Friday, June 9, 2017

"అప్పట్లో నువ్వు చాలా అమాయకురాలివి ...." ఒకరు నాతో .

"అప్పట్లో నువ్వు చాలా అమాయకురాలివి ...." ఒకరు నాతో ....🤣
"ఇప్పట్లో కూడా నేను చాలా అమాయకురాలినే....నాకు తెలియని విషయాల్లో ఎప్పటికీ నేను అమాయకురాలినే .....
నాకు తెలిసిన విషయాల్లో ఎప్పుడూ నేను తెలివైన దాన్నే ....అప్పుడూ నాకు తెలిసిన విషయాల్లో తెలివైన దాన్నే ...." నవ్వుతూ నేను ....😀
కాకపోతే ....
ఏ విషయాలు తెలుసు , ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటాను , ఏ విషయాల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని విసిరిపారేస్తాను , ఏ విషయాలు తెలుసుకోవాలని కృషి చేస్తాను .....అనేది, పూర్తిగా నా ఇష్టా ఇష్టాల మీద , జీవన మనుగడ మీద , మానసిక / శారీరక అవసరాల మీద ఆధారపడి ఉంటుంది అనేది నేనెరిగిన సత్యం ....😍

Thursday, June 8, 2017

స్త్రీకి "Choice" కావాలి ....కాదు కాదు ....సృష్టించుకోవాలి ...

"పురుషులు ....ఏ వయసులో అయినా ,ఏ సమయంలో అయినా తప్పు (అంటే పరాయి స్త్రీ తో శారీరక సంబంధం కలిగి ఉండటం) చేయడానికి కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కారణం తప్ప....అది పురుషుని తప్పు కాదు ...." ఒకరు నాతో ....,,
"ఇది మీరు అంగీకరించాలి ...." మళ్లీ అదే వ్యక్తి నాతో ...
"......................................." నా మౌనం ....
“మీరు అంగీకరిస్తారా ...లేదా ...”మళ్లీ అదే ప్రశ్న ఆ వ్యక్తి నుండి .....
"ఒక స్త్రీగా ....ఈ రోజు , ఈ క్షణం ఇది నేను అంగీకరించకపోవడానికి “Choice” ఏం ఉందా ....అని ఆలోచిస్తున్నాను ....." కాసేపటి తర్వాత నా సమాధానం ....
--------------------------------------
అవును ....నిజమే ....స్త్రీకి "Choice" కావాలి ....కాదు కాదు ....సృష్టించుకోవాలి ....తనకు తానే ....ఎప్పటికీ ......!!
-----------------------------------------------
కొన్నిసార్లు సమాధానం ఇవ్వడంలో ....వాదించడంలో నేను ఓడిపోతూ ఉంటాను .....సరైన సమాధానం ఇవ్వలేను ....అచేతనావస్థలోకి వెళ్ళిపోతాను .....ఎన్నో రోజులు, నెలలు ,సంవత్సరాలు సమయం పడుతుంది సమాధానం ఇవ్వడానికి .....ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందా అని ఆలోచిస్తాను .....ఇలా చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ....అలా ఖండించాల్సింది అనిపిస్తుంది .....నన్ను నేనే అసహ్యించుకుంటాను ....నాకు నచ్చిన నేనులా ఆ క్షణంలో లేనని ...
తర్వాత అర్ధమవుతుంది ....నేను “నాకు నచ్చిన నేనులా” రూపు దిద్దుకోవడానికి భగవంతుడు నాకు ఇచ్చే అవకాశాలే ఇవన్ని అని .....అప్పుడు మాత్రం తుఫాను తర్వాత ప్రశాంతత లా ఉంటుంది మనసు .....
ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ...... చాలా పెద్ద తుఫాను తర్వాత .............!!!!!!!!!!!!!!!!!!! :) :) :)
(Note: wrote and published on June 8 2015 )

కారు దిగి అలా నడుచుకుంటూ జిమ్ లోకి వెళ్తున్నా ...

ఈ రోజు ...
కారు దిగి అలా నడుచుకుంటూ జిమ్ లోకి వెళ్తున్నా ...
ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నా ....బహుశా నా ఆలోచనలు నా నడక మీద ప్రభావం చూపాయేమో కాస్త నెమ్మదిగా నడుస్తున్నా(బహుశా అందులో ఎనర్జీ కూడా తగ్గిందేమో ...గమనించలేదు ) ....

