Sunday, September 11, 2016

కష్టాలు , సుఖాలు .....జయాలు , అపజయాలు ...

"చాలా కష్టపడుతున్నావు ....కానీ కొన్నాళ్ళు నువ్వు...కష్టపడాలి తప్పదు ...." ఒకరు నాతో .... :) 

"నాకు తెలుసు .....ఫలానా విషయం నాకేం తెలియదు అని ....నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను ....అని....అపజయాలు చవి చూస్తున్నాను అని ....


కానీ ఏ ప్రతిఫలం ఆశించకుండా నా పని నేను చేసుకుంటూ పోతే...ఒకరోజుకి తప్పకుండా ఆ విషయంలో నేను విజయం సాధించగలను అనే నమ్మకం నాకుంది ....


నాకు భగవంతుడు ...అపజయాలు మాత్రమే ఇచ్చి ఎప్పుడూ నన్ను మర్చిపోలేదు .....

ఆ వెంటనే గుర్తుపెట్టుకుని నాకు విజయాలనూ ఇచ్చాడు .....

విజయాలు మాత్రమే ఇచ్చి ....అపజయాలు లేకుండా చేయలేదు .....కష్టాలేమిటో తెలియకుండా ఉండడానికి ....


ఒక అపజయం ....వెంటనే అదే చోట విజయం ....మళ్లీ ఒక అపజయం ...విజయం ....ఇలా నా జీవితం సమన్వయంతో నడుస్తుంది .....నాకు న్యాయం జరుగుతూనే ఉంది ...


అందుకే ....నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి .... <3


అపజయాలు మాత్రమే ఇచ్చి నాకు అన్యాయం చేయనందుకు .....


విజయాలు మాత్రమే ఇచ్చి నన్ను జీవిత అవగాహన లేమికి గురిచేయనందుకు .....


కష్టాలు , సుఖాలు .....జయాలు , అపజయాలు ....ఇంతకంటే అర్ధం ఏముంది పరిపూర్ణమైన జీవితానికి .... " నవ్వుతూ నేను వారితో .... :) :) :)


Saturday, September 10, 2016

డిప్రెషన్ అనేది ఒక సర్వసాధారణ పదం ....


డిప్రెషన్ అనేది ఒక సర్వసాధారణ పదం ....
==============================

"నేను ఇదివరకు ఓ సారి డిప్రెషన్ కి గురయ్యాను ...."

"అమ్మో ..అతను / ఆమె డీప్ డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు ..."

"ఫలానా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లారట ...."

"ఆమె /అతను డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నారు ..."

"ఆమె /అతను డిప్రెషన్ లోనుండి చాలా కాలం తర్వాత బయట పడి మామూలు మనిషయ్యారు ...."

ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం ....

నిజానికి చాలామంది గమనించని విషయం ఏమిటంటే ....డిప్రెషన్ అనేది అంత వినకూడని మాట ....భయపడాల్సిన పదం ఏం కాదు అనేది ....

జీవితంలో డిప్రెషన్ కి గురి కావడం తరచుగా జరుగుతూనే ఉంటుంది ....ఆ స్థితి నుండి మనిషి ఎప్పుడూ తనకు తాను బయటపడుతూనే ఉంటాడు .....

సాధారణంగా మనం ...అసలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి .... అన్యమనస్కంగా తిరుగుతూ ...ఏ పనీ చేయకుండా ఏడుస్తూ/ నవ్వుతూ కూర్చుంటే అది మాత్రమే డిప్రెషన్ అనుకుంటాం కొన్నిసార్లు.....

కానీ ఒక్కోసారి అన్ని పనులు చేసుకుంటూ ....సమాజంతో అనుకూలమైన సంబంధాలు కలిగి ఉండి… అసలు ఏ మార్పూ సమాజానికి కనిపించకుండా ....అసలు మనలో మార్పు మనకే తెలియకుండా కూడా ...మనసు అంతరాంతరాల్లో డిప్రెషన్ దాగి ఉండే అవకాశం ఉంది .....

ఇలాంటి గుర్తించని డిప్రెషన్ కి గురైన వాళ్ళు .... సాధారణంగా వాళ్ళంతట వాళ్ళే దానిని అధిగమించి బయటపడుతూ ఉంటారు కూడా ....

గుర్తించే స్థాయిలో ఉన్న డిప్రెషన్ ని కూడా ఎవరికి వాళ్ళే అధిగమించే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు కొందరు ....

డిప్రెషన్ అనేది ఎంత స్థాయిలో ఉన్నా ....మనం దానిని అధిగమించే శక్తి మనకు లేనప్పుడు నిపుణుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి ....అలా చేయకపోవడం ఆత్మహత్యకు దారితీసే అవకాశం ఉంది ...

