Saturday, September 10, 2016

సంవత్సరాల తరబడి మనం ఒకరు చేసే ఒక పనిని ద్వేషిస్తూ ఉంటాం ....

సంవత్సరాల తరబడి మనం ఒకరు చేసే ఒక పనిని ద్వేషిస్తూ ఉంటాం ....

పని వాళ్ళు చేసినప్పుడల్లా ద్వేషం ,కోపం అసహ్యం పెంచుకుంటూ....నిస్సహాయ పరిస్థితులకు లోనవుతాం ....

మనం పూర్తిగా ద్వేషం అనే ఉచ్చులో చిక్కుకుపోయి .... సదరు వ్యక్తులతో ,చుట్టుపక్కల వారితో మనం దుర్మార్గులుగా గుర్తించబడతాం ....వాళ్ళు మనకు ఆత్మీయులు కావడం వలన పని చేస్తున్నా వారిని మనం దూరంగా ఉంచలేం , వారికీ మనం దూరం కాలేం....

అలాంటి పరిస్థితుల్లో మన గుండె చిక్కబట్టుకుని ,లాభ నష్టాలను త్యజించి , న్యాయాన్యాయాలను విస్మరించి .....ఒకే ఒక్కసారి మనం వాళ్ళ కోసం అదే పని చేస్తే .... పని చేయడానికి నేనెప్పుడూ వ్యతిరేకిని కాదు ....అని మనం వాళ్లకు చూపించగలితే .....

అప్పుడు వచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది ......

అది నువ్వు అసహ్యించుకునే పని కదా అని ప్రశ్నిస్తే .....అందుకే పని చేయాలి అంటాను ....

అందుకు ఎంతో ధైర్యం కావాలి ....

కానీ పని చేశాక ....మన మీద మనకు కలిగే నమ్మకం ....మనలో ఉన్న మంచితనం మనకు చెప్పే కృతజ్ఞత తల్చుకుంటే ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది ....

మనలో ఉన్న మంచితనం ...తర తరాలుగా తన మీద వేసిన ద్వేషం అనే ముద్రను చెరిపేసినందుకు మనల్ని అభినందిస్తుంది ....

కృతజ్ఞతగా చూస్తుంది .... :) :)