Sunday, December 11, 2016

ఓ స్నేహితురాలు / స్నేహితుడు - అడిగిన సందేహం....



(గమనిక : సందేహం అడిగిన వారి అనుమతి అడిగి , వారు అంగీకరించాకే ఇక్కడ షేర్ చేయడం జరిగింది . )
- ఓ స్నేహితురాలు / స్నేహితుడు - అడిగిన సందేహం....
- నా అభిప్రాయం .....
==================================
ముందుగా నా మీద మీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు .... :)
================================
ఉంటాడు/ ఉండడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ....(చిన్న తనం నుండి మరణం అంటే ద్వేషించే వాళ్ళే మనకు కనిపించడం వలన మనకు ఈ సందేహం కలగడం సహజం ....)
నా ఆలోచనా పరిధిలో నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు వివరిస్తాను ....అది మీ ఆలోచనలకు సహాయ పడొచ్చు .....
-----------------
ముందుగా మనకు మరణం అంటే ఏమిటి అనేది ఒక అవగాహన ఉండాలి ....
మనకు చిన్నతనం నుండి ...మరణం అంటే ...అది చాలా భయంకరమైనది ....అది మనకు ప్రమాదం ద్వారానో , జబ్బుల ద్వారానో సంక్రమించే ఒక మహమ్మారి అనే భావన ఇవ్వబడింది ....
పైగా మరణం తర్వాత ఇక మనం ఈ భూమి మీద ఉండం, మనకు ఇప్పుడు మన అనుకుంటున్నవాళ్ళు ఎవరూ ఉండరు ....మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు ఏవీ ఉండవు ....మన సొంతం అని మనం ప్రేమ ఏర్పరచుకున్న వస్తువులు , వ్యక్తులు మనతో రావు అనే భావం మనల్ని మరణం కన్నా ఎక్కువ దుఃఖానికి గురి చేస్తుంది ....
అయితే ఎవరైనా ఇవన్నీ నీకు యధాతధంగా ఉంటాయి, మరణం అనేది ఒక సంఘటన మాత్రమే అని భరోసా ఇస్తే ....మనం ఆనందంగా మరణాన్ని ఆహ్వానిస్తాం ....
ఎప్పుడైతే మనిషి నా జీవితం అనేది అశాశ్వతం ....ఇక్కడ ఉన్న ఏ వస్తువూ , ఏ వ్యక్తీ మనకు చెందిన వాళ్ళు కాదు ...ఆఖరికి మన శరీరం కూడా శాశ్వతం కాదు అని అర్ధం చేసుకుంటాడో ...అర్ధం చేసుకోవడం కాదు , రోజు వారీ జీవితం లో ఆచరిస్తూ ఉంటాడో ...అతనికి మరణం అంటే భయం ఉండదు ....(అలా అని ప్రేమ ఉంటుంది అని చెప్పలేం ) అది ఒక సంఘటన అని బలంగా నమ్ముతాడు ....
అయితే అన్నిటి మీదా ఆశ వదిలేస్తే ....ఏదీ నాది కాదు అంటే ....మనిషి ఏ పనీ చేయలేడు ....
మనిషికి ఉన్న సహజ స్వార్ధ గుణం వలన ...ఏ పని చేసినా నాకేమొస్తుంది అని ఆలోచించడం అలవాటై ఉంటుంది ....
ఆ స్థితిని అధిగమించి ....నా బాధ్యతలు మాత్రమే నేను నిర్వర్తించాలి ....ఫలితం గురించి ఆలోచించకూడదు అని అనుకోవాలి .....
ఒక్క విషయం ఆలోచించండి ....మరణం నిజంగా అనుభవించినవాళ్లు .....మరణం అంటే ఇలా ఉంటుంది అని చెప్పారా ....??!! వాళ్ళు ఈ భూమి మీద లేరు చెప్పడానికి అనేది వాస్తవం ....
మరణం అంటే భయం ఉన్న మనుష్యులు అందరూ కొన్ని కథలు సృష్టించారు .....మరణం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని .....అవి మనం నమ్మి భయం ఏర్పరచుకున్నాం ...
కానీ నిజానికి మరణం అంటే జీవితం అంత అందంగా ఉంటుందేమో అని ఎందుకు ఊహించకూడదు...(అప్పుడు ప్రేమ కలిగే అవకాశం ఉంది ) <3
నిజంగా మనకు మరణం సంభవించినపుడు .....మనకు ఎంతో అద్భుతంగా అనిపించి ...."అరె...మరణం నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ....అనవసరంగా వాళ్ళు వీళ్ళు చెప్పినవి నమ్మి ....మరణం అంటే ఎంత భయపడ్డాను ....నా సమయం ఎంత వృధా చేసుకున్నాను " అని మనం అనుకోవచ్చు ....
ఈ విషయం ప్రపంచానికి చెప్పాలి అని ఆరాటపడొచ్చు ....కానీ చెప్పడానికి మనం ఉండం కాబట్టి ...ఆ నిజం ఎవరికీ తెలియకపోవచ్చు ....ఎప్పటిలాగే ఊహాగానాలు విని మరణం అంటే వివిధ అభిప్రాయాలు కొనసాగొచ్చు .....
అసలు మరణాన్ని ఎందుకు ప్రేమించాలని నా సందేహం ....ఇప్పడు మన ముందు లేని దానిని , తెలియని దానిని ఎందుకు ప్రేమించాలి / ద్వేషించాలి ...??!!
మన ముందు ప్రస్తుతం ఉన్నది జీవితం ....దానిని పరిపూర్ణంగా ప్రేమించాలి/ద్వేషించాలి....
జీవితం ఇక చాలు అని మన దగ్గర సెలవు తీసుకుని అంతమైపోయి .....మరణం మన ముందుకు వచ్చినప్పుడు ...మరణాన్ని ప్రేమించాలి / ద్వేషించాలి .....
అప్పుడు ఆలోచిద్దాం ....అప్పటివరకూ ....మన కళ్ళతో మనం చూసే వరకూ ...మరణం గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు ....
అని నా అభిప్రాయం .... !
========================

