Wednesday, November 23, 2016

అదేదో సినిమాలో ...."గల గల పారుతున్న గోదారిలా ...." పాట

అదేదో సినిమాలో ...."గల గల పారుతున్న గోదారిలా ...." పాట విన్న వాళ్లకు ఎవరికైనా తెలిసే ఉంటుంది ... పాట వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ....

తన ప్రేయసి.. తన కోసం ....అసంకల్పితంగా ఏడిస్తే ... ప్రియుడి మనసుకు అది ఏదో ఒక హాయిని , ధైర్యాన్ని , సౌకర్యాన్ని కలిగిస్తుంది .....అదే ఫీలింగ్ ని మనసులో దాచుకోకుండా ప్రియురాలికి చెప్పేస్తాడు .... <3 

సరే పాట అయిపోతుంది .....మళ్లీ ప్రియురాలు ,ప్రియుడు ఎప్పట్లాగే సహజంగా కలుస్తారు ...అప్పుడు ప్రియుడు ప్రియురాలిని ....మళ్లీ ఓసారి ఏడవవా ప్లీజ్ అని అడగడు ..... ప్రియురాలు కూడా అతనికి సంతోషం ఇవ్వడం కోసం కనిపించినప్పుడల్లా కడవలు కడవలు ఏడవదు..... :P

ఏమో ...ప్రియురాలో, ప్రియుడో (జరగదనుకోండి ) ఎవరైనా ఒకరికోసం ఒకరు ఏడిస్తే ....అందులో అవతలివారికి ఏమొస్తుందో నాకు తెలియదు ....

కానీ కొందరు ....తమ కోసం ఎవరో ఒకరు ఏడిస్తే రోజూ చాలా హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు .....వీళ్ళు చేసే పనులన్నీ ఏడిపించేవిగానే ఉంటాయి ...

ఎదుటివాళ్ళు వాళ్ళు చేసే పనులకు ఏడుస్తున్నంత కాలం .....అవే పనులు వాళ్లకు ఏడుపు అవసరమైనప్పుడల్లా చేస్తూ ఉంటారు .... ఏడ్చినంత కాలం వాళ్ళను ప్రేమిస్తూ ఉంటారు .....లేదు అంటే ప్రేమించలేరు

ఇక పనులకు ఎదుటివాళ్ళు ఏడవడం ఆపేస్తే  ...కొత్తపనులను ఎంచుకుంటారు .....దీనికి వారు బయట సమాజానికి , కనీసం ఏడ్చేవాళ్లకు కూడా తెలియకుండా .....సామ ,దాన , బేధ , దండోపాయాలను ఎంచుకుంటారు ...

అయినా ఎదుటివాళ్ళు ఏడవలేదు అనుకోండి .....వాళ్ళల్లో ఒక రకమైన క్రూరత్వం ప్రవేశిస్తుంది ...."నువ్వు ఏడిస్తేనే నేను ప్రేమిస్తా ...."అనేవరకు వస్తుంది ....

మనిషీ జీవితంలో ఎక్కువ కాలం ఏడవలేడు కాబట్టి ....వాళ్ళు ఏడవరు ...
వీళ్ళు ప్రేమించరు.....

ఎక్కడ వీళ్ళ బలహీనత బయటపడుతుందో అనే భయంతో ....వారిని సమాజంలో చెడ్డవారిగా చిత్రీకరించడం మొదలుపెడతారు .....ఇక అది వేరే కోణం లోకి వెళ్తుంది అనుకోండి .....

మరి వీళ్ళు బ్రతకాలి అంటే ....వీళ్ళ అహం సంతృప్తి పడాలి అంటే ....వీళ్ళు ప్రేమించగలగాలి అంటేఎవరో ఒకరు ఏడవాలి కదా .....??!! 

అందుకే వాళ్ళు మరెవరినైనా పనికి ఎంచుకుంటారు .....

వారు తనకోసం ఏడ్చే పరిస్థితులు కల్పించడం మొదలు పెడతారు ....ఓసారి ఏడుపు రుచి చూశాక సంతృప్తి పడతారు .....అది ఎక్కడ చేజారిపోతుందో అని అనుక్షణం ఆందోళన చెందుతారు .....వారు ఏడవడం కోసం తపిస్తారు .....

ఇలా ఎప్పుడూ ఇతరుల ఏడుపులో సంతృప్తిని వెతుక్కుంటూ , వాళ్ళ కన్నీళ్లతో ఆనందభాష్పాలు పేర్చుకుంటూ ....వాళ్ళ కష్టంలో తమ ఇష్టాన్ని చూసుకుంటూ ...జీవిస్తూ ఉంటారు ...... :( :( 

తొండ ముదిరి ఊసరవెల్లి అవడం అంటే ఇదే .....!!

అదేదో ఒక ఫీలింగ్ ....జీవితంలో ఒక్కసారి అనుకోకుండా....ప్రేమలో భాగంగా కనిపించేది .....జీవితమే అదైపోయి ....సైకోలుగా మారుస్తుంది కొందరిని .... :( 

అందుకే మన ప్రేమ , మన ఏడుపు , మన సంతోషం తదితర భావాలన్నీ .....ఎవరి ఆటలో పావులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే ....!!!

----------------------------------------

గమనిక: నేను సైకాలజిస్ట్ ని కాదు ....నాకెదురైన వ్యక్తుల మనస్తత్వాల ఆధారంగా నేను అర్ధం చేసుకున్నది వ్రాస్తూ ఉంటాను ....!


No comments:

Post a Comment