Sunday, September 11, 2016

కష్టాలు , సుఖాలు .....జయాలు , అపజయాలు ...

"చాలా కష్టపడుతున్నావు ....కానీ కొన్నాళ్ళు నువ్వు...కష్టపడాలి తప్పదు ...." ఒకరు నాతో .... :) 

"నాకు తెలుసు .....ఫలానా విషయం నాకేం తెలియదు అని ....నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను ....అని....అపజయాలు చవి చూస్తున్నాను అని ....


కానీ ప్రతిఫలం ఆశించకుండా నా పని నేను చేసుకుంటూ పోతే...ఒకరోజుకి తప్పకుండా విషయంలో నేను విజయం సాధించగలను అనే నమ్మకం నాకుంది ....


నాకు భగవంతుడు ...అపజయాలు మాత్రమే ఇచ్చి ఎప్పుడూ నన్ను మర్చిపోలేదు .....

వెంటనే గుర్తుపెట్టుకుని నాకు విజయాలనూ ఇచ్చాడు .....

విజయాలు మాత్రమే ఇచ్చి ....అపజయాలు లేకుండా చేయలేదు .....కష్టాలేమిటో తెలియకుండా ఉండడానికి ....


ఒక అపజయం ....వెంటనే అదే చోట విజయం ....మళ్లీ ఒక అపజయం ...విజయం ....ఇలా నా జీవితం సమన్వయంతో నడుస్తుంది .....నాకు న్యాయం జరుగుతూనే ఉంది ...


అందుకే ....నేను భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి .... <3


అపజయాలు మాత్రమే ఇచ్చి నాకు అన్యాయం చేయనందుకు .....


విజయాలు మాత్రమే ఇచ్చి నన్ను జీవిత అవగాహన లేమికి గురిచేయనందుకు .....


కష్టాలు , సుఖాలు .....జయాలు , అపజయాలు ....ఇంతకంటే అర్ధం ఏముంది పరిపూర్ణమైన జీవితానికి .... " నవ్వుతూ నేను వారితో .... :) :) :)