Thursday, October 7, 2021

పిల్లలతో కొన్ని కబుర్లు ....

 పిల్లలతో కొన్ని కబుర్లు ....

==================
ఇవ్వాళ నా పెద్ద డాటర్ ఏదో ట్రిక్ చేసిందని ...నా చిన్న డాటర్ కి అనుమానం వచ్చింది ....
"మమ్మి ...అది నీతో ట్రిక్ చేస్తుందనుకుంటా ....తప్పించుకోడానికి " అంది ....నాతో ...
"అవునురా ...నాకు కూడా అదే అనిపించింది .....కానీ ...పోనీలే అని ఊరుకున్నా ...
అయినా ....చిన్నప్పటినుండి ఇలాంటివి ఎన్ని ట్రిక్స్ వేసి ఉంటాను నేను మా పేరెంట్స్ దగ్గర ....
మీరిద్దరూ ఏ ట్రిక్స్ వేస్తారో ....ఏ నిజాలు చెబుతారో నాకు తెలియదా ...."
నవ్వుతూ చెప్పా ....
అది కూడా నవ్వేసింది ...అంగీకారంగా ....
తాతకు దగ్గులు నేర్పడం ...అంటే ఇదే ...
====================
ఈ మధ్య నా డాటర్ ...ఒక కాఫీ ఫిల్టర్ కొనుక్కుంటాను అని అడిగింది ....
ఇప్పుడు అది అవసరమారా ...బయట ఎటూ రకరకాల కాఫీ లు ట్రై చేసి తాగుతూ ఉంటావు ....మళ్ళీ ఇంట్లో కూడా ఎందుకు అదే పనిగా ....చెప్పా ....
తర్వాత ....కాసేపటికి ...."అరే.. కుట్టు మిషన్ కావాలని అప్పుడెప్పుడో అడిగావుగా ...కొనుక్కోరా" అడిగా ....
"కాఫీ మిషన్ అడిగితే వద్దన్నావు ....కుట్టు మిషన్ మాత్రం కొనుక్కో అన్నావు ....ఇప్పుడు అది నేను అడగకపోయినా ...."చెప్పింది ...
"సరే పోనీ రెండూ కొనుక్కో ...."ఒప్పుకోలుగా చెప్పా ...
"ఇప్పుడే వద్దన్నావు ...మళ్ళీ వెంటనే ఒప్పుకున్నావు ...." నువ్వేం పేరెంట్ వే చెప్పింది ...
పేరెంట్ ని కాబట్టే వద్దని చెప్పా ...నేను కూడా అప్పుడప్పుడు పేరెంట్ లా బెహేవ్ చేయాలి కదరా .....అది చేసేశా ...ఫార్మాలిటీకి వద్దని చెప్పా ....తరువాత నార్మల్ అయిపోయా " ...
=============================
"ఇంటికి రారా ....మమ్మి హ్యాపీ అవుతుంది ....ఎటూ వర్క్ ఫ్రొం హోమ్ కదా ..." మావారు నా డాటర్ తో ...
"డాడీ ....మమ్మి ఎప్పుడూ నేను ఇంటికొస్తే హ్యాపీగానే ఉంటుంది ....మమ్మి కి ఎప్పుడూ మంచి మమ్మీలా ఉండాలని ఉంటుంది ....కానీ నాకెప్పటికీ కిడ్ లా ఉండాలని లేదు " నా డాటర్ మావారితో ...
============================
to be continued
Like
Comment
Share

No comments:

Post a Comment