Sunday, February 19, 2017

ఏం కావాలి మీకు ...??!!

ఏం కావాలి మీకు ...??!!
తెలియదా ...,,,
లేదా తెలుసా ....,,,
ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి ....!!
50 ఏళ్ళు పైబడినా కొందరికి (ఎందరికో ) వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే తెలియదంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు ....
మాటలు కూడా రాని పసివాళ్ళకు ...కొంతమందికి సైగలతో అయినా వాళ్లకు ఏం కావాలో వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు అంటే కూడా ఆశ్చర్యం కలగక మానదు ....
అందుకే ముందుగా మనకు ఏం కావాలో మనం తెలుసుకోవాలి ....
కీర్తి , డబ్బు , ప్రేమ , బంధాలు , బాధ్యతలు , విజ్ఞానం ....ఇవన్ని కాకపోతే ఇతరుల చెడు(ఇది కూడా కావాలి కొందరికి) .....ఇలా ఏదో ఒకటి ...కానీ మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ....
ఆ తర్వాత అవి సాధించడం కోసం మనం నిరంతరం కృషి చేయాలి .....అందకపోతే ఇంకా ఇంకా కృషి చేయాలి ....
అవి అందుకోవడానికి ఏవైనా అడ్డు పడుతుంటే ....ఆ అడ్డంకులను అధిగమించాలి ....
ఒకవేళ మనం కావాలనుకున్నది సాధించడానికి ....మనం కావాలనుకోనిది అడ్డు పడుతుంది అనుకోండి ....మనం కావాలనుకున్నదాన్ని సాధించడం కోసం అందుకు అడ్డు పడేదాన్ని కూడా సాధించాలి .....
ఉదాహరణకు మనకు కీర్తి కావాలి అనుకుందాం ....దానికి డబ్బు అడ్డుపడుతుంటే ....డబ్బు సంపాదించి తర్వాత కీర్తి సంపాదించాలి ....(అది మన కీర్తికి ఏ మాత్రం ఆటంకం కలిగించకుండా జాగ్రత్తపడాలి ....)
లేదా డబ్బు కావాలి అనుకుంటే .....దానికి బాధ్యతలు అడ్డు పడుతుంటే .....బాధ్యతలు నిర్వర్తిస్తూ డబ్బు సంపాదించాలి ...
ప్రేమ కావాలి అనుకుంటే ....లేదా మరేదైనా చేయాలనుకుంటే ...అది ....ఇలా .....
మొత్తానికి మనం ఏం కోరుకుంటున్నామో మనకు దాని మీద స్పష్టమైన అవగాహన ఉంటేనే మనం ఏమైనా చేయగలం .....
మనకు ఏం కావాలో మనకే తెలియకపోతే ....మనకు మన జీవితమూ అయోమయమే ....పక్క వాళ్ళ జీవితం అంతకంటే అయోమయం ..... ఈ అయోమయంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాల్చుకు తింటూ ఉంటారు కొందరు ....
నాకు ఏదో కావాలి అని (అదేమిటో చెప్పలేరు ) ....,
నా జీవితం ఇలా ఉంది అని ....,,,,
నా జీవితం అల్లా వాళ్ళలా ఉంటే బాగుండేది అని .........,,,,
నాకు బ్రతకడం ఎలాగో తెలియట్లేదు అని .....ఇలా ....,,,,
అందుకే ...పోయి ...తెలుసుకోండి ....ముందు మీకేం కావాలో ....??!!
చుట్టుపక్కల బ్రతికే వాళ్ళను పీక్కుని తినకుండా .... !!

No comments:

Post a Comment