ప్రపంచం సామరస్యంగా, సమానత్వంతో సాగిపోవాలి అంటే ..

కొంతమంది ఉంటారు .............,,,,
వీళ్ళకి నూటికి 99 విషయాలు తెలిసి ఉంటాయి ....వాళ్ళు ఎంతో కష్టపడి ,సాధన చేసి అవన్నీ నేర్చుకుని ఉంటారు ....వాటిని అవసరమైనప్పుడు వాళ్ళ కోసం, నలుగురికీ ఉపయోగపడేలా ఉపయోగిస్తూ ఉంటారు ...ఆ 99 విషయాల గురించి ఎవరి ముందూ వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన చేయాలని ఆలోచించరు కూడా ...వాళ్లకు తెలియని ఆ ఒక్క విషయం గురించి మాత్రం అన్వేషిస్తూ ఉంటారు ......
మరి కొంతమంది ఉంటారు ...............,,,
వీళ్ళకి నూటికి 99 విషయాలు తెలియవు ....ఒక్క విషయమే తెలిసి ఉంటుంది ....తెలియని 99 విషయాల గురించి వీళ్ళు ఎప్పుడూ నేర్చుకోవాలని ప్రయత్నించరు ....వీళ్ళకు తెలిసిన ఆ ఒక్క విషయం గురించి మాత్రం సమయం దొరికినప్పుడల్లా అందరి ముందూ విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు ...
సరేలెండి ...ప్రపంచం అన్న తర్వాత రకరకాల వ్యక్తులు ఉంటారు .....ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తే సమస్య ఏం లేదు కదా… పోనివ్వండి ....అనుకున్నా ...కొన్నిసార్లు అలా జరగదు ....జరగనిస్తే అది ప్రపంచం ఎలా అవుతుంది ....అందులో ఉన్నవాళ్ళు రక రకాల మనుష్యులు ఎలా అవుతారు ....
అరుదుగా ఏం జరుగుతుంది అంటే ...ఈ 99 విషయాలూ తెలిసిన వాళ్ళ ముందుకు ... ఒక్క విషయం తెలిసిన వాళ్ళు వచ్చి విజ్ఞాన ప్రదర్శన చేసి కుప్పి గంతులు వేస్తారు ....
99
విషయాలూ నేర్చుకున్న వాళ్లకు ఒక్క విషయం నేర్చుకోవడం ఒక లెక్కా ...నవ్వుతూనే ఆ ఒక్కటీ నేర్చుకుని వీళ్ళు పరిపూర్ణమైన వ్యక్తులు అవుతారు ....
ఒక్క విషయం తెలిసిన వాళ్ళు సహజంగానే లెక్కలో లేకుండా పోతారు ....

ఇందుమూలంగా నాకు తెలిసిన నిజం ఏమిటి అంటే ....ప్రపంచం సామరస్యంగా, సమానత్వంతో సాగిపోవాలి అంటే ...రక రకాల వ్యక్తులు అవసరం అని …..!! :) :)

Saturday, December 10, 2016

విజ్ఞానవంతులు....అజ్ఞానవంతులు....