అంతలో జిమ్ లో నుండి... ఓ వ్యక్తి ...నాకు కాస్త దూరంలో ఎదురుగా వస్తూ కనిపించాడు ....ఒక్క క్షణం చూశాను...మళ్లీ తలొంచుకుని నడుస్తున్నా ....
నా ఆలోచనలను అనుసరిస్తూ ....
అతను దగ్గరకు రాగానే .... "నో ....నువ్వలా నడవ కూడదు ....ఇలా రన్ చేయాలి ..." అంటూ రన్ చేస్తూ ... ఓ రెండడుగులు రన్ చేసి చూపించాడు .... ....:)
మనిషి చూస్తే కండలు తిరిగిన శరీరం ....అలా ఫన్నీ గా రన్ చేసేసరికి నాకు ఒక్కసారిగా ఫక్కున నవ్వొచ్చింది .... :)
తర్వాత ...."నేను నీలా ఉండలేను ....నేను ఇలానే నాలానే ఉండగలను ,..." అని నవ్వుతూ చెప్పా ....అతని కండలను ఉద్దేశించి .... :)
అయినా ..అతను నేను చెప్పింది అసలు పట్టించుకోలేదు ....హాయిగా నడుచుకుంటూ.... నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ... :)
ఆ తర్వాత ...అతను ఎందుకలా చెప్పాడు ...రన్ చేసి నేను నవ్వేలా చేశాడు ....నేను నవ్వగానే పనయిపోయినట్టు అలా మౌనంగా వెళ్లి పోయాడు ....అని ఆలోచించా ....
ఒకదానికి ఒకటి లింక్ చేస్తే ....నెమ్మదిగా నాకు అర్ధమైంది ....
నేనేదో కాస్త నీరసంగా , అన్యమనస్కంగా , ఏదో ఆలోచిస్తూ అతనికి కనిపించాను ....అతను ఎలాగైనా నన్ను నవ్వించాలి అనుకున్నాడు ....అలా రన్ చేసి చెప్తే నేను నవ్వుతానని అతనికి అప్పటికప్పుడు అనిపించింది .....వెంటనే నవ్వించాడు ....నవ్వడం నా బలహీనత కాబట్టి అతను ఊహించిన దానికంటే ఎక్కువే నవ్వా నేను .....ఆ నవ్వు చూసి అతను సంతోషంగా వెళ్ళిపోయాడు ....
సందేహం లేదు .......అతనికి ఇతరుల సంతోషం లో తన సంతోషాన్ని చూసుకునే అలావాటు ఉంది ....ఖచ్చితంగా అతను మనిషి .....
నాకు వెంటనే అలాంటి అద్భుతమైన వ్యక్తిని మళ్లీ చూడాలి అనిపించింది ....<3
కానీ ....ఇవన్ని నేను ఆలోచించే సరికి అతను కనుమరుగైపోయాడు .. :(
అద్భుతాలు ,అద్భుతమైన వ్యక్తులు ఎప్పుడూ అంతే ....మెరుపులా మెరిసి మాయమైపోతారు .... :(
కానీ నేనెంతో అదృష్టవంతురాలిని అనిపించింది ....నిజంగా అలాంటి వ్యక్తులు ఎదురుకావడం కూడా అదృష్టమేగా .....??!! <3 :)
మళ్లీ ఎప్పుడైనా మనుష్యులు ఎదురైతే మీకు పరిచయం చేస్తాను .... ♥
(Note: Wrote and published on June 8 2016)

నాతో మాట్లాడడానికి భయపడే వాళ్లకు నేను ధైర్యాన్ని కలిగించను ....

నాతో మాట్లాడడానికి భయపడే వాళ్లకు నేను ధైర్యాన్ని కలిగించను ....
నాతో మాట్లాడడానికి ధైర్యంగా వచ్చేవాళ్ళకు నేను భయాన్ని కలిగించను.....
నాతో మాట్లాడడం ఇష్టం అనుకునే వాళ్లకు నేను కష్టం కలిగించను ....
నాతో మాట్లాడడం కష్టం అనుకునే వాళ్లకు నేను ఇష్టం కలిగించను ....
నాతో మాట్లాడడం నరకం అనుకునే వాళ్లకు నరకమే కనిపిస్తుంది ....
నాతో మాట్లాడడం స్వర్గం అనుకునే వాళ్ళకు స్వర్గమే కనిపిస్తుంది ...
నాతో మీరెలా ఉండాలి అనుకుంటారో ...నేను అలానే కనిపిస్తాను ....
మీతో నేనెలా ఉండాలి అనుకుంటారో...నేను అలా కనిపించను ....
నాతో మీరు జీవించాలి అనుకుంటే ...నేను మీతో జీవిస్తా ....
నాతో మీరు నటించాలి అనుకుంటే ...అయినా,...నేను మీతో జీవిస్తా .. <3 

Sunday, June 4, 2017

ఒక నిజం ఉంది,ఒక అబద్ధం ఉంది ....

