Saturday, December 10, 2016

విజ్ఞానవంతులు....అజ్ఞానవంతులు....

మనుషుల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు (అధికారికంగా ఆలోచిస్తే)...,
విజ్ఞానవంతులు....అజ్ఞానవంతులు....
అంటే నిజానికి చెప్పాలంటే మనుషులంతా ఒక్కటే అనుకోండి .....కానీ మనకున్న
విజ్ఞాన / అజ్ఞాన కొలతల ఆధారంగా రెండు రకాలుగా విభజించి చూసుకుంటూ ఉంటాం (కనిపిస్తూ ఉంటారు).....అందులో ఉన్న సౌకర్యం అలాంటిది మరి ..... :)
అయితే కొంతమంది ....తమ చుట్టూ విజ్ఞానవంతులు ఉండేలా చాలా జాగ్రతలు తీసుకుంటారు ...
ఇందువలన వాళ్లకు కొన్ని లాభాలుంటాయి ....అవి ..., వాళ్ళు కూడా విజ్ఞానవంతులు అని భావించడం ....లేదా విజ్ఞానవంతులు దగ్గరనుండి ఏదైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది అని ....లేదా విజ్ఞానవంతులు ద్వారా సమాజంలో వీళ్ళకు కూడా బోల్డంత గుర్తింపు వస్తుంది అని ....
వీళ్ళు మనుషులకు అతీతంగా తాము ప్రత్యేక వ్యక్తులం అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
---------------------------------------
కొంతమంది ....తమ చుట్టూ అజ్ఞానవంతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు .....
ఇందువలన వీళ్ళకు కొన్ని లాభాలు ఉన్నాయి ....వీళ్ళకున్న అపార జ్ఞానాన్ని అజ్ఞానవంతులకు పంచుతున్నామనే సంతృప్తి ....తమకు తామే దేవుడి దూతగా ప్రకటించుకునే అవకాశం ....అహం దానికదే సంతృప్తి చెందే సదవకాశం ....
వీళ్ళు దేవుడి తర్వాత మేమే ప్రపంచానికి దిక్కు అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
-----------------------------------------
మరికొంతమంది మిగిలిపోయి ఉంటారు కదా ....ఇక వీళ్ళ చుట్టూ విజ్ఞాన / అజ్ఞాన వంతులు అందరూ ఉంటారు ...వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేకుండానే ....,
వీళ్ళకి తమకు తాము విజ్ఞానవంతులం / అజ్ఞానవంతులం అనే ఫీలింగ్ ఏం ఉండదు ...నాకు తెలిసింది నేను ఇతరులకు చెప్పాలి ....నాకు తెలియనిది నేను ఇతరుల దగ్గర నుండి నేర్చుకోవాలి అనే అభిప్రాయం కలిగి ఉంటారు ....
వీళ్ళకు తాము సామాన్యమైన మనుష్యులం అనే అభిప్రాయం కలిగి ఉంటారు .....
----------------------------------------
అందుకే ....నేనెప్పుడూ అంటూ /అనుకుంటూ ఉంటాను ...నేను చాలా చాలా సామాన్యమైన మనిషిని అని ..... :) :) :)


No comments:

Post a Comment