మనుషుల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు (అధికారికంగా ఆలోచిస్తే)...,
విజ్ఞానవంతులు....అజ్ఞానవంతులు....
అంటే నిజానికి చెప్పాలంటే మనుషులంతా ఒక్కటే అనుకోండి .....కానీ మనకున్న
విజ్ఞాన / అజ్ఞాన కొలతల ఆధారంగా రెండు రకాలుగా విభజించి చూసుకుంటూ ఉంటాం (కనిపిస్తూ ఉంటారు).....అందులో ఉన్న సౌకర్యం అలాంటిది మరి ..... :)
అయితే కొంతమంది ....తమ చుట్టూ విజ్ఞానవంతులు ఉండేలా చాలా జాగ్రతలు తీసుకుంటారు ...
ఇందువలన వాళ్లకు కొన్ని లాభాలుంటాయి ....అవి ..., వాళ్ళు కూడా విజ్ఞానవంతులు అని భావించడం ....లేదా విజ్ఞానవంతులు దగ్గరనుండి ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది అని ....లేదా విజ్ఞానవంతులు ద్వారా సమాజంలో వీళ్ళకు కూడా బోల్డంత గుర్తింపు వస్తుంది అని ....
వీళ్ళు మనుషులకు అతీతంగా తాము ప్రత్యేక వ్యక్తులం అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
---------------------------------------
కొంతమంది ....తమ చుట్టూ అజ్ఞానవంతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు .....
ఇందువలన వీళ్ళకు కొన్ని లాభాలు ఉన్నాయి ....వీళ్ళకున్న అపార జ్ఞానాన్ని అజ్ఞానవంతులకు పంచుతున్నామనే సంతృప్తి ....తమకు తామే దేవుడి దూతగా ప్రకటించుకునే అవకాశం ....అహం దానికదే సంతృప్తి చెందే సదవకాశం ....
వీళ్ళు దేవుడి తర్వాత మేమే ప్రపంచానికి దిక్కు అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
-----------------------------------------
మరికొంతమంది మిగిలిపోయి ఉంటారు కదా ....ఇక వీళ్ళ చుట్టూ విజ్ఞాన / అజ్ఞాన వంతులు అందరూ ఉంటారు ...వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేకుండానే ....,
వీళ్ళకి తమకు తాము విజ్ఞానవంతులం / అజ్ఞానవంతులం అనే ఫీలింగ్ ఏం ఉండదు ...నాకు తెలిసింది నేను ఇతరులకు చెప్పాలి ....నాకు తెలియనిది నేను ఇతరుల దగ్గర నుండి నేర్చుకోవాలి అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
వీళ్ళకు తాము సామాన్యమైన మనుష్యులం అనే అభిప్రాయం కలిగి ఉంటారు .....
----------------------------------------
అందుకే ....నేనెప్పుడూ అంటూ /అనుకుంటూ ఉంటాను ...నేను చాలా చాలా సామాన్యమైన మనిషిని అని ..... :) :) :)


కొంతమంది నన్ను ఏం అడుగుతూ ఉంటారంటే ....,

కొంతమంది నన్ను ఏం అడుగుతూ ఉంటారంటే ....,
"నిజం చెప్పనా ....అబద్ధం చెప్పనా " అని ,,
ఆలోచించకుండా "నిజం" చెప్పమంటా ....
ఆలోచించి కూడా నిజం చెప్పలేకపోతారు .....అదేమిటో ....
అయితే, నిజం చెప్పే ధైర్యం అవతలి వాళ్లకు అరుదుగా ఉంటుంది ....అది వేరే విషయం .... :)
అదేమిటో.... అదే ప్రశ్న నేను అడిగితే మాత్రం ....నిజం వినడానికి భయపడుతూ ఉంటారు కొందరు .....
నిజం చెప్పడానికీ భయపడి ....నిజం వినడానికీ భయపడితే ....ఎలా ...??!!

