Saturday, September 10, 2016

డిప్రెషన్ అనేది ఒక సర్వసాధారణ పదం ....


డిప్రెషన్ అనేది ఒక సర్వసాధారణ పదం ....
==============================

"నేను ఇదివరకు ఓ సారి డిప్రెషన్ కి గురయ్యాను ...."

"అమ్మో ..అతను / ఆమె డీప్ డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు ..."

"ఫలానా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్లారట ...."

"ఆమె /అతను డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నారు ..."

"ఆమె /అతను డిప్రెషన్ లోనుండి చాలా కాలం తర్వాత బయట పడి మామూలు మనిషయ్యారు ...."

ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం ....

నిజానికి చాలామంది గమనించని విషయం ఏమిటంటే ....డిప్రెషన్ అనేది అంత వినకూడని మాట ....భయపడాల్సిన పదం ఏం కాదు అనేది ....

జీవితంలో డిప్రెషన్ కి గురి కావడం తరచుగా జరుగుతూనే ఉంటుంది ....ఆ స్థితి నుండి మనిషి ఎప్పుడూ తనకు తాను బయటపడుతూనే ఉంటాడు .....

సాధారణంగా మనం ...అసలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి .... అన్యమనస్కంగా తిరుగుతూ ...ఏ పనీ చేయకుండా ఏడుస్తూ/ నవ్వుతూ కూర్చుంటే అది మాత్రమే డిప్రెషన్ అనుకుంటాం కొన్నిసార్లు.....

కానీ ఒక్కోసారి అన్ని పనులు చేసుకుంటూ ....సమాజంతో అనుకూలమైన సంబంధాలు కలిగి ఉండి… అసలు ఏ మార్పూ సమాజానికి కనిపించకుండా ....అసలు మనలో మార్పు మనకే తెలియకుండా కూడా ...మనసు అంతరాంతరాల్లో డిప్రెషన్ దాగి ఉండే అవకాశం ఉంది .....

ఇలాంటి గుర్తించని డిప్రెషన్ కి గురైన వాళ్ళు .... సాధారణంగా వాళ్ళంతట వాళ్ళే దానిని అధిగమించి బయటపడుతూ ఉంటారు కూడా ....

గుర్తించే స్థాయిలో ఉన్న డిప్రెషన్ ని కూడా ఎవరికి వాళ్ళే అధిగమించే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు కొందరు ....

డిప్రెషన్ అనేది ఎంత స్థాయిలో ఉన్నా ....మనం దానిని అధిగమించే శక్తి మనకు లేనప్పుడు నిపుణుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి ....అలా చేయకపోవడం ఆత్మహత్యకు దారితీసే అవకాశం ఉంది ...

ఏది ఏమైనా డిప్రెషన్ స్థాయిని బట్టి ..మన మనసు/శరీరం దానిని అధిగమించగల స్థితిని బట్టి ....మనకు జీవితంలో మామూలు స్థితికి రావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పొచ్చు .....!!

(నేను సైకాలజిస్ట్ ని కాను ....ఇవి నేను స్వయంగా చూసి గమనించిన విషయాలు మాత్రమే ....…!!


No comments:

Post a Comment