ఏది ఏమైనా డిప్రెషన్ స్థాయిని బట్టి ..మన మనసు/శరీరం దానిని అధిగమించగల స్థితిని బట్టి ....మనకు జీవితంలో మామూలు స్థితికి రావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పొచ్చు .....!!

(నేను సైకాలజిస్ట్ ని కాను ....ఇవి నేను స్వయంగా చూసి గమనించిన విషయాలు మాత్రమే ....…!!


సంవత్సరాల తరబడి మనం ఒకరు చేసే ఒక పనిని ద్వేషిస్తూ ఉంటాం ....

సంవత్సరాల తరబడి మనం ఒకరు చేసే ఒక పనిని ద్వేషిస్తూ ఉంటాం ....

ఆ పని వాళ్ళు చేసినప్పుడల్లా ద్వేషం ,కోపం అసహ్యం పెంచుకుంటూ....నిస్సహాయ పరిస్థితులకు లోనవుతాం ....

మనం పూర్తిగా ద్వేషం అనే ఉచ్చులో చిక్కుకుపోయి ....ఆ సదరు వ్యక్తులతో ,చుట్టుపక్కల వారితో మనం దుర్మార్గులుగా గుర్తించబడతాం ....వాళ్ళు మనకు ఆత్మీయులు కావడం వలన ఆ పని చేస్తున్నా వారిని మనం దూరంగా ఉంచలేం , వారికీ మనం దూరం కాలేం....

అలాంటి పరిస్థితుల్లో మన గుండె చిక్కబట్టుకుని ,లాభ నష్టాలను త్యజించి , న్యాయాన్యాయాలను విస్మరించి .....ఒకే ఒక్కసారి మనం వాళ్ళ కోసం అదే పని చేస్తే ....ఆ పని చేయడానికి నేనెప్పుడూ వ్యతిరేకిని కాదు ....అని మనం వాళ్లకు చూపించగలితే .....

అప్పుడు వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది ......

అది నువ్వు అసహ్యించుకునే పని కదా అని ప్రశ్నిస్తే .....అందుకే ఆ పని చేయాలి అంటాను ....

అందుకు ఎంతో ధైర్యం కావాలి ....

కానీ ఆ పని చేశాక ....మన మీద మనకు కలిగే నమ్మకం ....మనలో ఉన్న మంచితనం మనకు చెప్పే కృతజ్ఞత తల్చుకుంటే ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది ....

మనలో ఉన్న మంచితనం ...తర తరాలుగా తన మీద వేసిన ద్వేషం అనే ముద్రను చెరిపేసినందుకు మనల్ని అభినందిస్తుంది ....

కృతజ్ఞతగా చూస్తుంది .... :) :) 



మన అభిప్రాయాలు ...

మన అభిప్రాయాలు ...
ఎదుటివాళ్ళ లోపాలను తడిమి చూడనంతవరకు వాళ్ళ దృష్టిలో అవి గొప్ప భావాలు .... :P :)

ఒక్కసారి, వాళ్ళ లోపాలను తడిమి చూస్తే ...
అంతే ...కట్టలు తెగిన వారి ఆగ్రహానికి సాక్ష్యం చెప్పలేని మౌన గీతాలు .... :) 

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

నువ్వు ఎదగడానికి ప్రయత్నిస్తున్నావా ....??!!

ఇప్పుడున్న చోటు నుండి మరో అడుగు ముందుకు వేయడానికో , మరో మెట్టు పైకి ఎక్కడానికో ప్రయత్నిస్తున్నావా ....??!!

అయితే..... ఒక విషయం తప్పనిసరిగా గమనించి ,గుర్తుపెట్టుకోవాలి .....,,,

మన చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్పకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ....ఏ సమస్యా లేదు ..... కానీ ....

అలా కాకుండా ...మనవాళ్లే కదా , మన మేలు కోరేవాళ్లే కదా అనుకుని ..... చుట్టూ ఉన్నవాళ్లకు ఆ విషయం చెప్తే ....మనల్ని కదలకుండా గట్టిగా అయినా పట్టుకుంటారు , లేదా కిందకు లాగేస్తారు .....
అంతే కాకుండా ....వాళ్లు ఏ క్షణంలో అయినా మనల్ని వదిలేయొచ్చు ....అందుకు కూడా సిద్ధంగా ఉండాలి .....

ఎందువలననగా ....,,,,

మనం వాళ్ళ కింద అయినా ఉండాలి , లేదా వాళ్లకు సమానంగా అయినా ఉండాలి ....వాళ్ళ కంటే ఎత్తుకు ఎదగడానికి ఎవ్వరూ ఒప్పుకోరు .....ఏ రోజుల్లో అయినా .... !

"లోక సహజ జీవన సిద్ధాంతం ....!!" :) :P :) :P