళ్ళు ఒక్క విమర్శలు తప్ప అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడడం లేదా ....???!!
అలాంటప్పుడే చాలా సంయమనంగా ఆలోచించాలి ....
అలాంటి వాళ్ళను విమర్శించనీయండి ....ఇంకా ఇంకా విమర్శించనీయండి .... తర్వాత కొన్ని రోజులకు మన మెదడు విమర్శకు బాధపడడం ఆపేస్తుంది ....
అలాంటి విమర్శ రాగానే అది విమర్శగానే తనలోకి స్వీకరించి ....అది తనకు అనుకూలంగా మార్చుకుని ఒక పొగడ్త గానో....లేదా మనకు కావలసిన స్ఫూర్తిగానో మార్చి ....మనకు చూపడం మొదలుపెడుతుంది .... స్థితికి వచ్చాక ....అది ఇచ్చిన స్పూర్తి మనం ఉపయోగించుకోవడం మొదలు పెట్టాక ....ఫలితాలు ఎలా ఉంటాయంటే ....ప్రపంచంలో ఇక మనకు తిరుగులేదు అన్నట్టు ఉంటాయి .... విమర్శా మనల్ని ఏం చేయదు అన్నట్టు ఉంటుంది ....,,
అయితే మెదడు కొన్నిసార్లు ... విమర్శను ...పొగడ్తగా ...లేదా స్పూర్తిగా మార్చుకునే క్రమంలో చేసే సంఘర్షణలో ..... విమర్శించిన వారి మాటలను ...అసలు అంగీకరించకపోవడం , అవి అసలు మాటలే కాదని విలువలేనివిగా తేల్చి కొట్టి పారేయడం ....వ్యంగ్య పూర్వక సమాధానాలు ఇవ్వడం ...లాంటివి జరగొచ్చు ... ,,,
ఏది ఏమైనా ....మన మెదడుకు తన స్వీయ రక్షణ తనకు ముఖ్యం ....
అలాంటి ఆహ్లాదకర సంఘర్షణ జరగనివ్వాలి ....లేకపోతే మన మెదడు ను మరొకరు తమ అధీనం లోకి తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ....!!

(గమనిక : ఇది అందరికీ వర్తించదు ....)

Tuesday, February 21, 2017

చిన్నతనం నుండి ....నిన్న మొన్నటి వరకు ...,,,

చిన్నతనం నుండి ....నిన్న మొన్నటి వరకు ...,,,

నన్ను ఎవరైనా విమర్శించే సమయంలో .....నేను ఎవరి విమర్శనైనా స్వీకరించే సమయంలో ......,,,
నావి - ఎదుటివారివి.... హావభావాలు ....వరుసక్రమంలో ఇలా మారుతూ ఉంటాయి ....
=========================
ముందుగా ...నాలో ఆవేశం ....వారిలో చిరునవ్వు
తర్వాత ....నాలో ఏడుపు ....వారిలో ప్రశాంతత
తర్వాత ...నాలో ఆలోచన ....వారిలో కూడా ఆలోచనే ....
ఆ తర్వాత ...నాలో ప్రశాంతత .....వారిలో ఏడుపు ...
చివరకు ....నాలో చిరునవ్వు .....వారిలో ఆవేశం ....
===========================
ఇప్పుడైతే ఇంతసేపు సాగతీత ఏం లేదు .... :) :P
అట్టే సమయం తీసుకోకుండా తేల్చేస్తున్నా ఒకే ఒక్క చిరునవ్వుతో .... :)
పాపం వారికే ఆవేశంతో మొదలు పెట్టడం కష్టంగా ఉంది .....! :) :P :P

Sunday, February 19, 2017

ఏం కావాలి మీకు ...??!!

