Sunday, January 28, 2018

మనుషుల్ని పోలిన మనుషులున్నట్టు ....ఆలోచనలను పోలిన ఆలోచనలు ఎందుకుండవు ....??!!


నిన్న నేను ఒక పొరపాటు చేశాను ...😥
ఒకరికి పెట్టాల్సిన మెయిల్ మరొకరికి పెట్టాను ...
నిజానికి...ఆ పొరపాటు చేయాల్సి వచ్చింది కూడా.. ఒక వ్యక్తి ఆ మెయిల్ తనకు పంపించమని చెప్పడం వలన ....వెంటనే పంపించేసా ....😥

కానీ పెట్టాక అనిపించింది ....పొరపాటు చేసానేమో అని ....ఆ మెయిల్ వేరే వ్యక్తికి పంపించాల్సిన మెయిల్ అని ...🤔
కానీ పంపించాక, అప్పటికే డిస్కషన్స్ అయ్యాక ఆలోచించి చేసేదేం లేదు అనిపించింది ....
తర్వాత నా పనిలో నేను బిజీ అయిపోయా ....
కాసేపటి తర్వాత ,,,,,,,
అనుకున్నట్టుగానే ..ఇలాంటి మెయిల్స్ నాకు పెట్టాలి ...మరెవరికీ కాదు అని ...అసలు వ్యక్తి (నేను ఎవరికైతే నియమ నిబంధనల ప్రకారం పంపించాలో ఆ వ్యక్తి ) నుండి మెయిల్ వచ్చింది ....
ఇక్కడ నేను ...నా తప్పేం లేదు ...ఫలానా వ్యక్తి తనకే పెట్టమని చెప్పాడు ...అని తప్పించుకోవచ్చు ....
కానీ పెట్టేముందు.. నేను ఒక్క క్షణం విచక్షణతో ఆలోచించకపోవడం గుర్తొచ్చింది ...🤔
ఇక మరేం ఆలోచించకుండా ....ఇకముందు మరెప్పుడూ ఈ పొరపాటు జరగదని ....విధి విధానాల గురించి తికమక పడడం వలన ఇలా చేసానని ....ప్రయివేట్ మెసేజ్ పంపించి క్షమాపణలు అడగడం ...
క్షమాపణలు ఏం అవసరం లేదు ....నీకు ప్రాసెస్ తెలియాలనే చెప్పాను అని నాకు ప్రయివేట్ మెసేజ్ చేయడం ...
ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో ...నన్ను నేను సరిదిద్దుకోవాలో....నాకు నేను గట్టిగా తిట్టుకుని మరీ చెప్పుకోవడం ....నిమిషాల్లో పూర్తయింది ....
---------------------------
నా ఇలాంటి ప్రవర్తనలో ...నా స్వార్ధం ఎంతో దాగి ఉంటుంది అనేది ...ఇక్కడ స్పష్టం చేసుకోవాల్సిన అవసరం... నా కోసం దాగి ఉంది....
నా సాధారణ ప్రవర్తన ప్రకారం ...,,,
నేను తప్పు చేసినప్పుడు ...., అలా చేయడానికి ఎవరైనా 99 శాతం కారణం అయి .... నేను ఒక్క శాతం కారణం అయితే ....ఆ ఒక్కశాతం ఇతరుల ముందు అంగీకరించడం వలన ...భవిష్యత్తులో ఆ ఒక్క శాతం కూడా తప్పు చేసే అవకాశాన్ని నేను సరిదిద్దుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటా ...
ఒకవేళ ....ఇతరులు ఒక్క శాతం కారణం అయి ....నేను 99 శాతం కారణం అయితే ...ఆ ఒక్క శాతం కారణం ఇతరులకు సాకుగా చూపించి ....నేను తప్పించుకుంటే ...తాత్కాలికంగా నేను తప్పించుకోవడానికి అవకాశం దొరికినా ....శాశ్వతంగా నేను దొంగ బ్రతుకు అనే ఊబిలో కూరుకుపోవడం ఖాయం .....
అని ఆలోచిస్తూ ఉంటా ...
ఆ ఒక్క శాతం నా తప్పుని ఇతరుల ముందు అంగీకరించి ....నన్ను తీర్చి దిద్దుకునే ప్రయత్నమే నేను చేసింది ....😍
....................
అయితే ఇంతవరకే జరిగితే ఈ ఆర్టికల్ వ్రాయాల్సిన అవసరం లేదు ....
కొసమెరుపు ఏమిటంటే ....,
ఇది జరిగిన కాసేపటికి .....తనకు మెయిల్ పంపించమన్న వ్యక్తి ....అందరిముందూ బహిరంగంగా ....మెయిల్ పెట్టమని చెప్పింది నేనే అని ....నేను చెప్పడం వలెనే తను అలా చేసింది అని ....తన తప్పు ఏం లేదని ....అందరికీ మెసేజ్ పంపించాడు ....
---------------------
అది చదివాక ...
నాలో ఏర్పడిన ...ఒక అసంకల్పిత ప్రతీకార చర్య ....నా చేతి వేళ్ళతో ...నా కనుల చివర తగిలిన తడి అసహజత్వాన్ని తడిమేలా చేసింది ....😥
బహుశా ....అతను కూడా నాలాగే ...ఎప్పుడూ ...ఒక్క శాతం తప్పుని అంగీకరించి తనను తాను సరిదిద్దుకుంటాడేమో ...🤔
ఏమో .....మనుషుల్ని పోలిన మనుషులున్నట్టు ....ఆలోచనలను పోలిన ఆలోచనలు ఎందుకుండవు ....??!! 🤔
*********************************************

No comments:

Post a Comment