Sunday, December 11, 2016

ప్రపంచం సామరస్యంగా, సమానత్వంతో సాగిపోవాలి అంటే ..

కొంతమంది ఉంటారు .............,,,,
వీళ్ళకి నూటికి 99 విషయాలు తెలిసి ఉంటాయి ....వాళ్ళు ఎంతో కష్టపడి ,సాధన చేసి అవన్నీ నేర్చుకుని ఉంటారు ....వాటిని అవసరమైనప్పుడు వాళ్ళ కోసం, నలుగురికీ ఉపయోగపడేలా ఉపయోగిస్తూ ఉంటారు ... 99 విషయాల గురించి ఎవరి ముందూ వాళ్ళ విజ్ఞాన ప్రదర్శన చేయాలని ఆలోచించరు కూడా ...వాళ్లకు తెలియని ఒక్క విషయం గురించి మాత్రం అన్వేషిస్తూ ఉంటారు ......
మరి కొంతమంది ఉంటారు ...............,,,
వీళ్ళకి నూటికి 99 విషయాలు తెలియవు ....ఒక్క విషయమే తెలిసి ఉంటుంది ....తెలియని 99 విషయాల గురించి వీళ్ళు ఎప్పుడూ నేర్చుకోవాలని ప్రయత్నించరు ....వీళ్ళకు తెలిసిన ఒక్క విషయం గురించి మాత్రం సమయం దొరికినప్పుడల్లా అందరి ముందూ విజ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు ...
సరేలెండి ...ప్రపంచం అన్న తర్వాత రకరకాల వ్యక్తులు ఉంటారు .....ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తే సమస్య ఏం లేదు కదాపోనివ్వండి ....అనుకున్నా ...కొన్నిసార్లు అలా జరగదు ....జరగనిస్తే అది ప్రపంచం ఎలా అవుతుంది ....అందులో ఉన్నవాళ్ళు రక రకాల మనుష్యులు ఎలా అవుతారు ....
అరుదుగా ఏం జరుగుతుంది అంటే ... 99 విషయాలూ తెలిసిన వాళ్ళ ముందుకు ... ఒక్క విషయం తెలిసిన వాళ్ళు వచ్చి విజ్ఞాన ప్రదర్శన చేసి కుప్పి గంతులు వేస్తారు ....
99
విషయాలూ నేర్చుకున్న వాళ్లకు ఒక్క విషయం నేర్చుకోవడం ఒక లెక్కా ...నవ్వుతూనే ఒక్కటీ నేర్చుకుని వీళ్ళు పరిపూర్ణమైన వ్యక్తులు అవుతారు ....
ఒక్క విషయం తెలిసిన వాళ్ళు సహజంగానే లెక్కలో లేకుండా పోతారు ....

ఇందుమూలంగా నాకు తెలిసిన నిజం ఏమిటి అంటే ....ప్రపంచం సామరస్యంగా, సమానత్వంతో సాగిపోవాలి అంటే ...రక రకాల వ్యక్తులు అవసరం అని …..!! :) :)

No comments:

Post a Comment