ఒక నిజం ఉంది,ఒక అబద్ధం ఉంది ....ఏది ముందు వినగలవు నువ్వు ....అని అడుగుతూ ఉంటారు నన్ను కొందరు కొన్నిసార్లు .... :P (ఇంతకు ముందు కూడా ఎక్కడో ఉదహరించిన గుర్తు )
ఇదివరకు అయితే.. కొంచెం సేపు ఆలోచించి ....అప్పుడు ఏం వినడానికి ఆసక్తి ఉందో....ఏది వినే ధైర్యం ఉందో చూసుకుని ...అది చెప్పమని అడిగేదాన్ని .. :( :)
కానీ "జీవితానికి" ...జనం చిత్రించి చెప్పిన ...నిజాలు అబద్ధాలుగా .....అబద్ధాలు నిజాలుగా ....సంవత్సరాల తరబడి వినీ వినీ .....తనకు తానే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే విచక్షణ సంపాదించుకుని ....స్థిత ప్రజ్ఞత పొందిన తర్వాత ...,,,
నవ్వుతూ ...."ఏది చెప్పినా పర్లేదు ...." అనడం అలవాటైంది ...
అందుకు కారణాలు ....,,,,,,,,,,,
రెండింటినీ ఒకే విధంగా స్వీకరిస్తానని ....ఏది చెప్పే అలవాటు నీకు ఉందో నిర్ణయించుకునే బాధ్యత నీది అని ...అవతలి వారికి అర్ధమయ్యేలా చెప్పడం ఒకటైతే ..... :) :P
స్వీకరించాక ....నీ విచక్షణ ఉపయోగించి ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించడానికి నువ్వు ఉన్నావు కదా ....చాలు ...అని నా మనసుకి కృతజ్ఞత తెలియజేయడం రెండవది.... :) <3

మీ విలువైన జీవితాన్ని కాసేపు ఆపి ..... లేని మనుషులను వెదకడం కోసం ఖర్చు చేయకండి ...."

ఈ రోజు ఉదయం .... (Posted on June 4th, 2016)
"ఫలానా వాళ్లకి నేను ఎంత చేశానో ....వేలు పట్టుకుని ...దిద్దించి ....తీర్చి దిద్దితే ....ఈ రోజు కి అంతా మర్చిపోయారు ...నాకే ద్రోహం చేశారు" ఒకరి గురించి బాధగా నాతో ఒకరు .... :(
"మీ జీవితంలో ఇలా మర్చిపోయే వాళ్ళు మీకు ఎంతమంది కనిపించి ఉంటారు ....??!! " ప్రశ్నించా ...
"చాలా మంది కనిపించారు ...." సాలోచనగా సమాధానం
"అలా మరచిపోని వాళ్ళు ....చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని మీకు కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళు ....ఎంతమంది కనిపించారు ....జీవితంలో మీకు " ప్రశ్నించా ...
"వాళ్ళు ...వీళ్ళు ....ఎవరో " అంటూ కొన్ని పేర్లు చెప్పే ప్రయత్నం ...
----------------------------------
"జీవితం నిరంతరం సాగే ఒక ప్రవాహం ....
చేసిన సహాయం మరిచిపోని వాళ్ళు కనిపిస్తే ....,,,కాస్త ఆగి... వాళ్ళల్లో ఉన్న మనిషిని చూసి ...పలకరించి , పరామర్శించి సంతృప్తి చెంది ....ప్రయాణం కొనసాగించండి .... :) <3
చేసిన సహాయం మరిచిపోయిన పోయిన వాళ్ళు కనిపిస్తే ....ఆగి చూడాల్సిన అవసరం లేదు ....మీ ప్రయాణం మీరు కొనసాగించండి ....
మీ విలువైన జీవితాన్ని కాసేపు ఆపి ..... లేని మనుషులను వెదకడం కోసం ఖర్చు చేయకండి ...." నవ్వుతూ చెప్పా ... :) :)
------------------------------------
గమనిక : అడిగిన వాళ్ళు వింటారని...వినాలని ... ,,,నేను ఈ సమాధానం చెప్పలేదు ... నా జీవితంలో నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏది ఆచరిస్తానో అది చెప్పా .... :) :)

Friday, June 2, 2017

ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని వాళ్ళు ....,,

ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని వాళ్ళు ....,,
తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్ళు .....,,
వద్దన్నా ఇచ్చేవాళ్ళు ....,,
బ్రతిమాలినా ఇవ్వనివాళ్ళు .....,,
ఇచ్చి బదులు పుచ్చుకునే వాళ్ళు ....,,
తీసుకుంటున్నామని రెండో కంటికి తెలియకుండా తీసుకునేవాళ్ళు .....,,
తీసుకుంటున్నామని చెప్పి తీసుకునేవాళ్ళు ......,,
తీసుకుంటున్నామని తమకే తెలియకుండా తీసుకునేవాళ్ళు ....,,
తీసుకోలేక తీసుకోలేక అతి జాగ్రత్తగా మొహమాటంగా తీసుకునేవాళ్ళు ......,,
తీసుకుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేవాళ్ళు ...,,
తీసుకుని తిరిగి ఇస్తామని మభ్యపెట్టేవాళ్ళు ......,,
తీసుకుని అందరికీ పంచుకునేవాళ్ళు .....,,
----------------------------
ఇలా మనకు జీవితంలో ఎన్నో రకాల వ్యక్తులు, తారసపడుతూ ఉంటారు .....
అందరినీ అర్ధం చేసుకుంటూ ....ఇచ్చుకుంటూ ....పుచ్చుకుంటూ ...కుదరకపోతే సర్దుకుపోతూ...ముందుకు పోవడమే జీవితం ... :) :)
ఇదే నేర్పింది నాకు జీవితం ...తనను తాను ప్రశాంతంగా మలచుకోవడం కోసం ,,..... :) :)