ఇలా అయితే....నిజం బ్రతికేదెలా ...అది చచ్చిపోతే .. నిజం మాట్లాడటానికీ ,వినడానికీ ప్రాణం ఇచ్చే వాళ్ళు బ్రతికేదెలా ....???!! ఎలా ....హౌ ..... :) :)

Friday, December 2, 2016

"నువ్వు ఎన్నిసార్లు అపజయానికి గురయ్యావు ...." నాకెదురైన ప్రశ్న .... :)

"ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఎదురైన ....అల్లా ఫలానా అపజయం వలన నేను ఈ విషయం నేర్చుకున్నాను .....అప్పుడు ఆ అపజయానికి కారణం అయిన వాళ్ళను నేను తిట్టుకున్నాను కానీ ....అదే అపజయం నాకు ఎదురుకాకపోతే నాకు ఈ విషయం తెలిసి ఉండేది కాదు ...." ఎప్పుడో జరిగిన ఓ సంఘటనను ఇప్పుడు జరిగిన ఓ పొరపాటు సంఘటనకు అన్వయిస్తూ చెప్పా .... :)

"నువ్వు ఎన్నిసార్లు అపజయానికి గురయ్యావు ...." నాకెదురైన ప్రశ్న .... :)

"నాకు ఎదురైన అపజయాలన్ని లెక్కపెట్టడం మొదలు పెడితే లెక్క తేలనన్ని ఉండొచ్చు ....అందులో నుండి నేను ఏం నేర్చుకున్నానో లెక్కపెడితే అవి నాకు లెక్క లేనన్ని విజయాలు ....
పది సంవత్సరాల తర్వాత కూడా ....అప్పటి అపజయం లో నుండి నేర్చుకున్న జీవన పాఠం ఇప్పటి జీవితానికి అన్వయించుకుంటూ ఆ పొరపాటు ఎందుకు చేయకూడదో గుర్తు పెట్టుకున్నాను చూడండి ....ఈ విజయం చాలు .....నా జీవిత కాలపు అపజయాలను పరిహసించడానికి ....." నవ్వుతూ చెప్పా .... :) :) <3




Wednesday, November 23, 2016

ఏది ఉంచుకోవాలో....ఏది పంచుకోవాలో ....ఏది తెంచుకోవాలో .... ఎవరిష్టం వాళ్ళది ....

కొందరు ...,,,
ఆనందాలు మాత్రం ఒక్కరే ఆత్రంగా అనుభవిస్తారు ....పక్కవారికి పంచరు.... 
మరి కొందరు ....బాధలు మాత్రం పక్కవారికి వెంటనే పంచుతారు ....వాళ్ళు ఏ మాత్రం బాధ అనుభవించడానికి ఇష్టపడరు ....

మరికొందరు .....,,,,
బాధలు మాత్రం ఒక్కరే అనుభవిస్తారు ....పక్కవాడికి పంచరు.... 
ఆనందాలు మాత్రం పక్కవాడికి వెంటనే పంచుతారు ....వాళ్ళు... ఆనందం ఒక్కరే అనుభవించడానికి ఇష్టపడరు ....

ఏది ఉంచుకోవాలో....ఏది పంచుకోవాలో ....ఏది తెంచుకోవాలో .... ఎవరిష్టం వాళ్ళది .... అది వేరే విషయం అనుకోండి .....

ఆనందాలు పంచిన వాళ్ళందరూ మనసున్నవాళ్ళు .....
బాధలు పంచేవాళ్ళు అందరూ మనసు లేని వాళ్ళు అని అనుకోవడం లోక సహజ అభిప్రాయం ....

కానీ ...కొన్నిసార్లు ...లోక అభిప్రాయానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది .....

ఎవరికి ఏది అవసరం ఉందో... అది వారికోసం దాచుకుంటారు ........
ఎవరికి ఏది అవసరం లేదో ....అది పక్కవారికి పంచేస్తారు ....

మనం కూడా పక్కవాడు పంచింది ఏదైనా ....అది మనకు అవసరం ఉంటే తీసుకోవాలి .....అవసరం లేకపోతే ....అది వాళ్ళకే ఇచ్చేయాలి ....


మరి ఆలస్యం ఎందుకు ......నిర్ణయం మీదే ....... !! :) :)

అదేదో సినిమాలో ...."గల గల పారుతున్న గోదారిలా ...." పాట

అదేదో సినిమాలో ...."గల గల పారుతున్న గోదారిలా ...." పాట విన్న వాళ్లకు ఎవరికైనా తెలిసే ఉంటుంది ...ఆ పాట వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ....

