Monday, January 15, 2018

మనం ఎప్పుడు ఇతరుల సలహాలు వింటాం ...??!!

మనం ఎప్పుడు ఇతరుల సలహాలు వింటాం ...??!!
మనం వినాలి అనుకున్నప్పుడు మాత్రమే వింటాం ....వినకూడదు అనుకున్నప్పుడు వినం ...
అయితే అలా అనుకోవడంలోనే అసలు రహస్యం దాగి ఉంది ....
ఎవరి సలహాలు అయితే వినాలి అనుకుంటామో ....వాళ్ళ దగ్గరకు వెళ్లే ముందు మనం, మన మెదడుని బలహీనంగా చేసుకుంటాం ....లేదా బలంగా ఉంచుకోము...
ఆ సమయంలో వాళ్ళు ఏది చెప్పినా మెదడు స్వీకరిస్తుంది ....పాటించడానికి సమాయత్తం అవుతుంది ....
ఎప్పుడైతే ఎవరి మాట అయితే వినకూడదని అనుకుంటామో ...వాళ్లకు ఎదురయ్యే ముందు మనం, మన మెదడుని బలపరచుకుని వెళ్తాం ....ఆ సమయంలో వాళ్ళు ఏదైనా చెప్పగానే తిరస్కరిస్తాం ....లేదా దానికి వ్యతిరేకమైన సూచనలు మన మెదడుకి మనం ఇచ్చుకుంటాం ...ఆ తిరస్కరించే శక్తిని మనం ముందే ఏర్పరచుకుంటాం కాబట్టి.....
మనం ఎవరి మాట వింటాం ....ఎవరి మాటలు వినం అనేది అంతా మనం మన మెదడు కి ఇచ్చుకునే సూచనలపై ....ఉంచుకునే స్థితిపై ....ఆధారపడి ఉంటుంది ....
అలాగే సలహాలు ....ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువశాతం మంది అంతే....
వాళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ....ముందుగా ఎదుటివాళ్ళ మెదడుని బలహీనపరచి ఇవ్వాలి అనుకుంటారు ...
బలవంతపు మత మార్పిడులు కూడా అలాంటి కోవలోకే వస్తాయి ....
వాళ్ళ కష్టాలను ఆసరాగా చేసుకుని ....ముందుగా వాళ్ళ మెదడుని బలహీన పరుస్తారు ....తర్వాత వాళ్ళు చెప్పినమాట వినేలా వశపరచుకుంటారు ....
వాళ్ళు చెప్పేవి నమ్మడం వలన మా కష్టాలు తీరుతాయి అనే నమ్మకం... ఆ క్షణంలో ఎవరేం చెప్పినా వినేలా ప్రేరేపిస్తుంది ....
మనిషి కష్టంలో ఉన్నప్పుడు మెదడు ఆలోచనా శక్తిని కోల్పోయి బలహీనపడుతుంది ....
సాధారణంగా మెదడు బలంగా ఉన్నప్పుడు ఎవరి సలహాలూ ఆశించదు....తనకు తానే సమస్యలను పరిష్కరించుకునే శక్తిని ..నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉంటుంది ....
సలహాలు నిజంగా ఎదుటివాళ్ళ బాగుకోరి ఇవ్వాలి అనుకునేవాళ్లు ....ఎదుటివాళ్ళ మెదడుని బలపరచి సలహాలు ఇవ్వాలి ...
ఉదాహరణకు ...., ఎదుటివాళ్ళు ఏడుస్తూ ...తమకు ఒక కష్టం వచ్చింది అని చెప్పుకుంటే ....ముందు వాళ్ళు దుఃఖం లోనుండి బయటపడే సమయం ఇచ్చి ....తర్వాత ఆ కష్టం గట్టెక్కే మార్గం చెప్పాలి ....
అంతేగానీ సమయం దొరికింది కదా అని ....ఏడుస్తూ ఉన్నప్పుడే ...ఇంకా ఏడుపు ఎక్కువ చేసి ...డిప్రెషన్ లోకి వెళ్లేలా చేసి ....చూశావా నా మాట వినకపోవడం వల్లే నీకిలా జరిగింది అని బ్లాక్ మెయిల్ ప్రారంభించకూడదు ....
మనిషి మెదడుని బలపరచి ఇచ్చే సలహాలు...అప్పటికప్పుడు ఆశించిన ఫలితాలు చూపకపోయినా .... దీర్ఘ కాలంలో మనిషి మూలాల్లో మార్పుకి దోహదం చేస్తాయి ....😍
మనిషి మెదడుని బలహీనపరచి ఇచ్చే సలహాలు ....అప్పటికప్పుడు ఫలితాలు చూపినా ...అవి తాత్కాలికం మాత్రమే ....!

No comments:

Post a Comment