Sunday, December 11, 2016

ఓ స్నేహితురాలు / స్నేహితుడు - అడిగిన సందేహం....(గమనిక : సందేహం అడిగిన వారి అనుమతి అడిగి , వారు అంగీకరించాకే ఇక్కడ షేర్ చేయడం జరిగింది . )
- ఓ స్నేహితురాలు / స్నేహితుడు - అడిగిన సందేహం....
- నా అభిప్రాయం .....
==================================
ముందుగా నా మీద మీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు .... :)
================================
ఉంటాడు/ ఉండడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ....(చిన్న తనం నుండి మరణం అంటే ద్వేషించే వాళ్ళే మనకు కనిపించడం వలన మనకు ఈ సందేహం కలగడం సహజం ....)
నా ఆలోచనా పరిధిలో నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు వివరిస్తాను ....అది మీ ఆలోచనలకు సహాయ పడొచ్చు .....
-----------------
ముందుగా మనకు మరణం అంటే ఏమిటి అనేది ఒక అవగాహన ఉండాలి ....
మనకు చిన్నతనం నుండి ...మరణం అంటే ...అది చాలా భయంకరమైనది ....అది మనకు ప్రమాదం ద్వారానో , జబ్బుల ద్వారానో సంక్రమించే ఒక మహమ్మారి అనే భావన ఇవ్వబడింది ....
పైగా మరణం తర్వాత ఇక మనం ఈ భూమి మీద ఉండం, మనకు ఇప్పుడు మన అనుకుంటున్నవాళ్ళు ఎవరూ ఉండరు ....మనం అనుభవిస్తున్న భోగభాగ్యాలు ఏవీ ఉండవు ....మన సొంతం అని మనం ప్రేమ ఏర్పరచుకున్న వస్తువులు , వ్యక్తులు మనతో రావు అనే భావం మనల్ని మరణం కన్నా ఎక్కువ దుఃఖానికి గురి చేస్తుంది ....
అయితే ఎవరైనా ఇవన్నీ నీకు యధాతధంగా ఉంటాయి, మరణం అనేది ఒక సంఘటన మాత్రమే అని భరోసా ఇస్తే ....మనం ఆనందంగా మరణాన్ని ఆహ్వానిస్తాం ....
ఎప్పుడైతే మనిషి నా జీవితం అనేది అశాశ్వతం ....ఇక్కడ ఉన్న ఏ వస్తువూ , ఏ వ్యక్తీ మనకు చెందిన వాళ్ళు కాదు ...ఆఖరికి మన శరీరం కూడా శాశ్వతం కాదు అని అర్ధం చేసుకుంటాడో ...అర్ధం చేసుకోవడం కాదు , రోజు వారీ జీవితం లో ఆచరిస్తూ ఉంటాడో ...అతనికి మరణం అంటే భయం ఉండదు ....(అలా అని ప్రేమ ఉంటుంది అని చెప్పలేం ) అది ఒక సంఘటన అని బలంగా నమ్ముతాడు ....
అయితే అన్నిటి మీదా ఆశ వదిలేస్తే ....ఏదీ నాది కాదు అంటే ....మనిషి ఏ పనీ చేయలేడు ....
మనిషికి ఉన్న సహజ స్వార్ధ గుణం వలన ...ఏ పని చేసినా నాకేమొస్తుంది అని ఆలోచించడం అలవాటై ఉంటుంది ....
ఆ స్థితిని అధిగమించి ....నా బాధ్యతలు మాత్రమే నేను నిర్వర్తించాలి ....ఫలితం గురించి ఆలోచించకూడదు అని అనుకోవాలి .....
ఒక్క విషయం ఆలోచించండి ....మరణం నిజంగా అనుభవించినవాళ్లు .....మరణం అంటే ఇలా ఉంటుంది అని చెప్పారా ....??!! వాళ్ళు ఈ భూమి మీద లేరు చెప్పడానికి అనేది వాస్తవం ....
మరణం అంటే భయం ఉన్న మనుష్యులు అందరూ కొన్ని కథలు సృష్టించారు .....మరణం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని .....అవి మనం నమ్మి భయం ఏర్పరచుకున్నాం ...
కానీ నిజానికి మరణం అంటే జీవితం అంత అందంగా ఉంటుందేమో అని ఎందుకు ఊహించకూడదు...(అప్పుడు ప్రేమ కలిగే అవకాశం ఉంది ) <3
నిజంగా మనకు మరణం సంభవించినపుడు .....మనకు ఎంతో అద్భుతంగా అనిపించి ...."అరె...మరణం నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ....అనవసరంగా వాళ్ళు వీళ్ళు చెప్పినవి నమ్మి ....మరణం అంటే ఎంత భయపడ్డాను ....నా సమయం ఎంత వృధా చేసుకున్నాను " అని మనం అనుకోవచ్చు ....
ఈ విషయం ప్రపంచానికి చెప్పాలి అని ఆరాటపడొచ్చు ....కానీ చెప్పడానికి మనం ఉండం కాబట్టి ...ఆ నిజం ఎవరికీ తెలియకపోవచ్చు ....ఎప్పటిలాగే ఊహాగానాలు విని మరణం అంటే వివిధ అభిప్రాయాలు కొనసాగొచ్చు .....
అసలు మరణాన్ని ఎందుకు ప్రేమించాలని నా సందేహం ....ఇప్పడు మన ముందు లేని దానిని , తెలియని దానిని ఎందుకు ప్రేమించాలి / ద్వేషించాలి ...??!!
మన ముందు ప్రస్తుతం ఉన్నది జీవితం ....దానిని పరిపూర్ణంగా ప్రేమించాలి/ద్వేషించాలి....
జీవితం ఇక చాలు అని మన దగ్గర సెలవు తీసుకుని అంతమైపోయి .....మరణం మన ముందుకు వచ్చినప్పుడు ...మరణాన్ని ప్రేమించాలి / ద్వేషించాలి .....
అప్పుడు ఆలోచిద్దాం ....అప్పటివరకూ ....మన కళ్ళతో మనం చూసే వరకూ ...మరణం గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు ....
అని నా అభిప్రాయం .... !
========================