ఏం కావాలి మీకు ...??!!
తెలియదా ...,,,
లేదా తెలుసా ....,,,
ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి ....!!
50 ఏళ్ళు పైబడినా కొందరికి (ఎందరికో ) వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే తెలియదంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు ....
మాటలు కూడా రాని పసివాళ్ళకు ...కొంతమందికి సైగలతో అయినా వాళ్లకు ఏం కావాలో వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు అంటే కూడా ఆశ్చర్యం కలగక మానదు ....
అందుకే ముందుగా మనకు ఏం కావాలో మనం తెలుసుకోవాలి ....
కీర్తి , డబ్బు , ప్రేమ , బంధాలు , బాధ్యతలు , విజ్ఞానం ....ఇవన్ని కాకపోతే ఇతరుల చెడు(ఇది కూడా కావాలి కొందరికి) .....ఇలా ఏదో ఒకటి ...కానీ మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ....
ఆ తర్వాత అవి సాధించడం కోసం మనం నిరంతరం కృషి చేయాలి .....అందకపోతే ఇంకా ఇంకా కృషి చేయాలి ....
అవి అందుకోవడానికి ఏవైనా అడ్డు పడుతుంటే ....ఆ అడ్డంకులను అధిగమించాలి ....
ఒకవేళ మనం కావాలనుకున్నది సాధించడానికి ....మనం కావాలనుకోనిది అడ్డు పడుతుంది అనుకోండి ....మనం కావాలనుకున్నదాన్ని సాధించడం కోసం అందుకు అడ్డు పడేదాన్ని కూడా సాధించాలి .....
ఉదాహరణకు మనకు కీర్తి కావాలి అనుకుందాం ....దానికి డబ్బు అడ్డుపడుతుంటే ....డబ్బు సంపాదించి తర్వాత కీర్తి సంపాదించాలి ....(అది మన కీర్తికి ఏ మాత్రం ఆటంకం కలిగించకుండా జాగ్రత్తపడాలి ....)
లేదా డబ్బు కావాలి అనుకుంటే .....దానికి బాధ్యతలు అడ్డు పడుతుంటే .....బాధ్యతలు నిర్వర్తిస్తూ డబ్బు సంపాదించాలి ...
ప్రేమ కావాలి అనుకుంటే ....లేదా మరేదైనా చేయాలనుకుంటే ...అది ....ఇలా .....
మొత్తానికి మనం ఏం కోరుకుంటున్నామో మనకు దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటేనే మనం ఏమైనా చేయగలం .....
మనకు ఏం కావాలో మనకే తెలియకపోతే ....మనకు మన జీవితమూ అయోమయమే ....పక్క వాళ్ళ జీవితం అంతకంటే అయోమయం ..... ఈ అయోమయంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాల్చుకు తింటూ ఉంటారు కొందరు ....
నాకు ఏదో కావాలి అని (అదేమిటో చెప్పలేరు ) ....,
నా జీవితం ఇలా ఉంది అని ....,,,,
నా జీవితం అల్లా వాళ్ళలా ఉంటే బాగుండేది అని .........,,,,
నాకు బ్రతకడం ఎలాగో తెలియట్లేదు అని .....ఇలా ....,,,,
అందుకే ...పోయి ...తెలుసుకోండి ....ముందు మీకేం కావాలో ....??!!
చుట్టుపక్కల బ్రతికే వాళ్ళను పీక్కుని తినకుండా .... !!

Saturday, February 18, 2017

అలాంటి హృదయాన్ని కరిగించాలంటే ....., ప్రేమకే సాధ్యం ....!


కష్టానికి.. హృదయం ద్రవించినప్పుడు మాత్రమే ..మనకు దుఃఖం వస్తుంది ..,

హృదయం కరడు కట్టినప్పుడు ....దుఃఖాన్ని కూడా మనం బ్రతిమాలుకుని ఆహ్వానించాలి ... :( 
కరడు కట్టిన హృదయాన్ని కరిగించే శక్తి ఆ దుఃఖానికి కూడా ఉండదు ....,
అలాంటి హృదయాన్ని కరిగించాలంటే ....., ప్రేమకే సాధ్యం ....!

"జీవితంలో నేను పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు"

కొందరు .....

"జీవితంలో నేను పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు" .....అని
"నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకేం తెలుసు" .....అని,
"నా కష్టాలకు ఎంత బాధ అనుభవించానో నా స్థానంలో ఉంటే మీకు తెలుస్తుంది" ....అని, నాతో అంటూ ఉంటారు ....

నాకు సానుభూతి , నవ్వు ఏకకాలంలో వస్తూ ఉంటాయి ..... :( :) 

వాళ్లకు తెలియనిది , వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే .....,,

ఎదుటివాళ్ళు నవ్వుతూ ఉన్నారని , లేదా వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకోలేదని ....వాళ్లకు అసలు కష్టాలే లేనట్టు కనిపించారని .....వాళ్లకు కష్టాలు లేవని , కష్టం అంటే తెలియదని అనుకోవడం మీ అమాయకత్వం .... :P 

అసలు జీవితం లో కష్టాలు లేనిది ఎవరికి....??!!

పుట్టిన పసిపాని అడుగు ....

మాటలు వస్తే .....తనకి ప్రపంచంలో బ్రతకాలని ప్రయత్నించడం ఎంత కష్టమో .....తల్లి కడుపులో ఎంత హాయిగా ఉండేదో వివరిస్తుంది ..... :( :( 

ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎన్నో కష్టాలు , సుఖాలూ ఉంటాయి ..

కానీ కొందరు సుఖాల్ని మాత్రమే ఎదుటివాళ్ళకు పంచుకుని .....కష్టాలని తామే భరించడం నేర్చుకుంటారు ....

ఎందుకంటే .....బహుశా ...., ప్రపంచం సుఖాలను మాత్రమే తేలికగా పంచుకునే శక్తి కలిగి ఉంటుంది అని వాళ్ళు గమనించి ఉండొచ్చు ..... 

తమ చుట్టూ ఉన్నవాళ్లకు కష్టాల్ని పంచుకునే శక్తి లేదని వాళ్ళు బలంగా విశ్వసించవచ్చు .....

