Friday, December 2, 2016

"నువ్వు ఎన్నిసార్లు అపజయానికి గురయ్యావు ...." నాకెదురైన ప్రశ్న .... :)

"ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఎదురైన ....అల్లా ఫలానా అపజయం వలన నేను విషయం నేర్చుకున్నాను .....అప్పుడు అపజయానికి కారణం అయిన వాళ్ళను నేను తిట్టుకున్నాను కానీ ....అదే అపజయం నాకు ఎదురుకాకపోతే నాకు విషయం తెలిసి ఉండేది కాదు ...." ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు జరిగిన  పొరపాటు సంఘటనకు అన్వయిస్తూ చెప్పా .... :)

"నువ్వు ఎన్నిసార్లు అపజయానికి గురయ్యావు ...." నాకెదురైన ప్రశ్న .... :)

"నాకు ఎదురైన అపజయాలన్ని లెక్కపెట్టడం మొదలు పెడితే లెక్క తేలనన్ని ఉండొచ్చు ....అందులో నుండి నేను ఏం నేర్చుకున్నానో లెక్కపెడితే అవి నాకు లెక్క లేనన్ని విజయాలు ....
పది సంవత్సరాల తర్వాత కూడా ....అప్పటి అపజయం లో నుండి నేర్చుకున్న జీవన పాఠం ఇప్పటి జీవితానికి అన్వయించుకుంటూ పొరపాటు ఎందుకు చేయకూడదో గుర్తు పెట్టుకున్నాను చూడండి .... విజయం చాలు .....నా జీవిత కాలపు అపజయాలను పరిహసించడానికి ....." నవ్వుతూ చెప్పా .... :) :) <3




No comments:

Post a Comment