తన ప్రేయసి.. తన కోసం ....అసంకల్పితంగా ఏడిస్తే ...ఆ ప్రియుడి మనసుకు అది ఏదో ఒక హాయిని , ధైర్యాన్ని , సౌకర్యాన్ని కలిగిస్తుంది .....అదే ఫీలింగ్ ని మనసులో దాచుకోకుండా ప్రియురాలికి చెప్పేస్తాడు .... <3 

సరే పాట అయిపోతుంది .....మళ్లీ ఆ ప్రియురాలు ,ప్రియుడు ఎప్పట్లాగే సహజంగా కలుస్తారు ...అప్పుడు ఆ ప్రియుడు ఆ ప్రియురాలిని ....మళ్లీ ఓసారి ఏడవవా ప్లీజ్ అని అడగడు .....ఆ ప్రియురాలు కూడా అతనికి సంతోషం ఇవ్వడం కోసం కనిపించినప్పుడల్లా కడవలు కడవలు ఏడవదు..... :P

ఏమో ...ప్రియురాలో, ప్రియుడో (జరగదనుకోండి ) ఎవరైనా ఒకరికోసం ఒకరు ఏడిస్తే ....అందులో అవతలివారికి ఏమొస్తుందో నాకు తెలియదు ....

కానీ కొందరు ....తమ కోసం ఎవరో ఒకరు ఏడిస్తే రోజూ చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు .....వీళ్ళు చేసే పనులన్నీ ఏడిపించేవిగానే ఉంటాయి ...

ఎదుటివాళ్ళు వాళ్ళు చేసే పనులకు ఏడుస్తున్నంత కాలం .....అవే పనులు వాళ్లకు ఏడుపు అవసరమైనప్పుడల్లా చేస్తూ ఉంటారు .... ఏడ్చినంత కాలం వాళ్ళను ప్రేమిస్తూ ఉంటారు .....లేదు అంటే ప్రేమించలేరు …

ఇక ఆ పనులకు ఎదుటివాళ్ళు ఏడవడం ఆపేస్తే  ...కొత్తపనులను ఎంచుకుంటారు .....దీనికి వారు బయట సమాజానికి , కనీసం ఏడ్చేవాళ్లకు కూడా తెలియకుండా .....సామ ,దాన , బేధ , దండోపాయాలను ఎంచుకుంటారు ...

అయినా ఎదుటివాళ్ళు ఏడవలేదు అనుకోండి .....వాళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం ప్రవేశిస్తుంది ...."నువ్వు ఏడిస్తేనే నేను ప్రేమిస్తా ...."అనేవరకు వస్తుంది ....

ఏ మనిషీ జీవితంలో ఎక్కువ కాలం ఏడవలేడు కాబట్టి ....వాళ్ళు ఏడవరు ...
వీళ్ళు ప్రేమించరు.....

ఎక్కడ వీళ్ళ బలహీనత బయటపడుతుందో అనే భయంతో ....వారిని సమాజంలో చెడ్డవారిగా చిత్రీకరించడం మొదలుపెడతారు .....ఇక అది వేరే కోణం లోకి వెళ్తుంది అనుకోండి .....

మరి వీళ్ళు బ్రతకాలి అంటే ....వీళ్ళ అహం సంతృప్తి పడాలి అంటే ....వీళ్ళు ప్రేమించగలగాలి అంటే …ఎవరో ఒకరు ఏడవాలి కదా .....??!! 

అందుకే వాళ్ళు మరెవరినైనా ఈ పనికి ఎంచుకుంటారు .....

వారు తనకోసం ఏడ్చే పరిస్థితులు కల్పించడం మొదలు పెడతారు ....ఓసారి ఆ ఏడుపు రుచి చూశాక సంతృప్తి పడతారు .....అది ఎక్కడ చేజారిపోతుందో అని అనుక్షణం ఆందోళన చెందుతారు .....వారు ఏడవడం కోసం తపిస్తారు .....

ఇలా ఎప్పుడూ ఇతరుల ఏడుపులో సంతృప్తిని వెతుక్కుంటూ , వాళ్ళ కన్నీళ్లతో ఆనందభాష్పాలు పేర్చుకుంటూ ....వాళ్ళ కష్టంలో తమ ఇష్టాన్ని చూసుకుంటూ ...జీవిస్తూ ఉంటారు ...... :( :( 

తొండ ముదిరి ఊసరవెల్లి అవడం అంటే ఇదే .....!!

అదేదో ఒక ఫీలింగ్ ....జీవితంలో ఒక్కసారి అనుకోకుండా....ప్రేమలో భాగంగా కనిపించేది .....జీవితమే అదైపోయి ....సైకోలుగా మారుస్తుంది కొందరిని .... :( 

అందుకే మన ప్రేమ , మన ఏడుపు , మన సంతోషం తదితర భావాలన్నీ .....ఎవరి ఆటలో పావులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ....!!!

----------------------------------------

గమనిక: నేను సైకాలజిస్ట్ ని కాదు ....నాకెదురైన వ్యక్తుల మనస్తత్వాల ఆధారంగా నేను అర్ధం చేసుకున్నది వ్రాస్తూ ఉంటాను ....!