లేదా తమకు తామే కష్టాలను తమలో దాచుకుని భరించే అసాధారణ శక్తిని సంపాదించుకుని ఉండొచ్చు ..... <3 


చెప్పలేం ....మాహానుభావుల జీవితాలు అస్సలు అర్ధం కావు ....!

"నువ్వు నీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు "

"నువ్వు నీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు " అని నాతో అంటూ ఉంటారు కొందరు .....

నేను అది పట్టించుకునే స్థితిలో ఉండను ..... :) 

వాళ్ళ మాటలు లెక్కచేయని మనస్తత్వం వలన మాత్రం కాదు సుమా .....  

అదే బాధ్యతను ఇంకా నాకు చేతనైనంతవరకు ఇంకా నిర్వర్తిస్తూ చాలా బిజీగా ఉంటా ... :) 

ఆ బాధ్యత నిర్వర్తించడం అయిపోయాక, తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తా ....

ఎంతవరకు చేశాను ....
ఎంతవరకు చేయలేదు ....
ఇతరులు అందులో ఎంత తీసుకున్నారు ....
ఎంత తీసుకోలేదు ....
నేను వాళ్లకు ఎంత అందించగలిగాను ....
ఎంత అందించలేకపోయాను..... అని ....,

అప్పటివరకు ఇలా ఆలోచించే సమయాన్ని కూడా ...నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోవడంలో వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు .....!! <3

Wednesday, February 15, 2017

గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ...

జీవితంలో ఏర్పడే అనేక అభివృద్ధి దశలే మెట్లు అనుకుంటే ...,,,

ఆ మెట్లు చాలా కష్టపడి / ఇష్టపడి అధిరోహిస్తూ అది అభివృద్ధి అనుకుంటే ...,,,,

అది కొంతమంది సునాయాసంగా అధిరోహిస్తూ ఉంటారు ...కొందరు వ్యయ ప్రయాసలకోర్చి అధిరోహిస్తూ ఉంటారు ....మరి కొందరు ...ఎప్పుడో ఒకసారి ఒకమెట్టు అతి కష్టం మీద ....ఇంకొందరు వారి జీవితకాలం అంతా ప్రయత్నించినా ఒక్క మెట్టు కూడా అధిరోహించలేక పోతారు ....ఏది ఏమైనా ఇదంతా ఎవరి దృష్టిలో ….ఎప్పుడు ....ఎందుకు ....ఎలా …అనేది నిర్వివాదాంశం ....!!

ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు .... ఆ ఎక్కిన/ దిగిన మెట్లు ని బట్టి వాళ్ళ వాళ్ళ జీవన విధానం కూడా మార్పు చెందుతూ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం ....

కొందరు ఎక్కిన/దిగిన మెట్లుకి అనుగుణంగా జీవన విధానం మార్పు చెందనివ్వకుండా ...సమాజానికి అనుగుణంగా నియంత్రించుకుంటూ ఉంటారనుకోండి ....అదివేరే విషయం ....!

అయితే ...ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే .......,,,,

కొందరు ...అర్హత సంపాదించాం అనుకుని కొన్ని మెట్లు ఎక్కి ....అందుకు అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని కూడా మార్చుకుంటారు ...కానీ కొంతకాలం ఆగాక ....జీవన విధానానికి తగినట్లుగా మన ఎదుగుదల లేదని ....మన అర్హత ఇంకా ఆ మెట్టుకి చేరుకోలేదు అని....తెలుస్తుంది...అప్పుడు తప్పనిసరి గా ఒక మెట్టు కిందకు దిగాల్సి వస్తుంది ...
వీళ్ళ అలవాటును ఎవరూ మార్చలేరు ....వీళ్ళను చూసి వీళ్ళే నవ్వుకునే పరిస్థితి అది ...

మరి కొందరు ...ఒక మెట్టు ఎక్కిన తర్వాత..వందసార్లు ఆలోచిస్తారు...
మనం...మనం ఎక్కాల్సిన మెట్టుకి అర్హత సంపాదించుకున్నామా లేదా అని ....,,,
అందుకు తగినట్లుగా మన జీవన విధానం మార్చుకోవచ్చా ...అని ....,,,
ఇక ఒకసారి వాళ్ళ జీవన విధానం మార్చుకుంటే .....ప్రాణం పోయినా క్రింది మెట్టుకి రారు ....అలా రావాల్సి వస్తే వాళ్ళ ప్రాణాలే వదిలేస్తారు .....వీళ్ళను చూసి వీళ్ళే గర్వపడే పరిస్థితి అది ….!!


ఏది ఏమైనా ....ఎలా జీవించినా....చివరకు గంజి నీళ్ళు త్రాగి బ్రతికినా .., బెంజి కారు ఎక్కి తిరిగినా ....,,,,, మన జీవన విధానం మనకు గర్వం కలిగించాలి తప్ప ...మనకే నవ్వు తెప్పించకూడదు ....అనేది నా అభిప్రాయం .!!